సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుఅడయార్ కథలుసంచిక: 1 ఆగస్టు 2019

అడయార్ కథలు

షర్మిలా కోనేరు
వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .
⚡️⚡️⚡️⚡️

ఆ రోజు తలదువ్వుకుంటున్నాను దువ్వెనలో కుచ్చులు కుచ్చులుగా జుట్టు వూడి వస్తోంది .
కీమో దాని ప్రభావం చూపించడం మొదలెట్టిందన్నమాట .
ఇప్పుడైతే పోతే పోనియ్ జుట్టేకదా అనుకునేదాన్నేమో .
కానీ ఆ వయసులో ఎందుకో చాలా బాధేసింది .
నిజానికి నీకు కేన్సరేమో అన్నప్పుడు కూడా అంత బాధ వేయలేదు .
మర్నాడు మా ఆయన వచ్చినప్పుడు చెప్పాను నాకు విగ్ కావాలి అని . ఆయన విగ్ ఎందుకు నువ్వు ఎలా వున్నా నాకు ఇబ్బందిలేదు అన్నారు .
కాదు నా మొహం చూసుకోవడానికి నాకే ఇబ్బంది , నాకు కావాలి అన్నాను స్థిరంగా .
మద్రాస్ లో ఆడవాళ్లు గుండు చేయించుకోరట .

అందుకే హాస్పటల్ లో ట్రేట్మెంట్ తీసుకునే చాలామంది విగ్ లు పెట్టుకుని కనిపించే వారు .
మర్నాడు వాళ్లని అడిగి మద్రాస్ లో సినిమా వాళ్లకి విగ్గులు తయారు చేసే చోటుకి వెళ్లాం .
అక్కడ నా తల సైజ్ కొలుచుకుని నాకు వున్న నొక్కుల జుట్టును పరిశీలనగా చూసి నాలుగురోజుల తర్వాత రమ్మన్నాడు .
నేను అన్నాను వూరికే మొత్తం జుట్టు గుండయ్యేలోపు తిరుపతి వెళ్లి అక్కడ జుట్టు ఇస్తాను అన్నాను .
గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టు జుట్టు దేముడికి ఇద్దామని నిర్ణయించుకున్నాను .
తిరుపతిలో జుట్టు ఇచ్చి విగ్ పెట్టుకున్నాను .
ఇంచుమించు నా జుట్టు లాగానే వుంది .
కానీ అద్దంలో చూసుకుంటే ఎవరినో చూసినట్టనిపించింది .
సెలవుల్లో పిల్లల్ని తీసుకుని మా అత్తగారు వచ్చారు .
సగం ప్రాణం తిరిగివచ్చినట్టనిపించింది . అమ్మా ఎవరూ చూడకుండా రోజూ నువ్వున్న ఫోటో దగ్గర ఏడుస్తానమ్మా అని పెద్దది చెప్తే గుండె మెలిపెట్టినట్టైంది .
మనసుకి బాధ కలిగినప్పుడు అందరిముందూ ఏడవకుండా చాటున ఆ ఇంట్లో వున్న చిన్న ఫోటో చూస్తూ వుంటున్నానని చెప్పింది .
ఆరేళ్ల పిల్ల అంత గుంభనగా వుండడం ఆశ్చర్యమే . అంత లోతుగా వుంటాయా పిల్లల మనసులు !
దాన్ని దగ్గరకు తీసుకుని త్వరగా వచ్చేస్తాను అన్నాను .
వెళ్లేటప్పుడు చిన్నదాన్నీ ఎత్తుకుని ముద్దాడాను .
చిన్నదానికి ఎక్కడున్నా చెలాయించుకునే తెలివి వుంది కానీ పెద్దదే లోపల్లోపల కుమిలిపోతుంది .
ఇంకా రెండునెలలు గడవాలి . రెండో కీమో మొదలుపెట్టారు . మా రెండో పిన్నత్త గారి వచ్చారు . స్పృహ వుండీలేని స్థితిలో వున్నాను .
ఇదిగో కనకరాజు మావయ్య వచ్చారు చూడు అని ఆయన పిలిస్తే కళ్లు తెరిచాను .
ఎలావున్నావమ్నా ఏంటీ ఘోరం ఇద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు .
చక్కటి పిల్లలు . నీకు రావలసిన కష్టం కాదు అన్నారు .
నేనంటే ఆయనకు చాలా ఇష్టం .
పెళ్లికి ముందు ఏ మర్యాదలు , తెచ్చిపెట్టుకున్న ప్రవర్తనా లేకుండా నేను నేనుగా వున్నప్పుడు నన్ను చూసిన మనిషి .
నవ్వుతూ తుళ్లుతూ నోటికి ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేసే నన్ను ముచ్చటగా చూసేవారు .
పెళ్లయితే మీ అత్తారింట్లో ఇలాగే వుంటే కష్టం అనేవారు . నిజమే మా అత్తగారింట్లో క్రమశిక్షణే వేరు .
గట్టిగా మాట్లాడనుకూడా మాట్లాడరు . నేను మొదట్లో ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేదాన్ని .
కనకరాజు గారు ఆ స్థితిలో నన్ను చూసి ఎంతో భారంగా వదిలి వెళ్లారు . ఎందుకో ఆయన్ని చూస్తే ఒక ఆత్మీయభావన !
కీమోతో పాటు రేడియేషన్ కూడా ఇచ్చేవారు . కొన్నాళ్లకి అక్కడ కాలిపోయినట్టు అయిపోయింది .
రోజులు గడిచాయి మూడో కీమో కూడా అయిపోయింది .
హాస్పటల్ వాళ్లు గడ్డ వున్న భుజం భాగం చుట్టూ కొలిచి ఆ కొలత రిపోర్ట్ లో రాసి వుంచారు .
మళ్లీ 15 రోజులు ఆగి రమ్మన్నారు . ఈ లోగా గడ్డ కరిగిపోతుందని ఆ తర్వాత సర్జరీ చేద్దామన్నారు .
నాకు జైల్లోంచి రిలీజైనట్టుంది . తిరిగి వైజాగ్ వెళ్లడానికి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాం .
కీమో వల్ల పూర్తిగా నా రూపు మారిపోయింది .
నల్లగా కమిలిపోయిన మొహం ,గోళ్లు , పలచబడిన కనుబొమలు , వుబ్బినట్టున్న మొహం .
ఇక బయల్దేరదామనగా సోషల్ వర్కర్ ఒకామె కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చింది . ఆమె ఏడ్స్ లో నటిస్తుదంట .
కేన్సర్ పేషంట్ల మనోధైర్యం కోసం ఆమె వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తుంది .
ఆమెతో మట్లాడుతూ ” నా పెద్దకూతురికి నా అవసరం ఎక్కువ , పిచ్చిది నాకోసం ఎంతో ఎదురుచూస్తూ వుంది .
ఈ కేన్సర్ నన్ను తీసుకుపోతే నా పిల్లలు ఏమైపోతారు ” అని ఏడ్చేసాను .
తొలిదశలో ట్రేట్మెంట్ తీసుకుంటే కేన్సర్ని జయించవచ్చని ఏమీ బెంగపెట్టుకోవద్దని అనునయించింది .
విశాఖపట్నం బయలుదేరాం . రాత్రికి విజయవాడ చేరింది .
స్టేషన్లో నన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు .
అందరితో పాటు మా మన్నాన ,పెద్దమ్మ కూడా వున్నారు.
మన్నాన్న నన్ను పదేళ్లు వచ్చేవరకూ పెంచాడు .
నేను నడిస్తే అరిగిపోతానేమో అని అయిదారేళ్లు వచ్చే వరకు ఎత్తుకునే తిప్పేవాడు .
రోజూ తాతగారి ఇంటికి వచ్చి బందరు హల్వా , జిలేబీలు తినిపించిగానీ ఇంటికి వెళ్లేవాడుకాదు .
నేను బయటకి రావడమే నన్ను చూసి మన్నాన , పెద్దమ్మ గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు .
అమ్మా నీ చిన్నప్పటి ముద్దు ముచ్చట్లు ఇప్పటికీ మర్చిపోలేదు , నీకేమన్నా అయితే నేను బతకను అని గావురుమన్నాడు .
అందరూ ఆయన ఏడుపు విని ఏదో అయిపోయిందని చుట్టూ చేరారు . విషయం తెలుసుకుని ” పాపం పెద్దాయన అల్లారుముద్దుగా పెంచుకున్నాడంటమ్మా ! ఆ పిల్లకి జబ్బు చేసిందంట , చూడు ఎట్లా ఏడుస్తున్నాడో … పెంచిన ప్రేమ మరి ” అనుకుంటా వెళ్తున్నారు .
నిజమే కడుపుతీపి కన్నా పెంచుకున్న మమత ఎక్కువే మరి .

*

షర్మిలా కోనేరు

View all posts
విలాసాల పెళ్ళిళ్ళు!
బెజ్జారపు రవీందర్ ‘నిత్యగాయాల నది’

2 comments

Leave a Reply to sharmila Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nityaa says:
    August 2, 2019 at 5:08 am

    అన్నీ వరసగా ఇప్పుడే చదివాను. మండుటెండల్లో నీటి చెలమల్లానే అనిపించాయీ కథలు. నిజంగా జరిగింది చెప్తున్నారా కథలా అని కూడా అనిపించింది చదువుతూంటే. మనసుకు హత్తుకునేలా రాసారు.

    Reply
    • sharmila says:
      August 20, 2019 at 12:01 am

      నిత్యా ఇది అనుభవం నుంచి పుట్టిన కధ . మీకు నచ్చినందుకు థాంక్స్

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

గురుకులం కదా నువ్వు!

మునిసురేష్ పిళ్లె

సంపెంగలు – విరిగిన గళాసులు

హరివెంకట రమణ

నేను చేసే తప్పులు

అరిపిరాల సత్యప్రసాద్

రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూ

కె. శ్రీనివాస్

సామాజిక చలనాలు తెలిసిన బుద్ధిజీవి

అరసవిల్లి కృష్ణ

నౌకారంగ ప్రవేశం

ఉణుదుర్తి సుధాకర్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Badri Narsan on గురుకులం కదా నువ్వు!అమ్మ చెక్కిన బొమ్మగా ఎన్ని వలపోతలు.. ఏడాదిగా 'ప్రతి గడియ ఒక...
  • krupakar pothula on గురుకులం కదా నువ్వు!'తరగతుల అంతరాలు తెలియనివ్వని.. పరీక్షలను నాదాకా రానివ్వని.. గురుకులం కదా నువ్వు!'...
  • కుడికాల వంశీధర్ on గురుకులం కదా నువ్వు!చాలా బాగుంది సార్
  • P.Srinivas Goud on గురుకులం కదా నువ్వు!అమ్మ అడుగడుగునా నేర్పే బతుకు పాఠాలు
  • Rohini Vanjari on గురుకులం కదా నువ్వు!అమ్మంటేనే అది గురువు. బతుకు బాటలో అడుగడుగునా ఎదురైయ్యే పరీక్షలకు ఎదురొడ్డి...
  • Rohini Vanjari on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూనా చిన్నప్పుడు మా నాయన ఊరు పొగడదొరువు కండ్రిగలో నా బాల్యపు...
  • JSR Murthy on గురుకులం కదా నువ్వు!అమ్మ గురుకులంగా మారే వైనాన్ని మనందరి అనుభవాల సారంగా అభివర్ణించలేసు... అక్షరీకరించారు....
  • సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి on గురుకులం కదా నువ్వు!బోధనకు సంబంధించిన పాఠ్యపుస్తకమే తప్ప అమ్మ ఎప్పుడూ ప్రశ్నాపత్రం కానేకాదు. బిడ్డను...
  • గిరి ప్రసాద్ చెలమల్లు on గురుకులం కదా నువ్వు!nice
  • శీలా సుభద్రాదేవి on గురుకులం కదా నువ్వు!అమ్మని చివరిరోజుల్లో ఎలా చూసినా అమ్మ గురించి కవిత రాయని కవులుండరు.అయితే...
  • చిట్టత్తూరు మునిగోపాల్ on గురుకులం కదా నువ్వు!అవును, అమ్మంటే నిజంగా అమ్మే
  • Valeti Gopichand on గురుకులం కదా నువ్వు!సురేష్ గారు ఇప్పటి దాకా మీరు పాత్రికేయులు, కథకులు గానే తెలుసు....
  • అల్లూరి గౌరీలక్ష్మి on గురుకులం కదా నువ్వు!అమ్మలంతా గురువులే ! వారి నడవడికే మార్గదర్శనం, సత్సంతానానికి! వారు అలా...
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యవాదాలు
  • Srinivas Reddy Lethakula on సనాతనమైనది ఏది ?Thought provoking article
  • reddy on నౌకారంగ ప్రవేశంCompleted sudhakar sir Plz write more experiences
  • reddy on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూChildhood memories True—real ones Great sir
  • Pandit aradhya S. Murty on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరికృష్ణా రావు గారి పొడుగైన వ్యాసం చాలా బాగుంది. ఎన్నో సాహిత్య...
  • Vavilala Subbarao on సామాజిక చలనాలు తెలిసిన బుద్ధిజీవిసి ఎస్ ఆర్ పి గురించి అత్యంత సమతూకం గల వివరణ...
  • శిరంశెట్టి కాంతారావు on నౌకారంగ ప్రవేశం‘చెరువులో చేప పిల్ల ఒక్కసారిగా నడిసంద్రంలో దూకినట్టు’ ప్రతీక కొత్తగా అనిపించింది....
  • శిరంశెట్టి కాంతారావు on కరాచీ తీరంలో సంక్షోభంనమస్తే సుధాకర్ సార్! మీ రచనల నేపథ్యం ప్రత్యేకమైనది. మీరు ఏది...
  • కృష్ణుడు on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరినా పరిచయ వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్ని సార్లు చదివినా,...
  • ఏల్చూరి మురళీధరరావు on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరి🌹🙏🌹 మాన్యశ్రీ కృష్ణారావు గారికి నమస్కారములతో, ఔదార్యమూ, సౌజన్యమూ, ఆత్మీయత కలనేతగా...
  • కె సీతారామారావు on సంపెంగలు – విరిగిన గళాసులుచాలా బాగుంది .
  • A.Krishna Rao on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యవాదాలు సార్
  • Kiran Palepu on సంపెంగలు – విరిగిన గళాసులుహరిగారు మొన్ననే గిరి ప్రదక్షిణ చేశాను మరలా కథ చదివాక ఇలా...
  • rayala sridhar on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూనిజానికి ఇది చాలా ముఖ్యమైన జీవితం. ఎంతో సంతృప్తి కష్టసుఖాల సమ్మేళనం...
  • Kiran Palepu on సంపెంగలు – విరిగిన గళాసులుహరిగారు మొన్ననే గిరి ప్రదక్షిణ చేశాను మరలా కథ చదివాక ఇలా...
  • Devarakonda Subrahmanyam on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరికృష్ణరావు గారు ఎల్చురి మురళీధర్ గారు కలిసి ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీ...
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిThank you!
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిThank you!
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిThank you sir. వివరాలు పంపిస్తాను
  • S. Narayanaswamy on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిఅద్భుతం
  • Koradarambabu on సంపెంగలు – విరిగిన గళాసులు'సంపెంగలు విరిగిన గాళసులు' కధ సరళ శైలిలో కధ ఆసక్తిగా చదివింప...
  • Y Srinivasa Rao on  ఆఖరి అన్యుడి చావుA multilayered story that offers comprehensive understanding on the...
  • Tuljaram Singh on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూఅన్నీ నాకూ ఉన్న జ్ఞాపకాలే. మా నాయన , మా ఇంటికి...
  • Prasada Murty on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూమనసు నీరు నీరు అయింది
  • Dr K Divakarachary on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూఅలాంటి ప్రేమ మనుషుల కోసం మన తరం ఇంకా ఎదురుచూస్తూనే ఉంటాం...
  • చిట్టత్తూరు మునిగోపాల్ on నేను చేసే తప్పులుచాలా సరళంగా, ఇప్పుడే సాహిత్యంలో ఇప్పుడే అక్షరాలు దిద్దుతున్నవారికి సైతం అర్థమయ్యేలా...
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యవాదాలు
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరినిజమే సార్
  • గిరి ప్రసాద్ చెలమల్లు on సంపెంగలు – విరిగిన గళాసులుముగింపు బాగుంది
  • Sreenivas Dwarapudi on సంపెంగలు – విరిగిన గళాసులుVery nice sir excellent sir 🤝 చాలా చక్కగా ఉంది...
  • Vijay Jeedigunta on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరికరెక్ట్ గా చెప్పారు. నాకు కూడా ఇలాగే అనిపించింది. అద్భుతమైన సమీక్ష....
  • రాజారామ్ తూముచర్ల on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిఎన్నో అపూర్వ అంశాలను తడిమి వాటి విశేషాలు వివరించిన అతి పెద్ద...
  • reddy on ఆమెది ముమ్మాటికీ బరిని తెగదెంచిన పద్యమేNew women writers are on the way -super writers...
  • చంద్రశేఖర్ on యామినీ కృష్ణ కవితలు రెండువేదనామయ క్షణాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
  • చల్లా రామ ఫణి on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిఇటీవలి కాలంలో ఇంత ఆసక్తి, కుతూహలం రేకెత్తించిన సమీక్ష చదవలేదు. ఈ...
  • Mrithyunjaya Rao Pinnamaneni on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిMrithyunjaya Rao Pinnamaneni వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు-...
  • Jilukara Srinivas on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూLoved it. But village is a prison house for...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు