'ఛాయ' మోహన్ బాబు
వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.
Abul Kalam Azad
Abul Kalam Azad was born in Guntur of Andhra Pradesh. Now living in now living in Japan. Previously published in Cha, The Sunflower Collective, Muse India, Raiot, Routes, Antiserious, etc. The first published one was 'The hunted ones' in Kindle Mag. Oct 2015 http://kindlemag.in/the-hunted-ones/
Alam
Abdul Manan Bhat, a PhD student in Religious studies at the University of Pennsylvania, who write under the pen-name ‘Alam’.
Ananya Muralidharan
Ananya Muralidharan is a medicine student in University of Queensland.
Aruna Prasad
Worked as English teacher for a few years. Readaholic. I believe literature is a powerful tool which can bring a change in the society.
Bhashwati Ghosh
Bhaswati Ghosh writes and translates fiction, non-fiction and poetry. Her website is bhaswatighosh.com
Cheran Rudhramoorthy
Cheran is a Tamil Canadian poet. He was born in Jaffna, Sri Lanka and was forced into exile. Currently, he is a professor in the department of Sociology, Anthropology and Criminology at the university of Windsor in Canada.
Chris George
CHRIS GEORGE is a writer, artist, and translator who lives and teaches in Dallas, Texas. His work has been published in numerous journals, including The Arts United, Entropy, and Sarah Lawrence’s LUX. His translations have been featured in Asymptote, Anomaly, and the University of Texas at Dallas' Reunion.
D.S.Rao
D. S. Rao, Ph.D., (b.1938), is an author, literary critic, retired professor, and former Editor of Indian Literature, the academic and literary bimonthly of Sahitya Akademi, the National Academy of Letters, India. His books include: Practical Literary Criticism: An Indian Take (2017); Manohar Malgonkar: A Study of His Complete Fiction (2013); and Five Decades: A Short History of Sahitya Akademi (2005). Presently, he is based in Minneapolis, but divides his time between USA and India.
Damodar Rao K.
Damodar Rao, K., retired as Head and Associate Professor from the Dept of English, Kakatiya University, Warangal. He had many critical and translated works to his credit.
Jayanta Mahapatra
A bilingual poet, and the first Indian poet writing in English to have been awarded the Sahitya Akademi award for poetry, Jayanta Mahapatra (1928- ) has over 40 volumes of poetry in English and Odia, short stories, memoirs, and translations. He edits Chandrabhaga devoted to poetry and prose in Indian languages.
Jessica Athens
Jessica Athens is an alumnus of Winter Tangerine’s New York City poetry workshop and has previously contributed writing to apt—a literary magazine and SHE, a Choreoplay. She loves the anarchic nature of poetry. Anything can be a poem.
Kimsukapriya
I inherit my literary roots and my pen name KimsukaPriya from my late writer and poet grandfather. Kimsuk is a Sanskrit word for the flower more commonly known as "Flame of the Forest". It is from the forests that we get the paper. So Kimsukapriya is someone with immense love for paper; reading and writing. I am an HR Manager by qualification and profession. But by passion and for a sense of fulfillment, I write, to tell the stories that need to be told, when something touches my heart, also when something leaves me thoughtful. I write to give a voice to those unheard and untold stories : Your Stories, My stories, Our Stories. I hope you enjoy the stories, as you bask into KimsukaPriya, for our stories are what would speak of us when we’re gone. :)
Maithri
I'm a 20 year-old Literature student on the verge of tasting what life has to offer. Curious lover of finding stories in almost anything and everything.
Mukoma Wa Ngugi
Mukoma Wa Ngugi is a Kenyan author, poet and academic. He is Associate Professor of English at Cornell University and the author of The Rise of the African Novel: Politics of Language, Identity and Ownership. His works include the novels Mrs. Shaw, Black Star Nairobi and Nairobi Heat, two books of poetry, Logotherapy and Hurling Words at Consciousness. His novel Unbury Our Dead With Song about competing Tizita musicians is forthcoming from Cassava Republic Press (Fall of 2020).
Nanda Kishore/K Damodar Rao
Nanda Kishore was born on 19-02-1989 in Warangal district. After his Engineering degree he completed PG in Rural Development Management. He is at present working as a development professional at Hardoi , UP, one of the backward districts in India. He has published two volumes of poetry. He is one of many contemporary young poets, especially from Engineering and Management background, who have been using Facebook effectively for expression of creative talent. He is interested in history apart from literature.
Nandini Dhar
Nandini Dhar writes in Bangla and English, is the author of two full-length books of poems --- 'Historians of Redundant Moments" ( Agape Editions, 2016) and "Jitakshara" ( Aainanagar Prakashani, 2016). She is also the author of the chapbook 'Occupying My Tongue," as part of FIVE -- a boxed set of chapbooks brought out under the collaboration of journals Aainanagar and Vyavya.
Ramadevi Singaraju
I write in Telugu, with an occasional piece in English. I published a volume of short stories in Telugu named "Oka Parichayam, Oka Parimalam" in August 2014. I write poetry, short stories, and articles in Telugu. I am also interested in translation, and have done some translation work from English to Telugu. I am a big fan of old Hindi film music. Gender issues are close to my heart, and child sexual abuse is one thing I am very concerned about.
Ravi Kiran Kasula
I am from Hyderabad city of Telangana currently finalising PhD in Neuroscience from The University of Queensland in Australia. I did my undergraduate B.Tech studies in Biotechnology from IITg. Soon to be employed in Yale University for a Post-doctoral position. I have published a poetry book in 2017 may by the name 'oceanic sail'.
Santhosh Alex
Dr Santosh Alex is the author of 42 books and is a bilingual poet , widely published translator and a poetry curator from India. His books include poems, translations and criticism. His poems have been translated into 25 languages world over.His poems have been published in International Poetry Anthologies like Sunrise from the Blue thunder(America), Hudson View( South Africa), Indo Australian Poetry Anthology( Australia), Poems for Hazara(Afghanistan), XX1st Century Literature(India), Salt Boundaries(Turkey) and other reputed English journals. His major works include two poetry collections in Malayalam titled Dooram(2008) and Njan Ninakku Oru Ghazal (2013), Two poetry collections in Hindi titled Panv Tale ki mitti (2013) and Hamare Beech Ka Maun (2017) and one in English titled Alone with Everybody (2016).Dr Santosh Alex is enriching Indian Literature by means of translation and creative writing for the past two decades. He was awarded Pandit Narayan Dev Puraskaar(2004), Dwivageesh Puraskaar (2008), Thalashery Raghavan Memorial Poetry Award(2015), Sirjanlok Poetry Award(2015), Sahitya Ratna Puraskaar (2016)and Vitruso International Poetry Award (2018). He works as a Hindi Officer in a Research Institute in Cochin, kerala. He can be reached at drsantoshalex@gmail.com
Sharath Babu, Tummuri
Sharath Babu, Tummuri, obtained his postgraduate degree from Kakatiya University and PGDTE from EFLU, Hyderabad and Ph.D from Kakaitya University. Presently, he is working as Postgraduate Teacher (PGT) in TSWREIS Society school at Koheda in Karimnagar district. He has a passion for writing poetry in English. His poems have been published in journals and newspapers like Triveni, Muse India, New Swatantra Times and The Hindu. He has also translated a good number of Telugu poems and short stories into English. Anklets is his maiden book of English translation. Mobile: 9492645665. Mail: sbthummuri@gmail.com
Shriya Prasad
An English literature major living in a world where coffee is a magical health supplement, men are half as confused as women, orchids wither only after a month, four months of autumn and carpe diem or a less cliche version of it is the normality. In the end, all the art still matters.
Siddhartha Banerjee
Siddhartha's work has appeared in various magazines such as University of East Anglia’s New Writing and The Daily Star, Dhaka. He was longlisted for the US-based Disquiet Literary Prize and was a finalist in Glimmer Train’s Short Story Award for New Writers. He lives in London and is currently working on his first novel .
Suchitra Reddy
Am Currently working as a software professional. Apart from the mundane IT life, I love to pamper the creative side of me. I love to read books of any genre. Our Indian Epics fanatasize me a lot leaving me awestruck everytime I read them. With the love for reading I have started to pen down short stories a year back. I shall continue to write as it gives me a high everytime I write.
Swathi Kumari
నా పేరు స్వాతి, రిషివాలీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. మనుషులంటే ఆసక్తి. మనుషుల ఆలోచనలు, మాటతీరు, రకరకాల వ్యక్తిత్వాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. వాటిని గమనించడం ఒక వ్యాపకం. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించడం, పదాల్లో పెట్టడం ఒక ఇష్టమైన ఆట. అరుదుగానే రాసినా కథలు రాయడం వెనకున్న కారణాలు ఇవే. రాసే వాక్యం చదవడానికి అందంగా ఉండాలనేది ఒక పట్టుదల. కథ చెప్పే పద్ధతి రొటీన్ గా ఉండకూడదని ప్రయత్నం.
Tadakamalla Vivek
Tadakamalla Vivek, former Member, Telangana State Public Service Commission, and Convener, Telangana History Society
Tali Cohen Shabtai
Tali Cohen Shabtai was born in Jerusalem, Israel, and is an international poet of high esteem with works translated into many languages. She is the author of three bilingual volumes of poetry, "Purple Diluted in a Black’s Thick"(2007), "Protest" (2012) and "Nine Years From You"(2018).
A fourth volume is forthcoming in 2021. She has lived many years in Oslo, Norway, and in the U.S.A.
Umar
Umar Nizarudeen is with the University of Calicut in Kerala. He was a Ph.D scholar at the Centre for English Studies, Jawaharlal Nehru University, New Delhi. In an eclectic career spanning over a decade, he has taught in various colleges of Delhi University, University of Kerala and has worked as staff reporter for the New Indian Express, and as Proof Reader for Mckinsey &Co. `Muse India', `Vayavya', `Culture Cafe journal of the British Library' are some the journals where his poems have appeared. A few poems were broadcast by the Yuvavani program of the All India Radio.
Vijay Koganti and Padmaja Kalapala
Dr. Vijay Koganti is a Professor of English, working in Govt. College for Women (A)Guntur. He is a passionate teacher as well as a Teacher Trainer, whose love for students results in his sharing of many student centered teaching methods. But his heart as a creative writer lies in his poetry, which is as fresh as a rainbow on a cloud cast sky. Apart from being a bilingual poet, writer and translator, he is an avid reader and an adept critic too. His first collection poetry, Ila Ruvvudaamaa Rangulu(2017), has received Sri Nagabhairava Sahitya Puraskaram.
Dr. Padmaja is a Professor of English in D. K. Government College for Women(A), Nellore. She is a translator and critic. 'Sleeping with the Rainbow' a translation of Devipriya's love poems is a collaborative work of Vijay Koganti and Padmaja Kalapala.
అజయ్ వర్మా అల్లూరి
కర్నాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా చెందిన ఒక చిన్న గ్రామంలో. తల్లిభాష తెలుగు. 'గగనసింధు' అనే కవితా సంపుటి. 'డయానా మర' అనే అనువాద కవితల సంపుటి ప్రకటిత పుస్తకాలు. ప్రస్తుతం మైసూరు విశ్వవిద్యాలయమంలో ఎం.ఎస్సి భౌతశాస్రం (Physics) వ్యాసాంగం.
అనిల్ అట్లూరి
అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.
ఆలమూరు సౌమ్య
పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.
ఉమా నూతక్కి
వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.
ఊర్మిళ
అస్తిత్వ నుడికారాన్ని కవిత్వంలోకి అలవోకగా అనువదిస్తున్న కవి ఊర్మిళ. "అంగార స్వప్నం" తో అత్యాధునిక స్త్రీ స్వరాన్ని కవిత్వంలోకి తీసుకువచ్చారు.
ఎ.వి. రమణమూర్తి
సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.
ఎండపల్లి భారతి
ఎండపల్లి భారతి 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి లో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. రచనలు : ముప్పై కథలతో 'ఎదారి బతుకులు ' కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. లఘుచిత్రాలు : మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు.
కృష్ణుడు
వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.
కె. శ్రీనివాస్
కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక ఎడిటర్.
కొట్టం రామకృష్ణా రెడ్డి
ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది కథలు రాశాను. హైదరాబాద్ నివాసం. ప్రైవేటు ఉద్యోగం. నాలుగు పుష్కరాల వయసు దాటింది. మొదటి కథ తీర్పు రచన మాసపత్రిక 1994లో ప్రచురింపబడింది. మానవ సంబంధాలు, వారి భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు. పూర్వీకులు సేద్యం చేసేవారు. సారంగ లో ఇది మూడవ కథ
గుర్రం సీతారాములు
పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.
గొరుసు
కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.
గోపిని కరుణాకర్
తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.
జగద్ధాత్రి
అనేక భాషల సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకోవడమే కాకుండా అంతే ఇష్టంగా రాసే జగద్ధాత్రి సాహిత్య వ్యాసాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారు. తెలుగులోకి ఇతర భాషా సాహిత్యాల వెలుగుని ప్రసరిస్తున్నారు.
జలంధర
కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.
జి.యస్.లక్ష్మి
మా అమ్మగారు శ్రీమతి పద్మావతిగారు, మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగార్లు నాకు సంగీత, సాహిత్యాలమీద అభిరుచి కలిగించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో సోషియాలజీ ప్రొఫెసర్ గా చేసిన మావారు గరిమెళ్ళ విశ్వనాథంగారు నేను రచనలు చేసేందుకు ప్రోత్సహించారు. ఇప్పటివరకూ నాలుగు కథా సంపుటాలూ, ఒక నవల పుస్తకాలుగా వచ్చాయి.
డాక్టర్ డి ఎస్ రావు
ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు, విశ్రాంత ఆచార్యులు డా. డి.యస్. రావు గారు ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాదెమి వారి ద్వైమాస పత్రిక ఇండియన్ లిటరేచర్ కు సంపాదకులుగా ఉన్నారు. Practical Literary Criticism: An Indian Take (2017), Manohar Malgonkar: A Study of His Complete Fiction (2013), Five Decades: A Short History of Sahitya Akademi (2005) ఇత్యాది గ్రంథాలను రచించారు. మినెపోలిస్ లో ఉంటూ అమెరికా, ఇండియాల మధ్య ప్రయాణిస్తుంటారు.
తాడికొండ శివకుమార శర్మ
వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.
దేవరకొండ సుబ్రహ్మణ్యం
దేవరకొండ సుబ్రహ్మణ్యం – విశాఖపట్నం లోని సింధియా కోలని లో పుట్టి పెరిగి, 1960-66 ల మధ్య అక్కడున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకొని, ఉద్యోగం కోసం ఢిల్లీ 1969 లో వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి, ఢిల్లీకి ఆనుకొని ఉన్న గురుగ్రామ్ లో ఉంటున్నారు. తన మేనమావా ఆకెళ్ళకృష్ణమూర్తి గారి ద్వారా పరిచయమయి ఫ్యామిలి మిత్రులయిన రావి శాస్త్రి గారంటే అంతులేని గౌరవం. నాటకం ప్రాణంగా భావించే సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యమంటే కూడా అంతే ఇష్టం చూపుతారు
దోర్నాదుల సిద్ధార్థ
స్వస్థలం: చిత్తూరు జిల్లా , పలమనేరు. వృత్తి: పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. 30కి పైగా కవితలు, వ్యాసాలు ప్రచురించారు..ఆకాశవాణి, తిరుపతి కేంద్రం నుండి కథలు కవిత్వం ప్రసారమయ్యాయి. రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుడు. ఎక్సరే సాహితీ పురస్కారం వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ పురస్కారం మరికొన్ని అందుకున్నారు.
నామని సుజనాదేవి
నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారి. 185 కధలు,175 కవితలు,20 ఆర్టికల్స్ ప్రచురించబడ్డాయి.
పాయల మురళి
తండ్రి బాలసాహిత్యం లో విశేష కృషి చేసిన పాయల సత్యనారాయణ. తల్లి పద్మావతి.. గ్రామం మెంటాడ ,విజయనగరం జిల్లా. పదహారేళ్ళ గా ఉపాధ్యాయ వృత్తి. "అస్తిత్వం వైపు " ప్రచురించ బడిన కవితా సంపుటి. రంజని కుందుర్తి,ఆటా,ఎక్స్ రే లాంటి బహుమతులు అందుకున్నాను. ప్రస్తుతం నా పుస్తకం కన్నా దివంగతులైన మా నాన్న బాలగేయాలు ప్రచురించే పనిలో ఉన్నాను
పాలపర్తి జ్యోతిష్మతి
చిన్నతనం నుంచి కథలు చదవడం అలవాటు. రచనావ్యాసంగం కవిత్వ రచనతో ఆరంభించినా కథ అంటేనే ఎక్కువ ఇష్టం. కథారచన మాధ్యమంగా నా మనోభావాల్ని పదిమందితో పంచుకునే అవకాశాన్ని కల్పించుకున్నాను. మనసును తాకిన కథ చదివినప్పుడు దానిగురించి నా అనుభూతిని వ్యాసంగా రాయాలనిపిస్తుంది.
ఫణీంద్ర
నిత్యం పాటల పల్లకీ మీదే ఫణి ప్రయాణం. మాటలోని సున్నితత్వం జీవితంలోని సారళ్యం అన్నీ కలిస్తే ఫణి.
బాలసుధాకర్ మౌళి
జూన్ 22, 1987 లో పోరాం గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో పుట్టాను. ఎనిమిదిన్నరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సమాజం తరగతిగదిలో సకల అంశాలతో ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. కవిత్వమంటే ఇష్టం. 2014 లో 'ఎగరాల్సిన సమయం', 2016 లో 'ఆకు కదలని చోట' కవితా సంపుటాలను తీసుకుని వచ్చాను. కథంటే అభిమానం. మొదటి కథ 'థింసా దారిలో' 2011లో రాశాను. మొత్తం ఐదు కథలు. ఇన్నాళ్ల నా పాఠశాల అనుభవాలను విద్యార్థుల కోణంలోంచి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చిస్తూ కథలుగా రాయాలని ఆకాంక్ష. గొప్ప శిల్పమున్న కథలు రాస్తానో లేదో గాని - ఇవి రాయకపోతే వూపిరాడని స్థితి.
మధు పెమ్మరాజు
మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
మధురాంతకం మంజుల
మధురాంతకం మంజుల వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. ప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారం గారి కుమార్తె. స్వతహాగా సాహిత్యం పట్ల ఆసక్తి, అభిలాష ...రచనల దిశగా అడుగులు వేయించాయి.
మనోజ నంబూరి
ఇటీవల సాక్షిలోనూ, ప్రజాశక్తిలోనూ కథలు ప్రచురించారు. రేడియో గుల్దస్తా కార్యక్రమంలో ఆరు కథలు ప్రసారం. కొన్ని బాలల కథలూ,నాటికలూ,బుర్రకథలూ...
మునిసురేష్ పిళ్లె
సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai
మెహెర్
తెలుగులో కొత్త వచనానికి వర్ణమాల తిరగరాస్తున్న రచయితల్లో మెహెర్ మొదటి కోవ. మెహెర్ కథ రాసినా, వ్యాసం రాసినా ఆ వాక్యంలో తనదైన తేటదనం! ఉత్తమ చదువరీ, బుద్ధిజీవీ, నిర్మొహమాటి అయిన సున్నిత మనస్కుడూ ఆ వాక్యాల్లో స్ఫుటంగా కనిపిస్తాడు. మెహెర్ కథల పుస్తకం కోసం ఇప్పుడు ఎదురుతెన్నులు.
మైథిలీ అబ్బరాజు
ఈకాలానికి దక్కిన కడిమిచెట్టు మైథిలి సాహిత్యం! కథ రాసినా, విమర్శ రాసినా తన చుట్టూరా నిమగ్న ఆవరణని సృష్టించే సహృదయి.
యాకుబ్ అలీ
నా పేరు సయ్యద్ యాకుబ్ అలీ. మాది మంచిర్యాల జిల్లా మందమర్రి ( కోల్ బెల్ట్ ఏరియా ). హెచ్.ఎం.టీవీ లో సబ్ ఎడిటర్ గా జర్నలిజంలోకి వచ్చాను. ఆ తరువాత టీ న్యూస్, వీసీక్స్ లో పనిచేశాను. 2014 నుంచి మిషన్ భగీరథలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. మీడియాలో పనిచేస్తున్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. చిన్న చిన్న కథలు రాసి ఫ్రెండ్స్ గ్రూప్ లలో షేర్ చేసేవాడిని. 2009 సెప్టెంబర్ లో నేను రాసిన “చిచ్చా” నమస్తే తెలంగాణ సండే బుక్ లో పబ్లిష్ అయింది. ఇటీవలే విడుదలైన జార్జ్ రెడ్డి సినిమాకు కథా సహకారం కూడా అందించాను.
రమేశ్ రాపోలు
రమేశ్ రాపోలు కథలు రాయడం మొదలుపెట్టడానికి ముందు.. పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాడు. కథలు చెప్పడమంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం ఇతనికి. చదువవ్వగానే సినిమాల్లోకి వెళ్లాలన్న కల ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది. ఉద్యోగంలోనైతే చేరిపోయాడు కానీ ఎక్కువకాలం ఉండలేక తిరిగి నచ్చిన పనిలోకే వచ్చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్న రమేశ్, సినిమాలకు పనిచేస్తున్నాడు. సాహిత్యం, సినిమా ఒకే దారిలో నడవాలని కోరుకునే ఈ రచయిత, వివిధ పత్రికల్లో ఇప్పటికి అర డజను కథల దాకా రాశాడు. ఎక్కువగా ప్రేమ కథలు రాయడానికి ఆసక్తి చూపిస్తానని చెబుతున్న ఈతరం రచయిత, కథలు రాస్తే ఏదో తెలియని సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు.
రవీంద్ర కంభంపాటి
ఊరు విశాఖపట్నం , ప్రస్తుతం ఇన్ఫోసిస్, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను .
ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను. సరదాగా ఓ ఏడాది క్రితం నుండి రాయడం మొదలెట్టాను . దేవుడి దయ, నా అదృష్టం ల కాంబినేషన్ కుదిరి , నలభై ఎనిమిది కధలతో పిఠాపురం క్రానికల్స్ అనే పుస్తకం వేయగలిగాను
లక్ష్మీ ప్రియాంక
మాది సత్తుపల్లి . ఎం.టెక్ చేసి TCS లో కొంతకాలం పనిచేసి రిజైన్ చేశాను. చిన్నతనం నుండి తెలుగు భాష మీద ఉన్న ఇష్టం కొద్దీ చదవటం మొదలుపెట్టిన నేను ప్రస్తుతం సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఏ భావాన్నైనా కళల రూపంలో నలుగురికి అర్ధమయ్యేలా చెప్పటం సులువని నమ్ముతూ నా ఆలోచనలను అటు కధల రూపంలో, ఇటు బొమ్మల రూపంలో (డూడుల్స్) మలిచే ప్రయత్నం చేస్తున్నాను.
నన్ను , నా ఇష్టాలను గౌరవించే తల్లిదండ్రులు , ఎల్లప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు దొరకటం నా అదృష్టం.
వి. మల్లికార్జున్
కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.
వివిన మూర్తి
తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.
విశీ
తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.
వెంకట కృష్ణ
ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.
వేణు నక్షత్రం
ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998 లో జీవన భృతిని వెతుక్కుంటూ అమెరికా జరిగింది. సిద్దిపేటలో 90 వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో , కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్న నా రచనలు (పాటలు, కవితలు , కథలు ) అన్నీ ఏదో ఒక విధంగా సమాజానికి ఉపయోగ పడే విధంగానే వుంటాయి . కథలు మౌనసాక్షి (సుప్రభాతం 1992) , పర్యవసానం ( ఆంధ్రజ్యోతి 1993) మరి కొన్ని కవితలు,పాటల తో ప్రారంభించిన సాహిత్య ప్రయాణం, అమెరికా చేరడంతో కొంత కాలం విరామం ప్రకటించక తప్పలేదు. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగం లో పని చేస్తున్నప్పటికీ, ప్రవుత్తి గా సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని సాహిత్య ,సాంస్కృతిక రంగంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా నా కలానికి ఎప్పుడూ ఏదో పని చెపుతూనే ఉన్నాను .
శివారెడ్డి
కవిత్వంలో సామూహిక స్వర మేళా శివారెడ్డి. మన ముందు నిలిచిన అక్షర జ్వాలాకేతనం. కవిత్వానికి తానే "భారమితి"గా మారిన అరుదైన సన్నివేశం.
శ్రీ వశిష్ఠ సోమేపల్లి
స్వస్థలం గుంటూరు. ఇప్పుడుండేది హైదరాబాద్లో. ఇప్పుడిప్పుడే కవితలు చదువుతున్నాను, అప్పుడప్పుడూ రాస్తున్నాను.
శ్రీధర్ వెల్దండి
తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.
శ్రీనివాస్ గౌడ్
ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.
సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.
శ్రీనివాస్ బందా
పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.
శ్రీనివాస్ శ్రీ రంగనాయకుల
శ్రీనివాస్ శ్రీరంగనాయకుల, సిరిసిల్ల ఊరు, సహచర శీను గా పరిచయం, ఉపాద్యాయ వృత్తి లో వుండి 2017 వరకు ఇథియోపియా లో ప్రభుత్వ యూనివర్సిటీ లో (హరమాయా యూనివర్సిటీ , జిగ్-జిగా యూనివర్సిటీ) లో ఆచార్యునిగా పనిచేశారు.. విద్యావేత్త, సాహితి ప్రియుడు.
శ్రీను పాండ్రంకి
విజయనగర వాసిని. సినిమాగా అయినా, పుస్తక రూపేణా అయినా కదురకపోతే నలుగుర్ని కూర్చోపెట్టి నోటితో అయినా కథలు చెప్పేద్దామనేంత కథలు పిచ్చోడ్ని. ముప్పై పైగా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంగ్లీష్ లో ప్రచురితమైన నవల రాశాను. అతి త్వరలో తెలుగు నవల విడుదల కాబోతోంది. నాటకం వైపు కూడా అడుగులు పడుతున్నాయి.
శ్రీరంగవల్లి
చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-
ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..
శ్రీరామ్ పుప్పాల
నిరంతర ఉత్సాహం శ్రీరామ్ వ్యక్తిత్వం! సాహిత్యమంటే ప్రాణం పెడతాడు. అద్వంద్వం కవితా సంపుటి తెచ్చాడు. కవిసంగమం లో కవితా ఓ కవితా, రస్తా ఆన్లైన్ పత్రిక లో మలిచూపు అనే శీర్షికలు నిర్వహిస్తున్నాడు. శత వసంతాల తెలుగు వచన కవిత్వాన్ని విమర్శనాత్మక దృష్టితో వ్యాసాలు రాస్తున్నారు. త్వరలో ఆ సంపుటి రాబోతున్నది.
షేక్ మొహమ్మద్ గౌస్
నా పేరు మొహమ్మద్ గౌస్. మాది తాడిపత్రి. బీ.టెక్ చేసి ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాను. తెలుగంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. చలం, శ్రీశ్రీ రచనలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేసాయి. నా చుట్టూ ఉన్న కథలు చెప్పాలనుకుని రాయడం మొదలు పెట్టాను.
సుంకర గోపాలయ్య
పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.
సుధాకిరణ్
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. చదివిందీ, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వుండేదీ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్ధిక అంశాల పైన, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.
సుపర్ణ మహి
అసలు పేరు మహేష్, ప్రొఫెషనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. పుట్టింది, పెరిగిందీ ప్రకాశమ్ జిల్లా అద్దంకిలో. మధ్యలో ఆపేసిన చదువూ, మిత్రులూ, ఖాళీ సమయాల్లో కవిత్వమ్ చదవడానికీ, వ్రాయడానికీ కూడా కారణాలు.
హరివెంకట రమణ
కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి కలలో పనిచేసాను, తరువాత యానిమేషన్ రంగంలో చాలా కాలం ఉన్నాక మునసోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వదిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చయంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా రకరకాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మరియు సోషల్ వర్క లో పీజీలు చేసేను. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువజన అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖపట్నం.