సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుఅడయార్ కథలుసంచిక: 1 ఆగస్టు 2019

అడయార్ కథలు

షర్మిలా కోనేరు
వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .
⚡️⚡️⚡️⚡️

ఆ రోజు తలదువ్వుకుంటున్నాను దువ్వెనలో కుచ్చులు కుచ్చులుగా జుట్టు వూడి వస్తోంది .
కీమో దాని ప్రభావం చూపించడం మొదలెట్టిందన్నమాట .
ఇప్పుడైతే పోతే పోనియ్ జుట్టేకదా అనుకునేదాన్నేమో .
కానీ ఆ వయసులో ఎందుకో చాలా బాధేసింది .
నిజానికి నీకు కేన్సరేమో అన్నప్పుడు కూడా అంత బాధ వేయలేదు .
మర్నాడు మా ఆయన వచ్చినప్పుడు చెప్పాను నాకు విగ్ కావాలి అని . ఆయన విగ్ ఎందుకు నువ్వు ఎలా వున్నా నాకు ఇబ్బందిలేదు అన్నారు .
కాదు నా మొహం చూసుకోవడానికి నాకే ఇబ్బంది , నాకు కావాలి అన్నాను స్థిరంగా .
మద్రాస్ లో ఆడవాళ్లు గుండు చేయించుకోరట .

అందుకే హాస్పటల్ లో ట్రేట్మెంట్ తీసుకునే చాలామంది విగ్ లు పెట్టుకుని కనిపించే వారు .
మర్నాడు వాళ్లని అడిగి మద్రాస్ లో సినిమా వాళ్లకి విగ్గులు తయారు చేసే చోటుకి వెళ్లాం .
అక్కడ నా తల సైజ్ కొలుచుకుని నాకు వున్న నొక్కుల జుట్టును పరిశీలనగా చూసి నాలుగురోజుల తర్వాత రమ్మన్నాడు .
నేను అన్నాను వూరికే మొత్తం జుట్టు గుండయ్యేలోపు తిరుపతి వెళ్లి అక్కడ జుట్టు ఇస్తాను అన్నాను .
గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టు జుట్టు దేముడికి ఇద్దామని నిర్ణయించుకున్నాను .
తిరుపతిలో జుట్టు ఇచ్చి విగ్ పెట్టుకున్నాను .
ఇంచుమించు నా జుట్టు లాగానే వుంది .
కానీ అద్దంలో చూసుకుంటే ఎవరినో చూసినట్టనిపించింది .
సెలవుల్లో పిల్లల్ని తీసుకుని మా అత్తగారు వచ్చారు .
సగం ప్రాణం తిరిగివచ్చినట్టనిపించింది . అమ్మా ఎవరూ చూడకుండా రోజూ నువ్వున్న ఫోటో దగ్గర ఏడుస్తానమ్మా అని పెద్దది చెప్తే గుండె మెలిపెట్టినట్టైంది .
మనసుకి బాధ కలిగినప్పుడు అందరిముందూ ఏడవకుండా చాటున ఆ ఇంట్లో వున్న చిన్న ఫోటో చూస్తూ వుంటున్నానని చెప్పింది .
ఆరేళ్ల పిల్ల అంత గుంభనగా వుండడం ఆశ్చర్యమే . అంత లోతుగా వుంటాయా పిల్లల మనసులు !
దాన్ని దగ్గరకు తీసుకుని త్వరగా వచ్చేస్తాను అన్నాను .
వెళ్లేటప్పుడు చిన్నదాన్నీ ఎత్తుకుని ముద్దాడాను .
చిన్నదానికి ఎక్కడున్నా చెలాయించుకునే తెలివి వుంది కానీ పెద్దదే లోపల్లోపల కుమిలిపోతుంది .
ఇంకా రెండునెలలు గడవాలి . రెండో కీమో మొదలుపెట్టారు . మా రెండో పిన్నత్త గారి వచ్చారు . స్పృహ వుండీలేని స్థితిలో వున్నాను .
ఇదిగో కనకరాజు మావయ్య వచ్చారు చూడు అని ఆయన పిలిస్తే కళ్లు తెరిచాను .
ఎలావున్నావమ్నా ఏంటీ ఘోరం ఇద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు .
చక్కటి పిల్లలు . నీకు రావలసిన కష్టం కాదు అన్నారు .
నేనంటే ఆయనకు చాలా ఇష్టం .
పెళ్లికి ముందు ఏ మర్యాదలు , తెచ్చిపెట్టుకున్న ప్రవర్తనా లేకుండా నేను నేనుగా వున్నప్పుడు నన్ను చూసిన మనిషి .
నవ్వుతూ తుళ్లుతూ నోటికి ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేసే నన్ను ముచ్చటగా చూసేవారు .
పెళ్లయితే మీ అత్తారింట్లో ఇలాగే వుంటే కష్టం అనేవారు . నిజమే మా అత్తగారింట్లో క్రమశిక్షణే వేరు .
గట్టిగా మాట్లాడనుకూడా మాట్లాడరు . నేను మొదట్లో ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేదాన్ని .
కనకరాజు గారు ఆ స్థితిలో నన్ను చూసి ఎంతో భారంగా వదిలి వెళ్లారు . ఎందుకో ఆయన్ని చూస్తే ఒక ఆత్మీయభావన !
కీమోతో పాటు రేడియేషన్ కూడా ఇచ్చేవారు . కొన్నాళ్లకి అక్కడ కాలిపోయినట్టు అయిపోయింది .
రోజులు గడిచాయి మూడో కీమో కూడా అయిపోయింది .
హాస్పటల్ వాళ్లు గడ్డ వున్న భుజం భాగం చుట్టూ కొలిచి ఆ కొలత రిపోర్ట్ లో రాసి వుంచారు .
మళ్లీ 15 రోజులు ఆగి రమ్మన్నారు . ఈ లోగా గడ్డ కరిగిపోతుందని ఆ తర్వాత సర్జరీ చేద్దామన్నారు .
నాకు జైల్లోంచి రిలీజైనట్టుంది . తిరిగి వైజాగ్ వెళ్లడానికి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాం .
కీమో వల్ల పూర్తిగా నా రూపు మారిపోయింది .
నల్లగా కమిలిపోయిన మొహం ,గోళ్లు , పలచబడిన కనుబొమలు , వుబ్బినట్టున్న మొహం .
ఇక బయల్దేరదామనగా సోషల్ వర్కర్ ఒకామె కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చింది . ఆమె ఏడ్స్ లో నటిస్తుదంట .
కేన్సర్ పేషంట్ల మనోధైర్యం కోసం ఆమె వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తుంది .
ఆమెతో మట్లాడుతూ ” నా పెద్దకూతురికి నా అవసరం ఎక్కువ , పిచ్చిది నాకోసం ఎంతో ఎదురుచూస్తూ వుంది .
ఈ కేన్సర్ నన్ను తీసుకుపోతే నా పిల్లలు ఏమైపోతారు ” అని ఏడ్చేసాను .
తొలిదశలో ట్రేట్మెంట్ తీసుకుంటే కేన్సర్ని జయించవచ్చని ఏమీ బెంగపెట్టుకోవద్దని అనునయించింది .
విశాఖపట్నం బయలుదేరాం . రాత్రికి విజయవాడ చేరింది .
స్టేషన్లో నన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు .
అందరితో పాటు మా మన్నాన ,పెద్దమ్మ కూడా వున్నారు.
మన్నాన్న నన్ను పదేళ్లు వచ్చేవరకూ పెంచాడు .
నేను నడిస్తే అరిగిపోతానేమో అని అయిదారేళ్లు వచ్చే వరకు ఎత్తుకునే తిప్పేవాడు .
రోజూ తాతగారి ఇంటికి వచ్చి బందరు హల్వా , జిలేబీలు తినిపించిగానీ ఇంటికి వెళ్లేవాడుకాదు .
నేను బయటకి రావడమే నన్ను చూసి మన్నాన , పెద్దమ్మ గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు .
అమ్మా నీ చిన్నప్పటి ముద్దు ముచ్చట్లు ఇప్పటికీ మర్చిపోలేదు , నీకేమన్నా అయితే నేను బతకను అని గావురుమన్నాడు .
అందరూ ఆయన ఏడుపు విని ఏదో అయిపోయిందని చుట్టూ చేరారు . విషయం తెలుసుకుని ” పాపం పెద్దాయన అల్లారుముద్దుగా పెంచుకున్నాడంటమ్మా ! ఆ పిల్లకి జబ్బు చేసిందంట , చూడు ఎట్లా ఏడుస్తున్నాడో … పెంచిన ప్రేమ మరి ” అనుకుంటా వెళ్తున్నారు .
నిజమే కడుపుతీపి కన్నా పెంచుకున్న మమత ఎక్కువే మరి .

*

షర్మిలా కోనేరు

View all posts
విలాసాల పెళ్ళిళ్ళు!
బెజ్జారపు రవీందర్ ‘నిత్యగాయాల నది’

2 comments

Leave a Reply to sharmila Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nityaa says:
    August 2, 2019 at 5:08 am

    అన్నీ వరసగా ఇప్పుడే చదివాను. మండుటెండల్లో నీటి చెలమల్లానే అనిపించాయీ కథలు. నిజంగా జరిగింది చెప్తున్నారా కథలా అని కూడా అనిపించింది చదువుతూంటే. మనసుకు హత్తుకునేలా రాసారు.

    Reply
    • sharmila says:
      August 20, 2019 at 12:01 am

      నిత్యా ఇది అనుభవం నుంచి పుట్టిన కధ . మీకు నచ్చినందుకు థాంక్స్

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్

రచన ముద్రబోయిన

Our Year in Translation

Shuchi Agrawal

ఎప్పుడు? ఎక్కడ?

అరిపిరాల సత్యప్రసాద్

ఈ మడిసి నాకు తెలీదు

శ్రీనివాస్ గౌడ్

గోడల్ని బద్దలు కొట్టే ఫెస్టివల్ “సమూహ”

మెర్సీ మార్గరెట్

కథాసంగమం, కదనరంగం కరాచీ నగరం

ఉణుదుర్తి సుధాకర్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • వనజ తాతినేని on క్రాస్ రోడ్స్ ధన్యవాదాలు అండీ
  • పాలగిరి విశ్వప్రసాద్ on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్సాహిత్యంలో మరో ఖాళీని కొద్దిగానైనా పూరించగల సంకలనం. మంచి ప్రయత్నం.
  • Venu on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్Will buy and read it
  • Devi on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్మన సమాజం క్వియర్ కమ్యూనిటీపై చూపే వివక్షను చాలా స్పష్టంగా చెప్పారు....
  • Palagiri Viswaprasad on క్రాస్ రోడ్స్ కథా వస్తువు బాగుంది. అభినందనలు వనజగారూ!
  • Prem Chand Gummadi on Writing has always been a quiet space….Excellent article.
  • Suresh on సంచులుమంచి కథ సార్ చాలా బాగుంది
  • సాయి ప్రసాద్ on దేవమాతఅద్భుతంగా రాశారు అండీ.. కళ్ళు చెమర్చాయి..
  • hari venkata ramana on ఈ మడిసి నాకు తెలీదుప్రస్తుతకాలపు ఇంటింటి కథ, బాగుందన్న. అభినందనలు.
  • Khalil on ఎర్ర సైకిల్సరిగ్గా చెప్పారు. ఆ జ్ఞాపక విలువే కథలో నాకు ముఖ్యమైనది.
  • Rohini Vanjari on రైల్లో …కొన్ని దృశ్యాలుఆకలి తో తిరిగే బొద్దింక కి మనిషికీ తేడా లేదు అండి....
  • Rohini Vanjari on రెక్కల వాకిలిరాతి కత్తి లాగా దిగబడిన చేదు కాలం.. వీడ్కోలు తర్వాత మరోక...
  • Rohini Vanjari on ఒక రాత్రంతా… ఊరికే..నిజమే... ఊరుని, వీధులను, బాల్యపు జ్ఞాపకాలను రాత్రి పూట నే చూడాలి....
  • Kcubevarma on వాక్యం నదిలా ప్రవహించాలిThank you Sir
  • Roseline kurian on Writing has always been a quiet space….The very last paragraph of the above interview,I felt...
  • పాలగిరి విశ్వప్రసాద్ on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!Thank you
  • పాలగిరి విశ్వప్రసాద్ on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!నిజమే, ఆ కథ రాసే నాటికి నా మీద చలం శైలి...
  • పాలగిరి విశ్వప్రసాద్ on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!థ్యాంక్యూ సర్!
  • వెంకి on దేవమాతSubject మీద study బాగా చేసినట్లు కనపడుతుంది.. వారు పాటించే కట్టుబాట్లు...
  • Shiva Krishna on సంచులుAsaantham chadivinchindi, chaala manchi katha, kotha katha kuda. Keep...
  • ఎల్లి చంద్ర on రోబో గర్భంలోకి మీ ప్యాటర్న్ కంటే కొంచెం పెద్ద పజ్జెమే.. "విచిత్ర నీటిని రంగుల...
  • చిట్టత్తూరు మునిగోపాల్ on దేవమాతకథ ముగిశాక కూడా దేవదూత శోకం నా గుండెల్లో కురుస్తూనే ఉంది...
  • చిట్టత్తూరు మునిగోపాల్ on ఎప్పుడు? ఎక్కడ?రచయితకు స్థలకాలాల విషయంలో పాఠకుడిపట్ల ఉండాల్సిన బాధ్యత బాగా గుర్తు చేశారు...
  • వనజ తాతినేని on క్రాస్ రోడ్స్ ఈ కథను ప్రచురించినందుకు సారంగ ఎడిటర్స్ కి ధన్యవాదాలు.🙏
  • D.Subrahmanyam on గోడల్ని బద్దలు కొట్టే ఫెస్టివల్ “సమూహ”Good programme and best wishes for the success of...
  • D.Subrahmanyam on వాక్యం నదిలా ప్రవహించాలికవిత బావుంది
  • N, Rukmani on కథాసంగమం, కదనరంగం కరాచీ నగరంఇంతకీ ఈ యస్ పి‌ఎవరండీ? ఒకప్పుడు ఒక ఎస్పి అనేతను విరసం...
  • Jayasurya Somanchi ( S.J.Surya ) on కథాసంగమం, కదనరంగం కరాచీ నగరంసహజంగా మంచి కథకుడైన సుధాకర్ గారి శైలి చక్కగా చదివిస్తుంది..
  • netaji nagesh on కథాసంగమం, కదనరంగం కరాచీ నగరంపాకిస్థాన్ లో ఇన్ని అనుభవాలు ఉండటం మీకే దక్కిందేమో అనిపిస్తుంది, నేను...
  • Raghu ram on సంచులుకథ బాగుంది మన్ ప్రీతం గారు 👏👏 అభినందనలు
  • Kcubevarma on వాక్యం నదిలా ప్రవహించాలిThank you sir
  • Kishore Mannem on దేవమాతGood one Ajay Bro
  • Sunkara Bhaskara Reddy on వాక్యం నదిలా ప్రవహించాలిమనసుకు హత్తుకొనే మంచి కవిత. అభినందనలు
  • శివ చంద్ర on దేవమాతబాగా రాశరన్నా... 💐💐💐
  • Manpreetam KV on సంచులుమీరు అన్నది పూర్తిగా నిజమయితే కాదు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది...
  • Hari Venkata Ramana Bokka on గోడల్ని బద్దలు కొట్టే ఫెస్టివల్ “సమూహ”Well written and good start
  • D.Subrahmanyam on అంబేద్కర్ తాత్విక ప్రతిఫలనం కేశవ్ కవిత్వం"చాలా మందికి కనపడే అంబేద్కర్ లో ఒక్క కోణమే ఉండొచ్చు. కాని...
  • D.Subrahmanyam on కథాసంగమం, కదనరంగం కరాచీ నగరంకరాచీ గురించి మంచి వివరాలతో కధ చెప్పినట్లు చాలా బాగా చెప్పారు...
  • Kcubevarma on ఒక రాత్రంతా… ఊరికే..నువ్వెప్పుడైనా రాత్రిని చూసావా? నిజమైన ఊరిని చూసావా? రాత్రంతా ఊరికే‌ తిరుగుతూ...
  • Kcubevarma on వాక్యం నదిలా ప్రవహించాలిThank you sir 🙏🏼
  • Kcubevarma on వాక్యం నదిలా ప్రవహించాలిThank you sir 🙏🏼
  • Sanjay Khan on దేవమాతఅద్భుతంగా రాశారు అజయ్... మాటలు రావట్లేదు.. raw and rustic... excellent...
  • Soumya on సంచులుఓ తుమ్ము తో కథ స్టార్ట్ చేసిన విధానంతోనే పట్టింపులను బ్రేక్...
  • Chandrasekhar on కథాసంగమం, కదనరంగం కరాచీ నగరంGripping narrative of adventurous experieces.
  • హుమాయున్ సంఘీర్ on దేవమాతకథ చాలా బాగుంది అజయ్. దేవమాత, రాజుల స్వచ్ఛమైన లవ్ స్టోరీ....
  • Sanjay Khan on సంచులుకథ చాలా బాగుంది... కొత్త కథా వస్తువు, శిల్పం...మనం కిరాణా షాపుల్లో...
  • Sanjay Khan on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!బాగుంది సార్ ... మోనోలాగ్ స్టైల్ లో చాలా బాగా రాసారు...
  • మహేష్ on సంచులుచాలా మంచి కథ. Monopoly capitalism పెరిగిన పరిస్థితులు survival struggles...
  • Suresh Krishna on దేవమాతVery nicely written, with an ending that hits hard...
  • V Abhiram on సంచులుI’m a fan of ur father and now for...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు