చిత్రా పవార్ ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో 1992లో జన్మించారు. ఆమె “అధూరీ ఇచ్చాయేం, హిసాబ్, బారిష్ కే మౌసమ్ మే” వంటి ఎన్నో మంచి కవితలు రాసారు. ఈమె కవిత్వంలో స్త్రీవాదం, ప్రకృతిపై ప్రేమ కనబడుతుంది. సున్నితమైన సరళమైన అభివ్యక్తి ఈమె సొంతం. ఈమె కవితలు ఎన్నో పత్రికలలో ప్రచురితమయ్యాయి. “దో ఔరతే” , “బారహ్ మాసా” అనే రెండు కవితాసంపుటులు ఈమె కలం నుండి వెలువడ్డాయి.
వినండి అమ్మాయిలు!
మీకెవరూ ఇవ్వరు
మీ వాటా భూమిని
ఆకాశాన్ని
గాలిని, ఎండని, నీటిని
వినండి అమ్మాయిలూ!!
అడవిలో పెరిగే పూలలా
హక్కుతో పెరగడం
గట్టిపడడం నేర్చుకోండి
2
మాలతీ లత
అమ్మాయిలు
మాలతీలతలాంటి వారు
కుండీలో పెట్టినా
తీయని నీరు అందించినా
బాగా సంరక్షించినా
బతుకుతారు
పెరుగుతారు
కానీ వికసించరు
తమకుంటూ నేల సంపాదించుకునే వరకు.
*








Add comment