మబ్బుల తలుపులు పగలవేం

సుఖంతో
దుఃఖంలో
స్పష్టంగా
చదవటం వినటం అనుభవించటం
ఎవరికీ రాదు

బతకాలి
శుద్ధ ఏకాంతంలో విరిగిపోతూ

మరొక తెలియని మరక
భగవంతుడు

శుభ్రమైన వాంఛలూ
శుభ్రమైన గోచీలూ
శుభ్రమైన పుష్పాలూ
రోజూ ఉండాలిగా

మాయా మతం బజారులో
ఏ మతం కొనుక్కోవాలో

ముసుగులు లేని అక్షరాలతో
ఊపిరితిత్తులకైనా పనిచెప్పరు

ఏ పునర్జన్మ తప్పొప్పుల
చరిత్ర చెపుతున్నావ్

ఏ చీకటి రాబందుల మోకాళ్ళ మోక్షాన్ని మోసుకుంటూ ఎవరికి మొక్కుతున్నావ్
ఎవరిని తొక్కుతున్నావ్

గాయాలనీ లెక్కచేయని గుంట నక్కలే
మన ఆరాధ్య ఖగోళ విధ్వంసకులు

నువ్వే నవ్వుకో
నీ చితి ముందు

*

చిత్రం: సృజన్ రాజ్

ఎం. ఎస్. నాయుడు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముసుగులు లేని అక్షరాలతో ఊపిరి తిత్తులకైనా పని చెప్పరు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు