సంగీతమే శ్వాసగా చిత్తరంజన్ మాస్టారు

గాయకుడా, స్వరకర్తా, సంగీత సూక్ష్మాలు తెలిసిన రసజ్ఞుడా, సంగీత చరిత్ర శోధించిన పరిశోధకుడా… ఏమో ఏదైనా తక్కువే అనిపిస్తుంది.

ఆకాశవాణి సంగీతంతో బ్రతుకులు చిగురించుకున్న ప్రతి వాళ్ళకి ‘చిత్తరంజన్’ ఓ మరిచిపోలేని అనుభూతి. సరిగమల ఆరోహ, అవరోహణలే  ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా మలుచుకున్న మనిషి చిత్తరంజన్ మాస్టారు. గాయకుడా, స్వరకర్తా, సంగీత సూక్ష్మాలు తెలిసిన రసజ్ఞుడా, సంగీత చరిత్ర శోధించిన పరిశోధకుడా, అన్నిటికి మించి సంగీతం ఆవహించిన నారద తుంబురుడా…. ఏమో ఏదైనా తక్కువే అనిపిస్తుంది.

మహాభాష్యం చిత్తరంజన్ 25  ఆగస్టు 1938 లో పుట్టారు. సంగీత విదుషి, తల్లి పేరిందేవి వీణ, వయోలిన్, హార్మోనియం లు అలవోకగా వాయిస్తుంటే పెద్ద కొడుకుగా చిత్తరంజన్ అలవాటుగా వీటిని చెవులకు ఎత్తుకున్నారు . ఎనిమిదో ఏట దక్కన్ రేడియో లో పాడటం మొదలు పెట్టి పాటనే జీవన పథంగా చేసుకున్నారు.

15000 కు పైగా పాటలు స్వరపరచి, 8000 కు పైగా పాటలు పాడిన ఈయన బాలమురళి ప్రియ శిష్యులలో ఒకరు .

డెబ్బై ఏళ్ళు  గా సంగీతమే సర్వస్వంగా జీవిస్తున్న మాస్టారు,  25 ఆగస్టున 80 వ పుట్టినరోజులోకి అడుగిడారు. ఈ శుభ సందర్భంగా మరో సంగీత జ్ఞాని కలగ కృష్ణ మోహన్ ,  సారంగ-ఛాయా తరపున ఆయనతో విస్తృతంగా సంభాషించారు. చెక్కు చెదరని జ్ఞాపకశక్తి ఆస్థి గా బ్రతుకుతున్న ఆ సంగీతజ్ఞుడి  జ్ఞాపకాలను  ఆయన మాటలలోనే వినండి.

Avatar

కలగా కృష్ణమోహన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చిత్తరంజన్ గారి ఇంటర్వ్యు బాగుంది. ముఖ్యంగా 40 ల నాటి హైద్రాబాద్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సౌండ్ బాగా తగ్గడం వలన జాగ్రత్తగా వినాల్సి వచ్చింది .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు