సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
తరంగసంచిక: 1 డిసెంబర్ 2018

నాన్న‌పాదాలు…కూతురి పాదాలు..

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

ఓ సాయంత్రం..
ఇసుక‌లోకి పోయి గుజ్జ‌న‌గూడు.
చెక్ చెక్ పుల్ల చెకారి పుల్ల ఆడుకున్నాం.

మా ఊరెళ్లాక‌..
‘నువ్వెక్క‌డాడుకున్నావ్‌!’
అంటూ కృతి అడిగింది.
ఆ ఒక్క‌మాట..
బాల్యంలోకి 11 కి.మీ ఫ‌ర్ సెక‌న్ కంటే ఎక్కువ వేగంతో..
నా మ‌న‌సు దూసుకెళ్లింది.
గురుత్వాక‌ర్ష‌ణ‌కు ఎంత‌టిశ‌క్తి ఉందో తెలీదుకానీ..
జ్ఞాప‌కాలకున్న శ‌క్తిని వ్య‌క్త‌ప‌ర్చ‌టం అల‌వికాదు.
బ‌డికాడికి పోయి..
ఒక‌ప్పుడు బావి, జామాయిల్ చెట్టు, దేవునిపూల చెట్టు..
ఒక‌టో త‌ర‌గ‌తి పెంకుటిల్లు బ‌డి..
మా ముర‌ళీ సారు, ప్ర‌కాశ్ సారు, ప్ర‌స‌న్న‌యివారు..
నేనాడుకున్న ఆట‌ల్నీ కాసేపు చెప్పానంతే.
అంత‌లోనే..
‘నాన్న‌.. నువ్వు బ‌డికిపోక‌పోతే..
మీ ఫ్రెండ్సు నిన్ను ఎత్తుకు పోవ‌టానికి వ‌చ్చింటే..
నువ్వు ఎనుముల ద‌గ్గ‌ర దాక్కున్నావు క‌దా!’ అంటూ ..
నేను ఒక‌ప్పుడు చెప్పిన విష‌యాన్నే నాకే గుర్తుచేసింది.
.
బ‌డికాడి గుర్తుల‌న్నీ భోరున గోల‌పెట్టాయి.
గానాట‌, సీటుబ్యాటు, అశ్వి ఆట‌లు.
జామాయిలు చెట్ల గంప‌ల్ని వేళ్ల‌పై పెట్టి ప‌గ‌ల‌గొట్టి ర‌క్తం చూడ‌టం..
ఆంజ‌నేయ‌సోమి క‌నిపిచ్చాడ‌ని ముక్కుగీరుకోవ‌టం..
అగ్గిపెట్టెల్ని ఇస్పెట్టాకుల్లా దాచుకోవ‌టం..
పావులా పుల్ల‌యిసులు, సోంపాపిడి..
ఆడ‌పిల్లోల్ల‌తో అచ్చందకాయ‌లాడుకున్న క్ష‌ణాలు..
గిల‌క‌ల చెట్టు, దేవుని పూల చెట్టు..
జెండాక‌ట్టె.. బోరింగ్‌.. అన్నీ లీల‌గా ప‌ల‌క‌రించాయి.
అభివృద్ధి విధ్వంసంలో
ఆన‌వాళ్లే లేకుండా పోయాయి.
అయినా మ‌న‌సుకు ఓ అగ్మెంటెడ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెంట్‌
ఉంటుంది క‌దా!
ఉత్త‌కాళ్ల‌కి ప‌ల్లెరుగాయిలు ఇరిగిన క్ష‌ణాలూ..
వొదెపెట్టి మ‌రీ గురుతొచ్చాయి.
జ్ఞాప‌కాలు ఇంక‌లేదు..
ఇంకా ప‌చ్చిగా ఉండాయి !
మా ఇంటికాడ కుంట‌లో ఈత‌లేసేవాళ్లం..
ఎనుముల్ని రాళ్ల‌తో కొట్టడం..
తూనీగ‌లు ప‌ట్టుకోవ‌టం, నీళ్ల కోళ్ల జాడ‌కోసం వెతుకులాట‌..
నిక్క‌ర్లు త‌డిచేదాకా కుంట‌లోకి పోయి ఆడుకోవ‌టం..
చ‌రిత్ర అయ్యాయి.
రియ‌ల్ ఎస్టేట్ కి కుంట‌లు జాడ లేదు
ఒక‌ప్ప‌టి చెర్లోప‌ల్లెగుట్ట‌కి వెళ్లాం.
సాదాసీదాగా బాధ‌తో క‌రిగిందది.
గుట్ట‌పై కాసేపు ఆడుకుంది మా కృతి.
ఆ త‌ర్వాత రోజు ఉద‌యాన్నే..
తూమురాళ్ల దిక్కుపోయినా.
‘తూమురాళ్ల‌ను నాలోనే క‌లిపేసుకున్నా’ నంది.
మా వూరి చెరువు క‌ట్ట.
దూరంగా ఉండే రేన‌గాయ‌చెట్లు, గ‌చ్చ‌కాయచెట్లు
గ‌గ‌నానికెగిసినాయి!
చెరువుక‌ట్ట‌లో..
కృతితో క‌లిసి రాళ్ల‌తో ఈత‌లేశాను..
చిన్న‌ప్ప‌టిలాగే ప‌ది రాళ్లీత‌లూ వేశా.
నీళ్ల‌పై రాయి స‌వారు గుర్రంలాగా పోతాంటే..
ఆ నీళ్ల‌లోనే..
ఇనాకుమ‌య్య‌ను వేసిన క్ష‌ణాలు మెదిలాయి.
ఓ సాయంత్రం..
ఇసుక‌లోకి పోయి గుజ్జ‌న‌గూడు.
చెక్ చెక్ పుల్ల చెకారి పుల్ల ఆడుకున్నాం.
ప‌డ‌మ‌టి కిర‌ణాలు ప‌ల‌చ‌బారుతున్న వేళ‌..
నాకో విష‌యం అనిపించింది
ప్ర‌తి మ‌నిషికి ఒకేసారి బాల్యం అనేది త‌ప్పని.
ఎందుకంటే..
మ‌న ప్ర‌తి బిడ్డా మ‌న‌కో బాల్యాన్ని తిరిగిస్తాడు.
అలా ఆ రోజు కృతి..
నా రెండోబాల్యాన్ని కందిపుల్ల తీసుకుని..
బెదిరించి మ‌రీ మ‌ళ్లీ నాకు ఇచ్చింది.
అది కూడా కాళ్ల‌కు అవాయి చెప్పుల్లేకుండా..
నాన్న‌పాదాలు, కూతురి పాదాలు..
ఒకేచోట ఇసుక‌లో ఆడుకోవ‌టం కంటే..
గొప్ప అనుభూతి ఏముంటుందీ?
*
చిత్రం: రాజశేఖర చంద్రం 

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

View all posts
నాలుగు గోడలు-నల్లముసుగు
మాయ నలుపు

6 comments

Leave a Reply to నాదెండ్ల.మదార్ వల్లి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముక్కోటి వెంకట శేషయ్య says:
    December 2, 2018 at 6:04 pm

    చాలా బాగుంది , ప్రతి గ్రామీణుని మనసుని హత్తుకొనే అంశం .

    Reply
    • Rallapalli rajavalli says:
      May 24, 2020 at 8:53 am

      Thanks sir

      Reply
  • పద్మశ్రీ says:
    September 2, 2019 at 12:08 am

    ఊరికి తీసుకెళ్లి పోయారుగా

    Reply
    • rajavali says:
      September 3, 2019 at 5:25 am

      vurikani vellanu. yekkada adukunnavante rasesa madam poem.’
      thanks

      Reply
  • నాదెండ్ల.మదార్ వల్లి says:
    September 6, 2019 at 3:47 am

    నేడుఇలాంటిఅనుభూతులుపిల్లలకుకరువయ్యాయి.సెల్ పోనులరేడియేషన్,టి.వి లఅరుపులు తోడయ్యాయి.ప్రకృతికిఆసరామనంమనకుప్రకృతిఆధారం అలాంటిప్రకృతిగురించితెలియడంలేదు నేటిబాల్యానికి ఇలాంటి అనుభూతులు,అనుభవాలుకలిగించాలి

    Reply
    • Rallapalli rajavalli says:
      May 24, 2020 at 8:52 am

      Thanks anna

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

ప్రపంచ భాషగా తెలుగు నిలబడుతుందా?!

అఫ్సర్

తెలుగు సాహిత్య భవిష్యత్తు ఇదిగో ఇక్కడ!

విశీ

మీజాన్‌సేన్ 2

అరిపిరాల సత్యప్రసాద్

ట్రీ ఆఫ్ లైఫ్

శ్రీరామ్
సంపుడు పందెం

సంపుడు పందెం

మొయిదా శ్రీనివాస రావు

పర్ఫెక్ట్ మర్డర్

మల్లాది లక్ష్మణ శాస్త్రి
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Sudhakar Unudurti
    on కనిపించే న్యాయంలోనూ కనిపించని వివక్ష వుంది!
    చట్టం వేరు; న్యాయం వేరు. (ధర్మం పూర్తిగా వేరు). అన్యాయాన్ని అరికట్టడానికి...
  • డాక్టర్. జోస్యుల కృష్ణబాబు..
    on ప్రపంచ భాషగా తెలుగు నిలబడుతుందా?!
    మాతృభాషకన్న! మాతృదేశముకన్న! మధురమైనదేది? మానవులకు! స్వర్గమైన నేమి సౌఖ్యంబులొనగూర్చు? తల్లిభాష కన్న!...
  • పద్మావతి రాంభక్త
    on సగం గడిచాక
    Thank you so much Sir
  • పద్మావతి రాంభక్త
    on సగం గడిచాక
    Thank you so much
  • Dr Venkatesh
    on సాయంబండ
    Excellent Depth life
  • thagulla Gopal
    on మెడకువడ్డ పాము
    అన్నా చాలా ధన్యవాదాలు
  • Thagulla Gopal
    on మెడకువడ్డ పాము
    చాలా చాలా సంతోషంగా ఉంది అక్కా. థ్యాంక్యూ సో మచ్ అక్కా...
  • పల్లిపట్టు
    on మెడకువడ్డ పాము
    జీవితాన్ని కథగా మలిచే నిపునత చాసోకి తేలిసినట్టు, కాలువమల్లయ్య కి తెలిసినట్టు...
  • LAKSHMANA MALLADI
    on పర్ఫెక్ట్ మర్డర్
    అద్భుతమైన విశ్లేషణ.
  • LAKSHMANA MALLADI
    on పర్ఫెక్ట్ మర్డర్
    మీ వ్యాఖ్యకి అనేక ధన్యవాదాలండీ. మీరిచ్చిన కొండంత బలంతో తప్పక ప్రయత్నిస్తాను....
  • Ch MURALI KRISHN
    on పర్ఫెక్ట్ మర్డర్
    can we get other stories from you sir, your...
  • Vijaya YND
    on నిరాదరణ గురించి ఏం చెప్పను?!
    ఒక బిచ్చ గత్తె హృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారో! ఈ జీవ...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా
    షుక్రియా
  • SRINIVAS AITHA
    on తెలుగు సాహిత్య భవిష్యత్తు ఇదిగో ఇక్కడ!
    నేనూ హాజరయ్యాను. యువతీ యువకులతో "T Works ప్రాంగణమంతా కోలాహలంతో నిండిపోయింది....
  • chelamallu giriprasad
    on ట్రీ ఆఫ్ లైఫ్
    నైస్ exploration
  • VIDYASAGAR SPV
    on పర్ఫెక్ట్ మర్డర్
    ippude chadivaanu, bagundi. murder ayindi attaiah mamaiah la relation...
  • premkumar chitla
    on మెడకువడ్డ పాము
    అన్న కథ బాగుంది
  • మానస ఎండ్లూరి
    on మెడకువడ్డ పాము
    మాండలికంలోని జీవం కథకు వెన్నుగా నిలిచింది. ఇక ఈ పేద జీవితాల...
  • Shaheen
    on పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా
    తండ్రి కి తగ్గ తనయ 👏👏
  • Sunitha Pothuri
    on ట్రీ ఆఫ్ లైఫ్
    మీ రచన నన్నూ ఆ కొండపైకీ..నీటి మడుగు దగ్గరకీ నడిపింవింది. చాలా...
  • పల్లిపట్టు
    on ప్రేమే నిజమైన రాజకీయం
    కవిత బావుంది తమ్ముడు ప్రేమ నిజమైన రాజకీయం.👌 💐💐 శుభాకాంక్షలు
  • Hemanth
    on స్పష్టత వచ్చాకే విమర్శ రాస్తాను!
    బాగుంది!
  • Achyutha Satyanarayana Rao Manchala
    on స్పష్టత వచ్చాకే విమర్శ రాస్తాను!
    మా సత్యం కెంగార మోహన్ గారు ఇంటర్వ్యూ పర్వాలేదు. మీ విమర్శన...
  • Valeti Gopichand
    on ఫ్యామిలీ సీరియల్స్ మొదలైంది రేడియోలోనే!
    త్రవ్వి పోస్తున్నావ్. జ్ఞాపకాల కలబోత. పాతతరం అందరూ గుర్తుకు వస్తున్నారు. ఈ...
  • K. SriKiran
    on సమాజపు గారడీలో ఓడిపోయిన దొమ్మరులు
    మేడమ్ దొమ్మర్ల మీద ఆసక్తితో పుస్తకాలు చదువుతున్నాను. మీ వ్యాసాలు ఆసక్తిగా...
  • డా. కె. ఎల్. వి. ప్రసాద్
    on ఫ్యామిలీ సీరియల్స్ మొదలైంది రేడియోలోనే!
    బాగుంది మీ ఉద్యోగ పర్వం అభినందనలు
  • Giri Prasad Chelamallu
    on ప్రమోద్ వడ్లకొండ కవితలు రెండు
    భాషలకు తెలియని సంభాషణ! Magnificient
  • chelamallu giriprasad
    on సగం గడిచాక
    Excellent
  • Gopal Lahiri
    on Kusumita Mukherjee Debnath’s Two Poems
    Well written Kusumita! Write on!
  • యాకస్వామి
    on వాస్తవికత సృజనగా ఎట్ల రూపుదిద్దుకుంటది? 
    చాలా బాగుంది. సార్. మీ విశ్లేషణ 🙏🙏
  • Ibraheem Nirgun
    on ట్రీ ఆఫ్ లైఫ్
    ఈ యాత్ర వృత్తాంతం చదువుతూ ఉంటే మేము కూడా ప్రయాణించిన అనుభూతి...
  • Murali
    on స్పష్టత వచ్చాకే విమర్శ రాస్తాను!
    Okay sir super
  • Sriram M
    on ట్రీ ఆఫ్ లైఫ్
    థాంక్యూ, శైలజ గారు 🙏
  • Kallakuri Sailaja
    on ట్రీ ఆఫ్ లైఫ్
    మీ ఈ పోస్ట్ నాకూ నా అనుభవాన్ని అక్షరీకరించింది.భూటాన్ టైగర్స్ నెస్ట్,కాశ్మీర్...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on అరుణ్ సాగర్ రాసిన ఒకే ఒక్క నవల
    లస్కుటపా ఇప్పుడే చదవడం ముగించాను. కడుపుబ్బ నవ్వించింది. అరుణ్ సాగర్ కవితలు...
  • పసునూరి రవీందర్
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    Thank you Jai bheem బ్రదర్
  • పసునూరి రవీందర్
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    Thank you రాజ్ కుమార్
  • పసునూరి రవీందర్
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    ధన్యవాదాలు బలు గారు
  • సియస్ రాంబాబు
    on ఆ మాట, ఆ నవ్వు, ఆ విమర్శ ఇక లేవు !
    మొన్ననే కథ 24లో వారి కథ చదివాను చాలా కాలం క్రితం...
  • స్రవంతిమహిపాల్. తెరవే సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    అన్నా జై భీమ్ మంచి వ్యాసం బహుజన కవులకు కావలసిన కవితావస్తువు...
  • Bandari Rajkumar
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    యువతరం కవిత్వం భవిష్యత్తు పట్ల భరోసాను కలిగించింది. దృక్పథం సోయిని రెండు...
  • Prabhakar Ak
    on ఆ మాట, ఆ నవ్వు, ఆ విమర్శ ఇక లేవు !
    ఆయనతో నేనూ గట్టిగా గొడవపడ్డాను. ఆయన విమర్శ కటువుగా ఉంటుంది. కానీ...
  • Pilli Balu
    on రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’
    ఈ వేదిక మాలాంటి కొత్తగా రాస్తున్న ఎంతోమందికి చక్కని దిక్చూచి అని...
  • ఎ. కె. ప్రభాకర్
    on ప్రవాసి వెతుక్కుంటూ వెళ్ళిన దారి
    Great tribute. మాటలో నిక్కచ్చితనం ఆయన సొంతం. 'బహుళ' సాహిత్య విమర్శ...
  • శ్యామల Kallury
    on ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు!
    ఇక్కడ వేలూరి వారు ప్రస్థావించిన Twentieth Century Telugu Poetry నాదేనా...
  • S Murthy Kompella
    on మధునా పంతుల వారి అడుగుజాడల్లో…
    Commendble literary services to the enrichment of Telugu literature...
  • Annapurna
    on ఆ మాట, ఆ నవ్వు, ఆ విమర్శ ఇక లేవు !
    Ademito intavarakoo naku Veluri Venkateswara Rao gari gurinchi teliyadu...
  • Sailaja Kallakuri
    on మధునా పంతుల వారి అడుగుజాడల్లో…
    మంచి జ్ఞాపకాలు పంచుకున్నారు.సంతోషం అండి.
  • Sailaja Kallakuri
    on మధునా పంతుల వారి అడుగుజాడల్లో…
    మీకు అనేకానేక ధన్యవాదాలు
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on ప్రవాసి వెతుక్కుంటూ వెళ్ళిన దారి
    మంచి సాహిత్య వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు సార్. వేలూరి వారి రచనలు...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు