1
హృదయంలోకి హృదయం
మనం కలిసే తావు_
అటు కల కాదు!
యిటు యిల కాదు!
మన సంభాషణ_
భాషలకు తెలియదు!
మాటల్లో తేలదు!
నేనడిగేది, నువ్విచ్చేదీ_
లోకానిది కాదు!
ఊహల్లో ఇమడదు!
ఆ అనుభూతి_
తనకు తానే
ఒక సృష్టి!
ఆ లిప్త_
కాలానికి చెందని
ఒక స్థితి!
ఆ జ్ఞాపకం
అడుగుజాడల్లేని
పూర్ణ లయం!
2
నదేహం
పాలరాతి పాదమైనా
ప్రియురాలి పెదమైనా
నే తాకేది తనువుతో కాదు_
అప్పటికప్పుడు
హృదయం
చేతికందిన పువ్వో
గొంతున మొలిచిన భాషో
కళ్లకు తోచిన సంజ్ఞో
అంతే.. యీ మేను!
యీ దేహం_
హృదయానిది!
యీ హృదయం_
నీ యిచ్ఛది!
*








భాషలకు తెలియని సంభాషణ! Magnificient