ఇదే సాహిత్యం అని చెప్పడం కష్టమే: చైతన్య మేడి

మ్మం జిల్లా బోనకల్ దగ్గలోని ఆళ్ళపాడు నుంచి వచ్చిన చైతన్య మేడి  ప్రస్తుతం యూమివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫిలాసఫీ లో M.Phil  చేస్తున్నారు..చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆలోచనలని కలిగిన చైతన్య దాదాపు 10 కథల వరకి రాసారు , అవి వాసిలో  సాధారణ కథలు మాత్రం  అస్సలు కాదు. కొత్తవారితో స్వభావరీత్యా ముడుచుకొని మాట్లాడుతాడు కానీ  మనిషి గురించి అతి ఇష్టంగా చర్చించే సాహిత్యకారుడు చైతన్య మేడి.. 

1 చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందుబాటులో ఉండటం వలన మీకు చదవడం మీద ఆసక్తి కలిగిందా?

చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలు అందుబాటులో లేవు. మా క్లాస్ బుక్స్ తప్ప, మిగతా పుస్తకాలు చదివింది లేదు. నేను చాలా లేట్ గా అంటే 2013 సెకండ్ హాఫ్ లో చదవడం మొదలుపెట్టాను.

2 మీరు ఎప్పటి నుంచి రాయటం ప్రారంభించారు?రాయటానికి ప్రేరకం ఏమిటి?

నేను రాయడం మొదలుపెట్టింది 2013 లోనే. కినిగె వాళ్ళు కథల పోటి పెడితే , అప్పుడు నా మొదటి కథ “చెదిరిన ఆదర్శం” రాసాను. ప్రేరకం అంటే, నాకు ఇప్పుడు సరిగా గుర్తులేదు. నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, మళ్ళీ ఆ పోటీలో గెలిస్తే ‘ప్రైజ్ మనీ’ ఇస్తారని ఉంది అనుకుంటా- అది ఒక కారణం అయ్యి ఉంటుంది.

3 సాహిత్యం ఎలాంటి ప్రశ్నలను మీలో రేకిత్తించింది? ఎలాంటి సమాధానాలను మీకు ఇచ్చింది? 

Most of the times , we are too much obsessed with ourselves , with our ideas, perspectives, what not every silly thing that related to our sense of being. At the same time, our sense of being (or what we are) is the result of our day-to-day interactions with the people surrounding us as well what we ‘inherit’ in the name of ‘culture’. So, in this way we can’t fail to see the ‘other’ that is so pervasive.

చాలా మందిలో, ఎప్పుడోకప్పుడు అనిపిస్తుంది కదా , ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవాలని, human కాంప్లెక్స్ nature గురించి అర్ధం చేసుకోవాలని, మన being పరిధిలో లేని entities ఎలా ఉంటాయబ్బా అనే ఆలోచన వస్తుంది కదా. మనకి పుట్టుక రీత్యా ఉండేటటువంటి పరిమితుల దృష్ట్యా (‘naturalistic’ human  limitations), we ‘truly’ cannot know  how it is to be a different person or how it is to experience this world other than our way  of conceptualizing or understanding it (other way meaning non-human way, if it at all there is something like it ).

so , ఈ పని కొంత సాహిత్యం చేస్తుందేమోనని నా అనుమానం. నేను ‘అబ్బాయిగా’ పుట్టాను, మళ్ళీ అబ్బాయిలాగానే ఈ లోకాన్ని experience  చేస్తున్నా  కాబట్టి ఒక ‘అమ్మాయిలా’ , ‘ఆడవారిలా’ నేను ఈలోకాన్ని experience  చేయలేను. కానీ వాళ్ళు, వాళ్ళ వాళ్ళ experience  రాస్తే ,I might get some sense of ‘what it is to be woman’ అని. నాకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది. అలానే మిగతా విషయాలు కూడా. వాళ్ళ ‘లోలోపల జరిగే విధ్వంసాలకి’ ఒక రూపం ఇచ్చామని చెప్పే రైటర్స్ కూడా, ఆ విధ్వంసానికి మూలం ఏంటని, ఈ లోకంలో వాళ్ళ ఉనికి ఏంటి అని, మనుషులతో, సంఘంతో జరిగిన సంఘర్షణ రాతల్లో రాసుకున్నారే తప్ప, ‘నా లోకం…నేను..” అనే “solipstic” టోన్ తో రాసిన వాళ్ళు తక్కువ అనుకుంటా.

4  తెలుగు సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి మధ్య తేడాలు మీరు ఏమి గమనించారు?

ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పేంత authoritative position లో నేను లేను. నేను ఇటు  తెలుగు సాహిత్యం సమగ్రంగా చదవలేదు, అలా అని అటు ప్రపంచ సాహిత్యం కూడా కొంతైనా చదవలేదు. నేను చదివింది చాలా తక్కువ. But, in my own way, I’ve tried to engage with the texts.

నాకంటే మంచి రీడర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా చెప్పగలరేమో తేడాలు. నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే అక్కడ ఎలాగయితే సాహిత్యం పేరిట కొంత “చెత్త” ఎలా అయితే ఉత్తమ గ్రంధాలుగా చలామణి అయ్యాయో , ఇక్కడ  కూడా ఇంచుమించు అలానే జరిగింది అని నా అభిప్రాయం( ఇక్కడ చెత్త అంటే ఇదే అని నిర్ణయించడానికి నా దగ్గర ఏమి ఆబ్జెక్టివ్  గా  తూచే పడిరాళ్ళు లేవు కానీ, చదివే ప్రతి రీడర్ కి vague గా తెలుస్తుంది ఏది చెత్తది, ఏది మంచిది అని ). అక్కడ ఎలా అయితే కాలం గడిచే కొద్ది సాహిత్యం బౌండరీస్ విస్తరిస్తూ  వచ్చాయో, ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడేమో సాహిత్యం మీదున్న ప్రేమతో సాహిత్యాన్ని ఒక సీరియస్ enterprise  గా తీసుకొని కొన్ని యూనివర్సిటిలలో ఈ ‘critical writing’ అనే కోర్సులు పెట్టి, సాహిత్యాన్ని టీచ్ చేసారు, చేస్తున్నారు కూడా. ఆ కోర్స్ ల వల్ల “మంచిగా రాయడం ఎలాగో” నేర్పించడం చేతనవుతుందో లేదో కానీ  ఒక టెక్ష్ట్ ని ఎలా బాగా చదవాలో తెలుస్తుంది. కొన్ని మంచిగా రాయని టెక్ష్ట్ లో ఉండే inconsistencies, absurdities ఏంటో తెలుస్తాయి. అలా టెక్స్ట్ని చదివిన అనుభవం రాసేటఫ్ఫుడు  ఉపయోగపడుతుంది అనుకుంటా, వాళ్లు అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటారేమో. ఈ ప్రాసెస్ మన దగ్గర అంతగా జరగలేదు అనుకుంటా. ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ జరగటం లేదు అని నాకు అనిపిస్తుంది. అసలు మనకి అసలు టెక్ష్ట్ ని సరిగా చదవటం రాదు అనుకుంటా. ముందు ఆ పని నేర్చుకోవాలి మనమందరం. ఈ పనిమీద ప్రపంచ సాహిత్యం  వాళ్ళు కొంత శ్రద్ధ పెట్టి, కొన్ని సూత్రాలను ప్రపోజ్ చేసి , ఓ ‘జ్ఞాన భాండాగారాన్ని’ తయారు చేసి పెట్టారు. ఆ పని ఇక్కడ పూర్తిగా జరగలేదేమో. వాళ్ళ సూత్రాలని అదే పనిగా దిగుమతి చేసుకోమని కాదు, కానీ ఆ స్పిరిట్ లో నే ఇక్కడ టెక్స్ట్ ని సీరియస్ గా తీసుకుంటే బాగుంటుదేమో. నేను అలంకరణ శాస్త్రం చదివింది లేదు. చదివిన వాళ్ళు దీనికి బాగా ఆన్సర్ చెప్తారేమో.. ఇంకా వేరే తేడాలు అంటే , అక్కడ సాహిత్యంలో రాసే విషయాల మీద ఎటువంటి నిషిద్ధం ఉండదు. They can freely write on any fancy thing as such (At least in principle). మన దగ్గర in principle  పాజిబుల్ అయినా కానీ, మనమంటూ ఒక ‘canonical  form ‘ లాంటిది ఎదో ఫాలో అవుతావేమో అని నా అనుమానం.

5 మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనాన్ని ఇచ్చింది అనుకుంటున్నారు?

మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ , తమ జీవితాన్నంతా సాహిత్యానికి ధారపోసిన వాళ్లే ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. నేను వాళ్ళు చెప్పగలిగినంత comprehensive  గా  చెప్పలేను కానీ, But, I can tell you  how I do I perceive literature as such. I write short stories and to me stories are the medium through which I can express my inner ఎమోషన్స్, ఫీలింగ్స్. This place has worked as a canvas for my inner perturbations. రాసిన తరువాత చాలా రచనల రూపం మారిపోవచ్చు. కొన్ని రచనల వల్ల కొత్త ఆలోచనలు ఉద్బవించవచ్చు.  విప్లవాలు పుట్టొచ్చు. చెదరిపోని ప్రేమ జ్ఞాపకాలుగా మిగిలిపోవచ్చు. కొన్ని రచనలు జీవం లేని నల్ల కాగితాలుగానూ మారొచ్చు. ఇలా అనేక రూపాలు కానీ, వీటి అన్నింటి వెనుక ఒక మనిషి ఆలోచనల  ఘర్షణ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటా. అలా అయితే తప్ప , రచనలు బయటకు రావు. ఎండ్ ఏదైనా అవ్వొచ్చు కానీ, తనలోపల అలజడులకు రూపం ఇవ్వడానికి మనిషికి  సాహిత్యం ఒక ఆసరాగా ఉందేమో.

6 మీ దృష్టిలో ఏది అత్యుత్తమ సాహిత్యం? 

నా దృష్టిలో అత్యుత్తమ సాహిత్యం – నిజంగా చెప్పాలంటే , ఇంతకు ముందు నాకు నచ్చిన రచయితలు, నవలలు, కథలు ఈ మధ్య నాకు అస్సలు నచ్చటం లేదు. బహుశా , మనం ఎదిగే కొద్ది , మన పాత జ్ఞాపకాలు కొన్ని ఎలా నచ్చవో , అలాగే, మన దృక్పధాలలో మార్పు , ఆలోచనలలో ‘పరిణితి’ వస్తున్న ప్రకారం , మనకి నచ్చిన సాహిత్యం , రచయితలు మారుతూ ఉంటారనేది నా అభిప్రాయం.

కానీ, కాలానికి తట్టుకొని, కొంతమంది రచయితలు, వాళ్ళ రచనలు, మొదటిసారి చదివినప్పుడు ఎంతటి సమ్మోహన శక్తినైతే మనమీద కుమ్మరించాయో,  ఆ శక్తి అలానే లేదా ఇంకా తీవ్రంగా మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి చదివిన ప్రతిసారి.

నేను తెలుగు సాహిత్యం చదవడం మొదలెట్టింది చలం నుండి. మొదట్లో, ఏదో అలా పిచ్చిగా చదువుకుంటూ పొయేవాడిని. ఎందుకు నచ్చాయో తెలియదు, but I simply loved them, కారణం లేకుండా పుట్టే పిచ్చి ప్రేమలాగా. కానీ, మొన్నీమధ్య మళ్ళీ ఆయన్ని చదువుతుంటే అనిపించింది ఏంటంటే, చాలా మందికి ఉన్నట్టు,  ఈ గ్రామర్ పట్టింపులు, ఈ శైలి గొడవలు, వాక్యపు సొగసులు ఆయన అంతగా పట్టించుకోరు అనుకుంటా. ఆయన రాస్తే “ఏదో force of nature ” లా, ఒక ఉద్రిక్తత తో రాస్తారు. భలేగా ఉంటాయి.

ఇంకా ఆ లిస్ట్ లోనే త్రిపుర కథలు, పతంజలి “రాజుగోరు”, కలేకూరి కవితలు, సుందర్రాజు కథలు, మెహర్ గారి కథలు, అలానే ఈ మధ్య చదివిన కనక ప్రసాద్ గారి కథలు, నామిని గారి ‘నెంబర్ వన్ పుడింగి’ చాలా చాలా నచ్చాయి. వాటి మీద ఇష్టం అలానే ఉంటుంది అనుకుంటా ఎప్పటికి. కాలం మనలో తెచ్చే మార్పులకి అతీతంగా ఏదో ఉంది ఈ రచనలలో అనేది నా నమ్మకం.    అందుకే ఇష్టం వీళ్ళు. చాలామంది రచయితల పుస్తకాలు మళ్ళీ చదువుతుంటే , కథలు చదివి “అబ్బే ఆ పుస్తకాలనా నేను మెచ్చింది మొదట్లో” అన్న స్తితి లో ఉన్న ఇప్పుడు. అంటే రచనకు ‘inherent’ ఏమి వాల్యూ ఉండదు అనుకుంటా , మనకి మనం ఇచ్చుకున్న వాల్యూ తప్ప.

అప్పుడు, ఇప్పుడు పతంజలి చదివినప్పుడు అన్నీ నచ్చాయి , కానీ, సెకండ్ రీడింగ్ లో only “గొపాలుడు”, “రాజుగోరు”, “బొబ్బిలి” ఇలా కొన్ని మాత్రమే నచ్చాయి. పతంజలి-నాకు తెలిసి social institutions లో ఉండే inherent hierarchie ఆయనలా subtle గా  ఎవరూ రాయలేరేమో .  “రాజుగోరు” లో ఆయన గొంతు బాగా నచ్చుతుంది ఎందుకో.

త్రిపుర- ఆయన కథల్లో మనకి ఆయనకే ప్రత్యేకమయిన చూపు కనిపిస్తది. ఆ distinctive tone ఇంకా ఎక్కడా కనిపించదు.

కలేకూరి- ఎప్పుడు చదివినా ఈయన రాసిన “అంటరాని ప్రేమ కవిత” ఏదో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నన్ను ఇంతలా కదిలించిన కవిత మరోకటి  లేదు. ఒక పొలిటికల్ విషయాన్ని, ఇలా నాన్-పొలిటికల్ terms లో రాయడం, రాసి మెప్పించడం ఆయనకే చెందుతుంది.

మెహర్- నాకు తెలిసి ఇప్పుడు రాస్తున్న వారిలో  సాహిత్యాన్ని ఇంతగా ప్రేమించి, ఒక టెక్ష్ట్ ని ఎలా చదవాలో తెలిసి, మంచి కథలు రాస్తున్న మనిషి మెహెర్ భాయ్.

నామిని గారు ‘నేను ఈ ఈ తప్పులు చేశారా బాబు’ అని నిర్మొహటంగా చెప్పుకోవడం కూడా ఒక తప్పు అయిపోయుంది పాపం. ఇంతలా తనని తాను అందరిముందు పంచుకోవడం, ‘ప్రజారచయితగా’ ఆయనకే చెల్లింది.

 1. సాహిత్యం అంతిమ లక్ష్యం?

ఇది చాలా tricky  ప్రశ్న. దీనికి జవాబు ఇచ్చేంతగా శక్తి, తెలివి నా దగ్గర ఉన్నాయి అని నేను అనుకోవడం లేదు. నాకు ఇప్పుడున్న అవగాహనతో దీనికి సమాధానం చెప్తా. ఒకప్పుడు బాలగోపాల్ “మనిషి-మార్క్సిజం” లో చెప్పిన  “ఖాళీలను పూరించడమే సాహిత్యం పని”  మాట నచ్చింది. కానీ కొంత అలోచించి చూస్తే,  ఆయన అలా అనడానికి వెనక, ప్రతి విషయానికి ఒక end అంటూ ఖచ్చితంగా ఉండాలి అనే assumption ఉందేమో అనిపించింది. గ్రీక్ భాషలో  “teloes” అంటారు కదా. ఆ పదాన్ని end అనే అర్థంలో వాడతారు. ఆయన ఆ మాట అన్నప్పుడు, సాహిత్యానికి  ఒక rounded-meaning  ఇద్దామనే అలోచనలో ఉన్నట్టు ఉన్నారు. అంటే , జీవితానికి ఒక మీనింగ్ ఉండాలి అని  ఎలా అయితే చాలా మంది అనుకుంటారో , అలానే సాహిత్యానికి కూడా  అలాంటి మీనింగ్ ఒకటి(ultimate meaning) ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా మాట్లాడారేమో అనిపించింది. ఇలా ప్రతి విషయానికి end ఉండాలి అనే claim మీద చాలా డిబేట్స్ జరిగాయి. అసలు ప్రతి విషయానికి ఒక end అంటూ ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న కూడా ఉంది. (క్రిస్టియన్ అండ్ medieval టైం లో ఇలానే ప్రతీ దానికి ఒక ఎండ్ ఉంటుంది అని argue చేసి, ఫైనల్ గా ultimate ఎండ్ ఎవరూ అంటే god అని చెప్పి, మతాల నమ్మకాలకి reason తాలూకా మసి పూసే ప్రయత్నం జరిగింది). ఎందుకు ప్రతీ విషయానికీ  ఒక complete మీనింగ్ అంటూ ఉండాలి? Incomplete గా ఉంటే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నల నుండే ఈ absurdism, cynicism లాంటి ఆలోచనలు వచ్చాయి అనుకుంటా.

ఇంతకు నేను చెప్పదలచుకుంది ఏంటంటే, సాహిత్యానికి ఒక అంతిమ లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి అంటే, ముందు అసలు సాహిత్యం అంటే ఏంటో పూర్తిగా తెలియాలి (డొమైన్).  I mean we need to have a cut and dry definition of what is literature first. ఈ ప్రశ్నకి సమాధానం అంత సులువు కాదు అని నాకనిపిస్తుంది. ఏది సాహిత్యం కాదో సులువుగా చెప్పొచ్చేమో కానీ , ఇదే సాహిత్యం అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. చరిత్రలో సాహిత్యం అనేది ఇదే అంటూ ఒక normative defination  ఇచ్చినప్పుడల్లా చాలా చాలా చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అసలు కథ అంటే ఇదే అని ఒక సింగల్ స్టాండర్డ్ డెఫినిషన్ ఇవ్వడమే కష్టం. అలాంటిది సాహిత్యం అంటే ఇదే (డొమైన్) అని చెప్పడం ఇంకా కష్టమేమో. నాకు తెలిసి మనం intuitive గా, vague గా  ఏది సాహిత్యం కాదో చెప్పచ్చేమో కానీ సాహిత్యం అంటే  ఇదే అనే ఒక standard defination అయితే   ఇచ్చుకోలేము. సాహిత్యం అంటేనే  ఖచ్చితంగా  తెలియనంత కాలం, దాని లక్ష్యం గురించి ఎంత తక్కువుగా మాట్లాడితే, అంత మంచిది అనుకుంటా. And I think we, as human beings,  are happy with the ‘vagueness’. We can’t handle clarity, distinctiveness and the truth.

*

 

 

 

 

Avatar

సత్యోదయ్

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నచ్చితే సరిపోయిందా? ఏది నచ్చిందో, ఎందుకు నచ్చిందో చెప్పాలి కదా …. 🙂

  • ఈ ఆలోచనలని ఇంకాస్త ఎవరయినా ముందుకు తీసుకెళ్తారేమో అని చూస్తున్నా సర్.. థాంక్స్

 • తమ్ముడు చిన్నవాడివనుకున్నా నీలో చాలా తెలిసిన సాహిత్య అనుభవం ఉంది. లోతైన ఆలోచనలు ఎంతో తెలుసుకున్న నేర్పు కనిపిస్తున్నాయ్. మామూలుగా పలకరించినపుడు నీలో ఈ లోతు అస్సలు బయటపడదు. మంచి రచయిత లక్షణాలు కనిపిస్తున్నాయ్. 👍

 • తమ్ముడూ చైతన్య.. నీ గురించి కొంత తెలుసు. నీ కథలను బట్టి ఇంకొంత అర్థం చేసుకున్నాను. కానీ నీలో చాలా డెప్త్ ఉంది. గుడ్…
  ఇంత మంచి ఇంటర్వూ చేసిన సత్య కి కూడా అభినందనలు.

 • అక్కడేమో సాహిత్యం మీదున్న ప్రేమతో సాహిత్యాన్ని ఒక సీరియస్ enterprise గా తీసుకొని కొన్ని యూనివర్సిటిలలో ఈ ‘critical writing’ అనే కోర్సులు పెట్టి, సాహిత్యాన్ని టీచ్ చేసారు, చేస్తున్నారు కూడా. ఆ కోర్స్ ల వల్ల “మంచిగా రాయడం ఎలాగో” నేర్పించడం చేతనవుతుందో లేదో కానీ ఒక టెక్ష్ట్ ని ఎలా బాగా చదవాలో తెలుస్తుంది. కొన్ని మంచిగా రాయని టెక్ష్ట్ లో ఉండే inconsistencies, absurdities ఏంటో తెలుస్తాయి. అలా టెక్స్ట్ని చదివిన అనుభవం రాసేటఫ్ఫుడు ఉపయోగపడుతుంది అనుకుంటా, వాళ్లు అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటారేమో. ఈ ప్రాసెస్ మన దగ్గర అంతగా జరగలేదు అనుకుంటా. ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ జరగటం లేదు అని నాకు అనిపిస్తుంది. అసలు మనకి అసలు టెక్ష్ట్ ని సరిగా చదవటం రాదు అనుకుంటా. ముందు ఆ పని నేర్చుకోవాలి మనమందరం. ఈ పనిమీద ప్రపంచ సాహిత్యం వాళ్ళు కొంత శ్రద్ధ పెట్టి, కొన్ని సూత్రాలను ప్రపోజ్ చేసి , ఓ ‘జ్ఞాన భాండాగారాన్ని’ తయారు చేసి పెట్టారు. ఆ పని ఇక్కడ పూర్తిగా జరగలేదేమో. వాళ్ళ సూత్రాలని అదే పనిగా దిగుమతి చేసుకోమని కాదు, కానీ ఆ స్పిరిట్ లో నే ఇక్కడ టెక్స్ట్ ని సీరియస్ గా తీసుకుంటే బాగుంటుదేమో. నేను అలంకరణ శాస్త్రం చదివింది లేదు. చదివిన వాళ్ళు దీనికి బాగా ఆన్సర్ చెప్తారేమో.. ఇంకా వేరే తేడాలు అంటే , అక్కడ సాహిత్యంలో రాసే విషయాల మీద ఎటువంటి నిషిద్ధం ఉండదు. They can freely write on any fancy thing as such (At least in principle). మన దగ్గర in principle పాజిబుల్ అయినా కానీ, మనమంటూ ఒక ‘canonical form ‘ లాంటిది ఎదో ఫాలో అవుతావేమో అని నా అనుమానం.

  bhale bhale chaitanya garu.. telidantune melliga manchi bhavanalni vellibucharru. ilanti interviews daily papers lo chudatam oka kala. content dammunna ilantivi saranga dwara matrame sadhyam .
  interview chesina satyoday gariki namassulu. keep it up sir.

 • బాగుంది చైతన్యా. కంగ్రాట్స్. జెన్యూనిటీ, ఒరిజినాలిటీ, అన్వేషణ బాగున్నాయి. తెలుగు సాహిత్యంలో అరుదైపోతున్న వ్యవహారాలవి. గుర్తింపు గజ్జితో గుంపు గజ్జితో కరప్ట్ కాకుండా ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరోెసారి కంగ్రాట్స్.

 • చాలా మంచి ఇంటర్వ్యూ.
  ఫ్రెష్ టోన్ ఇన్ ఎక్స్ప్రెషన్ అండ్ సేడ్ ట్రూత్.
  ఇన్ఫర్మేటివ్.

 • మీ భావాల విశ్లేషణ బావుంది.

  సామాన్య ప్రజానీకానికి సాహిత్యం మేలు చేసేవిధంగా మీరు రాయాలని కోరుతున్న..

 • 7 వ సమాధానం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. తాంక్ యు ఉదయ్ అన్నా. ఈ ప్రయత్నం బావుంది, నచ్చింది . కొంత నేర్చుకుంటున్న 👍👌👍

 • ” సాహిత్యానికి ఒక అంతిమ లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి ” అన్ననందుకు అభినందనలు మేడి చైతన్య గారు!

  మీకు నచ్చిన చలం, త్రిపుర, పతంజలి, కలేకూరి, నామిని లాంటి ఎందరో రచయితలు ( కొ.కు. నాయన, రావిశాస్త్రి లను త్వరలోనే డిస్కవర్ చెయ్యండి ) ఇంకా అనేకమంది సాహితీ పెద్దలు, కలం వీరుల స్పూర్తి తో ఏ అంతిమ లక్ష్యం తో రచనలు చెయ్యాలో మీకై మీరే ఓ నిర్ణయానికి వస్తారని విశ్వసిస్తున్నాను.

  సాహిత్యం అంతిమ లక్ష్యం ఏమిటి ? కాలం నాడు విశాఖ విద్యార్థులు విసిరిన సవాలు… ” రచయితలారా మీరెటువైపు ” లాంటి ప్రశ్నల గురించి ప్రస్థావించకుండా యీ కట్ అండ్ పేస్ట్ వాక్యాలను… ప్రతిభావంతమైన, నిజాయితీతో కూడిన వర్ధమాన రచయిత అయిన మీ ముందు ఉంచుతున్నాను.

  Literature has so many purposes. It does everything. It amplifies the writer’s opinion, thoughts and voice. It’s purpose is to enlighten, to protest against something, to challenge, to educate, inform, comfort, confront, express and even to heal in some cultures.

  ” Literature always anticipates life. It does not copy it, but moulds it to its purpose ” ~ Oscar Wilde

  Literature is where I go to explore the highest and lowest places in human society and in the human spirit ~ Salman Rushdie

 • శ్రీపాద, చాసో, గోపీచంద్‌, బుచ్చిబాబు లంటూ మరికొందరు తెలుగు సాహిత్య స్రష్టల ఓ పెద్ద లిస్ట్ మీ ముందు ఉంచలేను కానీ…

  ప్రజల ఆశలను, ఆకాంక్షలను అక్షరబద్ధం చేస్తూ మూడు దశాబ్దాలకు పైగా సాహిత్యాన్నే జీవితోద్యమంగా గడుపుతున్న కళింగాంధ్ర రచయిత అట్టాడ అప్పల్నాయుడు….

  దోపిడీకి, అధికార అహంకారానికి, కపటానికి, కాఠిన్యానికి గురవుతున్న అట్టడుగు వర్గాల గాథలను హృదయాన్ని కదిలించగలిగేలా చెప్పగల గొప్ప కథకుడు అట్టాడ అప్పలనాయుడు బావూ కేసి దయచేసి చూడండి.

  మీరూ అదే మార్గాన్ని ఎంచుకోమని చెప్పలేని అశక్తుడిని, అనర్హుడిని.

  The Road Not Taken ( Robert Frost ). లాగా మీరూ మీదైన స్వరంతో, మీరు ఎంచుకున్న మార్గం లో నడవండి. కాని దాన్ని బెంచ్ మార్క్ చేసుకోవటం అంటారో, విశిష్టత సంతరించుకున్న వాటితో బేరీజు వేసుకోవటం అంటారో అలాంటి దాన్ని విడవకండి.

 • ” మిత్రుల దగ్గర నీ ‘ప్రోగ్రెసివ్’ బడాయిలు, ఫేస్‌బుక్‌లో నీ ‘ఫెమినిజం’ నురగలు, డిబేట్లలో నీ ‘విప్లవాల’ మురుగు మాటలు గుర్తొస్తాయి. కలకి-నిజానికి, కల్పనకి-యథార్థానికి మధ్య ఉండే అడ్డుగోడ చిన్నగా నెర్రెలిస్తుంది. మరణం నీ జీవితంలోకి వచ్చింది ”

  జీవితం లోని తొలి మరణం, మలి మరణం, మలుపు మలుపుల వద్దా మరణాల తలపోతల్ని …. భావాంతరంగ కల్లోలాల మూలాన్వేషణా చైతన్య స్రవంతిని… ఇది కూడా సాహిత్యం అని చెప్పడం నాకు కష్టమే, మేటి చైతన్యా ! కానీ కర్నూలు లోని వేణయ్యకు ( కాశీ భట్ల వేణుగోపాల్ గారికి ) చూపిస్తే ఇలాంటి దావాలనాలు తనకిష్టం అని చెపుతాడు.

  https://eemaata.com/em/issues/201909/20582.html

 • Thank you everyone for your valuable comments. నా అభిప్రాయాలు కొన్ని ముందు ముందు మారొచ్చేమో . I hope I will continue to engage with texts in general, literature in particular.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు