ఆటా నవలల పోటీ ఫలితాలు

మెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీకి ఈసారి కూడా పెద్ద సంఖ్యలో నవలలు వచ్చాయి. ప్రముఖులతో పాటు కొత్త తరం రచయితలు కూడా ఆసక్తితో పోటీలో పాల్గొన్నారు. తుది జాబితాకి చేరుకున్న పది నవలల్లో ఈ ఏడాది అనేక పరిశీలనలూ, వడపోతల అనంతరం న్యాయనిర్ణేతల సూచనల మేరకు ఎంపికైన శ్రీ ఉణుదుర్తి సుధాకర్ రచించిన “చెదరిన పాదముద్రలు” నవలకి లక్ష రూపాయిలు బహుమతిగా ఇవ్వాలని ఆటా కార్యవర్గం నిర్ణయించింది.

బహుమతికి సరితూగే రెండవ నవల లేకపోవడం వలన ప్రకటించిన రెండు లక్షల రూపాయల నగదులో ఈసారి లక్ష రూపాయలు నవలకి, మిగతా లక్ష రూపాయలు ఆటా ప్రచురణల విస్తరణకి వినియోగించాలని నిర్ణయించాము. ఆటా ప్రచురణల విస్తరణకి సంబంధించిన ఆ ప్రాజెక్టు వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాము.

బహుమతి పొందిన ఈ నవలని ఆటా త్వరలోనే ప్రచురిస్తుంది.

ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ పోటీ నిర్వహణలో మాకు సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నారాయణ స్వామి శంకగిరి, శివ సోమయాజుల, సాయి బ్రహ్మానందం గొర్తి, పద్మవల్లి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు.

మధు బొమ్మినేని (ఆటా ప్రెసిడెంట్)
రవి వీరెల్లి (ఆటా ప్రచురణల కమీటీ)

రవి వీరెల్లి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Iam very proud that my brother’s novel selected for ATA. Yes there is no doubt he is very well writer. Before he starts writing, he thoroughly observes ,analyse the situations and present situations. He trys to reach the situations in readers mind and hearts. Once again congratulations to my brother Sudhakar.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు