మూలం: ఫైజ్ అహ్మద్ ఫైజ్
ఏడవకు కన్నా ఏడవకు!
కుమిలి కుమిలి ఏడిచి
ఇపుడే నీ తల్లికి కునుకు పట్టింది!
ఏడవకు కన్నా ఏడవకు!
ఇంతకు మునుపే నీ నాన్న
తన బాధకు వీడ్కోలు పలికాడు!
ఏడవకు కన్నా, ఏడవకు!
నీ తోబుట్టు తన కలల సీతాకోకచిలుక వెంట
కానరాని దూరతీరాలకు పయనమయ్యాడు
ఏడవకు కన్నా, ఏడవకు!
నీ అక్క పల్లకిన పరదేశానికి పయనమైంది
ఏడవకు కన్నా, ఏడవకు!
అస్తమించిన సూర్యుడికి మీ వాకిట్లోనే
ఆఖరిస్నానం ఆచరించారు ఇప్పుడే!
చంద్రుడిని మీ పెరట్లో ఖననం చేశారు!
ఏడవకు కన్నా, ఏడవకు!
నువ్వు అలా ఏడుస్తూవుంటే
అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు
సూర్యచంద్రులు కలసికట్టుగ
ఆటపట్టున మరింత ఏడిపిస్తారు!
నీ ముఖాన ఓ చిరునవ్వు చూస్తే!
వారంతా కలసి నీతో వీరివీరి గుమ్మడిపండు
ఆడడానికి మారువేషాన మరల వస్తారు!
*








Add comment