నిష్క్రమణం

ళ్ళీ నేను నాలోకి వెళ్ళిపోతున్నాను

నీతో ఉన్నంతకాలం నీలోకి పరకాయ ప్రవేశం చేసి
నువ్వెలా ఆలోచిస్తావో అలాగే ఆలోచించి –
నీకేం కావాలో ఎలా మాట్లాడతావో అన్నీ ఊహించి – నీకోసమే అంతా అయి
నేనంతా నీవే అయి – ఉన్నానని అనుకున్నాను!

కానీ
ఇపుడీ క్షణాన అంతా అర్థ రహితం అయి
నాలోకి నేను తిరిగి చూసుకున్నాను –
నాలోపలి ఖాళీని పూరించడానికి

నేను తప్ప ఇంకెవరూ వద్దని
నాలోకి నేను తిరిగి పోతున్నాను!

ఒక పక్కగా నీ జ్ఙాపకాలను సర్ది
మరోపక్క ఇకపై చేయాల్సినవన్నీ రాసుకుని
నీ అడుగు జాడలను చెరిపి
కొత్తగా ఏ ముద్రా పడకుండా

సున్నితంగా గుండె గదులను దులిపాను!

నాలోకి నేను చేరాక చేయాల్సిందొకటే మిగిలింది
……సవ్వడి లేకుండా ఉండడం!
గుండె సవ్వడి కూడా భరించలేనేమో!
వీడ్కోలు చెప్పేస్తాను హృదయానికి..

ఎంతకాలం పనిచేస్తుంది మరి ఒంటరిగా!

*

గీతా వెల్లంకి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు