అక్కడ
బూట్లు,బొమ్మలు,బ్యాగులు
క్రమ పద్థతి లో పేర్చారు
వరుసలో పేర్చిన
వస్తువుల చూస్తుంటే
వరుసలో నిలబడి
ప్రార్థనలు చేసే విద్యార్థులు యాదికొస్తారు
ఒక్కో వస్తువు మీద
ఒక్కో పుష్ప గుచ్ఛం
ఓజ్నాపకాలతడి
ఓతల్లి గుండెకోత
బూట్లను జూస్తే
పరుగెత్తలేని కాళ్ళు యాదికొస్తాయి
బొమ్మల జూస్తే
అల్లుకున్న ఆశలు యాది కొస్తాయి
స్కూల్ బ్యాగ్ ముట్టుకుంటే
వొణుకుతున్న చిన్నారి
చివరి సంతకం యాది కొస్తుంది
“అమ్మా, రక్షించండి
నాయనా ,రక్షించండి
బాంబులు వే స్తున్నారు
ఎవరైనా రండి “
స్ట్ర యిక్ వన్- — స్కూలు బిల్డింగ్
స్ట్రయి క్ టు —ప్రేయర్ హాల్
స్ట్రయిక్ త్రీ- –పక్క బిల్డింగ్
మినాబి స్కూల్ రక్తంతో చిత్త డయింది
163 జీవనదులు
కలగలిసిన దుఃఖ సముద్రం
ప్రపంచాన్ని ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుంది
రక్తం కడుక్కుని
వైట్ హౌస్
ఎప్పటికీ సుద్ధులు చెబుతూనే ఉంటుంది.
****
అమెరికా దాడిలో 163 మంది విద్యార్థులు చనిపోయిన విషాదం విని–








Add comment