అశేష జనం భావన
పెనం నుంచి పొయ్యిలో పడ్డామో
ప్రజాస్వామ్యం పేరా రాజ్యం అహంభావం
పెనం నుంచి ఆహారంగా మల్చబడ్డామో
రూమిటోపి పోయి గాంధీ టోపీలు
అలచివేత స్థానంమే కాదు
తన పేరూ మార్చుకుంది
తోడు వెంట పార్లమెంటును
చట్టబద్ధతను తెచ్చుకుంది
రెండు
మోచేతికి బెల్లం పెట్టి నాకమంటుంది
నోరూరంగా చొంగ కారంగా
మాటలు అందంగానే ఉ
కానీ మర్మమంతా ఒక్కటే
సమాజమంతా
నిరసనలు ఊరేగింపులు ధర్నాలు
రంగు వెలసిన జెండాలు
ప్రజలు లేని ఎజెండాలు
పాము తన కుబుసం విడిచినట్టు
మోసం అనేకానేక రూపాలు
మూడు
తంతే లేవనోడు
గోకితే లేస్తాడా
ఒకడు విమోచన అంటాడు
మరొకడు విముక్తి అంటాడు
ఇంకొకడు విద్రోహం అంటాడు
చెక్కరి పూత వజ్రోత్సవ
కారు చేదు మాత్రలు నోరూరిస్తుంటాయి
ఏది ఏమైనా
పేరు ఏదైనా
పులి ఆవు చర్మం కప్పుకున్నట్టు
ఎటు చూస్తే అటు
సాధు జంతువుల్లా
ఊసరవెల్లుల కండువాల కాలం
ఒక విలోమ విద్రోహ కాలం నడుస్తుంది
అయ్యా బాంచన్ దొరా నుంచి
బాంచని కాళ్ళు మొక్కుతా నుంచి
అందమైన పరివర్తన
అన్నా తమ్మీ అక్క చెల్లీ
కొమ్మ మీది కాకి నోటా మాంసం ముక్క
నమ్మ బలుకుతున్న జిత్తుల మారి నక్క
నోరు తెరిస్తే ఒకటి
తెరవకుంటే మరొకటి
ఓటు నోటు తిని మద్యం తాగి
నీటి మీది బోటులా ఊగుతుంది.
*
చిత్రం: తిలక్
కొమ్మ మీది కాకి నోటా మాంసం ముక్క