We Must Hide Our Heads

Siddhardha Katta hails from Narasaraopeta in Guntur District. After finishing his B.Tech, he is now employed as a journalist in Hyderabad. He has been writing poetry for the last 4 to 5 years and about 2 years ago has published a book of poetry called ‘Oka..’ under the banner of SahithiSravanthi. 

1.
no matter which direction the Wind blows
it always tracks the whereabouts of the forest
like us, Nature does not lie
after all has become parched and skeletal
there will be no god left to lament to
the Forest is the only god

 

2.
those proud of your ancestry, remember
not your own blood,
a child will be born bloodless
who doesn’t even have a life to ask
whose curse is that!

  1. you may have your expectations
    you might overcome every obstacle
    but when the Forest perishes
    the Sun shall finally set into the arena on behalf of us all
  2. we can presume that we may never talk to each other
    but Water shall always remain cohesive
    once hit with the wave of a Tsunami,
    there will be no one left to exchange words with

we can do everything in our power
we can make everyone cease to speak
but the Earth and the Sky shall still converse
hand in hand, exchanging vows
long before man came into existence
the Wind already knew how to whirl

  1. to remain calm in the face of adversities
    the Trees are not human
    but the Earth threatens till date
    at the mere snap of its fingers

lush green canopy of Trees, when uprooted
the Earth shall loom upon us in its wrath
with the heads of tens and thousands of tigers

6.
after all
there must be some shame left
there must be a few words left to justify

the blanket of civilisation carefully wrapped by those
over the naked Earth
you want them to get out?
alright

those who let us borrow their tongue
those who you call names in the same tongue
you want to feast on them?
that too, is alright

now, remember

when ‘once upon a time…’ ceases to exist
make sure you hide your face in the clothes
of the only living Chenchu boy spared alive

7.
lastly, as it must already be known,
man and the Forest beat with the same heart
the death of the Forest, will be the death of man

if you find yourself dubious still,
hold a mirror up to the Forest
if you don’t see a man in its reflection,
let us talk again

 

తలలు దాచుకోవాలి

 

1.

ఏ వైపు నుంచి వీస్తోన్న గాలైనా

అడవిని ఆరా తీసే వస్తుంది

మనుషుల్లా ప్రకృతి అబద్ధం చెప్పదు

అంతా చిక్కి శల్యమైపోయాక

మొరపెట్టుకోడానికి ఏ దేవుడూ ఉండడు

అడవే దేవుడు

2.

వారసత్వాలను తలచి మురుస్తోన్న వాళ్ళారా గుర్తుపెట్టుకోండి

మీ రక్తమే కాదు,

అసలు రక్తమే లేకుండా ఒక శిశువు పుడతాడు

ఆ పాపం ఎవరిదో అడిగేందుకు వాడికి ప్రాణం ఉండదు

3.

మీ అంచనాలు మీకుండొచ్చు

ఎవరడ్డమొచ్చినా తొలగించుకోవచ్చు

అడవి అంతరించాక

అందరి తరపునా బరిలోకి సూర్యుడు దిగుతాడు

4.

మనుషులూమనుషులూ మాట్లాడుకోరని మీ నమ్మకం కావొచ్చు

నీళ్ళూనీళ్ళూ కూడబలుక్కుంటాయి

వచ్చింది సునామీనే అని చెప్పుకోడానికి ఏ ఒక్కడూ మిగలడు

 

మీకు చేతనైంది చేసి

అందరి నోళ్ళనూ మూపించొచ్చు

నేలా, ఆకాశమూ మాట్లాడుకుంటాయి

చేతిలో చెయ్యి పెట్టి ప్రమాణం చేసుకుంటాయి

మనిషికి పుటక అబ్బకముందే

గాలికి సుడులు పుట్టించడం తెల్సు

5.

కడుపుకొట్టినా నిమ్మలంగా ఉండేందుకు

చెట్లేమీ మనుషులు కాదు

ఇప్పటి దాకా

నేల చిటికె వేసి బెదిరించిందంతే

 

ఆకుపచ్చని భూమితలను తెంపుకుపోయారో…

మీద పడబోయే నేలకు పదివేల పులుల తలలు

6.

అయినా

ఏ కొంచమైనా సిగ్గుండాలి

సంజాయిషీ ఇచ్చుకోడానికైనా నాలుగు మాటలుండాలి

 

లోకం బోసిముడ్డి మీద

నాగరికత గుడ్డను కప్పిన జాతిని

తరిమి కొడతారా… సరే

 

భాషను భిక్షగా వేసిన జాతుల్ని

ఏదో ఒకపేరుతో

నంజుకు తింటారా… అదీ సరే

అయితే… జ్ఞాపకముంచుకోండి

 

అనగనగా మాట్లాడే తీరాల్సినప్పుడు

బతికి బయటపడ్డ ఓ ఆఖరి చెంచు పిల్లవాడి

గోచీలో తలలు దాచుకోవాలి

7.

చివరిగా అందరికీ తెల్సిందే చెప్తున్నాను

అడవికీ, మనిషికీ రెండు వేరువేరు గుండెల్లేవు

అడవే పోతే మనిషీ పోతాడు

 

ఏ మాత్రం అనుమానం ఉన్నా…

అడవి ముందు అద్దాన్ని నిలబెట్టండి

మనిషి కనపడకపోతే

 

మళ్లీ మాట్లాడుకుందాం …

 The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.

 

Maithri

I'm a 20 year-old Literature student on the verge of tasting what life has to offer. Curious lover of finding stories in almost anything and everything.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది. అనువాదం కూడా.. ❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు