రచయితలకు సూచనలు

‘సారంగ’ పక్ష  పత్రిక  ముఖ్య లక్ష్యం ఉత్తమ స్థాయి  సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం!

మీ రచన పంపే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోండి. అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఫార్మాటింగ్. కామాలు, ఫుల్ స్టాప్ లు, పదానికి పదానికి మధ్య స్పేస్ లు అన్నీ సరి చూసుకొని పంపండి. ఫార్మాటింగ్ చేయాల్సిన రచనలను ఖచ్చితం గా తిరస్కరిస్తాము.

ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

మీరు రచన పంపిన వెంటనే మేము ఆ రచనని పీర్ రెవ్యూకి పంపిస్తాం. కొన్ని సూచనలు ఇస్తాం. ఆ సూచనల మేరకు మీరు మీ రచనని తిరిగి మార్చవలసి వుంటుంది. కాబట్టి, మార్పులూ చేర్పులకు మీరు సిద్ధంగా వుండండి.

అలాగే, ‘సారంగ’లో  ప్రచురితమయిన ప్రతి రచన పైనా మీరు కేవలం ప్రశంసలే కాదు, సునిశితమయిన/ అర్థవంతమయిన విమర్శ కూడా చేయండి.

 

రచనలు/ వీడియోలు  పంపే పద్ధతి:

‘సారంగ’ కోసం మీ రచనలు యూనికోడ్ లో టైప్ చేసి editor@saarangabooks.com ఈమెయిలుకు పంపండి.  ఈ మెయిలుకు జోడింపుగా కూడా పంపవచ్చు.

ఆడియో/ వీడియో విభాగానికి కూడా మీరు మీ క్లిప్స్ పంపించవచ్చు. అయితే, వాటి నాణ్యత విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి.

 

మరికొన్ని ముఖ్య గమనికలు:

  • గతంలో ప్రచురించబడిన, లేదా వేరే పత్రికలలో ప్రస్తుతం ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు ప్రచురణకి స్వీకరించబడవు.
  • స్వంత బ్లాగులలోగాని వెబ్ పత్రికలలోగాని ప్రచురించబడిన రచనలు కూడా ప్రచురించబడవు.
  • రచనలు తమ స్వంతమనీ, గతంలో ఎక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేవనీ రచయితలు హామీ పత్రం ఇవ్వాలి.
  • రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం ‘సారంగ’దే!
  • ‘సారంగ’లో  ప్రచురించబడిన రచనలను రచయితలు  ఒక వారం తర్వాత తమ స్వంత బ్లాగులలోనో, ఫేస్ బుక్ లాంటి చోట  ప్రచురించుకోవచ్చు. అప్పటి వరకూ కేవలం లింక్ మాత్రమే షేర్ చేసుకోండి.
  • ‘సారంగ’లో  ప్రచురించిన రచనలు/వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయా రచయితలవే కాని ‘సారంగ’వి కాదు. ఆయా రచనలపై పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయాలే కాని అందులో ‘సారంగ’కి ఎటువంటి సంబంధము లేదు.
ఎడిటర్

ఎడిటర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి మంచి పాత కథలు ప్రతి సంచికలో ఒకటి ప్రచురిస్తే ఈ యువతరానికి ఎంతో మేలు చేస్తుంది . కొన్ని మంచి కథలు ఎంత వెదికినా మాకు దొరకడం లేదు . దయచేసి ఎవరిదగ్గరున్న మీరు సేకరించి మీరు నేటి నూతన రచయితలకు ఔత్సాహితులకు అందించే ప్రయత్నం చేయండి . సారంగంను తిరిగి ప్రారంభించడం హర్షించదగ్గ విషయం . చాల మంచి మంచి శీర్షికలతో మా ముందుకు తీసుకువస్తున్న సారంగా బృందానికి అభినందనలు .పది కాలాపాటూ ఎంతో మంది రచయితలకు పాఠకులకు మార్గదర్శిలాగా నిలుస్తుంది .

    పాపులర్ అనువాద కథలు కూడా అందించండి .మొదటి తరం రచయితలూ ఆంగ్ల సాహిత్యం విరివిగా చదివారు .ఇప్పటి వారు చదవడం లేదు .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు