కవిత్వం

చిరునామా

1 చిరునామా వనమంతా రాలు పూల దుఃఖం . పిట్ట శోక షెహనాయి స్వర సంకేతం వాయులీనంపై తరగలుగా .. పక్షి గొంతును కోల్పోయాక గోరంత చిగురు సాంత్వన. జీవితమంతా రాలు పూల స్వప్నాలు మనిషి బాధాతప్త నిర్వేద గానాలు రంగస్థలంపై దృశ్యాదృశ్యాలుగా...

దట్టెం

ఇసురుగాలికి ఈదిలోబడింది దట్టెం మీంచి ఒక తునక. మిగిలినదాన్ని పోనూక్కుంటే పొగిలే ఆకల్ని పొణుకోబెట్టేదెట్టా!? సౌకగా దొరికినాక లౌక్కెంగా దాపెట్టుకోకపోతే రేపుటికి బువ్వెట్టా!? సూరుకింది నుంచి తునకలదండెం పరమటగాలికి కమ్మటి...

తిరుగలమరగల

నీకున్న బాధ నాకుండక పోవొచ్చు నాకున్న బాధ నీకుండక పోవొచ్చు అసలొకటికానీ నీబాధ నా బాధ ఒక్కటిగానే తిరుగుతుండొచ్చు.   సగం నీదుఃఖం నా దుఃఖం పొత్తు కలవొచ్చు నువ్వు నేను నాలోని నీనేను ఏ బాధల తాళ్లకో కట్టబడుండొచ్చు...

నా కళ్ళ కొలనెప్పుడూ ఎండిపోదు!

 నాదంతా నిష్ప్రయోజన నిరీక్షణమే  ఎన్నెన్ని సుదీర్ఘ పగళ్ళు వెతికానో  ఎన్ని నిర్నిద్ర రాత్రులు వేచానో  గగనతలంలో నక్షత్రాలకే ఎరుక కళ్ళను దివిటీలు చేసి నీకై మనసంతా యుగాలు వేచాను నువ్వు అత్తిపత్తి ఆకువై ముడుచుకుంటావు నా కళ్ళ...

అమ్మమ్మోళ్లింట్లో….

అమ్మమ్మ లేదు ఆమె వున్నన్నాళ్ళు సెలవుల రాక ఆమె చెంత వాలే పక్షులమై ఆమె చేతి ముద్ద కై ఆ ముద్ద లోని ఆప్యాయత ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కానరాలే ఆ ముద్ద లోని చింతకాయ పచ్చడి కే లోగుట్టు ఎరుక ఆమె లేని ఇల్లు పడావు కూలిన గోడలు అలికిన...

అనిర్వచనం

ఆ వీధిలో కి వెళ్లినప్పుడు ఆ ఇంటి ముందుకు రాగానే పలకరింపుగా నవ్వుతాను.. ప్రతిగా ఏ నవ్వూ వినపడదని తెలిసినా ఆకలి తీర్చడంలోని ఆనందం అక్కడి పరిసరాలకు బాగా తెలుసు ఆ పరిసరాల గుండా ఎన్ని వందల మైళ్ళు నడిచినా ఆకలి వేయదు మరి మాటలు...

మైండ్ స్పేస్

అప్పుడప్పుడు మైండ్ స్పేస్ దారుల్లో నడవాలేమో.! అప్పుడే… ఆ దారి వెంట ఎన్ని శకలాల అద్దాలు ముక్కలు ముక్కలుగా అతక పెట్టి ఉన్నాయో.. ఇంద్రచాపంలా కనిపిస్తాయి. నీలం, ఆకుపచ్చ అంటూ నింగిని తాకుతూ… నిలుచున్న...

రేఖాజ్యోతి కవితలు రెండు

1 మిగుళ్ళు కొన్ని అధ్యాయాల తరువాత దూరాల సెగ సోకి భగ్గున మండి ఆవిరైపోయి క్షణం వెలిగిన చీకటి ఛాయ ఆ కర్పూరకళికది! తలపు – తెలివి స్పృహ – స్మరణ అన్నీ ఒకే ఒక్క బిందువు మీద నిలబడి నీ ద్వారా లోకాన్ని లేదా లోకం...

వర్ణచ్ఛాయ

నువ్వొక అద్భుతమైన వర్ణానివి కలల్లోంచి నడిచొచ్చి కళ్ళముందు పరుచుకొన్న ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సముద్రానివి లోపలికి లాక్కెళుతున్న అలల్లోంచి వెతుక్కోవాల్సిందేదో, పొగుచేసుకోవాల్సిందేదో అప్పుడెప్పుడో మనసుపుటలను సుతారంగా తాకి...

నిగూఢం

అమ్మ చేతి ముద్దలో బోసినోటి నవ్వులో తియతియ్యటి ముద్దులో పసితనంలోంచి తొంగిచూసే చందమామలా పరిచయమయ్యావు.   ఇసుకలో చెదిరిన అడుగుల్ని నిశిలో కలిసిన వెలుగుల్ని జడిలో తడిసిన కలల్నీ కదిలించడానికే నువ్వొచ్చావు.  ...

ఆమె కోసం నాలుగు మాటలు…

1. ఓడ అక్కడే ఉండిపోతుంది కదలికలు నాతో పాటు వచ్చేస్తాయి నది పారుతూనే ఉంటుంది తరంగాలు నా వెనువంట వచ్చేస్తాయి ఇప్పుడు నాలోపల ఎన్ని ప్రవాహాలో చెప్పలేను మన తొలి కరచాలనం నుంచి ఇప్పటి దాకా ప్రయాణిస్తున్న నావల తో అంతర్వాహిని...

పూరీడుపిట్ట పాట

శాన్నాలుగా ఎదురు తెన్నులు సూత్తన్ను పుచ్చపువ్వుల్లాటి నా రొండు కళ్ళూ సూర్జిడిని ఎలిగించి పొగులంతా ఎదకతనవి పొద్దుబోయీపాటికి దీవెట్టుకొని దివస్తంభాల మీద దివ్వలవతనవి – ఏ పొద్దు కిందనుండి దూరి తుర్రుమని ఎటెగిరిపోతందో...

కవిత ప్రభావం

కవిత్వానికి వేణువునే అయినా ఆ శబ్దానికి ఆలోచనల బీజం ప్రాకుతూ నడుస్తూ పరుగెత్తుతూ నిద్రలో సైతం వెంటాడుతుంది పెరిగాక ఎలా బయటపడుతుందో దానికీ తెలియదు   దానిని కవితలా చేయబోతుంటే గొప్ప కవులు నన్ను చిన్నవాడిని చేస్తుంటారు...

వెళ్లేందుకు ఒక చోటుందా ?

నువ్వు అట్లా పగిలిపోయినప్పుడు  ఆ విరిగిన ముక్కల్ని అతుక్కుని మళ్లీ  పక్షివై ఎగిరేందుకు నీకో ఆకాశం ఉందా? వెళ్లేందుకు నీకో చోటుందా? నువ్వు గుదిగుచ్చి ఒక హారంలా నిత్యం  నీ మెడన ధరించిన జ్ఞాపకాల మువ్వలను ఇహ తెంపేసుకుని...

రేపటి పోరాటం కోసం

నిర్జనారణ్యంలో టార్పాలిన్ పైన నిద్రిస్తున్న నిన్ను సీతాకోక చిలక ముద్దుపెట్టుకుంది. అన్ని సౌకర్యాలూ  వదులుకున్న నగ్న పాదాలు అడవిలో గ మ్యాన్ని వెతుకుతున్నాయి. రేపటి పోరాటం కోసం ఈ రోజు నీ నిద్రను పొదుపు చేసుకుంటున్నావు...

యామినీ కృష్ణ కవితలు రెండు

పుట్టింది జూలై 1986. సిరిపురం తెలంగాణ లో. చదువు, పెరిగింది అంతా విజయవాడ. వృత్తి రీత్యా గతంలో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా, సోషల్ వర్కర్ గా, ఇంగ్లీష్ మీడియా లో ఫీచర్ రైటర్ గా పనిచేశాను. ప్రస్తుతం ఇంగ్లిష్ తెలుగు పుస్తకాలు...

మట్టిలో రహస్యం 

తను చెప్పేది వింటూ ఎప్పుడూ నిశబ్దమై పోతావు రాయడం ఒక అదృష్టం అనుకొని కొత్త పదాలను వెతుక్కుంటూ నీటిలో వలయం లా వాటిని కలిపేసుకుంటుంటావు అప్పుడే ఒక మెరుపు వెర్రిగా ఒక నవ్వు అంతలో అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంటావు ఎందుకంటావు...

సుగంధి

ప్రేమ అద్దం లాంటిది సందేహం అక్కర్లేదు పగిలితే బహు పదును! ప్రతిబింబం కూడా ప్రతీకారం కోరుతుంది. కర్పూర సుగంధం మొగలి ముల్లై సర్రున గీసుకున్నాక, ఆశలు ఆవిరైన మసకలో వెచ్చని కన్నీరై కురుస్తుంది. గుండెకు పొదువుకున్న రూపం...