Womanist – Alice Walker

లింగ వివక్షనీ జాతి వివక్షనీ కలిపి గుర్తించాలనీ ఆ సన్నని పొరని కాన్షియస్ గా గుర్తించకపోతే జరిగే అనర్ధాలని హెచ్చరిస్తుంది ఎలీస్.

“I am an expression of the divine, just like a peach is, just like a fish is. I have a right to be this way…I can’t apologize for that, nor can I change it, nor do I want to… We will never have to be other than who we are in order to be successful…We realize that we are as ourselves unlimited and our experiences valid. It is for the rest of the world to recognize this, if they choose.”

― Alice Walker, The Color Purple

        లీస్ వాకర్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన కొత్తల్లో మనసులో పాతుకుపోయిన వాక్యాలివి. మనల్ని మనలా వుండనివ్వకుండా ఈ ప్రపంచంలో సమస్త శక్తులూ ఎంతగా అన్నా ప్రయత్నించనివ్వండి… “నేను…” అని మనల్ని మనం నిర్వచించుకోవడానికి ఎంత స్థైర్యం వుండాలి! 

ఎలీస్ వాకర్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది ఆమె రాసిన “కలర్ పర్పుల్” నవల. ఈ నవలకి పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది. నల్లవారు అనుభవిస్తున్న హింస, ప్రత్యేకంగా స్త్రీల జీవితాల్లో వేళ్ళూనుకు పోయిన సెక్సువల్ ఎబ్యూజ్ మీద అనేక ప్రశ్నలు లేవెనెత్తి, ఎంతో చర్చకు దారితీసిన పుస్తకం ఇది. 1930 ప్రాంతాల్లో ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీల దుర్భర జీవితాల నేపధ్యంలో రాసిన ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇందులో చిత్రించిన హింస పురుషులను పరమ దుర్మార్గులుగానో లేక పెద్ద జోకర్లగానో చిత్రించిందని విమర్శలు వచ్చాయి. పేదరికం, అభద్రత, చదువు లేకపోవడం, జాతి వివక్ష, పురుషాధిక్యత, ఇన్నింటిని భరిస్తూ, పోరాడుతూ మానవీయవిలువల్ని కాపాడుకుంటూ, ఒక ధ్యేయాన్ని సాధించడం ఎంత కష్టమో, ఆ క్రమంలో పీడితులైన స్త్రీల మధ్య స్నేహం, అనుబంధం ఎలా ఏర్పడి స్థిరపడిపోతాయో , హృద్యంగా కళ్ళముందుంచింది. 

      ఎలీస్ 1944 లో జార్జియాలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు షేర్‌క్రాపర్స్ (భాగస్వామ్య వ్యవసాయం). అసలు ఈ పద్ధతే దారుణమైన అసమానతల్లో ఒకటి. వాళ్ళు పండించిన పంట, అంటే వారి శ్రమ విలువ ఆధారంగా పంటలో వాటా ఎప్పుడూ వుండేది కాదు. ఆ తర్వాత రోజుల్లో ఈ షేర్‌క్రాపర్ పద్ధతి బానిసత్వం కన్నా ఘోరమైనదని దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేసింది.

   ఎనిమిదేళ్ళ వయసులో అనుకోకుండా తమ్ముడి చేతిలో తుపాకీ పేలడం వల్ల ఒక కన్ను కోల్పోయింది ఎలీస్. ఆతర్వాత ఒక వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మచ్చ తను చేయాల్సిన యుద్ధానికి ప్రేరణ అనిపిస్తుందని అంటుంది. (“it is this broken road with pitfalls and sharp turns and unexpected traverses that has brought me joy and adventure. ”).

     స్కాలర్‌షిప్స్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పౌరహక్కుల ఉద్యమంలో పనిచేయడం మొదలు పెట్టాక మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ ని కలిసే అవకాశం రావడం ఆమె జీవితం లో పెద్ద మలుపు. ఆతర్వాత వాషింగ్‌టన్ మార్చ్ లో పాల్గొంది. జ్యూయిష్ న్యాయవాదిని వివాహం చేసుకుని భిన్న జాతి వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు గాను అనేక బెదిరింపులు ఎదుర్కొంది. ఎనిమిదేళ్ళ తర్వాత భర్తతో విడిపోయాక కాలిఫోర్నియాలో స్థిరపడి అక్కడ ఒక పత్రికకి సంపాదకురాలిగా పనిచేసింది. అప్పటిదాకా మరుగున పడివున్న ప్రఖ్యాత ఆఫ్రోఅమెరికన్ రచయిత్రి జోరానీల్ హర్‌స్టన్ జీవితాన్ని, ఆమె రచనల్ని తన వ్యాసాల ద్వారా ప్రపంచానికి తెలియచెప్పింది. 

    ఈ క్రమం అంతా తెలుసుకోవల్సిన అవసరం ఎందుకుందంటే, ఆ తర్వాత ఆమె రచనల్లో ఈ అనుభవాలన్ని ప్రతిఫలిస్తాయి. ఈ అనుభవాలన్నీ రంగరించి ఎన్నో స్ఫూర్తిదాయక వ్యాసాలు నవలలు, కవితలు రాసింది ఎలీస్.

ఆమె మొదటి నవల  The Third Life of Grange Copeland భాగస్వామ్య పద్ధతిలో పనిచేసే నల్లజాతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతుంది. ఈ పద్ధతిలో కేవలం శ్రమ దోపిడీనే కాదు, స్త్రీల పట్ల వివక్ష, వారిపై జరుగుతున్న హింస ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్తుంది. మెరుగైన జీవితం కోసం కుటుంబాన్ని భూమిని వదిలి వెళ్ళిన గ్రేంజ్ -వివక్ష ఒక ఊరుకీ  ఒక వాడకీ పరిమితం అవ్వలేదనీ దేశమంతా వేళ్ళూనుకు పోయిందని తెలుసుకుని కన్నీరు మున్నీరవుతాడు. బతికి బట్టకట్టి తన కుటుంబాన్ని చేరుకుని తమకంటూ ఒక చిన్న ఆశ చూపించే వెలుగుని పట్టుకోవడానికి ఆ కుటుంబం మూడుతరాలు యుద్ధం చేస్తుంది. ఈ నవల్లో అడుగడుగునా ఆమె చిన్నతనంలో చూసిన అనుభవాలు ప్రతిఫలిస్తూ వుంటాయి.

 ఆమె రాసిన అనేకానేక వ్యాసాల్లో చాల ఆలోచన కలిగించే వ్యాసం “In search of our mothers Gardens”. ఆ వ్యాసం ఎంత గొప్పగా వుంటుందంటే అందులో ఏదైనా ఒక కోట్ ని ఇక్కడ ప్రస్తావించాలి అంటే ఏది ఎంచుకోవాలీ అని తడబడేంత గొప్పగా వుంటుంది.

     “మా అమ్మమ్మల కాలంలో ఒక స్త్రీకి ఎంత నైపుణ్యం వున్నా ఏం లాభం? తెల్ల యజమాని కొరడా దెబ్బలకి నలిగిపోవాల్సిందే కదా? డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ వాళ్ళతో పాటు తమ ఆత్మని కూడా అమ్ముకుంటూ బతుకు వెళ్ళమార్చడమే కదా.అసలు దశాబ్దాల తరబడి నల్లజాతి వారు చదువుకోకుండా చేయడం ఎంతటి శిక్షకి అర్హమైన నేరం ? ” అంటుంది. వర్జీనియా వూల్ఫ్ రాసిన “A room of One’s own” వ్యాసాన్ని ప్రస్తావిస్తూ తన తల్లిని తలుచుకుంటుంది.

“For you will find, as women have found through the ages, that changing the world requires a lot of free time. Requires a lot of mobility. Requires money, and, as Virginia Woolf put it so well, a room of one’s own, preferably one with a key and a lock. Which means that women must be prepared to think for themselves, which means, undoubtedly, trouble with boyfriends, lovers, and husbands, which means all kinds of heartache and misery, and times when you will wonder if independence, freedom of thought, or your own work is worth it all. We must believe that it is. For the world is not good enough; we must make it better.”

    “మేం వేసుకునే బట్టలు కుట్టి, మా పక్క దుప్పట్లు, తువాళ్ళు తయారు చేసేది మా అమ్మ. పాతబట్టల్ని పోగుచేసి చలికాలంలో కప్పుకునే బొంతల్ని తయారుచేసేది. ఇవి కాక పొలంలో మా నాన్నతో సమానంగా పనిచేసేది. తెల్లవారక ముందు మొదలైన ఆమె పని, సగం రాత్రి అయినా ముగిసేది కాదు. ఒక్క నిముషం తీరిగ్గా కూర్చుని తన గురించి పట్టించుకునే వెసులుబాటే మా అమ్మకి లేనప్పుడు తన సృజనాత్మక శక్తిని నిలబెట్టుకునే అవకాశం ఎక్కడుంటుంది?” అని వాపోతుంది ఏలీస్. 

   ఎలీస్ రచనల్లో గొప్పగా అనిపించేది ఏంటంటే ఆమె కథానాయికలంతా ఎంత హింసకి, వివక్షకీ గురైనా చాలా ధైర్యంగా మార్పుకి ప్రతీకల్లా వుంటారు. కలర్ పర్పుల్ లో సెలే, ది థర్డ్ లైఫ్ ఆఫ్ గ్రేంజ్ కోప్‌లాండ్ లో నాయనమ్మ, మెరీడియన్ నవల్లో కాలేజీ పిల్ల, బై ది లైట్ ఆఫ్ మై ఫాదర్స్ స్మైల్ లో సుసన్నా, మాగ్దలీనా.. ఇలా అందరూ ఎవరికి వాళ్ళే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మెరిసిపోతూ వుంటారు.

    నవలలూ, వ్యాసాలూ ఒకెత్తు అయితే ఆమె కవిత్వం అద్భుతంగా వుంటుంది. 

“వాళ్ళు నీ తల్లిని హింసించినప్పుడు 

ఒక మొక్కని నాటు.

నీ తండ్రిని హింసించినప్పుడూ,

నీ చెల్లినీ, తమ్ముడ్నీ హింసించినప్పుడూ,

మీ నాయకుల్నీ అభిమానుల్నీ హింసించినప్పుడు కూడా 

నువ్వు మొక్కల్ని నాటుతూ పో, 

నిన్ను మాట్లాడమని తీవ్రంగా హింసించినప్పుడు కూడా 

ఒక మొక్కని నాటు.

కానీ,

వాళ్ళు నువు నాటిన మొక్కని హింసించి, 

నీ అడవిని నరికేయాలని చూస్తే మాత్రం 

మరొక యుద్ధానికి పూనుకున్నట్లే, 

ఆ యుద్ధానికి నిన్ను సన్నద్ధం చేసినట్లే”

 

(When they torture your mother

plant a tree

When they torture your father

plant a tree

When they torture your brother

and your sister

plant a tree

When they assassinate

your leaders

and lovers

plant a tree

Whey they torture you

too bad

to talk

plant a tree.

When they begin to torture

the trees

and cut down the forest

they have made

start another.)

    ఒకానొక సందర్భంలో ఆమె ప్రయోగించిన Womanism అన్న పదం ఆ తర్వాత ఎన్నో ఆలోచనలకి దారితీసింది. లింగ వివక్షనీ జాతి వివక్షనీ కలిపి గుర్తించాలనీ ఆ సన్నని పొరని కాన్షియస్ గా గుర్తించకపోతే జరిగే అనర్ధాలని హెచ్చరిస్తుంది ఎలీస్. ఫెమినిస్ట్ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వాఖ్య “Womanist is to feminist as purple is to lavender,” చాలా ప్రసిద్ధి.

ఎలీస్ ఎంత విస్తృతంగా ఎంత లోతైన రచనలు చేసిందంటే ఆమె రచనలు అన్నీ ఒకచోట  చర్చించడం అసాధ్యం. సాహిత్యంలో ఆమె స్పృశించని సమకాలీన అంశం లేదు. అన్నిటికన్నా ఆమె రచనల్లో బాగా నచ్చే అంశం తమ జీవితాల్లోని హింసని ఎంతగా రాసినా, అంతే ప్రతిభావంతంగా వాటికి తనదైన రీతిలో పరిష్కారాలు చూపుతుంది.  ఆమె పోరాట పటిమ, జీవన వాత్సల్యం, శాంతియుత జీవితం పై ఆపేక్ష … ఇవన్నీ అందరికీ స్ఫూర్తిదాయకాలు.

*

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉమా….
    బాగా రాశారు. Alice Walker ఆత్మని పట్టిచ్చే ఆమె కోట్ తో ఈ రచనని మొదలెట్టడం చాలా బాగుంది.
    తెలిసిన వారికి సరే, Alice గురించి తెలియని వారికి, ఇప్పుడే తెలుసుకుంటున్న వారి సౌలభ్యం కోసం:
    “I am a Renegade,an Outlaw, a Pagan” అని ఎలిస్ వాకర్ తన గురించి చెప్పుకుంటూ, అమెరికన్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ ఆమీ గుడ్మన్ తో చేసిన సంభాషణ ‘Democracy Now’ ద్వారా 2006 ఫిబ్రవరిలో ప్రసారమైంది. దానినే “Outlaw, Renegade, Rebel, Pagan”: Interview with Amy Goodman from Democracy Now (2006) గా “The World Has Changed” సంకలనంలో చేర్చారు. The World Has Changed- Alice Walker ఇంటర్వ్యూల సంకలనం.
    ఒక పీచ్ పండు లాగా, ఒక చేప పిల్ల వలెనే తాను కూడా దైవికమైన ఒక వ్యక్తీకరణని… (I am an expression of the divine, just like a peach is, just like a fish is) అంటూ Alice తన గురించి చెప్పుకోవడానికి దారితీసిన ప్రశ్న ఇది –
    Amy Goodman:
    The questions that were raised-here you had written it, deeply out of your own experience, then having a white producer produce it and going on to Broadway, well, that’s just repeated over and over. What were your thoughts of having your experience, your writing, your art, channelled through them?
    ఇది Alice Walker జవాబు :
    Well, I have fallen in love with the imagination. And if you fall in love with the imagination, you understand that it is a free spirit. It will go anywhere, do anything. So your job is to find trustworthy companions and co-creators. That’s really it. And if you find them-and I don’t know how you do, I can only go by how I feel about people.
    And so with the play, this young man, Scott Sanders, who is the primary producer, went to great lengths to woo me, because I was not interested in doing a musical, partly because of the suffering that had occurred after making the film. There was so much incredible controversy after the film, and a lot of it excruciatingly hurtful. And even though I had ways to buffer myself, and even though by nature I can continue to function and do things that I need to do, it was still very painful. So I didn’t really want to go back to that….
    That anybody reading ‘The Color Purple’ or seeing the film, actually, that they could read it and see the film and still think that I hated … my father, my grandfather, my brothers, my uncles, just because they were black men-and, you know, this would mean that I hated Langston Hughes or Jean Toomer or Richard Wright or Ralph Ellison or-it felt so incredibly mean. It felt very mean, it felt very small, and it was very painful.
    A.G.: And so how did you get through it?
    A.W.: Well, I came down with Lyme disease in the middle of all of this, and I experienced it actually as a spiritual transformation, even though I didn’t know that was going to be the result. It was very frightening. But I came out the other end of the bashing that I had received, the physical debilitation from Lyme disease, the breakup of my relationship with a partner at the time. I came out of all of that with a renewed sense that life itself, no matter what people are slinging at you, no matter what is happening, life itself is incredibly precious and wonderful, and that we are so lucky that we wake up in the morning, that we hear a bird, that we…
    You know, just if you think about little things, they seem little, but they are so magical, you know, like eating a peach. I came through that period understanding that I am an expression of the divine, just like a peach is, just like a fish is. I have a right to be this way. And being this way, ‘The Color Purple’ is the kind of work that comes to me. I can’t apologize for that, nor can I change it, nor do I want to.
    So there was this marvellous feeling, you know, that I had already been through a kind of crucifixion by critics…. And not to compare myself with Jesus, but I really got it, that there is a point at which a certain kind of crucifixion leads to a certain kind of freedom, because you cannot be contained by other people’s opinions of you. You will always, I think, after you go through this kind of thing, feel somewhat removed, as I do. You know, I basically stopped reading reviews. And it’s fine. I have realized I don’t need them. I really feel that if more people could pay less attention to other people’s opinions of them, they would be so much happier.
    ** **
    థ్యాంక్యూ ఉమా, Alice Walker ని చేరువ చేశారు.

  • ఎలీస్ వాకర్ గురించి నాకు తెలియదు. మంచి పరిచయ వ్యాసం ఉమ గారూ.

  • చాలా ఆలోచనాత్మకంగా ఉంది మీ విశ్లేషణ. ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు