ఉన్న చోటు నుండి పారిపోవడానికి
విశ్వప్రయత్నాలు చేసి, జన్మించిన చోటికే
కొత్తశిశువుగా చేరి అకారణంగానే
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలతో
ఉబ్బితబ్బిబౌతుంటుంది
ఒకే దగ్గరుండి అలసిపోతుంది
కాలం గుండె చప్పుడుల బరువు
మోయలేక విసిగిపోతుంది
పారిపోయేందుకు ప్రయత్నించి
అప్పుడే నడక నేర్చుకుంటున్న
పిల్లాడిలా పడిపోతుంది
తనను చూసేందుకు వచ్చిన వారితో
వెళ్లిపోయేందుకు పరిగెత్తుకుంటూ వస్తే
దారి పొడుగున నత్త గుల్లలు,
శంఖాలు, చిప్పలు, స్టార్ట్ చేపలు,
పఫర్ చేపలు, రంగు రాళ్లు,
పడవ శకలాలు ఇలా ఇంకెన్నో
నడక ఎక్కడికక్కడ ముగిసిపోతుంది
మళ్లీ అక్కడే మొదలవుతుంది
ఇంతకీ ఎవరి బిడ్డ ఈ సముద్రం?!
ఎవరి గర్భం నుండి జన్మించిందో?!
*








Inkevaru ..,, bhoomaata garbham nunchekada!