“For I do not exist: there exist but the thousands of mirrors that reflect me. With every acquaintance I make, the population of phantoms resembling me increases. Somewhere they live, somewhere they multiply. I alone do not exist.”
― Vladimir Nabokov
“I felt her absence. it was like waking up one day with no teeth in your mouth. you wouldn’t need to run to the mirror to know they were gone”
― James Dashner, The Scorch Trials
“I often stood in front of the mirror alone, wondering how ugly a person could get.”
― Charles Bukowski, Ham on Rye
***
ఎలా మొదలు పెడదాం ఈ చాప్టర్ ని? Of course, ఇది ఎస్తర్ గురించి అయినప్పటికీ తనతోనే మొదలు పెట్టాలి అని నియమం ఏదీ లేదు. నిజానికి you wanted to ask her: ‘I want to write about you. What should I write? How should I begin? Because this is your story, because this is about you – it would be only appropriate that I should know it from you. In first hand. What to write and how to write! I mean what are the things that you allow me to include in this story of yours … which is also mine! Can I say ‘everything’? Am I allowed to say everything or do you want me to leave out a few things that you may not feel comfortable now? (Even though I don’t know with certainty if you were comfortable with those ‘few things’ back then) But even then, how can one be so sure that one is recounting exactly the same incidents in the same way that one has experienced ‘then’? Is it even possible? నువ్వు ఎవరి గురించైనా గుర్తు తెచ్చుకుని మాట్లాడాలి అంటే ఆ గుర్తుకు ఉన్నవీ వచ్చేవి ఏమిటి? వాళ్ళతో నువ్వు గడిపిన ప్రతి క్షణం … ఆ ప్రతి క్షణంలో నీ మానసిక స్థితీ, మీ ఇద్దరి మధ్యా ఆ ప్రతి క్షణంలో transpire అయ్యినది ఏమిటి? మీ ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణలలో నువ్వు విన్నది ఏమిటి? అర్థం చేసుకున్నది ఏమిటి? అవతలి వాళ్ళు ఉద్దేశించిన అర్థంతోనే నీకు అన్నీ అర్థం అయ్యాయా? లేక అర్థంలోకి మారకుండా అవి ఒట్టి శబ్దాలుగానే మిగిలి పోయాయా? ఆ శబ్ధాలలో నువ్వు నీ అర్థాన్ని నింపుకుని అవతలి వాళ్ళని అర్థం చేసుకున్నావు అని అనుకున్నావా? భ్రమపడ్డావా? ఈ అర్థం ఎట్లా నిర్మితం అవుతుంది? ఆ నిర్మాణం ఎవరిది? నీదా? తనదా?ఇరువురిదా? లేక అనేకులదా? సంభాషణలూ శబ్దాలూ సరే … ఇద్దరి మధ్యా అనేకమార్లు పేరుకున్న నిశ్శబ్దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకుకోవడమంటేనే శబ్దంగా మార్చడం … నిశ్శబ్దాన్ని శబ్దంలోకి మార్చాక ఇక అది నిశ్శబ్దం ఎలా అవుతుంది? You wonder …నీకు తెలియదు. అనేక విషయాల లాగే … you cannot comprehend … ఎస్తర్ లాగానే!
నువ్వు తన గురించి రాద్దామని అనుకున్నప్పుడు, ఏం గుర్తుకు వచ్చాయి నీకు? నువ్వు వెనక్కు వెళ్లి ఆ కాలాలని గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తావు. ఎదురీత అది! Very slippery business అది. ఈ గుర్తుకు తెచ్చుకోవడం అనేది … పేరు తప్ప పెద్దగా నీకేమీ గుర్తు లేదు ఇప్పుడు. నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది ఎలా సాధ్యం? నీ జీవితంలో అతి ముఖ్యమైన వాళ్ళు అని నువ్వు ఎవరి గురించి అయితే అనుకున్నావో, వాళ్ళ గురించి తలుచుకుందామంటే ఏవో చెదురు మదురు ఘటనలు తప్ప ఏమీ లేకపోవడం నిన్ను విస్మయానికి గురి చేసింది! ఎందుకు ఇలా? నువ్వు ఆలోచించడానికి ప్రయత్నిస్తావు కానీ your mind refuses to think … ఎట్లా అంటే ఆ గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఏదైతే ఉందొఉందో అది …. as if it is a threat to this mind, as if the very existence of your mind is threatened by that act of remembering! ఇది కూడా నిజం కాదు! ఎప్పుడో ఎక్కడో నువ్వు చదివినవీ విన్నవీ అన్నీనూ ఇప్పుడు వివిధ రకాల permutations and combinations of words లాగా flash అవుతున్నవి. అంతే! అందరూ ఉన్నది అది అని అంటున్నారు కాబట్టి mind అని నువ్వు అంటున్నావు. ఆ పదాన్ని నువ్వు వాడుతున్నావు కానీ నిజానికి అది ఉందో లేదో ఉంటే అది ఏమిటో నీకు అస్సలు తెలియదు. సరే let us not divert our attention … నువ్వు తన గురించి లేక తనతో ముడిపడిన నీ సమయాల గురించి చెబుదామని అనుకున్నావు కాబట్టి , we must insist him: ‘him’ who writes this or that ‘him’ who is actually created by this writing!
***
ఏదో అవుతుంది నీలో. నువ్వు దానిని పిన్ పాయింట్ చేయలేవు. ఎంతో కాలంగా జరుగుతున్నదేదో పతాక స్థాయికి చేరుకుని ఇక నువ్వు ఏమాత్రం దానిని ఆపలేని స్థితి. ఏం జరుగుతుందో నీలో నువ్వు చెప్పలేవు. exact గా. నువ్వు చేయగలిగినదల్లా చందమామని చూయించే వేలులాగా కొన్ని పదాలతో సూచించే ప్రయత్నం చేయగలవు. అవి ఈ పదాలు: దిగులు (వంటిది). తపన (వంటిది). Something very essential, that which makes one human and be at home వంటి దానిని కోల్పోయినతనం. ఇంతకు మునుపే చెప్పినట్టు out of place (దీనికి చాలా దగ్గర). ఇక్కడ కాదు మరెక్కడో నువ్వు ఉండవలసింది (ఇదేనా?) అనే చాలా ఘాఢమైన urge. (ఆ మరెక్కడో నీకు తెలియదు: ఇప్పటికీ). అస్థిమితం. Neither joy nor sorrow. Neither happy nor unhappy. Gloomy – all the time. (ఎందుకు?). Anguish. Agony. Melancholic. నీది కాని స్థలంలో కాలంలో ఇరుక్కుపోయి గింజులాట. (‘తెల్లని ఊబి’ అని నువ్వు డైరీ లో రాసుకున్నావు). బహుశా నువ్వు కూడా నీకు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో ఉన్నట్టు ఉన్నావు. ఆ టైంలోని డైరీ ఎంట్రీస్ చూస్తున్నప్పుడు ఇవే పదాలు పదే పదే కనిపిస్తాయి నీకు: ‘ఏం జరుగుతుంది నాకు?’ ‘ఎందుకీ దిగులు?’ ‘ఎందుకీ స్ట్రాంగ్ సెన్స్ అఫ్ అవుట్ అఫ్ ప్లేస్?’ ‘ఏం కావాలి నీకు ఇంతకీ జీవితంలో?’ ‘ఎందుకు నీ పట్టించుకోనితనంతో వాళ్ళని హర్ట్ చేస్తావు?’ ‘is this a strong desire to die?’ ‘ఏం కావాలి వీళ్ళకి నా నుంచి? ‘Why can’t they leave me alone?’ ‘This is not even a desire to die. అంతకు మించినది ఏదో. రూపరహితంగా మారి తుంపులు తుంపులుగా నలుదిశలా కొట్టుకుపోవాలి … become formless and disappear into the air’. ‘ఖాళీ’. ‘చెప్పడానికి ఏమీ లేదు’. ‘వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి’. ఇవే, ఇలాంటి shade ఉన్న phrases అప్పటి నీ డైరీ ఎంట్రీస్ లో! (like a blade in the throat నువ్వు రాసుకున్నావు అప్పటి స్థితి గురించి). ఇది కాక, ఒక constant feeling of Deja vu … నువ్వు ‘బ్రతుకుతున్న’ ఈ జీవితం అంతా ముందే జీవించినట్టు, ఆ క్రమాన్ని తప్పించుకునే దారి లేదన్నట్టు ఇంకా as if you can do nothing about it and it has to repeat again and again and again …
ఉదయం లేస్తే drowsiness. ‘huge weight in the head …’ అని రాసుకున్నావు నువ్వు దాని గురించి అని నీ డైరీ చెబుతుంది. ‘like a soaked sponge’, ‘as if bands of cloths twisted and tightened’ – ఆ దినాల గురించి ఇలా కూడా రాసుకున్నావు నువ్వు అని అదే డైరీ చెబుతుంది. తలుపు తెరిస్తే లోపలికి వచ్చే వెలుతురులో కదిలే సూక్షమైన రేణువులు. ఆ వెలుతురు – నువ్వు దానికి ఏమీ ఆపాదించకపోతే – తటస్థంగా ఉండేదేమో. కానీ అది అసాధ్యం. ఆ దినాలలో వెలుతురు దేనితోనో నిండి ఉండేది. తేలికగా, మరి అదే సమయంలో దేనితోనో నిండి బరువుగా! weightless weight … ఆ వెలుతురు కదులుతూ ఉండేది … there is no particular direction … కానీ ఆ వెలుతురులో కదలిక ఉన్నట్టు నీకు స్పష్టంగా తెలిసేది. ఇక ఆ ఉదయాలు నువ్వు తలుపు తెరిచి నీ గది బయట గోడకు ఆనించిన కుర్చీలో కూర్చుంటే వీచే గాలి కూడా అంతే. అది కూడా దేనితోనే నిండి ఉండేది. నీ హృదయంలో ఒక బాకు దిగబడిన అనుభూతి … pangs నీలో … అలలు అలలుగా. ఏదో నీలోపల ‘నువ్వు’ అయిన దానినేదో బిగించి పట్టుకున్నట్టు … దానిని వదులుకోడానికి ‘నువ్వు’ గింజుకునీ గింజుకునీ ఏం చేయాలో తెలియక నీ శక్తిని అంతా కోల్పోయి (drained of energy అని రాసుకున్నావు) ఒక ముద్దలాగా అక్కడే ఆ కుర్చీలో అనేకసార్లు … నీ ఎదురుగా అశోకా చెట్టు … వెనుకగా పచ్చిక … గాలి వీచి ఆ మంద్రమైన వెలుతురులోవాటి కదలికలకు నీకు మాటలు దొరికేవి కాదు. గాలి పెద్దగా వీచి, ఎండిన అశోకా ఆకులు రెండు మూడు రాలిపడటం … as if in slow motion … ప్రతిదీ స్పష్టంగా … you could trace every movement of those falling leaves … as if they were completely slowed down … నువ్వు వాటిని ఆ slowed down motion లో చూసేవాడివి … even ‘time’ slowed down … sometimes it froze … రాలుతూ మధ్యలో ఆకులు ఆగిపోయేవి …. క్షణకాలమో లేక అనంత కాలమో అవి అట్లా గాలిలో ఆగిపోయేవి … తిరిగి గాలి గట్టిగా వీచి నీ ఎదురుగా పచ్చిక పొరలు పొరలుగా కదిలేదాకా! నీకు అవన్నీ వినపడేవి … ఆ శబ్దం … ఆ కాంతి … ఆ గాలి … ఆ తరువాత ఉన్నట్టుండి నీకు ఏమీ తెలిసేది కాదు, మెస్ నుంచి ఏడింటికి పెద్ద mugలో టీ తీసుకుని ఎస్తర్ వచ్చి నీ భుజం కుదిపి నిన్ను పలకరించేదాకా!
***
రెండుసార్లు మాత్రమే ఎస్తర్ నీ తల్లిని కలిసింది. ఒకసారి నువ్వు తీసుకు వెళ్ళావు, మరోసారి తనే వచ్చింది. నువ్వు మొదటసారి తనని నీ తల్లి వద్దకు తీసుకు వెళ్లిన రోజు బుధవారం. బహుశా మధ్యాహం పన్నెండు గంటలు అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు నీకు ఆ సమయం సరిగ్గా గుర్తు లేదు. నీకు గుర్తుకు ఉన్నదల్లా తనని నీ బండిపై పిక్ అప్ చేసుకుని యూనివర్సిటీ నుంచి నీ తల్లి పని చేసే ఆఫీసుకు తీసుకు వెళ్లడం. ఆ రోజు ఉదయం నీకు ఎవరో చెప్పారు తను తన thesis సబ్మిట్ చేయడానికి గుంటూర్ నుంచి వచ్చింది అని. ఆ మాట వినగానే నీకు ఏం చేయాలో తోచలేదు. How does one react to it? Apart from the expected reaction, do you have a reaction of your own as such? నువ్వు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నావు కానీ సరిగ్గా ఆ క్షణాన నీ ప్రతిస్పందన ఏమిటి అన్నది సందేహాస్పదం. It is contestable, నీ రియాక్షన్. దుఃఖం కలిగిందా నీకు అప్పుడు? బాధ కలిగిందా నీకు అప్పుడు? ఎక్కడో ఏదో తవ్వుకుపోయినట్టు అయ్యి ఏదో నీలోపల చెక్కుకుపోయిందా అప్పుడు? Did your heart skip a beat? నువ్వు సరిగ్గా అప్పుడు ఎలా అనుభూతి చెందావు? ఎవరో నీలోపల violent గా మేల్కొన్నారా? గొప్ప ప్రతీకార వాంఛతో? ఇతరుల పట్ల కాదు, నీ పట్ల నువ్వే పగ తీర్చుకునేందుకు? ఇప్పుడు అవేమీ నీకు సరిగ్గా గుర్తు లేవు. నువ్వు జ్ఞాపకాలని నమ్మలేవు. You cannot trust memories. ఎలా నమ్మగలవు? How can you trust something that does not exist? నువ్వు ఇప్పుడు ఎంత గింజుకున్నా నీకు తన ముఖం అస్సలు గుర్తుకు రాదు. ఒక్క పేరు తప్ప. ఆ నామ శబ్దం తప్ప. ఆ పేరుతో associate అయి ఉన్న జరిగిపోయిన ఘటనలు తప్ప నీకు ఏమీ గుర్తుకు రావు. నీకు ఇప్పుడు మిగిలినదల్లా ఒక పేరు. నువ్వు దానిని ఎన్ని సార్లన్నా మననం చేసుకో ఆ పేరుతో ఉన్న ముఖాన్ని గుర్తు తెచ్చుకునేందుకు … ఏదీ రాదు. So strange …. ఏదైతే ముఖ్యం అని నువ్వు అనుకున్నావో ఏదైతే నీ జీవిత గతిని మార్చింది అని అనుకున్నావో దానికి ఒక రూపం మిగలకపోవడం ఏమిటి? నిన్ను నియంత్రించే జ్ఞాపకం …. ఒక శబ్దంగా పదంగా తప్ప దానికి సారాంశం ఏమీ లేకపోవడం ఏమిటి? Is memory just a sound? Is it a non-existent thing that controls your life? An illusion so real that you do not know that it is an illusion anymore! An illusion so real that you cannot come out of it anymore!
యూనివర్సిటీ foyerలో dissertation copies తో కూర్చుని ఉంది ఎస్తర్ ఆ ఉదయం. ఆఫీస్ లో అవి సబ్మిట్ చేయడానికి వేచి చూస్తుంది. Foyer లో కి నువ్వు అడుగిడగానే రిసెప్షన్ కౌంటర్ లో ఉండే ఎంప్లొయీ నీవైపు అదోలా చూసిన జ్ఞాపకం. (44 ఏళ్ల స్త్రీ. డార్క్ సారీస్ ఎక్కువ కట్టుకునేది. పెద్ద బొట్టు. రిసర్వ్ గా కనిపిస్తూ పలకరిస్తే నీళ్లు కుమ్మరించినట్లు మాట్లాడే తన పేరు ఇప్పుడు నీకు గుర్తు లేదు). ఆ చూపుకి అర్థం ఏమిటో నీకు తెలియదు. మీ ఇద్దరి ఎఫైర్ యూనివర్సిటీ మొత్తం తెలుసు కాబట్టి తనకీ తెలిసి ఉండొచ్చు. ‘We thought it is over. Why are you here again?’ అని ఆ చూపుకు అర్థం కావొచ్చు. To hell with it. You crossed a stage where you neither cared for those looks or people. నువ్వు లోపలికి అడుగు పెట్టిన వద్ద నుంచి ఆవిడ చూపులు నిన్నే అనుసరిస్తూ ఉండటం నిన్ను దాటిపోలేదు. నువ్వు వెళ్లి తన పక్కన కూర్చున్నావు. ‘ఏంటి ఇట్లా ఉన్నావు?’ అని అన్నది తను. అదే మొదటి మాట నీతో. నువ్వేమి మాట్లాడలేదు. అప్పుడు వెంటనే తట్టలేదు కానీ తరువాత ఎన్నేళ్లకో నీకు అనిపించింది బహుశా ఆ రోజు foyer లో ఆవిడ నీవైపు అదోలా చూడటానికి కారణం నీ appearance అయ్యి ఉండవచ్చు అని. ఎలా ఉండింది నీ appearance ఆ ఉదయం? What made your appearance disturbing to others on that particular day? Can you imagine or recollect how you looked that morning? You try very hard. All you can remember is this: అంతకు మునుపు రాత్రి నువ్వు నిద్ర పోలేదు. బహుశా, ఆ రాత్రికి మునుపు మరో రాత్రి కూడా. ఏమి చేస్తున్నావు నువ్వు మరి? తాగుతూ ఉన్నావు. పని నుంచి వస్తూ దారిలో డ్రింక్ తెచ్చుకున్నావు. రూమ్ కి చేరి స్నానం చేసి డ్రింక్ పెట్టుకుని నీ మానాన నువ్వు కూర్చున్నావు. You were drinking … గతపు ఆలోచనలు – thoughts associated with her – లేకుండా కూర్చుని ఉన్నావు నువ్వు. (నీ మొదటి జీతంతో ఎంతో ఇష్టంతో కొనుక్కున్న టేప్ రికార్డర్ పెట్టుకుని). బహుశా Jon Seceda and Tracy Chapman పాటలు వింటున్నావు. రూమ్ ముందు కుర్చీలో కూర్చుని ఆ సాయంత్రపు వెలుగులో పల్చగా మెరిసే అశోకా చెట్ల ఆకులనూ పచ్చికనూ చూస్తూ. వాటన్నిటికీ ఏదో అంటుకుని ఉంది ఆ రోజు. వెలుతురు దేనికో అతుక్కుని ఉన్నట్టు! sticky light. నీలోపల కూడా ఏదో stickyగా. నీ బీయింగ్ లోపల కూడా ఏదో sticky గా … as if your whole being is a filed with that substance … filled and fitted to the shape of your body … and that substance that is in you in turn being pulled into something else … into some vacuum … the ‘you’ in you is gradually disappearing into a hazy smoke… fog … like a whirlwind … ఆ సెన్స్ ఏదైతే ఉందో – you are not you – అది ఎప్పుడు మొదలయ్యిందో నీకు తెలియదు కానీ constant గా నిన్ను అంటి పెట్టుకుని ఉండేది. Only the intensity of it differed … ఒకోసారి like breathing … సాఫ్ట్ గా ఉండేది … మరోసారి నీకు ఊపిరి అందనట్టు అయిపోయేది … ఊపిరి అందక గాలి కోసం struggling with all your might అన్నట్టు! అది ఏంటో నీకు తెలిసేదు కాదు … దాని నుంచి ఎట్లా విడివడాలో కూడా అర్థం అయ్యేది కాదు … ‘what is this? This intense longing, this intense sadness that engulfs you? Object లేని longing కారణం లేని దిగులు … దిగులు కూడా కాదు … ఇంకేమిటో … ఎందుకు? ఏమిటి అది?’ ని పలుమార్లు నీ డైరీ లో ఆ దినాల్లో వ్రాసుకున్నావు …
***
‘Symptoms of clinical depression’ అపోలో ఆసుపత్రిలో నువ్వు కలిసిన డాక్టర్ నీతో ఆనాడు అన్నాడు. ఆ డాక్టర్ పేరు మునుపటి అధ్యాయంలో గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు నీకు తట్టింది. అతని పేరు Dr. భార్గవ. అదే డాక్టర్ వద్దకు నిన్ను నీ తండ్రి నువ్వు తొమ్మిదో తరగతిలో ఉండగా తీసుకు వెళ్ళాడు. తొమ్మిదో తరగతో ఏడో తరగతినో నీకు గుర్తు లేదు. ఒకోసారి తొమ్మిది అనిపిస్తున్నది. మరోసారి బలీయంగా ఏడో తరగతి అని అనిపిస్తున్నది. Anyway, why did your father take you to that doctor? ఎందుకు అంటే you were very weak. నీలో జీవకళ లేదు. నీ ముఖంపై తెల్లని మచ్చలు వచ్చాయి. మాటిమాటికీ నోట్లో ఉమ్మి వచ్చేది. ఎవరితోనూ ఒక మూలకు కూర్చుని ఉండేవాడివి. ఎవరూ నీలోని ఆ మార్పును పట్టించుకోలేదు. ఉద్యగం నుంచి నీ తల్లి ఇంటికి వచ్చేసరికి ఆరు దాటిపోయేది. ఆ చిన్ని ఇంటిలో డిమ్ వెలుతురులో గదిలో ఒక మూలకు చేరి ఉండేవాడివి టెక్స్ట్ బుక్ ఒకటి తెరిచి పెట్టుకుని. (అదొక ploy ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి). నీ తల్లి వచ్చి ఇల్లూ వాకిలీ ఊడ్చుకుని అంట్లు తోమి అన్నం వండేది. ఏదైనా అవసరం అయితే, నువ్వు మూల మీద ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లి అవి తెచ్చేవాడివి (అక్కడ అప్పు ఉండేది. ఒక పుస్తకంలో ఆ కొట్టువాడు రాసుకునే వాడు). ఏ తొమ్మిందింటికో నువ్వు తినేసి పడుకునేవాడివి (నిద్ర పోయేవాడివి కాదు). నీ తండ్రి వచ్చేటప్పటికి పది దాటిపోయేది. నువ్వు దిగాలుగా అట్లా ఉంటున్నావనీ, నువ్వు సరిగ్గా లేవనీ నీ తల్లే గమనించింది: ‘ఒకసారి వాడిని మంచి డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళండి … ఏమయ్యిందో … సరిగ్గా తినడం లేదు. ముఖం మీద తెల్లని మచ్చలు వచ్చాయి’ అని తల్లి పలుమార్లు చెబితే నీ తండ్రి నిన్ను తీసుకుని సిటీ లో ఆ డాక్టర్ క్లినిక్ కు తీసుకు వెళ్లినట్టు గుర్తు. He gave medicines and you recovered in a couple of weeks. మచ్చలు పోయాయి. ఓపిక వచ్చింది. బ్రతికి ఉన్న కాంతి ఏదో కూడా నీ ముఖంలో! Later ఎప్పుడో, బహుశా నువ్వు డిప్లోమా చేస్తున్నప్పుడే అనుకుంటాను, నీకు ఏడో తరగతిలో ఆ డాక్టర్ ఇచ్చిన మందుల పేర్లు గుర్తు ఉండి (అందులో ఒకటి Cyltabs, మరొకటి Albendezole. ఇవి కాక ఇంకొక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసాడు కానీ దాని పేరు నీకు గుర్తు లేదు) వాటి కోసం వెదికితే నీకు తెలిసింది ఆ ఏడో తరగతిలో నువ్వు సఫర్ అయ్యింది malnutritionతో అని కానీ నువ్వు మెరుగు అవ్వడం వల్ల ఆ డాక్టర్ మీద నమ్మకం ఏర్పడి తిరిగి ఎన్నో ఏళ్లకు అతను ఎక్కడ పని చేస్తున్నాడో వెదికి కనుక్కునీ మరి అపోలోకి వెళ్ళావు –
‘ఎప్పటి నుంచి ఇలా ఉంది నీకు?’ అతను అడిగాడు (ఇంగ్లీష్ లో). ఎప్పుడో పదేళ్ల క్రితం నువ్వు అతని వద్దకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసావు. (He did not remember. How can he?) మీలో పెద్దగా మార్పు లేదు అని నువ్వు కలుపుగోలుతనంతో అన్నావు. నీ మాటలు పట్టించుకోకుండా అతను ప్రశ్నలు వేస్తూ పోయాడు. నువ్వు చెబుతూ పోయావు. దేని గురించి ? పేరు లేని longing గురించి. దేని పట్లా ఆసక్తి లేకపోవడం గురించి. నిద్ర లేకపోవడం గురించి. ఎప్పూడూ అలసిపోయినట్టుగా ఉండటం గురించి. ఆకలి లేకపోవడం గురించి. దేని గురించో తెలియని గిల్టీ ఫీలింగ్ గురించీ. ఆవరించుకుని ఉన్న ఒక నిరాసక్తత గురించీ. అంతా విని అతను నిన్ను suicidal thoughts గురించి కూడా ఏదో అడిగాడు, నీకు గుర్తు లేదు ఇప్పుడు. దేని గురించో మీ ఇద్దరి మధ్యా ఆర్గుమెంట్ అయ్యింది అప్పుడు: diagnosis మీద అనుకుంటాను. బహుశా చివరికి ఏవో మందులు రాసి అతను నిన్ను సైకాలజిస్ట్ కు refer చేసినప్పుడు ఆ ఆర్గుమెంట్ మొదలయ్యింది అని ఇప్పుడు అనుకుంటున్నావు. You were into a lot of Foucault then. ‘Normalization’ లేదా ‘what is normal’ అనే దాని మీద మొదలయ్యింది ఆ సంభాషణ. ఇప్పుడు నీకు గుర్తుకు ఉన్నదల్లా diagnosis of those ‘symptoms’, medical truth కానే కాదనీ socially and culturally constructed concept అనీ ‘anything that does not fit into such ‘normalization’ has to be corrected by institutionalizing such people అనేదే పెద్ద ఫ్రాడ్ అని ఏదో వాదించావు. ‘Whores are far better than psychologists, they are at least honest’ అని కూడా ఏదో చాలా condescending గా అన్నావు. అతను ఓపికగా విని ‘ఈ మందులు వాడి చూడు. We will talk more when we meet next time’ అని అన్నాడు. ఎందుకు నువ్వు అంత irritate అయ్యావు అప్పుడు? What ignited you? Is it because whatever anyone was saying about your condition wasn’t true? Is it because deep down you felt that those descriptions do not fit the state of mind you were in? నీకు నీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. You were lost … your interior landscape then was an alien land … maps లేని ప్రదేశం అది. ఎవరైనా ఎందుకు వస్తారు పేరు లేని ఆ దేశంలోకి?! ఆ uncharted టెర్రిటరీ లోకి? నీలోకి?
***
ఎవరూ రారు. అందుకని వాళ్ళని ఆహ్వానించడానికి నువ్వు వెళ్ళావా? ‘lakes and waters’ అని నువ్వు నీ డైరీలో రాసుకున్నావు ‘your life is entwined with lakes and waters. Perhaps your death as well’ అని. అప్పటికి నీకు ఇంకా what is living and what is dead అనే డిగ్గింగ్ మొదలు కాలేదు (you remembered a book ‘what is living and what is dead in Indian Philosophy). You were trying to figure out what was happening to you. Anyway, వరంగల్ నుంచి అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక సరస్సుకు పిక్నిక్ అని వెళ్ళావు నువ్వు నీ బాచ్ మేట్స్ నీ జూనియర్స్ తో. ఆ సరస్సు వద్దకు వెళ్లేసరికి మధ్యాహ్నం అయ్యింది. నీకు ఎప్పుడూ సూర్యరశ్మి పడి తళతళలాడే అలలు ఆ నీళ్లు అంటే ఒక fascination! ఒక గాలి ఆ ఒడ్డున నిన్ను చరచగానే నీలో అలలు! ఆ గాలి చప్పుడూ, ఆ అలల చప్పుడూ నీ పాదాల కింది ఎండా తడీ కలిసిన ఇసికా … ‘I miss you in waves’ అనుకున్నావు. ఒడ్డున ఏర్పడిన ఒక రాతి నిర్మాణం వద్ద నిలబడి ఎదురుగా అలలు అలలుగా కదిలే సరస్సుని అలలపై పడి మెరిసి పరావర్తనం చెందే సూర్యరశ్మిని చూస్తూ నిలబడ్డావు. ‘There is something magical about this … something magical about this sunlight reflecting on the water, the breeze and the lake’ నువ్వు ఆ రాత్రి నీ డైరీ లో రాసుకున్నావు. నిన్ను లోపలికి రమ్మని లాగుతుంది బలంగా ఆ కాంతీ గాలీ నీళ్ళూ. నిజానికి నీకు ఈత రాదు. కానీ లోపలికి వెళ్ళాలన్న బలీయమైన కోరిక నిన్ను నిలువనీయదు. అలలు నీ వైపుకు వచ్చి నీ కోసం వేచి చూసి నిరాశతో వెనక్కి మళ్లినట్టు. మళ్ళీ వచ్చి నిన్ను పిలిచినట్టు. వాటి తడి చేతులని నీ వైపు చాచినట్టు. మంద్రమైన గాలి నిన్ను అలలతో ఆ నీటి బాహువుల్లోకి రమ్మని గుసగుసలాడినట్టు. ఆ మధ్యాహ్నం వాటి అన్నిటికీ ఒక definitive language ఉండింది. వశీకరణ మంత్రం ఏదో వాటి రహస్యమైన గొంతుకల్లో. ఎంతో సేపు తదేకంగా ఆ నీళ్ళని చూసిన క్షణాల్లో ఒకపరి నీకు చీకట్లు కమ్మినట్టయ్యి consciousness పోయినట్టయ్యింది. (Or is it your imagination?) ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏమీ చెప్పలేవు. నీ డైరీ లో కూడా ఆ క్షణం గురించి మెన్షన్ లేదు. ఒడ్డున నిలబడినప్పుడు నీ పాదాల కింది ఇసుక వెనక్కు మరలే అలలతో కొంచెం కరిగినప్పుడు నువ్వు జారిపోతున్న ఫీలింగ్. ‘as if you were slipping into a feeling that you never experienced before’ అని మాత్రం రాసుకున్నావు. ఆ వాక్యం ముందు మరే రిఫరెన్స్ లేదు. నువ్వు పాదాల కింద జారే ఇసుక గురించి రాసావో లేక మరేదైన దాని గురించి రాసావో ఇప్పుడు గుర్తు లేదు. Any way within the fluidity of the language and the constantly changing structure of its meanings నువ్వు దేని గురించి రాసావో it does not matter … Or maybe it matters but you can do nothing about it … భాష … నువ్వు దానితో బ్రతకలేవు. అలా అని దానితో ఉండలేవు. నీకు తెలుసు నువ్వు రాసే ఈ అనుభవం … ఈ experiencing structure దానితోనే భాషతోనే మొదలవుతుందని … ‘నువ్వు’ కూడా దానితోనే మొదలవుతావనీ … ఇక ఆ తరువాత ప్రతిదీ ‘అదే‘ అనుభూతి చెందుతుందనీ ఇందులో నీదైనదేదీ (including you … what you call as ‘I’) లేదనీ ఇప్పడూ, ఈ క్షణాన నువ్వు రాసేవి కూడా ఒకప్పుడు ‘నీ’ అనుభవాలో కాదో కూడా నువ్వు చెప్పలేవనీ. ఇదంతా ఒక రకమైన repetition. ఒక రకమైన helplessness. వెళ్లకూడదని తెలుసు కానీ వెళ్లకుండా ఉండలేవు. వెళ్లకముందే వెళ్ళాక ఏమి జరుగుతుందో నీకు తెలుసు అయినా నువ్వు దానిని ఆపలేవు. What is that, that pulls you into self-destruction? ఈ ”నేను’ లేకుండా పోవాలి’ ‘a strong urge to turn into formless form’ అనే anguish … ఏమిటి అది? ఎక్కడ నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? ఈ తపన? ఈ saudade – Qué será?… yo no sé … కానీ నువ్వు ఎందుకు ఈ చాప్టర్ కి mirrors within mirrors అనే టైటిల్ పెట్టావు? Is it because it is about Esther? Or is it because of you? A reflection …
ఎస్తర్ నీకు కొద్ది దూరంలో నీళ్ళల్లో ఉన్న ఒక రాయిపై కూర్చుని ఉంది. నీకు తన ముఖం సగం మాత్రమే కనపడుతుంది. బహుశా అలలనీ ఆకాశాన్నీ చూస్తూ ఉండింది (అరచేతిలో చుబుకం ఆన్చుకుని మోచేతిని మోకాలి వద్ద ఆనించి). బహుశా తాకే గాలిని అనుభూతి చెందుతూ ఉండింది. అలల సవ్వడినీ వింటూ ఉండింది. బహుశా అవన్నీ తానే అయ్యి ఉండింది ఆ క్షణాన. ఆ రోజు ఆ సమయంలో ఆ సరస్సుకి అనిర్వచనీయమైన గుణం ఏదో ఉండింది. దాదాపు magical. Yet at the same time a sense of sadness! మీ ఇద్దరి మధ్యా ఏదీ మొదలు కాకమునుపు … ఆ ఇమేజ్ … తను అక్కడ ఆ రాయిపై కూర్చుని దిగంతాలలోకి చూసే ఆ ఇమేజ్ … ఇప్పటికీ వదలదు నిన్ను. నీకు ఆ క్షణమే ఈ అధ్యాయం తట్టింది. నీ ఆ క్షణానే ఈ అధ్యాయంలో ఏం రాయబోతున్నావో తెలిసింది. Word by word and sentence by sentence! తనని అలా చూస్తున్నప్పుడు ఆ దిగంతాలని తాకే దిగులు ఏదో నిన్ను చుట్టుముట్టింది. ఆ blemish less image … అది నిన్ను వదలదు అని నీకు తెలుసు. కడ దాకా నువ్వు దానితో సఫర్ అవుతావని తెలుసు. తన జ్ఞాపకం కాదు ఆ ప్రతీకతో! And then తల తిప్పి తను నీవైపు చూసి చేతిని ఊపింది. నీకు తెలియలేదు. Was she saying hello or if she was calling you … you were confused. రెండు రోజులుగా కణతల్లో ఉన్న తగ్గని నొప్పితోనూ డాక్టర్ ఇచ్చిన మందుల drowsiness తోనూ చాలా అసౌకర్యంగా ఉన్నావు నువ్వు. నువ్వు నువ్వుగా లేవు. constant pain in your temples and your being నిన్ను నిన్నుగా నిలువనియ్యడం లేదు. కానీ you felt a bit better when she turned her head towards you with a smile and waved her hand. నువ్వు కూడా బదులుగా చేతిని ఊపావు. చిన్నగా నవ్వావో లేదో ఇప్పుడు గుర్తు లేదు. అదే ఇరువురికి మిగిలే చివరి చిరునవ్వు అని అప్పుడు తెలియలేదు. తటిల్లతలో మీ ఇరువురి జీవితం నీకు ఆ క్షణంలో తట్టింది. like a narrative. స్పష్టంగా. కానీ ఆ కథకి మిడిల్ లేదు. ముగింపు మాత్రమే చాలా స్పష్టంగా తట్టింది నీకు. Not as events. Not as a sequence of events but as a feeling. ముగింపు తెలిసీ నువ్వు ఎందుకు ముందుకు అడుగు వేసావో నీకు తెలియదు. ‘If I knew exactly how it is going to end, I would not have taken that step’ అని ఏదో రాసి ఉంది నీ డైరీలో కానీ నీకు తెలుసు అంతా ముందే తెలిసినా కూడా నువ్వు ఖచ్చితంగా అదే చేసేవాడివని. నీకు మరో దారి లేదనీ. ఒకవేళ కాలం వెనక్కు మళ్ళి మళ్ళీ ఆ క్షణానికి వెడితే – even remembering all that went between you two – తిరిగి నువ్వు సరిగ్గా అదే, అలాగే చేస్తావు అని తెలుసు. No choice! అక్కడ నువ్వు నిల్చున్న చోట నుంచి కదిలి, తాను కూర్చున్న చోట వద్దకు వెళ్లేందుకు ఆ నీళ్ళల్లో నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వెళ్తావనీ, నీళ్ల లోతు మోకాలు దాటాక హఠాత్తుగా పెరిగి నీ పాదాల కింది నేల మాయం అయ్యి నువ్వు మునిగిపోతావనీ కొన్ని క్షణాలు నీటి లోపల వివశత్వంతో కదిలి ఆనక ఊపిరి అందక విలవిలలాడి చేతులు కొట్టుకుని పైకి వచ్చి మళ్ళీ మునిగి దాదాపు చచ్చిపోయి ఇక ఎవరో నిన్ను చేయి పుచ్చుకుని పైకి లాగి ఒడ్డుకు తీసుకు వస్తే ఇంకా ఊపిరి అందనట్టు ఎగశ్వాస పీలుస్తో ముఖం తుడుచుకుని కళ్ళజోడు లేక అటువైపు చూస్తే మసకగా తన రూపం … ఆకుపచ్చని దుస్తులలో … అలికినట్టుగా కనిపించిన ఆ ఆకుపచ్చని రంగు. ఆ రోజు నువ్వు నీ గదికి చేరి రాసుకున్న ఓక incomplete వాక్యం నీ డైరీ లో సగం చినిగిన పేజీలో ఉంది (ఆ పేజీ ఎందుకు చినిగి ఉందో నీకు గుర్తు లేదు) Is death green? / Does death come in green / enveloped in water? / Does death come in green / and in a shape / that one often mistakes as …
***
ఎస్తర్ ను తొలిసారి నువ్వు నీ తల్లిని కలిపించేందుకు తీసుకు వెళ్లే ముందు రోజు రాత్రి, ఏడింటి తరువాత నీ పక్కగా వచ్చి కూర్చుంటూ ‘Color of pain … I wrote something like that long back ….’ అని అన్సారీ నీతో అన్నాడు. అన్సారీ నీ senior. నువ్వు డిప్లొమా చేరినప్పుడు అతను అక్కడ PhD చేస్తున్నాడు. Deconstruction గురించి బాగా తెలిసిన వాడు Derridaను చదివి అర్థం చేసుకున్నవాడు intellectual అని ఒక aura ఉండేది అతనికి యూనివర్సిటీ స్టూడెంట్స్ సర్కిల్ లో. (ఆ intellectual అనే పదం మీద అనేక వాదోపవాదాలు జరిగాయి మీ మధ్య. గొడవ కూడా పడ్డారు అనేకమార్లు). నువ్వు తరచూ certain theoretical విషయాలపై అతనితో డిస్కస్ చేసేవాడివి. నువ్వు డిప్లొమా లో చేరిన వద్ద నుండి ఆ మూడేళ్ళ కాలంలో you became close to him. At least that is what you thought. ‘I used to write poems’ అని చెప్పాడు అన్సారీ నీతో. అతను రీసెర్చ్ పేపర్స్ మాత్రమే రాసాడని అప్పటిదాకా నువ్వు అనుకున్నావు. Someone who writes in research articles in literary studies from a postmodern point of view … కవిత్వం రాసి ఉండవచ్చు అని నీకు తట్టలేదు. ఆ రెండు జెల్ కానీ అంశాలు అని నువ్వు అనుకున్నావు. ‘When I lost a friend of mine, I wrote this poem … Color of Pain’ అని అతను నీతో అన్నాడు. నీకు ఆ టైటిల్ నచ్చింది. Color of pain! నువ్వు పెయిన్ లో ఉన్నావా అప్పుడు? పెయిన్ నా అది? పెయిన్ అని అంగీకరించడానికి నీ మనస్సు ఒప్పుకోలేదా? అది పెయిన్ అయితే దాని రంగు ఏమిటి? తెలుపా? నలుపా? ఊదానా? (ఏదో రాసుకున్నావు నువ్వు నీ డైరీ లో ఆ రోజు Why to name it? Why to name the sensation at all? Why to color it? అని ఇలా ఏదో). ఏమి రాస్తున్నావు ఈ మధ్య అని అన్సారీ అడుగుతాడు నిన్ను (what are you writing these days). ఆ ప్రశ్న వినగానే నీకు తెలుసు ఆ తరువాతి సంభాషణ ఎటు మళ్లబోతుందో. He is good at that … to start and steer a conversation into the familiar waters that he is comfortable with … తెలిసీ నువ్వు అడుగు పెడతావు. ఆ నీళ్లలోకి … deep waters … ప్రశ్న నువ్వు ఏమి రాస్తున్నావు అని కాదు. ఒకవేళ అది అయినా నీ నుంచి జవాబు ఆశించి కాదు. It is just a pretext to get into a dialogue …to test you …to take you down the hard and winding road where you will be left with nothing … to test the ‘you’ of you! తరచూ నువ్వు మౌనంగా వినేవాడివి. వాదించే ఓపిక ఉండేది కాదు. అతి తక్కువ సార్లు చాలా animated గా వాదించేవాడివి. Two points of views arguing … an argument that leads to nothing … అదొక addiction … intellectual గా మాట్లాడటం వాదించడం నువ్వు సుపీరియర్ అని ప్రాజెక్ట్ చేసుకునే ఒక intoxicating game అని నీకు తోచేది. అది తప్పించి అందులో ఉన్నది ఏమిటి? అని నీకు అనిపించేది. ఆ పాయింట్ అఫ్ వ్యూ అనేది ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అంతం కాదు. మరొక దానిని అది అంగీకరించదు. It wants to perpetuate itself at any cost అని తరువాత ఎప్పుడో నీకు అర్థం అయ్యింది కానీ అప్పట్లో అదంతా ఒక ఆట. Intoxicating intellectual game of sorts …
నువ్వు అనుకున్నట్టుగానే, ఆ సంభాషణ ఎటువైపు మర్లుతుంది అని అనుకున్నావో సరిగ్గా అక్కడికే చేరింది. ‘So, what’s happening with Esther?’ అని అన్సారీ అడిగాడు నిన్ను. Something ignited. సర్రున ఏదో అనుకుంది నీలో. (బహుశా నువ్వు చాలా ఇర్రిటేషన్ లో ఉన్నావు అప్పుడు) చికాకుగా అనిపించింది. ఒక పదిహేను రోజుల క్రితం తను యూనివర్సిటీ హాస్టల్ లో రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని అతనికి తెలుసు. అంతకు మునుపు రెండు ఏళ్ల నుంచి నువ్వు తను గడిపిన జీవితం ఆ ఒడికి దుడుకులూ అతనికి తెలుసు. (ఆమె తనకి ఉన్న సమస్యల్ని అతనికి, అతని గర్ల్ ఫ్రెండ్ ఆస్మా కీ on a regular basis చెప్పుకునేది అని నీకు తెలుసు). What you were going through అనేది కూడా అతనికి తెలిసే ఉండవచ్చు. తెలిసీ అడగటం … మునుపే చెప్పినట్టు, ఏదో రాజుకుంది నీలో. ముక్తసరిగా ఏదో జవాబు చెప్పి దాటవేసే మానసిక స్థితిలో లేవు నువ్వు ఆ రోజు. అంతకు మునుపు అనేకమార్లు మీ ఇద్దరి సంభాషణలలో అతని ప్రోబింగ్ శైలీ ఇంటరాగేషన్ లా ఉండే అతను ప్రశ్నలు అడిగే పద్ధతీ పట్ల అప్పటికే ఒక విముఖత చాలా డీప్ గా ఏర్పడి ఉన్నది నీలో. అతను వాగ్వాదంలో దిట్ట అని నీకు తెలుసు కాబట్టి వాదన నీకు పెద్దగా ఇష్టం లేదు కాబట్టీ you prefer not to get into an argument. You have no inkling towards it. అటువంటి సందర్భం వచ్చి నువ్వు దానిని దాటవేసినప్పుడు అతను దానిని ఎత్తి చూపించడం కూడా నీకు గుర్తే: ‘Aah … come on … why do you always shy away from a dialogue? Why do you chicken out in pressing your views?’ అని అతను అనేవాడు. నీకు కూడా తెలియదు ఎందుకో. వాదనకు ప్రతివాదన లేక కాదు. నీకు ఆసక్తి లేదు కనుక, ఆ సో కాల్డ్ డైలాగ్ ఎక్కడ అంతమవుతుందో ముందే నీకు తెలుసు కనుక, వాటిలో పాలుపంచుకోక పోవడమే బెటర్ అనుకునే వాడివి కనుక. కానీ ఆ రోజు అలా కాలేదు. You wanted to see the end of it. You mean – the dialogue: once and for all. అందుకని నువ్వు అతనిని తిరిగి అడిగావు: ‘Tell me …what’s happening with Esther?’. అతనికి వెంటనే నీ ఇంటెన్షన్ అర్థం అయ్యి నవ్వాడు. He is pro in that: in and out of discourses … years of practice. నువ్వు నవ్వి మళ్ళీ అడిగావు: ‘What’s with Esther?’ –
ఆ రాత్రి మీ ఇద్దరి మధ్యా ఆ సంభాషణ తెగలేదు. ఆ game of language లో ముందుగా నువ్వు పక్కకి తొలగదలుచుకోలేదు. కానివ్వు ఎంత వరకు పోతుందో చూద్దాం అనే అనుకున్నావు. నువ్వు ఇంతకు మునుపే చెప్పినట్టు ఎస్తర్ అనేది ఒక నెపం మాత్రమే ఆ సంభాషణకు. అసలు కంటెన్షన్ వేరే. ఎస్తర్ అనే విషయం నీ వీక్ పాయింట్ అని అతను అనుకున్నాడు. అక్కడ ప్రారంభిస్తే నువ్వు డిస్టర్బ్ అయ్యి ఆర్గుమెంట్ కన్సీడ్ చేస్తావని అనుకున్నాడు. నీకూ అతను ఏ విషయంలో సెన్సిటివ్ ఇంకా వల్నరబుల్ నో తెలుసు. If you poke me I will poke you as well … let us see who bleeds first … అటువంటి ఆట అది. ఆ రాత్రి గడుస్తున్న కొద్దీ వాగ్వాదం కొనసాగుతూనే ఉండింది. దేని గురించి వాగ్వాదం? ఒక టాపిక్ అని ఉండేది కాదు. ఫ్లూయిడిటీ తో అది ఒక దాని నుంచి మరొకదానికి వేగంగా మారేది. ఐడెంటిటీ గురించి ఆర్గుమెంట్ అయినట్టు నీకు గుర్తుకు ఉన్నది. Representation గురించి. Politics of representation గురించీ. Construction of identity గురించీ. కమ్యూనిటీ గురించీ. You don’t know now the presupposition that both of you taken in that discourse … how you predefined yourself in order to put forward your argument or he predefined himself for that matter … does his argument stem from his notions of Hindu and how a right-wing Hindu perceives a Muslim? అతని PhD టాపిక్ కూడా అటువంటి representation మీదనే ఉండింది … how certain texts knowingly or unknowingly reinforce the image of the other – here Muslim – as uncivilised barbarian and ‘beastly’ … నీకు ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు అప్పుడు అంత తీవ్రతతో మీరు దేని మీద argue చేసుకున్నారో కానీ మంచినీళ్లు అయిపోవడం గుర్తు ఉంది. అప్పుడు సమయం ఎంత అయ్యిందో నీకు తెలియదు. గది నుంచి నడిచి వెళ్లి మెస్ లోంచి మంచి నీళ్లు బాటిల్ లో పట్టుకు రావాలి. మీరిద్దరూ ఎప్పుడు కలిసి కూర్చున్నా నీళ్లు అయిపోతే ముందుగా లేచి వెళ్లి రెండు లేదా మూడు బాటిల్స్ లో మంచినీళ్లు నువ్వే పట్టుకు వచ్చేవాడివి. ఎప్పుడూ కూర్చున్న చోటు నుంచి అతను లేచే వాడు కాదు. స్మోక్ చేస్తూ ‘get some water’ అని ప్లీడింగ్ గొంతుకతో అనేవాడు. ఎప్పుడైనా లేచినట్టు చేస్తే ‘it’s ok … I will go and get it’ అని నువ్వే లేచేవాడివి. ఆ రోజు నువ్వు లేవలేదు … this is a game of hurting … hurting each other …who hurts better అనే game … పోటీ … in language. నువ్వు కూడా స్మోక్ చేస్తూ అలాగే కూర్చున్నావు కుర్చీలో. బహుశా అప్పుడు రాత్రి రెండు దాటింది. ఎంత తాగావో నీకు తెలియదు. గదికి వస్తూ తెచ్చుకున్న బాటిల్ కాకుండా మధ్యలో సిగెరెట్స్ కని సీతాఫల్మండికి వెళ్లి వాటితో పాటు ఇంకో బాటిల్ తెచ్చావు. Royal Stag whisky. అది మాత్రమే నువ్వు afford చేయగలిగే వాడివి అప్పుడు నీకు వచ్చే జీతంలో. అన్సారీ కి వచ్చే JRF స్కాలర్షిప్ కి కూడా అదే రెగ్యులర్ –
‘I don’t feel like getting up. Why don’t you go and get some water?’ అని నువ్వు అన్నావు. అంతకు మునుపే దాదాపు రెండు గంటలు ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఇప్పుడు స్పష్టంగా గుర్తు లేదు కానీ (how can memory be clear?) అతను నువ్వు ఏదైతే పర్సనల్ అని అనుకుంటావో ఆ టాపిక్ తీయడం నువ్వు కూడా అదే tactic తో అతను ఎక్కడైతే తొందరగా burst అయ్యే అవకాశం ఉందో దానినే సంభాషణలోకి చాలా యధాలాపంగా తీసుకురావడం … blow by blow … ఇద్దరూ తగ్గక – కత్తులతో చరుచుకున్నట్లు! ‘Look at you … I had told you not to sleep with her … told you not to get too emotional … attached … see …what a mess you have created for yourself and for her …’ అని ఇంకా ఏదో అన్నాడు అతను. నువ్వు వెనక్కి తగ్గలేదు. అంతకు మునుపులా ‘I am not interested in talking about her. It is personal’ అని చెప్పి ఊరుకోలేదు. ‘Why are YOU so upset about it? It’s my problem anyway … or maybe her problem … what has sleeping with her got to do with anything?’ అని ఆగి అన్నావు: ‘Aah … I get it now … Jaya is sleeping with someone else …. as long as you are sleeping with Asma that is not an issue … but the moment Jaya sleeps with someone else it seems to upset you … unsettles you … and that … and the disturbance that it has caused … you project on me …’. అతను స్థాణువయ్యాడు. క్షణంలో పాలిపోయిన అతని ముఖం నీకు బాగా గుర్తుంది …’the color of pain in his face’ అని నువ్వు నీ డైరీ లో నోట్ చేసుకున్నావు ఆ తరువాతి రోజు కానీ అప్పుడు ఆ క్షణాన you felt a sort of victory. Even though it is hitting below the belt! You pushed me to that corner … I had no choice అని నువ్వు చెప్పుకున్నావు కానీ మ్లానమైన అతని ముఖం అలాగే ఉండిపోయింది. జయశ్రీ అతని ex-wife. ఆస్మా అతని present woman. అప్పటికి ఇంకా వాళ్లిద్దరూ వివాహం చేసుకోలేదు. అక్కడితో ఆగలేదు నువ్వు. అతను తరచూ politics of representation అని మాట్లాడతాడు కాబట్టి నువ్వు ఇలాగ కూడా అడిగావు: ‘Why cannot we talk of politics of name and naming as well? Is it because of that name, of that Hindu (ఇది నొక్కి పలికావు) name – which once was subdued to you morally, socially and sexually -is no longer obliged to you now that you are so agitated?’ అని అన్నావు. అనకూడని మాట అని నీకు తెలుసు. ప్రతిదానికీ మతపరమైన కోణాన్ని లింక్ చేసి అనలైజ్ చేయకూడదు అని కూడా నీకు తెలుసు. ఆ దినాలలో అతని డిస్కోర్స్ హెవీ గా అటువైపు టిల్ట్ అయ్యి ఉండేది. extreme అనిపించేవి అతని వాదనలు. కానీ నువ్వు ఆగలేకపోయావు. చరిత్రను తవ్వుతున్నావని తెలుసు. పాపులర్ రైట్ వింగ్ stance నీ మాటల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనీ తెలుసు …you did not want to do it … but you had no choice … ఆ మాటలు అన్న తరువాత నువ్వు realize అయ్యావు కానీ ఇక అప్పుడు నువ్వు చేయగలిగినది ఏమీ లేదు –
‘So, it has come to this … our friendship …’ తేరుకుని అతను అన్నాడు నీతో: ‘I did not expect this from you’. ‘I did not expect this from you either … you know I have been going through a tough time … with Esther and all … knowing everything how could you bring her into our conversation? Intentionally? అని నువ్వు తిరిగి అతనిని అడిగావు. He was hurt. That is for sure. ‘Is this what I get of our friendship? Is this the gift of friendship?’ అని ఇంకా ఏదో కూడా అన్నాడు చిన్నగా నీతో. ఆ తరువాతి రోజు నీకు గుర్తు ఉన్నవి ఏవో డైరీ లో వ్రాసుకున్నావు కానీ ఆ రాత్రి సంభాషణలు పెద్దగా ఏమీ word to word నోట్ చేసుకోలేదు నువ్వు. ఇద్దరి మధ్యా స్నేహం మీద ఏదో చర్చ జరిగింది. నువ్వు ఇంకా టిట్ ఫర్ టాట్ మూడ్ లోనే ఉన్నావు కాబట్టి ఆ స్నేహం టాపిక్ ని కూడా నువ్వు వదిలి పెట్టలేదు. ‘What do you know of friendship?’ అని అడిగావు. స్నేహితుడివి కాబట్టే అతని manipulative tactics తెలిసీ తెంపుకోక అతని వెంట ఉన్నావు అని చెప్పావు. స్నేహితుడివి కాబట్టే అతన్ని భరించావు అని చెప్పావు. ఇంకా ఏదో! అతను ఏమీ మాట్లాడలేదు. నిన్ను డిస్మిస్ చేస్తున్నట్టు చేతులు ఊపి నిస్సహాయానంగా తల విదిల్చాడు. ఆ క్షణాన నీకు తట్టలేదు కానీ తరువాత ఎన్నడో అనుకున్నావు, ఆ మౌనం ఆ gestures కూడా part of the tactics of that discourse అని. అప్పుడు నీకు తట్టలేదు. Words uttered మాత్రమే సంభాషణ అనుకుని నిశ్శబ్దాన్ని పట్టించుకోలేదు నువ్వు. You did not take silence into the account … you did not take silence as a part of the conversation … as an important part of that discourse or for that matter any other discourse … తెలిసి ఉంటే ఆ silence తోనే బదులు ఇచ్చేవాడివి. ఆ నిశ్శబ్దం ఆ gestures ట్రాప్ అయ్యి ఉండవచ్చు అని అప్పుడు నీకు తట్టలేదు. నువ్వు animated గా నీ మొత్తం being తోటి Signifier కి signified కి ఉండే సంబంధం arbitrary కాదు అని వివరిస్తున్నావు. సరిగ్గా convey చేయలేక పోతున్నావు అనే ఆదుర్దాలో ఉన్నావు. మరింత ఘాడంగా చెప్పాలి ఈ signifier signified మధ్య ఉన్నదీ arbitrary కానిదీ, that space of uncertainty where in which meaning assembles and disassembles is not at all fixed అనీ a single action can mean many things అని demonstrate చేద్దామని అనుకున్నావు. What one does and what the other understands అనేది అంత తేలికగా తేలేది కాదు, బహుశా ఎప్పటికీ తేలేది కాదు అని నువ్వు చాలా బలీయంగా ప్రూవ్ చేద్దామనుకున్నావు. ఆ నిశ్శబ్దం నిజానికి నిన్ను ఒక corner కి నెట్టే ఆయుధం, అదృశ్య ఆయుధం అని నీకు తెలీలేదు అప్పుడు. అందుకని నువ్వు ఆ ఫ్లో లో ఏదో చెబుతూ –
‘Hermeneutics is still limited …’ – అని చెప్పి కుర్చీ పక్కన ఉన్న పళ్ళ కత్తిని అందుకుని ‘look at this … what does this mean? How do you or anyone can interpret it? It’s meaning? What I have intended by that?’ అంటూ ఎడమ చేతితో కత్తి అందుకుని బిగించి పట్టుకుని దానిపై నీ కుడి చూపుడు వేలిని సమాంతరంగా గట్టిగా ఒత్తి ఉంచి, బలంగా ఒక గీతని – ఆ అంచు నుంచి ఈ అంచు దాకా – గీసావు! గీసీ నింపాదిగా అడిగావు: ఈ gesture కి అర్థం ఏమిటి? I have drawn a line with my finger on a knife! What does it mean? What does that line mean? What does the finger say to the knife when it met it at the edge and when it travelled through contours of the knife’s body? Tell me, what does the blood say to the knife and the hand that is bleeding? About meaning? About identity of meaning? About representation of meaning?
***
Part I of Chapter III of
Home: A Memoir (The Years 1996 -2000)
Image: Srujan Raj








Add comment