ప్రశాంతంలోకి
పెట్టుబడి జొర్రింది
నదీ ప్రవాహంలోకి
జొచ్చుకొచ్చిన పెట్టుబడి
చెట్టును చంపేసారు
కొండని చెరబట్టారు
ఎక్కడికక్కడ పెట్టుబడి తిష్ట వేసుకుని
లాభాల వేటలో హిమ శిఖరాల మొదళ్ల దాకా వెళ్ళింది
సౌఖ్యం మాటున మనిషి
భూ తాపాన్ని పెంచుతున్నాడు
ఆధునికత ముసుగులో ప్రకృతి విధ్వంసం
విరిగి పడే చరియల ధాటికి
మనిషి విలవిల
కోలుకోలేని మనిషి పశ్చాత్తాపం తో
పెట్టుబడి నిరంతరం లాభాల వేటలోనే
*








చక్కటి స్పందన గిరిప్రసాద్ గారూ 👌👏🙏