గెలవడమంటే…

వాడు పంపిన
ప్రేమలేఖ
నీ కన్ను
పూలగుచ్ఛం
నీ నవ్వు

నేను పెట్టిన
అగరుధూపం
నా వైపుకే ఊదే
కవ్వింపు కేళి
నీ ప్రేమ!

 

గెలవడమంటే
నీ కనుసన్నల్లో
మెలగడమే

వెలగడమంటే
త్రికరణశుద్ధిగా
నీలో కలవడమే!

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రమోద్ గారూ, చాలా.బాగున్నాయి మినీ కవితలు.👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.