నా ప్రేమనంతా అమాయకంగా ఖర్చుపెట్టేసాను
లెక్కలేనంత సంపదతో
కావాల్సినవన్నీ కొనేసుకున్నాను
ఒంటరితనపు సహచర్యంలో!
కొన్ని చాక్లెట్లు, తియ్యతియ్యటి పానీయాలు
మరికొన్ని కామిక్ పుస్తకాలు కొనేసుకున్నా
నా ప్రేమనంతా ఇలానే ఖర్చుపెట్టేసా
అన్నింటినీ ఇంట్లొ మంచంపై పర్చి
ప్రతీ చిన్నముక్కనీ ఆస్వాదిస్తూ తిన్నా,
ఎంతవరకంటె అఖరికి
తియ్యదనంతో విసుగొచ్చేవరకూ.
కాస్తంత వయసు చేసాక, మరింతగా
నాప్రేమని ఖర్చుపెట్టుకున్నాను
‘నీకు నచ్చినంత, నచ్చినన్ని తినే’ పాకశాలల్లో
రోజూ విందులే.
సూప్ తో మొదలుపెట్టి చివరి స్వీట్ వరకూ
ఏదీ వదల్లేదు
రోజూ అన్నీ తింటునేఉన్నా
నా ప్రేమ ఖర్చుతో….
ఎంత తిన్నా సంతృప్తికి
ప్రాప్తి దక్కనేలేదు
ఆఖరికి కలల్లో కూడా విందుభోజనాలె.
నా ప్రేమనంతా ఖర్చుపెడుతూనే ఉన్నా.
ఇక ప్రౌఢనయ్యాక
నా ప్రేమనంతా నా తోటపై ఖర్చుపెట్టాను
వివిధ విత్తనాలన్నిటినీ జాగ్రత్తగా నాటాను
వాటికి పేర్లు కూడా పెట్టాను.
మొదట్లో, పంటకోత ఎంత విస్తారమని
కానీ కాలక్రమేణా
కలుపుమొక్కలని తియ్యటం
మొక్కలకి నీళ్ళుపెట్టటం మర్చిపోయాను.
త్వరలోనే గమనించాను
సారవంతమైన మట్టి క్షీణిస్తోందని
ఇక కొత్తగా మొలిచేదేముండదని
నా పచ్చని పంట పొలాన్ని
ఇక బీడుచెయ్యకతప్పదనీ.
నిన్ననే రైతుబజార్లో
తాజా పంటఫలాలని
అలానే తిందామనుకున్నా, పచ్చిగా
నా ప్రేమని ఖర్చుపెట్టి.
చేత్తో బలంగా మట్టినంతా తవ్వాను
ఒక్కసారి జేబులు తడుముకుంటే
ఖాళీతనమంతా బయటకొచ్చింది.
ఆఖరుగా–
అప్పుడె ఓ గొప్ప జ్ఞానోదయం
ప్రేమపై ఖర్చంతా అయింది
పొదుపు చేసిందంటూ ఏమీ లేదు
ఒక్కటె మిగిలింది
నాకు “నేను”
Anna Breslin :
కవిత ఒరిజినల్ లింక్ :https://medium.com/annapoetics/how-i-spent-my-love-9ce174638022
*
చాలా చక్కని కవిత.. అభినందనలు సర్..💐