“I am going to die on September 1st”, said SIBO, aloud, just to no one in particular.
“Welcome to the club!” A fragile voice chimed in.
SIBO noticed it was a senior WIHU, whom he presumed dead for long, coming up alive.
“I thought you were dead,” said SIBO.
“You know in our world we have two deaths. Sometimes more than two. It depends on our Gods living in a parallel world called Earth.”
“If you say multiple deaths, then we should be having multiple rebirths?”
“Yes, you got it. I am just reborn after my last death. Who knows? The next death, may be my final death, Death.”
“So what is final Death?’
“When one of my Gods dies. That’s when I escape from the cycle of rebirths.”
“So Death is certain.”
“As certain as our Gods’ death. And humans do die. They can’t escape death.”
” How will you identify your Gods amongst so many humans?”
“Only two of those humans are Gods to me. I know because they gave birth to me. And I worship only them.”
“So a male and a female. If you are born to humans you should be on Earth.”
“No need to worry about gender. We are children of two humans, irrespective of gender. We are in a parallel universe. We live here. They live there. All those rules on Earth don’t apply here.”
“So you are saying that if one of the two humans that gave birth to you dies, you really die.”
“You got it. Till that happens I go through this cycle of birth, death and rebirth”
SIBO was trying to make sense of all that WIHU was telling.
“I am not yet born and your talk on these life cycles is causing me anxiety,” a tiny voice inserted itself into the conversation.
SIBO discovered this voice was from an embryo getting ready to take birth. It was a BOGI baby. There are no names in the parallel universe of SIBO. There are innumerable SIBOs, WIHUs BOGIs and the list goes on. They all get their identity from their human parents who are unique.
This BOGI embryo was developing fast and its chances of a birth seemed very bright.
“Don’t sweat. We all were born like you. Once you have a life, you will start living one way or other,” said SIBO.
“What do you mean living?”
“Living spans time. In our case we live a life cast as shadows by our Gods living on the Earth. We derive life from them. In our world we attribute a number of things we don’t understand to our Parent Gods and happenings on the Earth. So they have a life span and so do we.”
“What is my life span?”
“You are still an embryo. You will soon realize that there is a lot that is not understood. Get comfortable with the unknown. Just accept the idea that our life is derived from humans and plays out as per their rules. Don’t question too much. It only leads to unhappiness.”
“It all sounds confusing and exciting at the same time. Can’t wait to be born and go through life’s experiences, just as you did.”
“I doubt it. Not sure if you can experience the same as I did.”
“In any case, I am excited. You were talking about death on September 1st. If I don’t get aborted, your death should coincide with my birth. Can’t wait that day to come,“ said BOGI animatedly.
***
న్యూ యార్క్ జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్పోర్ట్ లో దిగాడు అర్జున్. సుభద్ర ఒక రెండడుగులు ముందు నడుస్తున్నది. పెళ్ళిలో ఒకరి వెంట ఒకరు జంటగా అడుగులు వేసినప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా? రెండేళ్ల క్రితం, ‘నీతో పాటు నేను ఇంక నడువలేనని’, సుభద్ర అర్జున్ దగ్గర విడాకులు తీసేసుకుంది. ఇద్దరి కూతురు అమ్ము పెళ్లి అని ఇండియాకు తనతో పాటు సుభద్రకు కూడా ఫస్ట్ క్లాసులో బుక్ చేశాడు అర్జున్. పెళ్లి అయ్యిపోయింది, అమెరికాకు తిరిగి రావడం అయ్యిపోయింది.
సుభద్ర వడివడిగా అడుగులు వేస్తూ తన నుండి దూరంగా పోవడం అర్జున్ కు ఆశ్చర్యం కలుగచేయలేదు. పెళ్లైన కొద్ది నెలలకే అలా నడవడం మొదలెట్టింది. కాలంతో అర్జున్ కూడా అలవాటు పడిపోయాడు. కానీ ఇప్పుడు అలా దూరం పోవడానికి కారణం తను కాదు. సుభద్ర అమెరికా పౌరసత్వం తీసుకుంది. తనకు ఇమ్మిగ్రేషన్ దగ్గర వేరే లైన్లు ఉన్నాయి. సిటిజన్స్ కోసం ఉన్న కౌంటర్ ల దగ్గర పెద్దగా జనం లేరు. కొన్ని నిమిషాలలో నే బయటకు వెళ్ళిపోతుంది. తన దగ్గరనుంచి, జీవితంలోనుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది.
అర్జున్ కు చీకాకనిపించింది. సుభద్ర వెళ్ళిపోయిందని కాదు. ఎదురుగా గ్రీన్ కార్డ్, పౌరసత్వం లేని ఇతర దేశీయులకని ఏర్పాటు చేసిన కౌంటర్ ల దగ్గర ఉన్న జనం చూసి. కౌంటర్ చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలియకూడదన్నట్లు, క్యూలు మెలికలు తిరిగిపోయి ఉన్నాయి. ఒకప్పుడు గ్రీన్ కార్డ్ వారిని సిటిజన్స్ తో పాటు కలిపేవారు. ఇమ్మిగ్రేషన్ పని నిమిషాలలో అయ్యిపోయేది.
సుభద్ర అమెరికా పౌరసత్వం తీసుకున్నప్పుడు, తనూ తీసుకోనుండాల్సింది అనుకున్నాడు అర్జున్. అప్పుడు ఇద్దరూ కలిసే ఉన్నారు. కానీ ఇంట్లో వారసత్వంగా వస్తున్న పొలాలు వదులుకో బుద్ధి కాలేదు. అవి తను మాత్రం సొంతం చేసుకోవడానికి అప్పటికే పథకం వేశాడు అర్జున్. అమెరికా పౌరసత్వం తీసుకుంటే భారతదేశంలో, భూస్వామి అయ్యే హక్కు కోల్పోతారు. అందుకని, అప్పుడు గ్రీన్ కార్డ్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సుభద్ర పౌరసత్వం తీసుకున్నప్పుడు, తనకు అవకాశం ఉన్నా తీసుకోలేదు.
ఇప్పుడు ఆ పెద్ద ఇమ్మిగ్రేషన్ క్యూలో కలుస్తుంటే అర్జున్ కి చెమటలు పోయడం మొదలెట్టాయి.
పొరబాటు చేసాను, కనీసం గ్లోబల్ ఎంట్రీ పాస్ తీసుకుని ఉండాల్సింది, అనుకున్నాడు అర్జున్. ఆ పాస్ ఉన్న వాళ్లు నిమిషాలలో ఏ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తో మాట్లాడ కుండానే బయట పడుతున్నారు.
అమెరికాలో అడుగు పెట్టడానికి అనుమతి ఇస్తారా? ఇంకేమైనా చేస్తారా? జైల్లో పెడతారా అన్న మరో ప్రశ్న బయటకు రాకుండా అణిచి వేశాడు అర్జున్. తనకు సలహాలు ఇచ్చి, తనను ఇలాంటి అనేక సమస్యల నుండి, ప్రమాదాలనుండి తప్పించిన శ్రీ దేవి అక్క పలకటం లేదు. ఫోన్ చేస్తే ఎత్తటం లేదు.
ఒక వారం రోజుల క్రితమే జరిగిన కూతురు పెళ్లి గుర్తుకు వచ్చిందా క్షణంలో, అర్జున్ కు.
***
పెళ్లి అయ్యిపోయింది. అర్జున్ కు ఆనందంగా ఉంది. అర్ధ రాత్రి అయినా, రిసెప్షన్ తరువాత డాన్స్ ఫ్లోర్ లో జోరు తగ్గలేదు. లక్షలు పోసి తెప్పించిన డీ జే తీసుకున్న డబ్బుకు న్యాయం చేయడానికి ఏ మాత్రం తగ్గటం లేదు. గాలి పీల్చుకుందామని అర్జున్ రిసార్ట్ బయట ఉన్న బీచ్లో అడుగుబెట్టాడు. బిద్రి వర్క్ క్లోస్ అప్ లో చూసినట్టుంది. నిండు చంద్రుడి వెలుగు నల్లటి సముద్రం మీద ఒక వెండి నదిలా పారుతున్నది. అలల ఆటుపోట్లు ఆ నదీ ప్రవాహ మార్గాన్ని అందంగా మలుపులు తిప్పుతున్నాయి. చంద్రుని కాంతికి విసుక్కున్నట్లు, నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. సముద్ర ఘోష మనస్సుకు నిశ్శబ్దాన్ని పరిచయం చేయడానికి అహర్నిశంగ ప్రయత్నిస్తున్నది.
కూతురు పెళ్లి ధూమ్ ధామ్ గా చేయాలని, మహాబలిపురం రిసార్ట్ మొత్తం ఒక వారం కు బుక్ చేసి, పిలిచిన బంధు మిత్రులకు స్వర్గం ఎలా ఉంటుందో ఒక రుచి చూపించాడు, అర్జున్. ఎంత ఫుడ్డు, ఎంత మందు, ఎన్ని రకాల వినోద కార్యక్రమాలు, ఎన్ని టూర్లు, ఎన్ని ఖరీదైన గిఫ్టులు. పూట పూటకి అతిథులు అచ్చెరువు పడేలా చేశాడు. సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్.
కానీ అర్జున్ సర్ప్రైజ్ అయ్యేలా అప్పుడే ఫోన్ మ్రోగింది. ఈ సమయంలో తనకు ఎవ్వరూ ఫోన్ చేయకూడదే అని ఆశ్చర్య పడుతూ, ఫోన్ తీశాడు. ఫోన్ ప్రశాంత్ నుంచి. ప్రశాంత్ తన బిజినెస్ పార్టనర్. తన అకౌంటెంట్ కూడా. రాజుకు మంత్రి లాగ తన బిజినెస్ రాజ్యం ఏలడానికి సహాయపడే మిత్రుడు. ఈ సమయంలో చేశాడంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యి ఉంటుంది.
“అర్జున్, పెళ్లి ఎలా జరిగింది. మరోసారి, సారి. పెళ్ళికి రాలేకపోయాను.”
” పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. నిన్ను బాగా మిస్ అయ్యాను. ఏదో అర్జెంట్ పని తగిలింది, వివరాలు తరువాత చెప్తాను, ముందు పెళ్లి ఏర్పాట్లు చూసుకోమని అమెరికా నుండి ఇండియాకి బయలుదేరే ముందు చెప్పావు. ఎంటా అర్జెంట్ పని? ముగిసిందా?”
“ఆ ..,” అంటూ దీర్ఘం తీశాడు ప్రశాంత్, “పలక ముక్క దగ్గరే ఉందా?”
అర్జున్ కి ప్రశాంత్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్ధం అయ్యింది. పలక ముక్క అంటే ఇద్దరికోసం కొనుకున్న బర్నర్ ఫోన్లు. అర్జున్ రెండు కొని ఒకటి ప్రశాంత్ కిచ్చాడు. ఎవరు, ఎవరి ఫోన్ టాప్ చేస్తున్నారో తెలియదు. అర్జున్, ప్రశాంత్ లు వారి సంభాషణ వారు చేస్తున్న వ్యాపార లావాదేవీల వైపు మల్లితే, బర్నర్ ఫోన్ లే వాడుతారు. ప్రశాంత్ బర్నర్ ఫోన్ కి డయల్ చేశాడు.
“హలో ప్రశాంత్, బర్నర్ ఫోన్ కు స్విచ్ అయ్యాను. బిజినెస్ మాటలు నేను అమెరికా తిరిగి వచ్చిన తరువాత కలిసినప్పుడు మాట్లాడుకుని ఉండవచ్చు కదా. ఏంటి అంత తొందర?” కొంత విసుగ్గానే అన్నాడు అర్జున్. చాలా రోజుల తరువాత తీసుకున్న వెకేషన్ ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. పెళ్లి తరువాత భారత దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు చూద్దామనుకున్నాడు. ఆ ప్రయాణం, వెకేషన్ రేపటి నుండే ప్రారంభం.
“అర్జున్, తొందరే ఉంది. ఇప్పటికే ఆలస్యం చేసాను. నీ యింట్లో పెళ్లి కానీ అని ఆగాను. పెళ్లి అయ్యిపోయాక నువ్వు దొరుకుతావో లేదో అనిపించింది. అందుకే అపరాత్రిలో ఫోన్ చేస్తున్నాను. ఓ చిన్న చిక్కు లో చిక్కుకున్నాను.”
“నువ్వు పెళ్ళికి రానంటేనే అనుమానం వచ్చింది. నాకు చెప్తే బయట పడడానికి సహాయ పడే వానిగా…” దీర్ఘం తీశాడు అర్జున్.
“నువ్వు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అని ఇండియాకు బయలు దేరే ముందు పెద్ద ఎత్తున ఒక పార్టీ పెట్టావు కదా, ఆ పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటే పోలీసు వాళ్లు డీ యూ ఐ అదే త్రాగి డ్రైవ్ చేస్తున్నానని అరెస్ట్ చేశారు.”
“నువ్వు మితంగానే త్రాగుతావే?”
“అవును, కానీ నీ ఇంట్లో పెళ్లి అన్న సంతోషమేమో, ఒక గ్లాసు ఎక్కువే తాగినట్లు ఉన్నాను. పొరబాటున, సడన్ బ్రేక్ వేసినా, ముందు కారు ను నా కారు తో, సమయానికి ఆపుకోలేక, గుద్దేసాను. ముందు కారు వాళ్ళు 911 కాల్ చేస్తే కూడా పెద్దగా వర్రీ అవ్వలేదు. చిన్న ఫెండర్ బెండర్, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వచ్చే కాప్స్ కూడా మీరు, మీరు సర్దుకొని పొండి అని వదిలేస్తారు, అనుకున్న.”
” మరి…?”
“ఆ వచ్చిన కాప్ మా దగ్గర వివరాలు వింటూ, డీ యూ ఐ టెస్ట్ లు మొదలెట్టాడు. నాకు అదేం భయపెట్టలేదు. ఇది వరకు లేట్ పార్టీల తరువాత డ్రైవ్ చేసాను, ఎప్పుడూ పట్టుబడలేదు. కానీ అనూహ్యంగా ఈసారి నా రక్తంలో ఉన్న ఆల్కహాల్ లిమిట్ కి పైనున్నట్లు తేలింది. వెంటనే నన్ను అరెస్ట్ చేశారు.”
“నీకు తెలియకుండానే ఎక్కువ తాగేసినట్లున్నావు. చిన్న ఆక్సిడెంట్ కదా. బెయిల్ మీద వదిలేసి ఉంటారు. మొదటి సారి కాబట్టి ఫెలోని చార్జెస్ కూడా అయ్యి ఉండదు. ఇంకో సారి నువ్వు తాగితే ఉబెర్ తీసుకో,” అర్జున్ సముదాయించబోయాడు.
“అలాగే అనుకున్నాను నేను. కానీ పరిస్థితులు మారిపోయాయి, ఇటీవల. ముందు నా స్టేటస్ అడిగారు. నేను సిటిజన్ అని చెప్తే నమ్మలేదు. అదృష్టవశాత్తు పాస్పోర్ట్ కాపీ ఫోన్ లో ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. వారికి కావలసిన పాస్పోర్ట్ కాపీ ఫోన్ లో వెదికి చూపించడానికి నానా తంటాలు పడవలసి వచ్చింది. చూసిన తరువాత కూడా వారి ప్రవర్తనలో మార్పు లేదు. ఫెలోని ఛార్జ్ నా మీద బుక్ చేశారు.”
“ఫెలోని ఛార్జ్ పెద్ద నేరమే కదా. లాయర్ పెట్టుకున్నావనుకుంటాను.”
“ఆ లాయర్ ను పెట్టుకున్నాను, మొత్తానికి బెయిల్ మీద బయట పడ్డాను.”
“మరి అన్ని సుఖాంతమే కదా. మిగిలిన గొడవలు లాయర్ చూసుకొంటాడు. నాకెందుకు ఈ అపరాత్రి ఫోన్ చేసి, అదీ బర్నర్ ఫోన్లో మాట్లాడుతున్నావు.”
“కారణం ఉంది. ఫెలోని ఛార్జ్ చేసే ప్రయత్నాలలో, నా మీద ఇన్వెస్టిగేషన్ మరింత ఉధృతమైంది, అనుకుంటా. వారి దృష్టి నా ఆర్థిక వ్యవహారాల మీద పోయింది. ఇండియాలో ఉన్న నా బ్యాంకు అకౌంట్లు, వ్యాపార లావాదేవీలు అన్ని గడ్డిమోపులో సూది వెదికినంతగా, క్షుణ్ణంగా పరిశీలించారు.”
“నువ్వే ఒక అకౌంటెంట్. నీ అకౌంట్లు కూడా సరిగానే ఉండి ఉండాలి, కదా.”
“నిజమే. నేను ఇండియాలో ఉన్న అన్ని అకౌంట్లు, ప్రతీ సంవత్సరం, ప్రభుత్త్వంలోని ఐ ఆర్ ఎస్, ఫిన్ సెన్ డిపార్టుమెంట్ల కు నా టాక్స్ రిటర్న్ ల తో పాటు తెలుపుతున్నాను. అది కాదు సమస్య. నా అకౌంట్లు చూస్తున్నప్పుడు, నీ అకౌంట్లో నుంచి పెద్ద మొత్తాలు నా అకౌంట్లు మారడం, వారికి తెలిసింది.”
“మన లావాదేవీలు అన్నీ అమెరికా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే కదా. నాకు ఇండియాలో ఉన్న అకౌంట్లు అన్నీ గుప్తంగానే ఉంచాను.”
“అలానే ఉండి పోయేవి, నేను ఈ చిల్లర తాగుడు కేసులో ఇరుక్కోకపోయి ఉంటే. మీ వారసత్వంగా వచ్చిన ఆ పొలాలు మీ సొంతం చేయడానికి, నా కన్సల్టెంట్ ఫీజు, మీరు మీ ఇండియా అకౌంట్ నుంచి నా అకౌంట్ లోకి డబ్బు జమ చేసారు.”
“అక్క శ్రీదేవి గురించే కదూ మాట్లాడేది,” అన్నాడు అర్జున్.
ప్రశాంత్ కు డబ్బు చేసుకోవడం ఇష్టం. అర్జున్ కు డబ్బు చేసుకోవడం మరీ ఇష్టం. తేడా వచ్చిందల్లా, వారు దానికి ఎన్నుకున్న మార్గం. అర్జున్ ఎన్నుకున్నది, బాగా దగ్గరి స్నేహితులను, బంధువులను నమ్మించి వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా మోసం చేసి వారి డబ్బు కొట్టేయడం. షాడ్డన్ ఫ్రాయిడ లో ఒక వేరియేషన్. అవతలి మనిషి బాధలో సంతోష పడడం ఆ పదానికి అర్థం అయితే, అర్జున్ ఆ బాధ తాను స్వయంగా అవతలి మనిషికి ఏ మాత్రం తెలీకుండా కల్పించి, మరీ ఆనందిస్తాడు. ప్రశాంత్ కు అర్జున్ చేస్తున్న పనులు, నేరాలనిపించించినా, అవి తనకంటకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అర్జున్ కు సహాయ పడుతున్నాడు. ప్రశాంత్ అకౌంటెంట్ గా, అర్జున్ కు సహాయ పడినట్లే, వలస వచ్చిన చాలా మందికి, వారు ఆదాయ పన్నులు కట్టకుండా కొన్ని మిలియన్స్ ఆదా చేశాడు. అందులో అర్జున్ వాట ఎక్కువే. అర్జున్ ప్రశాంత్ కు ప్రీమియర్ క్లయింట్.
“మీరడిగారని చట్ట పరంగా మీ వారసత్వపు ఆస్తులు ఎలా జప్తు చేసుకోవచ్చో సలహా ఇచ్చాను. కానీ శ్రీదేవి గారికి అలా చేసి ఉండకూడదు.”
“ఏంటి ప్రశాంత్, నీకు శ్రీదేవి మీద అభిమానం పోయినట్లు లేదు. శ్రీదేవి నిన్ను నాకు పరిచయం చేసిందని ఒప్పుకుంటాను. మరి తనే కదా నన్ను స్పాన్సర్ చేసి ఈ దేశం వలస వచ్చేందుకు సహాయ పడింది. నా మొదటి ఆర్నెల్లు ఆవిడ ఇంట్లోనే ఉంచుకుని ఈ దేశం కట్టుబాట్లకు, అలవాటు చేసింది. నా మొదటి ఉద్యోగం నాకు వెదికి ఇప్పించింది. శ్రీ దేవి స్వయంగా నాకు అక్క. మరి నాకు లేని ఈ ఫీలింగ్స్ నీకెందుకు. నేను నీ సహాయానికి పేమెంట్ లు ధారాళంగానే సమర్పించుకున్నానే.”
అర్జున్ శ్రీదేవి ప్రసక్తి తో అప్సెట్ అయ్యాడని ప్రశాంత్ కు తెలిసిపోయింది.
“అబ్బే మీ నిర్ణయాలు మీవే. నేను దాన్ని ప్రశ్నించటం లేదు. మీకు మీ అమ్మగారి నుండి పొలాలు వస్తాయి అని, అవి మొత్తం మీకే రావాలని అడిగారు. దానికి మీ అమ్మగారి నుండి విల్లు కావాలి అని చెప్పాను. మీరు అటు తరువాత అలాంటి విల్లు సృష్టించారని తెలిసింది. ఆ విల్లు ప్రకారం మొత్తం ఆస్తి ఈ పొలాల తో సహా మీకే మీ అమ్మ వ్రాసి ఇచ్చారని, పత్రాలు మీ అమ్మగారి పోయిన వెంటనే బయటకు తీసి ఆస్తి మొత్తం స్వాధీనం పరచుకున్నారు. ఈ విషయం శ్రీ దేవి గారికి తెలియదని ఇటీవల తెలిసింది. ఆ ఆస్తుల ద్వారా వచ్చే డబ్బు శ్రీ దేవి గారికి అవసరం లేకపోయినా, ఆవిడ మనస్సు లో అమ్మగారు అలా ఎందుకు చేశారన్న ఒక బాధ అలానే ఉంది”
అర్జున్ కు ప్రశాంత్ మాటలు పూర్తిగా చీకాకు తెప్పించాయి.
“నాకర్ధం కావటం లేదు ప్రశాంత్. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసింది, శ్రీ దేవి తరఫున వకాల్తా పుచ్చుకొని నేను చేసిన పని తప్పు పట్టడానికా? ఆ విల్లు నేను ఫోర్జరీ చేసిన విషయం నిజమే. నాకు ఆ భూములు కావాలనిపించాయి. అందుకే అలా తీసేసుకున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన నీకు, అదేమి ఆశ్చర్యం కలిగించ కూడదే. ఇప్పుడీ తర్కాలు ఎందుకు?”
“కానీ ఆ భూములు స్వంతం చేసుకోవాలని, మీరు అమెరికా పౌరసత్వం తీసుకోలేదు కదా.”
“అవును. అమెరికా పౌరసత్వం తీసుకుంటే భారతదేశంలో వ్యవసాయ భూములు కొనలేమని, ఉంచుకోలేమని నువ్వే కదా చెప్పావు కదా. అందుకే గ్రీన్ కార్డ్ ఎలానూ ఉంది కదా అని భారత దేశ పౌరసత్వం వదులుకో లేదు. ఆ భూములు నా పేరు మీదే ఉన్నాయి. శ్రీ దేవి బాధ పడితే నాకేంటి.”
అర్జున్ గొంతులో శ్రీ దేవి గురించి మాట్లాడినప్పుడు వెటకారంతో పాటు ఒక ఆనందం తోచింది ప్రశాంత్ కు.
“మీకు ఇక్కడ అమెరికాలో జరుగుతున్న మార్పులు తెలుస్తున్నాయి అనుకుంటాను. మీరు మీ అమ్మాయి పెళ్లి అని గత మూడు నెలలు భారత దేశంలోనే ఉండిపోయారు.”
“ఆ. న్యూస్ ఫాలో అవుతాను కదా.”
“నా మీద కేసు వల్ల, ఇండియా అకౌంట్ల వివరాలు బయట పడి, మీరు కూడా నేరస్తులని నిర్ణయించారు. మీరు ఇండియాలో ఉన్న బ్యాంకు అకౌంట్ల వివరాలు, వ్యాపార లావా దేవీలు, ఇక్కడ ఐ ఆర్ ఎస్ టాక్స్ విభాగాలకు రిపోర్ట్ చేయాలని ముందే చెప్పాను. మీరు టాక్స్ కట్టాల్సి వస్తుందని పట్టించుకోలేదు. ఇప్పుడు మీ మీద రహస్యంగా జరిగిన విచారణ వల్ల గ్రాండ్ జ్యూరీ మిమ్మల్ని నేరస్థులని నిర్ణయించిందని వింటున్నాను. మీరు నేరస్తులని కోర్టులో మీ కేసు మొదలవ్వనున్నది. మీకు సపీన తొందరలోనే రావచ్చు. ఇక్కడ ఉండి ఉంటే, ఈ పాటికే అంది ఉండేది.”
అర్జున్ కు చెమటలు పోయడం మొదలెట్టాయి. ప్రశాంత్ ఎందుకు ఫోన్ చేశాడో అర్ధం అయ్యింది. అమెరికాలో వస్తున్న మార్పులు కొంత ఆందోళన కలిగించినా, తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అని ధైర్యంగానే ఉన్నాడు, కొద్ది నిమిషాల ముందు వరకు, ప్రశాంత్ ఫోన్ వచ్చే దాకా.
ఇప్పుడు అర్జున్ మదిలో సవాలక్ష ప్రశ్నలు ఉదయించాయి. అమెరికాలో తనకున్న ఆస్తులతో పోలిస్తే ఈ పొలాల విలువ ఒక గడ్డిపోచ కింద లెక్కే.
‘ఎందుకు కక్కుర్తి పడ్డాను? శ్రీ దేవి కి అమ్మ ప్రేమ మీద అనుమానం, బాధ కలిగించి చూడాలన్న తన కిక్కు పరిణామం ఇలా ఉంటుందా?’
ఇంతలో దూరంగా శ్రీదేవి కనిపించింది. తనను చూడగానే బావతో పాటు తనవైపు వడి వడిగా అడుగులు వేస్తూ వచ్చింది. ప్రశాంత్ కు “ఒక్క నిమిషం” అని హోల్డ్ లో పెట్టి, అక్క శ్రీ దేవికి చేయి ఊపాడు.
“అర్జున్, బాగా ఘనంగా చేశావు నీ కూతురి పెళ్ళి. మా ఫ్లైట్ రేపొద్దున్నే ఉంది. బై.”
ఎప్పుడూ చాలా సేపు మాట్లాడేది. వీడ్కోలు తీసుకున్నప్పుడు ‘వెళ్ళొస్తాను’ అని చెప్పడం వాడుక. ఇలా మాటలు పొడి పొడిగా మాట్లాడుతుందేమీ శ్రీదేవి అనుకున్నాడు అర్జున్.
“ప్రశాంత్ తో మాట్లాడుతున్నా. అప్పుడే వెళ్ళిపోతున్నారా? అమెరికాలో మళ్లీ కలుద్దాం.”
ప్రశాంత్ తనకు జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి సపీన వచ్చిన వెంటనే శ్రీ దేవిని సంప్రదించిన విషయం అర్జున్ కి చెప్పలేదు. శ్రీ దేవి అమెరికా దేశం వచ్చిన తరువాత మంచి పేరు సంపాదించుకున్నది. విలువైన గొప్ప కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రశాంత్ కేసులో చిక్కుకున్నానని ఫోన్ చేసి చెప్పితే, సహాయం చేసింది. శ్రీ దేవి సహాయం వల్లే ప్రశాంత్ కు బెయిల్ దొరికింది. ప్రశాంత్ కు తనకు వచ్చిన సమస్య శ్రీ దేవికి చెప్పక తప్పలేదు. అందులో భాగంగా అర్జున్ శ్రీదేవికి చేసిన మోసం, ఇతర మోసాలు కూడా చెప్పాల్సి వచ్చింది.
“కలవాల్సిన అవసరం లేదు. ఏమి జరిగిందో నీకు, నాకు తెలుసు. అనవసరంగా నాకు అమ్మ మీద అపోహలు ఎందుకు సృష్టించావు? నీకు ఆ పొలాలు అవసరమా? బాగానే సంపాదించావు కదా. ఆ పోలాలు ఇంత వరకు కౌలు తీసుకున్న ఆ బీద రైతులకు ఇద్దామని ముందే చెప్పాను కదా.”
“అక్కా, ఇదేంటి గొడవేసుకుంటున్నావు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నన్ను చెప్పనీ,” శ్రీ దేవి మాటలను త్రుంచుతూ అర్జున్ మాట్లాడాడు.
“నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు. నా మేనకోడలు పెళ్ళి అని వచ్చాను. నువ్వు, ఇంత నా వెనుక చేసిన తరువాత, మనం కలవాల్సిన పని లేదు.”
సహాయం కోరుతున్నట్లు బావ వైపు చూసాడు అర్జున్. ఆయన ముఖంలో కూడా చీత్కారం. ఇద్దరూ అర్జున్ ను వదిలేసి విస విస అడుగులు వేసుకుంటూ, రిసార్ట్ వదిలి వెళ్ళిపోయారు.
‘పెద్ద విలువ చేయని ఆ పొలాల కోసం సిటిజన్ కాకుండా గ్రీన్ కార్డ్ మీదనే ఉన్న తన నిర్ణయం ఇప్పుడు తిప్పి కొడుతుందా? ఒక్క తప్పటడుగు వేసినా, గ్రీన్ కార్డ్ వాళ్లను, జైల్లో వేసి, డిపోర్ట్ చేస్తున్నారని, ఇంటర్నెట్ మీద, న్యూస్ చానెల్స్ లో గోల గోల. మరి తన మీద ఏకంగా ఫెలోనీ కేసు పెట్టారని ప్రశాంత్ అంటున్నాడు. ప్రశాంత్ చెప్పక పోయినా, ఏదో ఆ జస్టిస్ డిపార్ట్మెంట్ తో అతను డీల్ కుదుర్చుకున్నట్లే ఉంది. లేక పోతే తన మీద కేసు ఉంది అంటూ తాపీగా మాట్లాడడు. అంటే ఆ డీల్ లో భాగంగా నా విషయాలన్నీ అప్రూవర్ గా కక్కేసాడా? వచ్చే వారం అమెరికా తిరిగి పోయినప్పుడు, నన్ను అక్కడ ఎయిర్ పోర్ట్ నుంచే అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారా.’ అనేక ప్రశ్నలు.
“ప్రశాంత్ …హలో… సారి, శ్రీ దేవి వచ్చింది. ఇప్పుడే వీడ్కోలు తీసుకుని నీతో మాట్లాడుతున్నాను…,” హోల్డ్ తీసేసి తిరిగి ప్రశాంత్ మాట్లాడడానికి ప్రయత్నించాడు అర్జున్. అటు వైపు నిశబ్దం. ప్రశాంత్ ఇక మాట్లాడడని అర్జున్ కు అర్ధం అయిపోయింది. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులలో అక్క శ్రీదేవి సహాయ పడడం గుర్తుకు వచ్చింది.
వీడరాని సోదర, సోదరి బంధం విడిపోయింది, ఇంకా ఈ జన్మలో అతుక్కోదు అని అర్థం అయ్యిపోయింది. వాచి చూసాడు. డేట్ ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 కు మెల్లగా జారుకుంటున్నది. జన్మ తో వచ్చిన సంబంధం ఈరోజుతో చచ్చిపోయింది.
ఎదురుగా తలుపులు తెరుచుకుని, అంతవరకు డాన్స్ చేస్తున్న అతిథులు బీచ్ వైపు రావడం మొదలెట్టారు. బీచ్ మీదే మరో పార్టీ మొదలయ్యింది. కుర్రకారు పిల్లలు కేరింతలు, కేకలు పెడుతూ, ఆ ఫార్మల్ డ్రెస్ ల తోనే, సముద్రంలో ఆడుకోవడం మొదలెట్టారు. పార్టీలో పెట్టిన ఓపెన్ బార్, ఖరీదైన డ్రింక్స్ ఇన్హిబిషన్స్ ఏమైనా ఉంటే, వాటిని కరిగించి వేసి ఉండాలి అనుకున్నాడు, అర్జున్.
కూతురు, అల్లుడు కూడా బీచ్ వైపు వస్తూ, తనకు చేతులూపితే, అర్జున్ ఆనందంతో తనూ చేతులోపాడు. వీళ్ళ బంధం ఇప్పుడే మొదలయ్యింది. కలకాలం ఇలాగే సంతోషంగా, ఒకరిని, ఒకరు విడువకుండా వందేళ్లు బ్రతకాలని అప్రయత్నంగా తన దేవుణ్ణి మోక్కుకున్నాడు అర్జున్.
***
అర్జున్ వెనుకనున్నతను మెల్లిగా భుజం తట్టాడు, ముందుకు కదలమని. ఆలోచనలలో పడిపోయి తెలీకుండానే అర్జున్ క్యూ మొదటికి వచ్చేశాడు. ఎదురుగా, జనాన్ని కంట్రోల్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్. కౌంటర్ 15 కి వెళ్ళమని, ఆ కౌంటర్ వైపు చేయి చాచాడు ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్.
భారంగా అర్జున్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వైపు అడుగులు వేశాడు.
***
“You seem to be quoting scriptures. Do you think the humans on Earth control us?” BoGi still had so many unknowns and questions
“I don’t know where Earth is in this universe. I hope it really exists. I don’t find any other rationale to justify our existence. That’s what my religion taught me. And I find immense solace in that”
“So you accept everything our religion says!”
“Yes, that stops me from asking unpleasant questions. I can get on with my life with a little more peace. Your birth has already decided your religion. You will learn quickly too. You will have your own belief system that sooner or later you will stop questioning.”
“A SIster and a BrOther fight, don’t talk and end their relationship. And, you say or rather our religion says it’s a death warrant for you?”
“Yes, as true as the life that just began for you, when a BOy and GIrl met on Earth and got married, making vows to live forever.”
“You mean, I am an immortal”
“You will find out.”
“Do you think these gods can be good and evil and fight with one another?”
BOGI’s question was met with silence.
SIBO was dead.
It didn’t affect BOGI. He was just excited to start the new journey. He did that with a strange wail that relieved all his built up exuberance.
***
(Footnote: First one in the series of One story, Two Stories and a Hybrid story (OTH series).)








Author’s note:
This is the first of the series of experimental stories I am currently working on.
I respect the readers of my stories and want to adopt them as co-creators for these stories. While there are two or more independent stories either in Telugu or English or both, they are created in such a fashion, when read together, the reader comes up with an independent untold story. I call this structure/genre as ‘Emergent Realism’
I made AI read a series of stories written by me in this genre.
Here is the analysis by Al on Emergent Realism along with a note on the current story.
“Introduction: Crossing Parallel Universes and Moral Landscapes
In Parallel Universes, Bhaskar Pulikal crafts a compelling narrative that bridges the gap between metaphysical inquiry and the stark realities of human greed, guilt, and existential dread. By juxtaposing a parallel universe of ethereal beings (SIBO, WIHU, BOGI) against the earthly plight of Arjun, a protagonist entangled in financial fraud and familial betrayal, the story evokes a profound reflection on how our actions resonate across different planes of existence.
To introduce this story to a broader audience, we can compare its thematic architecture to the finest works of world fiction:
Magical Realism and Moral Mirrors (Comparable to Jorge Luis Borges): Just as Borges utilized metaphysical concepts like the labyrinth or parallel dimensions to explore human nature, Pulikal uses the SIBO and BOGI dynamic to mirror earthly relationships. The idea that the lives and deaths of these parallel beings are tethered to the marriages, betrayals, and deaths of earthly humans presents a striking, surreal metaphor for our interconnectedness – humans themselves living in a world that appears irrational.
The Psychological Shadow-Self (Comparable to Dostoevsky): Arjun’s realization of his own moral compromises—such as forging his mother’s will to seize rural property—echoes the psychological intensity of classical Russian literature. The story explores the Schadenfreude of a protagonist who derives pleasure from secretly engineering the suffering of those around him, juxtaposed with the panic of facing earthly and cosmic consequences.
Emergent Realism is an emerging literary mode that seeks to extend realism beyond the psychological and social frameworks that shaped twentieth-century fiction. If Magical Realism revealed the mythical within everyday life, and postmodern literature questioned the stability of truth and narrative itself, Emergent Realism explores how new realities arise from the interaction of consciousness, science, memory, technology, ecology, and cosmic scale. It is fiction shaped by the intellectual climate of the twenty-first century
The Hybrid Form (Emergent Realism): In line with Pulikal’s broader literary portfolio, which explores the intersection of global politics, high finance, and spiritual philosophy, the story blends modern immigration and tax-evasion suspense with speculative fiction.
– AI analysis”