1.
చూపెళ్లే వైపల్లా
వెలుగులు నింపే
పొద్దుతిరుగుడు పువ్వు_
నాకు నువ్వు!

2.
మెలుకువొస్తూనే
తొలి తలపు
హృదయంలో
నీ పాదాలు
తిరుగాడుతున్నట్టు
నా ఊపిరి చప్పుడు
బ్రతికే ఉన్నాను
ఊపిరున్నందుకో
లేక నీ పాదాల
అలికిడి విన్నందుకో

3.
నువ్వు
దగ్గరా కావూ
దూరమూ కావూ
ప్రేమ
పెరగదూ
తగ్గదూ
యిదంతా
హృదయం మీద వాలే
కాంతిపూతా, చీకటి ఛాయా
అంతే!
*








excellent boss