సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
2019 సంచికలుతరంగసంచిక: 15 జూన్ 2019

ఫిఫ్టీ – ఫిఫ్టీ 

శ్రీరామ్ పుప్పాల

ఆడా మగా సగం సగమే 

కానీ చెరిసగాలన్నీ ఒక సంపూర్ణం కానే కావు 

 

ఒక్కోసారి రాత్రి పొడుగ్గా ఆమె.

చాలాసార్లు పట్ట పగలే కురచగా నేను…

 

ముక్కలవుతున్న అద్దంలాంటి రేపవళ్ళలో 

మా ఇద్దరి ప్రతిబింబాలన్నీ రోజూ 

సగం సగమే అతుక్కుంటున్నట్టు కనిపిస్తాయి.

 

పుస్తకాల సంచీతో బడి దగ్గరో, బర్రెలు గాస్తూనో 

దేవుడిచే పాడుబడ్డ గుడి దగ్గరో, 

ఆవిడే పిల్లల్నాడిస్తోంటేనో 

పెదవుల్తో, చూపుల్తో, మురికి చేతివేళ్ళతో 

ఎప్పుడూ ఏదో ఒక సాకుతో తాకుతో 

దీపప్పురుగు చుట్టూ రాత్రి రెక్కలు కాల్చుకుంటోంటే 

ఆమె అంతరార్ధం లోపలా బయటా 

నాలో సగం, కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతుంది.

 

ఒక సగం వినా ఇంకో సగమేదన్నా అసత్యమే గానీ 

ఇన్నాళ్ళూ నేనే వృత్తాన్ని పూర్తిచేయ గలననుకున్నాను 

ఇప్పుడిక నాడీకణ దేహపు అంచుల చివర 

ఒకర్నొకరం అరహస్యంగా మళ్ళీ కౌగిలించుకోవాలి 

 

బావిలో కప్పల్లాంటి మోహాల్ని, జన్మాంతర వియోగాల్ని 

వెంటేసుకుని, ఉండజుట్టుకుని, ఎక్కడివాణ్ణో 

ఒక ఆకలి తప్ప వేరే రుచేమీ తెలీకుండా 

కేవలం శరీరం మాగన్నులోని చీకటిలా ఒత్తిగిలి వుంటే 

ఎంగిలి నవ్వుల్ని శుభ్రంగా తోమి 

ఒలికిన సమ్యోగ కలల స్కలనాల్ని ఉతికారేసి 

వంటగదుల్నీ, పడకపాన్పుల్నీ అలసిపోకుండా 

కీకారణ్యంలోకి పిట్టల్ని చేసి స్వేచ్చగా ఎగరేస్తుంది.

 

అసలు ఆమె సగమే 

నా భయద రెక్కలు విప్పార్చే జ్ఞాన విముక్త నేత్రం 

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

View all posts
సమాధుల తోట
ఆక్సిజన్‌

5 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Giriprasad Chelamallu says:
    June 14, 2019 at 9:01 am

    Excellent. Sagam sagam okkataithe?!
    Gnaana vimuktha netram prayogam bavundi.
    Baavilo kappalanti mohaala?!
    Sir totally appreciable

    Reply
  • Sailaja Kallakuri says:
    June 14, 2019 at 4:52 pm

    దేవుడి చే పాడుబడ్డ గుడి…. కఠినంగా ఉంది అందుకోవడం… అంతరార్ధమో, నిబిడీకృతమైన భావమో… మిగిలినదంతా అత్యంత ప్రమాణికమైన సత్యాలకు అతి సుందర పదబంధాలు… వావ్..!

    Reply
  • Telugu venkatesh says:
    June 14, 2019 at 9:27 pm

    చాలా బాగా రాశారు….👌

    Reply
  • దోర్నా దుల సిద్ధార్థ says:
    June 15, 2019 at 4:06 am

    చెరి సగాలన్ని సంపూర్ణం కావు అన్న మాట చాలా లోతైన భావన
    మళ్లీ శ్రీరామ్ గారు కొత్త పదం వాడారు గమనించారా
    అరహస్యం
    చాలా బాగుంది

    Reply
  • లావణ్యసైదీశ్వర్ says:
    July 15, 2019 at 9:40 am

    Excellent

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

ముస్లింవాద సాహిత్య లక్ష్యం ఇప్పుడేమిటి ?

దాదా హయాత్

చాసో ‘ఏలూరెళ్లాలి’ – ఒక సంక్లిష్ట కథ

బాలాజీ పోతుల

మనస్సంచీ

పాణిని జన్నాభట్ల

కాలం గడిచేకొద్దీ కొత్తగా అర్థమయ్యే కథ

విశీ

మంటో కథ: అవమానం

శ్రీనివాస్ గౌడ్

మళ్ళా మనం జెండా పట్టాల్సిందే  

కె.పి.లక్ష్మీనరసింహ
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు