తెల్లమద్ది వెన్నెల
అటు తిరిగి
ఇటు తిరిగి
నీ వైపు, నా వైపు ఒరిగి
చేతికందకుండా ఎగిరే
రెక్కలక్కర్లేని
ఓ చందామామా..నను కాదని
కొంతదూరమైనా
పోగలవేమో చూడు..నల్లమలలో తెల్లమద్దినై
ఒంటినిండా
నీ వెన్నెలని పూసుకున్నా..ఇక నీ రాత్రులు, పగళ్లు.
అన్నీ నేనే..
ఇటు తిరిగి
నీ వైపు, నా వైపు ఒరిగి
చేతికందకుండా ఎగిరే
రెక్కలక్కర్లేని
ఓ చందామామా..నను కాదని
కొంతదూరమైనా
పోగలవేమో చూడు..నల్లమలలో తెల్లమద్దినై
ఒంటినిండా
నీ వెన్నెలని పూసుకున్నా..ఇక నీ రాత్రులు, పగళ్లు.
అన్నీ నేనే..
2.
కదిలించొద్దు
ఎండిపోయిన ఆకులను
కదిలించొద్దు.తమను తాము
కోల్పోలేకపోయిన
భగ్న హృదయాలు అవి.
కదిలించొద్దు.తమను తాము
కోల్పోలేకపోయిన
భగ్న హృదయాలు అవి.
జీవి విడిచిపోయినా
ప్రాణం మిగిలే ఉన్న దేహాలవి..ఎన్నో ప్రేమలను చిగురించిన
గాలుల గానాలవి..
ప్రాణం మిగిలే ఉన్న దేహాలవి..ఎన్నో ప్రేమలను చిగురించిన
గాలుల గానాలవి..
కాలాలన్నింటినీ జీవించిన
కదపకూడని జ్ఞాపకాలవి..
మళ్లీ ఏ వానో కురిసినప్పుడు
చినుకులని పట్టుకొని
ఒక్కసారి భోరున ఏడ్చేసి
కొత్త జీవితాన్ని మొదలుపెడతాయేమో..
అందుకే..
మనం
ఎండిపోయిన ఆకులను
కదిలించొద్దు.
*
నల్లమలలో తెల్లమద్దినై
ఒంటినిండా
నీ వెన్నెలని పూసుకున్నా..ఇక నీ రాత్రులు, పగళ్లు.
అన్నీ నేనే..
beautiful lines. The second poem is very optimistic one. Expect more poems from you.
Sure and thank you
✍✍👌👌👌👏👏
Thank u
ఎండిపోయిన ఆకులు – భగ్న హృదయాలు….
—- ఈ భావుకత బావుంది.
Very beautiful