సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుఅడయార్ కథలుసంచిక: 1 ఆగస్టు 2019

అడయార్ కథలు

షర్మిలా కోనేరు
వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .
⚡️⚡️⚡️⚡️

ఆ రోజు తలదువ్వుకుంటున్నాను దువ్వెనలో కుచ్చులు కుచ్చులుగా జుట్టు వూడి వస్తోంది .
కీమో దాని ప్రభావం చూపించడం మొదలెట్టిందన్నమాట .
ఇప్పుడైతే పోతే పోనియ్ జుట్టేకదా అనుకునేదాన్నేమో .
కానీ ఆ వయసులో ఎందుకో చాలా బాధేసింది .
నిజానికి నీకు కేన్సరేమో అన్నప్పుడు కూడా అంత బాధ వేయలేదు .
మర్నాడు మా ఆయన వచ్చినప్పుడు చెప్పాను నాకు విగ్ కావాలి అని . ఆయన విగ్ ఎందుకు నువ్వు ఎలా వున్నా నాకు ఇబ్బందిలేదు అన్నారు .
కాదు నా మొహం చూసుకోవడానికి నాకే ఇబ్బంది , నాకు కావాలి అన్నాను స్థిరంగా .
మద్రాస్ లో ఆడవాళ్లు గుండు చేయించుకోరట .

అందుకే హాస్పటల్ లో ట్రేట్మెంట్ తీసుకునే చాలామంది విగ్ లు పెట్టుకుని కనిపించే వారు .
మర్నాడు వాళ్లని అడిగి మద్రాస్ లో సినిమా వాళ్లకి విగ్గులు తయారు చేసే చోటుకి వెళ్లాం .
అక్కడ నా తల సైజ్ కొలుచుకుని నాకు వున్న నొక్కుల జుట్టును పరిశీలనగా చూసి నాలుగురోజుల తర్వాత రమ్మన్నాడు .
నేను అన్నాను వూరికే మొత్తం జుట్టు గుండయ్యేలోపు తిరుపతి వెళ్లి అక్కడ జుట్టు ఇస్తాను అన్నాను .
గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టు జుట్టు దేముడికి ఇద్దామని నిర్ణయించుకున్నాను .
తిరుపతిలో జుట్టు ఇచ్చి విగ్ పెట్టుకున్నాను .
ఇంచుమించు నా జుట్టు లాగానే వుంది .
కానీ అద్దంలో చూసుకుంటే ఎవరినో చూసినట్టనిపించింది .
సెలవుల్లో పిల్లల్ని తీసుకుని మా అత్తగారు వచ్చారు .
సగం ప్రాణం తిరిగివచ్చినట్టనిపించింది . అమ్మా ఎవరూ చూడకుండా రోజూ నువ్వున్న ఫోటో దగ్గర ఏడుస్తానమ్మా అని పెద్దది చెప్తే గుండె మెలిపెట్టినట్టైంది .
మనసుకి బాధ కలిగినప్పుడు అందరిముందూ ఏడవకుండా చాటున ఆ ఇంట్లో వున్న చిన్న ఫోటో చూస్తూ వుంటున్నానని చెప్పింది .
ఆరేళ్ల పిల్ల అంత గుంభనగా వుండడం ఆశ్చర్యమే . అంత లోతుగా వుంటాయా పిల్లల మనసులు !
దాన్ని దగ్గరకు తీసుకుని త్వరగా వచ్చేస్తాను అన్నాను .
వెళ్లేటప్పుడు చిన్నదాన్నీ ఎత్తుకుని ముద్దాడాను .
చిన్నదానికి ఎక్కడున్నా చెలాయించుకునే తెలివి వుంది కానీ పెద్దదే లోపల్లోపల కుమిలిపోతుంది .
ఇంకా రెండునెలలు గడవాలి . రెండో కీమో మొదలుపెట్టారు . మా రెండో పిన్నత్త గారి వచ్చారు . స్పృహ వుండీలేని స్థితిలో వున్నాను .
ఇదిగో కనకరాజు మావయ్య వచ్చారు చూడు అని ఆయన పిలిస్తే కళ్లు తెరిచాను .
ఎలావున్నావమ్నా ఏంటీ ఘోరం ఇద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు .
చక్కటి పిల్లలు . నీకు రావలసిన కష్టం కాదు అన్నారు .
నేనంటే ఆయనకు చాలా ఇష్టం .
పెళ్లికి ముందు ఏ మర్యాదలు , తెచ్చిపెట్టుకున్న ప్రవర్తనా లేకుండా నేను నేనుగా వున్నప్పుడు నన్ను చూసిన మనిషి .
నవ్వుతూ తుళ్లుతూ నోటికి ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేసే నన్ను ముచ్చటగా చూసేవారు .
పెళ్లయితే మీ అత్తారింట్లో ఇలాగే వుంటే కష్టం అనేవారు . నిజమే మా అత్తగారింట్లో క్రమశిక్షణే వేరు .
గట్టిగా మాట్లాడనుకూడా మాట్లాడరు . నేను మొదట్లో ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేదాన్ని .
కనకరాజు గారు ఆ స్థితిలో నన్ను చూసి ఎంతో భారంగా వదిలి వెళ్లారు . ఎందుకో ఆయన్ని చూస్తే ఒక ఆత్మీయభావన !
కీమోతో పాటు రేడియేషన్ కూడా ఇచ్చేవారు . కొన్నాళ్లకి అక్కడ కాలిపోయినట్టు అయిపోయింది .
రోజులు గడిచాయి మూడో కీమో కూడా అయిపోయింది .
హాస్పటల్ వాళ్లు గడ్డ వున్న భుజం భాగం చుట్టూ కొలిచి ఆ కొలత రిపోర్ట్ లో రాసి వుంచారు .
మళ్లీ 15 రోజులు ఆగి రమ్మన్నారు . ఈ లోగా గడ్డ కరిగిపోతుందని ఆ తర్వాత సర్జరీ చేద్దామన్నారు .
నాకు జైల్లోంచి రిలీజైనట్టుంది . తిరిగి వైజాగ్ వెళ్లడానికి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాం .
కీమో వల్ల పూర్తిగా నా రూపు మారిపోయింది .
నల్లగా కమిలిపోయిన మొహం ,గోళ్లు , పలచబడిన కనుబొమలు , వుబ్బినట్టున్న మొహం .
ఇక బయల్దేరదామనగా సోషల్ వర్కర్ ఒకామె కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చింది . ఆమె ఏడ్స్ లో నటిస్తుదంట .
కేన్సర్ పేషంట్ల మనోధైర్యం కోసం ఆమె వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తుంది .
ఆమెతో మట్లాడుతూ ” నా పెద్దకూతురికి నా అవసరం ఎక్కువ , పిచ్చిది నాకోసం ఎంతో ఎదురుచూస్తూ వుంది .
ఈ కేన్సర్ నన్ను తీసుకుపోతే నా పిల్లలు ఏమైపోతారు ” అని ఏడ్చేసాను .
తొలిదశలో ట్రేట్మెంట్ తీసుకుంటే కేన్సర్ని జయించవచ్చని ఏమీ బెంగపెట్టుకోవద్దని అనునయించింది .
విశాఖపట్నం బయలుదేరాం . రాత్రికి విజయవాడ చేరింది .
స్టేషన్లో నన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు .
అందరితో పాటు మా మన్నాన ,పెద్దమ్మ కూడా వున్నారు.
మన్నాన్న నన్ను పదేళ్లు వచ్చేవరకూ పెంచాడు .
నేను నడిస్తే అరిగిపోతానేమో అని అయిదారేళ్లు వచ్చే వరకు ఎత్తుకునే తిప్పేవాడు .
రోజూ తాతగారి ఇంటికి వచ్చి బందరు హల్వా , జిలేబీలు తినిపించిగానీ ఇంటికి వెళ్లేవాడుకాదు .
నేను బయటకి రావడమే నన్ను చూసి మన్నాన , పెద్దమ్మ గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు .
అమ్మా నీ చిన్నప్పటి ముద్దు ముచ్చట్లు ఇప్పటికీ మర్చిపోలేదు , నీకేమన్నా అయితే నేను బతకను అని గావురుమన్నాడు .
అందరూ ఆయన ఏడుపు విని ఏదో అయిపోయిందని చుట్టూ చేరారు . విషయం తెలుసుకుని ” పాపం పెద్దాయన అల్లారుముద్దుగా పెంచుకున్నాడంటమ్మా ! ఆ పిల్లకి జబ్బు చేసిందంట , చూడు ఎట్లా ఏడుస్తున్నాడో … పెంచిన ప్రేమ మరి ” అనుకుంటా వెళ్తున్నారు .
నిజమే కడుపుతీపి కన్నా పెంచుకున్న మమత ఎక్కువే మరి .

*

షర్మిలా కోనేరు

View all posts
విలాసాల పెళ్ళిళ్ళు!
బెజ్జారపు రవీందర్ ‘నిత్యగాయాల నది’

2 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nityaa says:
    August 2, 2019 at 5:08 am

    అన్నీ వరసగా ఇప్పుడే చదివాను. మండుటెండల్లో నీటి చెలమల్లానే అనిపించాయీ కథలు. నిజంగా జరిగింది చెప్తున్నారా కథలా అని కూడా అనిపించింది చదువుతూంటే. మనసుకు హత్తుకునేలా రాసారు.

    Reply
    • sharmila says:
      August 20, 2019 at 12:01 am

      నిత్యా ఇది అనుభవం నుంచి పుట్టిన కధ . మీకు నచ్చినందుకు థాంక్స్

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

గిల్పికలు రెండు

ఏ.కె. ప్రభాకర్

బొటనవేలు

శ్రీరామ్

డైలాగ్‌కి తగిలించే తోకలు

అరిపిరాల సత్యప్రసాద్

Seen

చైతన్య పింగళి

మనిషి అర్థశూన్యతకు అద్దం

అజహర్

సాయి తేజ కవితలు మూడు

సాయి తేజ
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Naheed Akhtar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Thanks a bunch for the kind words💐
  • Ahmad vali
    on బొటనవేలు
    కధ చాలా బాగుంది శ్రీరామ్ సర్
  • Phani
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    "అనంతరం" సినిమా పై శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన సమీక్ష మనసును...
  • Mukul kumar
    on The Feminine Ambiguity: Between Silence and Voice
    Such a touching piece! Straight from the heart! The...
  • Ibraheem Nirgun
    on బొటనవేలు
    చాలా బాగుంది బ్రదర్ 👌👌👌
  • R.S. Venkateswaran
    on గిల్పికలు రెండు
    బలే ఉన్నాయ్
  • R.S. Venkateswaran
    on వానలో మెరిసిన ఒక పల్లె బతుకు
    పుస్తక పరిచయం చాలా బాగుంది
  • Srinivas Goud
    on భూమి గుండెల మీద గాయం
    బావుంది.
  • Raheemoddin Mohammad
    on అడుగడుగునా చెలిమి – అక్షరమైన వెలుగు
    నా కవిత ఆత్మను అద్భుతంగా స్ఫృశిస్తూ తులనాత్మక విశ్లేషణ చేశారు. మీకు...
  • డా. కె. ఎల్. వి. ప్రసాద్
    on ఎడ్లబండికి రేడియో ….
    మీ రేడియో అనుభవాలు గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారు.ఇవి చదివి నాటి రోజులు...
  • Syamala Kallury
    on ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!
    ఈ వ్యాసం ఎత్తుగడకి మిగతా వ్యాసానికి సంబంధం ఏమిటో తెలియలేదు. ఇందులో...
  • Sunkara Bhaskara Reddy
    on Stories and Arithmetic
    Excellent analysis and brilliantly written article
  • Shaarvari
    on మల్లెపూలు
    Chinni ,how beautifully you painted Malli's innocence, it's a...
  • Amarendra
    on Journey Through Taiwan
    Very good intrò
  • hari venkata ramana
    on పరిమితుల్లో ఒదిగి, సాగిన ప్రవాహం!
    మీ నడచి వొచ్చిన దారి స్ఫూర్తిదాయకం. అభినందనలు...పాడుకుందాం మీ స్వేచ్ఛాగీతం ఎప్పటికీ.....
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on  వైకోమ్ మహమ్మద్ బషీర్ కథ “గోడలు”
    అస్సలు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎంత...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on తడిసిన కనురెప్పలు 
    వేదనామయ ఒంటరితనాన్ని ఓదార్చే కవితాత్మక ఆలింగనం. వనజ గారూ... అభినందనలు.
  • Varala Anand
    on  వైకోమ్ మహమ్మద్ బషీర్ కథ “గోడలు”
    'Mathilukal' Adoor film adopted from th story, great film...
  • GKK
    on ఆకలి మెతుకులు గెలిచిన ఒక సందర్భం
    వార్తా పత్రికలు తెలుగు భాషకు ఒక ప్రామాణిక రూపం తీసుకు వచ్చి...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on దుబాయ్ రిటర్న్
    సంజయ్ గారూ, గుండెను మెలిపెట్టే స్టోరీ చెప్పారు. అదికూడా చాలా సాధారణమైన...
  • కాత్యాయని
    on ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను!
    థాంక్యూ వేణు గారూ.
  • కాత్యాయని
    on ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను!
    Thank you Usharani garu
  • కాత్యాయని
    on ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను!
    థాంక్యూ జగదీశ్వర్ రెడ్డి గారూ.
  • Vimala
    on ఇప్పటి సాహిత్యరంగంలో బాలగోపాల్ వుంటే….?!
    బాలగోపాల్ సాహిత్య రూప సారాలపై చేసిన లోతైన విశ్లేషణను, కొత్త చూపును...
  • GKK
    on నిరాశా లేదు. నిస్పృహ అస్సలే లేదు!
    పత్రికా రంగం లో మీడియాలో వామపక్ష వాదులు ఎంత బలంగా పాతుకుపోయారో...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on ఆకలి మెతుకులు గెలిచిన ఒక సందర్భం
    "ఈ కాసిన్ని కిరణాల్ని కూడా వాళ్ళు దోచుకుపోయి అదనపు ఆదాయం కింద...
  • వేణు
    on జీవితానుభవానికి కథే దగ్గరి దారి!
    ఇంటర్ వ్యూలోని ప్రశ్నలూ, జవాబులూ ఆలోచనలు రేపేలా, ఆసక్తికరంగా ఉన్నాయి. కథా...
  • వేణు
    on నిరాశా లేదు. నిస్పృహ అస్సలే లేదు!
    ఒకింత కవితా స్పర్శా, కొండొకచో అతిశయోక్తీ ప్రకాష్ గారి వచనానికి అలంకారాలూ,...
  • ప్రగతి
    on ఆర్ యు అవైలబుల్?
    ఆధునిక తరం కథ, అవసరమైన కథ. చాలా బాగుంది. అభినందనలు విమల...
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you Venu
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you
  • వేణు
    on ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను!
    అనువాదం గురించి మీ అనుభవాలూ, అభిప్రాయాలూ బాగున్నాయి. మీరు పాటించే అనువాద...
  • వేణు
    on ఆర్ యు అవైలబుల్?
    A modern exploitation. చివరికి చలమూ, స్వేచ్ఛా కూడా దీనికి కారణమవ్వటమే...
  • చిట్టత్తూరు మునిగోపాల్
    on పరిమితుల్లో ఒదిగి, సాగిన ప్రవాహం!
    గంటేడ గౌరునాయుడు పేరు వినడం, ఆయన కథలు ఒకట్రెండు చదివి అబ్బురపోవడం...
  • Usharani
    on ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను!
    I love your translations
  • Annapurna
    on సముద్రం
    Inkevaru ..,, bhoomaata garbham nunchekada!
  • శ్రీ వశిష్ఠ సోమేపల్లి
    on ఏటూరి నాగేంద్రరావు కవితలు
    రెండు మంచి కవితలు. అమ్మ పేజీలు మరింత బాగుంది.
  • Sree Vasista Somepalli
    on నా కళ్ళెక్కడో పోయాయి
    స్పందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    ధన్యవాదాలు. ప్రతి కథలోనూ,దానిలోని పాత్రలకి వాటిదైనా ఉద్దాన పతనాలు ఉంటాయి. ఆ...
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    చలం రజనీకాంతరావు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ వినండి. తాను గతంలో రాసిన...
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you స్వామి
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you . అవునండి
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you . రామలక్ష్మి గారూ
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you . రామలక్ష్మి గారూ
  • Vimala
    on ఆర్ యు అవైలబుల్?
    Thank you నాగలక్ష్మి గారు..
  • ప్రమోద్ వడ్లకొండ
    on ఆర్ యు అవైలబుల్?
    కాలానికి అనుగుణమైన కథ. చాలా అవసరమైన కథ. ఎన్నో సందేహాలకీ సంశయాలకీ...
  • Gorusu
    on ఆత్మహత్యల కుట్ర వెనక కథ గొరుసు “గజ ఈతరాలు”
    హరీ.. నువ్వు కూడా సాహిత్యం చదువుతావని ఇప్పుడే తెలిసింది. నా జీవితంలో...
  • Ashok Dash
    on Melbourne Celebrates Sarangi’s Poetry
    Congratulations, sir. Your poetry has all along been travelling...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు