పదమూడేళ్ళ ప్రయాణంలో….తోడూ చేదోడూ!

ఈ పదమూడేళ్లలో సారంగ సగర్వంగా చెప్పుకోవాల్సింది ఈ నిలకడ గురించే- ఎప్పుడూ ఎలాంటి స్థితిలోనూ అడుగు తడబడని  ప్రయాణం ఇది.

ఇదిగో ఇదే ఇదే మా బడి!

సాహిత్యమంటే కథలు, కవితలని కాక- సమాజం, రాజకీయం, దృశ్యం, ముఖ్యంగా రచయితలూ, కవులకు ప్రోత్సాహం అని అర్థం చేసుకున్న సంపాదక వర్గం ఉండడం వలెనే సాధ్యపడింది.

వేల పొద్దులుగా సాగాలి ఈ ప్రయాణం!

తెలుగులో సుదీర్ఘకాలంగా సాగుతున్న సాహిత్య శీర్షికల్లో ‘కథలపొద్దు’ కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల రచయితలు ఇందులో భాగం పొందారు. అన్ని రకాల మాండలికాలూ ఈ కథల్లో ఉన్నాయి.

విశ్వవీధిలో తెలుగు పతంగం ‘సారంగ’

'సారంగ' మరీ ముఖ్యంగా కొత్త రచయితలకు తక్షణ గమ్యం.  వారికి తగినంత ప్రోత్సాహం 'సారంగ' బృందం నుండి లభిస్తున్నది.  సారంగలో తన రచన చూసుకున్న ప్రతి యువ రచయిత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

వాళ్ళు జీవితాన్ని తిరగరాస్తున్నారు!

కథల్లో బాధపడిన వాళ్ళు, ఇప్పుడు చక్కగా నవ్వుతున్నారు. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని తలకిందులు చేసుకున్నవాళ్ళు, ఇప్పుడు దైర్యంగా నిలబడున్నారు.

పుస్తకాలే నా బాల్యం

అది ఒక విచిత్రమైన వ్యవహారం. పుస్తకాలను ఇస్తే ఆయనకు బాధ కలుగుతుంది, ఇవ్వకపోతే నాకు బాధ కలుగుతుంది. నాది జిజ్ఞాస, ఆయనది మమకారం.

నాన్న (జస్ట్ ఎ బయోలాజికల్ ఫాదర్)

నాకు పద్దెనిమిదేళ్లు రాగానే, మన మురికివాడలోని ఆడపిల్లల లాగానే ఒక సౌదీ ఇంట్లో కద్దామా (హౌస్ మెయిడ్) పని చెయ్యడానికి రియాద్ పంపించారు. ఎవరైనా కన్నవాళ్ళను, ఊరిని వదిలి వెళ్లాలంటే బాధపడతారు. కానీ నేను మాత్రం ఎంతో...

పాతికేళ్ళ తరవాత కొత్త అనుభవమే!

పుస్తకానికి పేరేం పెట్టాలో అర్థం కాలేదు. ఏదైనా ఒక పేరునే పెడదామంటే, ఆ కథకి ఎక్కువ వెయిట్ ఇచ్చినట్టువుతుందని ఓ మిత్రుడన్న మాటలు - ఆలోచనలో పడేశాయి. ‘1, మరో 13’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టి కొనసాగించాను.

రమాదేవి కవితలు రెండు

1 ఓ… కొంగుముడి పనేమీ లేనట్టు సమయమే గడవనట్టు నింపాదిగా కాళ్ళు ముడుచుక్కూర్చుంటానా నా కోసమే కాచుకూర్చున్నట్టు యాతన, వేదన ఒకింత నిశ్శబ్దం ఒక్కసారిగా నన్ను చుట్టుముడతాయి వాటిని కళ్ళతోనే అదిలించి దూరంగా...

కట్టమంచి నుంచి రాజారామ్ దాకా…

గత దశాబ్ధ కాలం నుండి రాయలసీమ ప్రాంతం నుండి  అన్నీ సాహిత్యప్రక్రియల్లో విస్తృతంగా రచనలు వస్తున్నాయి. వొకదశలో తెలుగు రాష్ట్రాలు రాయలసీమ వైపు చూసే పరిస్థితి నెలకొంది. రాయలసీమ నుండి విమర్శ అనే సరికి కట్టమంచి...

సహానుభూతి తలపోత

ఈ శతాబ్దపు రచనలు గత శతాబ్దంలో వచ్చిన ఆధునికానంతర ఆలోచనలకు కొనసాగింపుగానే అయినా భిన్నంగా ఉండడం ఒక లక్షణంగానూ, ఇది ఒక్క కవిత్వమూ, సాహిత్యమూ మాత్రమే కాక అనేక సామాజిక రంగాలలో మనిషిని ప్రభావితం చేసిన తీరును...

కేరాఫ్ వంటిల్లు ఇంకా ఎంతకాలం?!

ఇటీవలకాలంలో ఫేస్ బుక్ లో నేను చదివిన కవిత్వంలో ఒక మంచి కవిత గురించి చెప్పాలనుకున్నాను. మిత్రులతో మాటల్లో కవిత్వాన్ని విశ్లేషించడమే తప్ప నేనెప్పుడూ కవిత్వాన్ని పరిచయం చేసే బాధ్యతను తలకెత్తుకోలేదు. ఎందుకో ఈ కవిత...

కింట్సుగి

చిటికెడు కర్పూరపు ముద్ద వెలిగినంత సేపు కూడా నిలవదు నా ధ్యానం. పని తరవాత పని చేసుకుంటూ పోతుంది దేహం. కనురెప్ప తాటింపులో కరిగిపోయే జన్మం! *** మా ఇల్లు నీకు దగ్గరే. నీ ఇల్లే నాకు బహుదూరం ఎప్పుడూ. ఇదేం పెద్ద వింత...

పొలంబడి

స్కేల్ తీసుకొని పెన్నుతో నోట్సుల  నాలుగు పక్కల లైన్లు కొట్టి, హెడ్డింగులను అండర్ లైన్ చేసినట్టు పొలంలో నాయిన అంతే అందంగా వొరాలు చెక్కి, బురద పెడతాడు. ….రోజు స్కూల్లో మన హ్యాండ్ రైటింగులకు గుడ్, వెరీ గుడ్...

పూలతోట

నదిని చూస్తే నదంతా సముద్రాన్ని చూస్తే సముద్రమంతా విశాలమవుతాయి కనులు ఆకుపచ్చ వనాలను చేరగానే విప్పారుతుంది ముక్కు మామూలుకన్నా ఎక్కువ గాలిని నిండా నింపుకుంటాయి ఊపిరి తిత్తులు వాన చినుకుల్ని ఒడిసిపట్టాలని...

కాసుల పేరు

“అమ్మా! పింఛనందింది కదా ఆ సొమ్మేదే.” “ఇంకెక్కడ సొమ్మురా నాయన! సేతిలో ఎట్టినట్టే ఎట్టి మల్లా ఆ బాంకోలే తీసుకుంతే.” “ఆలు ఏల తీసుకుంతరే! ఆలు తీసుకుంతుంతే నువ్వేల పల్లకున్నావు. గట్టిగా గరిసి గోలసెయ్యలేకపోనావా...

ప్రపంచ భాషగా తెలుగు నిలబడుతుందా?!

దశాబ్ది కాలంగా పెరుగుతున్న అమెరికా తెలుగు సమూహాలలో ప్రపంచ భాషగా తెలుగుని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష తీవ్రంగానే వుంది. అనేక చోట్ల జరుగుతున్న తెలుగు సభల్లోనూ, రచయితల సమావేశాల్లోనూ ఈ ఆకాంక్షకి ఆచరణ రూపం ఇస్తే...

తెలుగు సాహిత్య భవిష్యత్తు ఇదిగో ఇక్కడ!

ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు తెలుగులో జరగాలి. తెలుగు సాహిత్యం మరింత మందికి చేరేందుకు తోడ్పడాలి. ఇతర భాషలతో సమానంగా తెలుగు సాహిత్యం అంతర్జాతీయ స్థాయికి చేరాలి. ఇటువంటి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటే అది తప్పకుండా...

మీజాన్‌సేన్ 2

ఈ సన్నివేశం చదివినప్పుడు మీకేమనిపించింది. బహుశా "ఇది బాగానే ఉంది కదా? చెప్పాలనుకున్న విషయాలు రచయిత చెప్పగలిగాడు కదా? ఇందులో లోపం ఏముంది?" అని మీకు అనిపించి ఉండచ్చు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కథలో ఈ...

ట్రీ ఆఫ్ లైఫ్

ఎదురుగా నా ప్రియమైన నీటి బుగ్గ కనిపించింది. జీవితానందం ఎక్కడి నుండి ఊరుతోందో మనకు తెలియనట్టే, ఈ ఊట బుగ్గలోకి యుగాలుగా నీరు ఎక్కడి నిండి వస్తుందో తెలియదు.

సంపుడు పందెం

ఇషయం తెలుసుకొని పోలీసులొచ్చారు. తరువాత ఫారెస్టోళ్లు వచ్చారు. పులి అడుగు ముద్రల కొల తీసుకున్నారు. పులిని పట్టుకోడానికి బోను ఎడతామన్నారు.  పులితో జాగ్రత్తగుండండి. ఒంటిగా ఎవ్వరూ ఎక్కడికెళ్ళొద్దు…తొందర్లోనే...

పర్ఫెక్ట్ మర్డర్

సిద్ధాంతం బానే ఉంది. ఇద్దరు జ్ఞానమూర్తులూ ఒకే సోఫాలో తన ఎదురుగా ఇదివరలాగానే నవ్వుతూ కూర్చోవాలనే కోరికనుంచి ఎలా బయట పడటం? ఇన్నాళ్ళ తన ప్రగాఢ ప్రయత్నం ఫలితం శుద్ధశూన్యమని ఎలా ఒప్పుకోటం? ఈరెండు మొండిగోడలు...

మెడకువడ్డ పాము

రేవతమ్మ పేరుకే ఇక్కడ ఉంది కానీ తన మనసు ఏడేడు లోకాలు తిరిగొస్తుంది. కొండలు లేకుండా ఇన్ని రోజులు బతికింది. ఇక మీదట బతకడం తనకు పెద్ద విషయం గాదు. సంసారాన్ని ఈది ఈది అలిసిపోయి ఉంది. కొండలును తీసుకొని పోవాలా? వద్దా?

English Section

Sonali Chanda’s Two Poems

Should I be War ground?Who arranged the bodies after all war has been over? I didn’t see Panipat ..or honestly saying Waterloo or the war of Haldighati. I tried to  out some I tried to shovel the war ground of...

Will they ever forgive us?

A group of “men” Lusted for the kingdom They flaunted their plunder   They bought The makers, the implementers and the protectors of rules of the game called democracy   Overnight they disguised the monster as...

Kitty and the gader

Pundit Ji suggested an offering of salt as per the weight of the dead cat and a puja to placate the Gods to ensure her soul found peace and would spare its perpetrators!

Between a Mother and Her Daughter

After all it is not unusual for mothers and daughters to have quarrels during their growing up years but their relationship stays firm most of the times. Not so for Arundhati in this narrative. Though uncommon, this...

Ruins

Raja Chakraborty is a much-published poet. His poems are crisp, playful, deep, weaving beautiful images with lofty thoughts. Chakraborty is a seasoned poet who says little to convey much. Poems like ‘Washed and Dried’...