రోబో గర్భంలోకి 

ఎంతో ఋణపడి ఉన్నాను
నీ అసహ్య బుద్ధికి

ప్రతి గెలుపు
ఓ పిరికి వాసనే

ఉత్త ఇళ్ళులే
ఏ ఊరూ లేనివే

కుళ్ళిపోయే చెదిరిపోయే మాటలకే
ఏ వెలుగూలేని జీవనం

అతనికొక తృప్తిలేని ముఖం ఉండేది

లేకలేక అతనితో అతనిలో
అతనొక ముఖంతో పురుడుపోసుకుని

చిందుల చిల్లులుండే అక్షరాలు
తనవే అనుకుంటూ వాక్యాల తెరపై

విచిత్ర నటన
రంగుల నినాదాల నీడలో

పేరులేని పయనం మొదలుపెట్టిందీ లేదు

వికాస విగ్రహాల విసర్జన
వినమ్ర చింతన ఎవరికి దక్కేనో

కాలుతున్న చీకటి రంగు
ఎవరికి తెలిసిందో

ఏ ఎవరు చూసినా
పోలికలు చూసే చూపే

సరికొత్త పాలిపోయిన దుఃఖంలో
కొత్త అద్దం తెగి చూస్తోంది

మృత మఠంలో
మోక్షం ఏ స్వస్థితిలోనూ లేదు

ఆ ఊరు, ఓ ఊరు, అదేదో ఊరు
అందొక భాష కలదు
అదే అందరికీ చెందునా
ఎవరికి దొరికిందో తెలిసిందో

ఊపిరూదే విలాప కరుణలో
ఎగిరిపో

*

ఎం. ఎస్. నాయుడు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ ప్యాటర్న్ కంటే కొంచెం పెద్ద పజ్జెమే..
    “విచిత్ర నీటిని
    రంగుల నినాదాల నీడలో”,

    “మృత మఠంలో
    మోక్షం ఏ స్వస్థితిలోనూ లేదు”

    బోవుంద్సార్
    నాయ్డు గారూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు