Illusion

నేనేమీ అడగలేదు నిన్ను
ప్రేయసిలా నా భుజం మీద వాలిపొమ్మని…
కొంత చనువు తీసుకుని
నువ్వే చుట్టేసుకున్నావు
బాంబుష్ లను చూసి భయపడే పసిపిల్లలా
నా ఎడం చేతిని
నల్లని కాటుక మధ్యలో చిక్కుకుపోయిన నీ కళ్ళు
చీకట్లో రంగులు కోల్పోయిన Saturn planetలా కనిపించాయి నాకు…
మెరిసిపోతున్న గులాబీరంగు పెదాలు
చంపలమీద మొలిచిన మొటిమలు
ఆ మొటిమల్లాగే తారసపడే అందమైన బొట్టుబిళ్ళ
స్పష్టంగా కనిపించే నీ నల్లని జుట్టు, ఘాటుగా షాంపూ వాసన.
నువ్వు
ఇంత అందంగా కనిపించినా
ఏ ఫీలింగ్ కలగట్లేదు నాకు
ఎందుకంటే అనుకున్నాను కదా ముందే నిన్ను:
నా స్నేహితురాలివని
నేనెప్పుడూ ఏడిపించే చిన్నపిల్లవని
కానీ
ఇప్పుడు నిన్ను అడిగాను కదా నెమ్మదిగా
ఒక ప్రశ్నని –
‘అతనితో తిరుగుతున్నావ్ కదా నువ్వు?
ఏంటి విషయం!’
అప్పుడు నీ ముఖంలో జీవంలేదు
అమావాస్యలా చుట్టేసిన దిగులు తప్ప
చాలాసేపు నిశ్శబ్దం తర్వాత చెప్పావు నువ్వే
‘అవును. We are in love’
లోపల కోపం పొంగి
బయట కాస్త ఓపికని నటిస్తూ
‘వాడి గురించి తెలిసే చేస్తున్నావా ఇదంతా.
నీకేం తెలుసు వాడి గురించి’
‘….’
‘నాలుగేళ్ల సీనియర్ గురించి నీకేం తెలుసు
నాల్గురోజుల్లో వెళ్లిపోతాడు
వాడొక అవకాశవాది
అవసరం తీరాక వాడొక Venomous Snakeలా మారతాడు’
తియ్యగా వాడు చెరిచిన అమ్మాయిల కథలను
వాడి క్లాస్ అమ్మాయిల కథలనే పూసగుచ్చినట్టు చెప్పాను కదా
జామంతా… కూర్చోబెట్టుకొని
అప్పుడు
నీ కళ్ళలో నా పైన కొంత కోపం ఇంకొంత అమాయకత్వం
ఒకే వాక్యాన్ని తిప్పి తిప్పి అప్పజెపుతూ నువ్వు-
‘వాడు నా లక్ష్యాన్ని గుర్తు చేసి
 నన్ను నాలోకి మళ్ళీ చూపించాడు’
ఇక నేనే ఓడిపోయి నేలరాలిపోయి
నువ్విప్పుడు ఏ ఆలోచనకు ‘ప్రతీక’వో అంతుపట్టక
ఆఖరికి నీ లక్ష్యం ఎటు దారితీస్తుందో అవగతమవ్వక
నీకేం అవుతుందోనని భయపడుకుంటూ చివరి మాటగా ఇలా చెబుతాను
‘మాటలు బాగా నేర్చావు కదా నువ్వు
 ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు నీకు.
 B’cuzz you’re in illusion now.
 Go ahead with your illusion and disappear from this world.
 Goodbye dear friend’
*బాంబుష్ – బూచోడు; మా ఊరిలో దెయ్యం అనే అర్థం వచ్చే పదం

లిఖిత్ కుమార్ గోదా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు