Mirrors within Mirrors-2

మొదటిసారి అది నిన్ను నువ్వు కోసుకోవడం. You did not feel a thing! మొదటిసారి అని నువ్వు ఇప్పుడు రాస్తున్నావు అని అంటే it means that you have done that again … when? ఆ విషయం తరువాత రాద్దాము అని నువ్వు అనుకున్నావు. ఆ భాగం ఇక్కడ సరిపోదని ఏదో నీకు చెబుతుంది. ఏమిటది? ఏదైతే ఇదంతా రాస్తుందో అది ఆ మరొక సంఘటనని ఇక్కడ elaborate చేసేందుకు అంగీకరించడం లేదు! ఇదంతా సరే కానీ, నువ్వు  ఏ విషయాన్నైనా ‘నేరుగా’  ఎందుకు చెప్పలేవు? In simple linear narrative? Is it an illness that you have? Writing is a form of therapy అని చాలా సందర్భాలలో నువ్వు చదివావు. Writing ని glorify చేసే అనేక రచయితల కవుల మాటల్లో కూడా ఆ విషయాన్ని నువ్వు గమనించావు. కానీ నువ్వు మాత్రం ‘Writing (itself) is a form sickness’ అని  నువ్వు నీ డైరీలో రాసుకున్నావు. అది రాసుకున్న context ఏమిటో ఇపుడు నీకు గుర్తు లేదు.  బహుశా ఈ ‘రాయడం’ ఏదో అలవాటయ్యి ఇక దాని నుంచి బయట పడలేక అది సృష్టించిన స్ట్రక్చర్స్ నీలోకి చేరి నిన్ను పూర్తిగా లొంగదీసుకుని వాటినే మళ్ళీ మళ్ళీ నిన్ను రాసేటట్టుగా చేయడం వలన అయ్యి ఉండవచ్చు. దానికీ  addiction కీ తేడా లేకపోవడం నువ్వు గమనించి ఉండవచ్చు. ఏదైతే నువ్వు రాసావో, ‘అది’ తన continuation కోసం ఎంతకైనా దిగజారడం నువ్వు పలువురిలో observe చేసి ఉండటం వాళ్ళ కూడా కావచ్చు. అయినా, అసలు ఎవరు చదువుతారు దీనిని? నిజానికి ఎవరైనా దీనిని చదవాలని నువ్వు కోరుకున్నావా? specificగా? అసలు ఇదంతా ఎందుకు రాస్తున్నావు? What is that you get by writing this? What will – all those who read it – they get in return? Some sort of a pleasure?  … anyway, you never wanted a reader … you want someone to participate in it … in this masochism … perhaps, writing for you is some sort of a masochism … an act of violence … and public display of it … your life … what you call as your life … those events … those heart breaks … those convulsions …. that nausea … that delirium … no shame in that … you always knew that life is not something that one should be ashamed of … feel guilty of … ఇదిగో ఇట్లా జరిగింది అని చెబుతున్నావు. ఎందుకు అనేది తరువాత. నువ్వు ఇతరులని ఎక్కువ గాయపరిచావా లేక నిన్ను నువ్వే ఎక్కువగా హింసించుకున్నావా అనేది తరువాత … masochism … దానిని తెలుగులో ఏమని అంటారో నీకు తెలియదు. ఇది రాస్తున్నప్పుడు నువ్వు నెట్ లో వెదికావు. ‘దుఃఖభోగి’ అని కనిపించింది. బావుంది కానీ masochist అనే దానికి అది సరైన పదం అని నీకు అనిపించలేదు. నీకు అనిపించలేదు సరే, మరి వేరేవాళ్లకి ఏమి అనిపించింది, నిన్ను వాళ్ళు చూసిన ఆ కాలాలలో? వాళ్ళు నీతో కాలం గడిపిన ఆ క్షణాలలో? నీకు పెద్దగా తెలియదు. You have to ask them … by them you mean those people … by people you mean the shadows in your room … by shadows you mean the blood in the corridors … by blood you mean the knife … bleeding language … meaning … Deja vu … and … perhaps, death …

అన్సారీ పెద్దగా మాట్లాడలేదు. రక్తం ఓడుతున్న నీ వేలిని చూస్తూ అలాగే కూర్చున్నాడు. కుర్చీలోంచి లేవబోతుంటే  _ బహుశా కట్టు కట్టడానికి – నువ్వు ‘వద్దు’ అని పెద్దగా అరిచినట్టు గుర్తు. Something has begun and there is nothing to stop it now! చెప్పు దీని అర్థం ఏమిటో అని నువ్వు insist చేసావు. చెప్పు What does this gesture suggest? దీనికి ఒక చరిత్ర ఉన్నదా? అని కూడా అడిగావు. ‘Does the color of pain look like this? Can ever a poem actually become this? this gesture? where did this gesture, if you want to call it as a gesture, reside before it surfaced? What do you call that place? That space between a dream and reality? Home? Homelessness? Love? Lovelessness? Or is it indifference?’ అని కూడా ఏదో అడిగావు. అడిగి, ఆ తరువాత నువ్వు రెండు ఖాళీ నీళ్ల బాటిల్స్ తీసుకుని మెస్ కి నడుచుకుంటూ వెళ్ళావు. ఆ మరునాడు ఉదయం ఆ దారి అంతా రక్తం చుక్కలతో నిండి ఉన్నదనీ ఒకో దగ్గర ఎవరో వాటి మీద నడవగా అవి బ్రష్ స్ట్రోక్స్ లాగా (painted brush strokes) ఉన్నాయనీ నీతో అన్నారు. (I asked the mess workers to clean it early in the morning before anybody could see it అని అన్సారీ నీతో తరువాత చెప్పాడు కానీ రక్తం ఓడుతున్నట్టు అప్పుడు నీకు తెలియనే లేదు). మూడు అయ్యి ఉండవచ్చు తెల్లవారుఝామున. ఖాళీ బాటిల్స్ తీసుకుని కుర్చీలోంచి లేస్తే చల్లటి గాలి తెలిసింది నీకు. స్ట్రేంజ్ peace ఏదో నీలోపల … tremendous peace నీలోపల ఆ ఘడియల్లో … చిన్నగా అశోకా ఆకులు ఊగుతున్నాయి. ఒక రకమైన మసక వెన్నెల పచ్చిక మీద. sticky మసక వెన్నెల. కాదు. ఆ మసక వెన్నెల్లో ఆ మెత్తని మెరుపులో ఏదో stickiness. గాలిలో కూడా అదే. దూరంగా లీలగా ఊగే పేరు తెలియని చెట్టు కదలికలలోనూ అదే. L shapeలో కారిడార్ మలుపు తిరిగి ముందుకు నడిచినప్పుడు అశోకా చెట్ల ముందుగా వాటర్ మోటార్ వద్ద పెరిగిన కాక్టస్ మొదళ్ళ లోని నీళ్లలోనూ అదే. పురుగులు కదిలి – లేదా కప్పలో  – అవి చేసే చప్పుళ్లలోనూ అదే. నీకు ఏదో వాసన సోకుతుంది. వాసన లేని వాసన! అది ఏమిటో నువ్వు పిన్ పాయింట్ చేయలేవు. ఆ వాసనకి చల్లదనం ఉంది. మనిషి శరీరానికి ఉండే చల్లదనం. It smelled soft … as if it is breathing … you felt that breath permeate everything … ఆ వాసనకి కూడా మెత్తని వెలుతురు. అదే stickiness దానిలో. చాలా తేలికైన అసలు బరువే లేని మెత్తని కాంతితో నిండిన stickiness. నువ్వు నీ చేతిని గాలిలోకి చాచి దానిని తాకేందుకు ప్రయత్నించావు. అతి పల్చనైన పొర వంటి దానిని. కాంతికి అతుక్కుని ఉండి దానికి వెలుతురును ఇచ్చే పొర. దానిని తాకావా? నీ చేయి నీళ్ళలోకి ఇంకినట్టు ఆ పొరలోకి ఇంకిందా? అది, ఆ కాంతి, కాంతిని అంటిపెట్టుకుని ఉన్న ఆ పొర నిన్ను తనలోకి అదుముకుందా? ఏం జరిగింది అప్పుడు? నీకు ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు. You felt as if the ‘you’ in you has disappeared for a while … where? నీకు తెలియదు … for a while, the ‘I’ that held your life together just snapped out … నీకు ఏమీ తెలీలేదు. నీకు తెలిసేటప్పటికీ రెండు బాటిల్స్ లో నీళ్లు పట్టుకోవడం పూర్తి చేసి తిరిగి వచ్చి నీ కుర్చీలో కూర్చుని ఉన్నావు. ఒక పది పదిహేను అడుగులు నీళ్లు తెచ్చుకోడానికి నువ్వు నడవటం మాత్రమే గుర్తు. ఆ తరువాత ఏం జరిగిందో నీకు తెలియదు … వెళ్లడం …నీళ్లు పట్టుకోవడం … తిరిగి రావడం … కూర్చోవడం … ఆ time lapse … దాదాపు అరగంట … ఆ అరగంట నువ్వు ఏమైపోయావు? నీకు తెలియదు!

***

‘నువ్వు ఏమై పోతున్నావో నీకు తెలుస్తున్నదా?’ అని ఎస్తర్ అడిగింది నిన్ను తన పర్టికులర్ accent లో యూనివర్సిటీ foyerలో ఆ ఉదయం. Or నువ్వు ‘రా మా అమ్మని కలిపిస్తాను. ఒకసారి చూడాలని ఉంది అని నువ్వు నాతో చాలాసార్లు అన్నావు కదా … తీసుకు వెళ్తాను’ అని తనతో అన్నప్పుడు. ‘ఎందుకు చేసుకుంటున్నావు నిన్ను నువ్వు ఇలా?’ అని కూడా తను అడిగినట్టు గుర్తు. ఏం చెప్పగలవు నువ్వు తనతో? ఇప్పుడు నాకు ఇది అనిపించింది. చేస్తున్నాను. దానికి ముందూ వెనుకా లేవు. కారణాలు లేవు. ఉన్నాయేమో తెలియదు. ఉంటే వాటిని ఇప్పుడు విశ్లేషించుకునే ఓపిక లేదు. అలసిపోయి ఉన్నాను. నిద్రలేక లేదు. తాగి కూడా ఉన్నాను. ఇవేమీ కారణాలు కాదు. ఇవే కారణాలు కూడా అయ్యుండవచ్చు. ఇవన్నీ తరువాత … ఇంతకు మునుపు చాలాసార్లు నువ్వు అడిగావు అమ్మ వద్దకు తీసుకు వెళ్ళమని … నేనే ఎన్నడూ దాటవేస్తూ వచ్చాను. ఎందుకనో నిన్ను తీసుకు వెళ్ళలేదు ఇన్నాళ్లూ. కానీ ఇప్పుడు తీసుకు వెళ్తాను. రా’ అని అన్నావు  ‘ఇప్పుడా?!’ అని తను hesitant గొంతుకతో అన్నప్పటికీ. ఎందుకంటే … if not now, perhaps you will never be able to take her to meet your mother again. ‘అమ్మకి నీగురించి తెలియదు. నా గురించీ తెలియదు. నాకు  తెలుసు అనుకునే అమ్మ కూడా బహుశా నాకు తెలియక పోవచ్చు. వెళ్లి వద్దాం … we will be back in a couple of hours’ అని నువ్వు అన్నావు. తెగిన నీ చేతివేళ్ళని తను ఇంకా చూడలేదు. ఒక వేలు అని నువ్వు అనుకున్నావు కానీ రెండు చేతివేళ్ళు అని ఉదయం మౌలాలిలో ఉండే – నువ్వు ఫోన్ చేయగా వచ్చిన – నీ ‘స్నేహితుడు’ చెప్పేదాకా నువ్వు గమనించలేదు … a cut is a cut is cut is a cut అని a rose is a rose is a rose is a rose స్టైల్ లో అతనితో చెప్పి నవ్వావు కానీ you did not pay much attention to them: I mean those cuts … I mean those wounds … cuts and wounds … inside and out … రాత్రి కారిడార్ లో నువ్వు వెదజల్లిన నెత్తురు చుక్కల వార్త అప్పటికి ఇంకా తనకి ఎవరూ చెప్పలేదు. చెప్పి ఉండి ఉంటే తను నీతో వచ్చేదో కాదో నీకు తెలియదు. నువ్వు అడగగానే నీతో రావాల్సిన compulsion కానీ obligation కానీ ఏమీ లేవు కానీ, నువ్వు అడిగిన రెండు నిమిషాల తరువాత ‘dissertation సబ్మిట్ చేసి వెళ్దాము’ అని  నీతో అన్నది. You were relieved … ఆ మాటలకు … ఎందుకు? నీలో భారంగా ఉన్నది ఏదో తేలికైనట్టుగా తోచింది. ‘రాత్రి చీకటి బరువుకి గడ్డకట్టుకుపోయిన చెట్టు వేకువ సూర్యరశ్మికి తేలికైనట్టు’ అని ఏదో తర్వాత నువ్వు నీ డైరీలో రాసుకున్నావు ఆ క్షణం గురించి (నీ డైరీ లో ఆ లైన్ కొట్టి వేసి ఉంది. చికాకుగా, అసహనంగా బలంగా  కొట్టివేసినట్టు చిరిగిన ఆ కాగితం చెబుతోంది) కింద స్పేస్ ఇచ్చి ఇలా ఉంది: you felt relieved / even though it is just for a moment …/ you felt as if the veil / of the  unbearable burden of being / lift / and pave way to / a glimpse / of that peace / called life …

 

‘ఏమైనా తిన్నావా?’ అని నిన్ను దారిలో తను అడిగింది (జవాబు తనకు ముందే తెలుసు). మూడు వేళ్ళతో నువ్వు ఆక్సిలేటర్ ను మేనేజ్ చేస్తున్నావు. నీ రెండు చేతివేళ్ళకు band aid లు వేసి ఉన్నాయి కానీ అవి తడిగా ఎరుపుగా ఉన్నాయి. ఒక క్షణం అవి నీ వేళ్ళకు ఎలా వచ్చాయో తెలియలేదు. ఆ తరువాత, దారిలో ఒక కెఫె వద్ద టీ కోసం ఆగినప్పుడు నీకు తట్టింది. నువ్వు ఉదయం 6.30 కి మౌలాలి ఉండే నీ ‘స్నేహితుడు ‘ రంగనాథ్ కి కాల్ చేసావు. రమ్మని. బీర్లు తాగాలని ఉంది అని నువ్వు అతనికి చెప్పావు. అతనికే ఎందుకు అంటే మౌలాలిలో అతనికి తెలిసిన వైన్ షాప్ ఒకటి ఉంది కాబట్టి. అందులో ఉదయం ఏడింటి నుంచే alcohol దొరుకుతుంది కాబట్టీ. ‘నైట్ అవుట్ అయ్యిందా’ అని అతను అడిగాడు నీ గొంతుకలో జీరను గమనించి. మూడు రాత్రులు అని నువ్వు అతనికి చెప్పలేదు. ‘need chilled beers … please get it … will pay once you get here’ అని అన్నావు. ‘gold flake నార్మల్ కూడా …’ అని చెప్పావు. తెస్తాడు అతను అని నీకు తెలుసు. నీకు నిద్రపోవాలని లేదు. అన్సారీ ఆరు దాటాక తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు కానీ నువ్వు నీ గది తలుపు బార్లా తెరిచి మంచంపై కాళ్ళు జాపుకుని కూర్చుని ఉన్నావు ( తలుపులోంచి తెల్లనయ్యే రాత్రిని చూస్తూ). ఆ తెలుపు నీకు పెద్దగా నచ్చదు. బావుంటుంది కానీ నచ్చదు. ఎందుకు అంటే నీ గదిలోని నీడలు కరిగిపోతాయి. నిన్ను వదిలి వెళ్లిపోతాయి. నీకు అది ఇష్టం లేదు. నీకు ఆ నీడలే ఇష్టం. రాత్రుళ్ళలో ఉండే నీడలు. నువ్వు ఎవరికీ చెప్పలేదు కానీ ఆ నీడలు నీతో మాట్లాడేవి. వాటి భాష వాటి మాటలూ నెమ్మదైన వాటి gestures అన్నీ నీకు స్పష్టంగా అర్థం అయ్యేవి. అవి నీతో నువ్వు వాటితో …. ఎన్నో రాత్రుళ్ళు సంభాషణలు … ఎటువంటి conflict లేని సంభాషణలు … నువ్వు చెప్పేది వాటికీ అవి చెప్పేవి నీకూ అర్థం అయ్యేది! నిజానికి ఆ ఉదయం ఏడున్నరకి రంగనాథ్ నీ గదికి బీర్లు తీసుకుని వచ్చినప్పుడు నువ్వు గదిలోకి ప్రసరించిన చతురస్రాకారపు వెలుతురు అంచును నేలపై కూర్చుని నీ చూపుడి వేలితో ట్రేస్ చేస్తూ ఉన్నావు. ‘థాంక్స్ రంగనాథ్’ అని చెప్పావు. ఆ తరువాత బహుశా ఒక రెండు నెలల తరువాత ఏదో బార్ లో కూర్చున్నప్పుడు నీకు అతను చెప్పాడు: ‘ఆ రోజు చాలా భయపడ్డాను’ అని. ‘చాలా బ్లీడింగ్ అవుతుంది మీ వేళ్ళకి … ఏం చేసినా ఆగటం లేదు …. బ్యాండ్ ఎయిడ్ తెచ్చాను వెళ్లి … వేసిన కొద్దిసేపటికే అవి పచ్చిగా అయిపోయాయి’ అని. అయితే అవేమీ నీకు తెలియలేదు. బ్రష్ చేసుకుని స్నానం చేసి అతను తెచ్చిన బీర్ ఒకటి తాగాకే నీకు నీ వేలు కాక వేళ్ళు కోసుకున్న సంగతి తెలిసి వచ్చింది. ‘ఎట్లా అయ్యింది?’ అని అతను అడిగితే ‘take it easy’ అని దాటవేసావు కానీ నువ్వు ఏమీ చెప్పలేదు. What would he understand? ఒక gesture గురించి? no way! నువ్వు ఎస్తర్ తో కలిసి ఉన్నావు అని తెలిసీ తనకి propose చేసిన అతనికి? aah … the gift of friendship నువ్వు అనుకున్నావు నీలోపల. ‘ఇదేనా నాకు మిగిలింది మన స్నేహంలో?’ అని అన్సారీ లాగా whispering low voice లో agony తో అడగలేదు రంగనాథ్ ని. ఎందుకంటే నీకు తెలుసు, that is all that is left. … that is all that will be left of anything … pain … a wound as large as life … I mean if you believe in wounds … I mean if you believe in cuts … I mean if you believe in the conversations between a knife and the throat … కుత్తుక మీద ఆగిన కత్తికీ కుత్తుకకీ మధ్య సంభాషణ ఉంటుంది అని నువ్వు నమ్మేటట్లు అయితే … కుత్తుకలో దిగిన కత్తికీ చిందిన రక్తానికీ మధ్య ప్రేమ ఉంటుందని నువ్వు విశ్వసించినట్లు అయితే! ఉన్నదా? లేదా? అది నీకు తెలియదు! మెస్ నుంచి మంచినీళ్లు పట్టుకు వచ్చిన వేకువఝాము 3.30 నుంచి 6.30 దాకా ఏమి జరిగింది? ఆ సంభాషణ ఏమిటి అనేది నీకు పూర్తిగా గుర్తులేదు. what did you speak and what did you convey? In those three hours of intense delirium? With those bleeding fingers and your mutilated being?

 

కారిడార్స్ ని మెస్ వర్కర్స్ శుభ్రం చేశారు హాస్టల్ లో ఎవరూ లేవక మునుపే అనేది నువ్వు గమనించలేదు ఆ ఉదయం తొమ్మిదిన్నరకు రంగనాథ్ ను తీసుకుని వర్క్ కి వెళ్తున్నప్పుడు. ‘ఇప్పుడు కాలేజ్ కి ఎందుకు? లీవ్ పెట్టు’ అని అతను నీతో అన్నాడు. లీవ్ తీసుకుని రూమ్ లో ఉండక అతనిని నీ బండిని  డ్రైవ్ చేయమని అతని వెనుక కూర్చుని ఆ స్థితిలో నువ్వు కాలేజ్ కి ఎందుకు పోయావో నీకు తెలియదు. వెళ్లాల్సిన అవసరం కూడా ఉండి ఉండదు అప్పుడు. బహుశా ఏదో image బ్రేక్ చేద్దాము అని పోయి ఉంటావు … you hated the societal expectations … expectations of the people … their constant judgements … moral or otherwise … వాటి వెనుక దాగుని తమని తాము సుపీరియర్ గా ప్రాజెక్ట్ చేసుకోవాలనే వాళ్ళ తాపత్రయం …. you hated that … ఆ phoney values … నేను అది కాదు అని demonstrate చేయడానికి పోయావా? అలా పోవడం కూడా నీలో పాతుకుపోయిన ఒక societal ఇమేజ్ సిస్టం లో భాగమేనా? తెలియదు … బహుశా నీకు ఊరికే ఒక రైడ్ కి పోవాలని అని అనిపించి ఉండవచ్చు! నీకు లాంగ్ డ్రైవ్స్ ఇష్టం. two wheelers పైన. అందుకని రంగనాథ్ ని బండిని తీయమన్నావా? Maybe it is a lie … you were doing a crash course in self-destruction and perhaps that was an exam … viva -voce with people … నువ్వు అతనిని డ్రైవ్ చేయమని వెనుక కూర్చున్నావు కానీ నీకు తెలుస్తుంది ఒక రకమైన drowsiness … alcohol కంటే మరేదో. ఏదో నీలోపల చెక్కుకుపోతున్నటుగా ఉన్న ఫీలింగ్. తరుక్కుపోయినట్టు … something in you is pulling away from yourself … నీ తలను అతని భుజం మీద ఆనించి కూర్చున్నావు. మధ్యలో అతను శంకర్ మట్ వద్ద టిఫిన్ కి అని ఆపాడు. నిన్ను కూడా తినమన్నాడు కానీ లోపలికి ఏమీ పోలేదు … perhaps you were out of habit … of eating … అతను తిన్నాక నిన్ను కాలేజీ కి తీసుకు వెళ్ళాడు. నువ్వు వెళ్లి రిజిస్టర్ లో సంతకం చేసి వెనుదిరిగావు. నీ colleagues ముగ్గురు ఎదురు పడి పలకరిస్తే ముక్తసరిగా తిరిగి విష్ చేసి వచ్చేసావు. నీ వెనుక వాళ్ళు నీ గురించి అనుకునే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. judgmental మాటలు … తండ్రికి కొడుకుకి compare చేసి నిన్ను తక్కువ చేసే మాటలు … nothing new and not the first time … you were used to it … నీకు అది అర్థం అవుతుంది. అటువంటి మాటల వెనుక ఉండే value structures … ఆ మాటల వెనుక ఉండే అభద్రత … వాళ్ళ భయం … why are they threatened the moment they see someone who does not fit into their value system? అని అనుకున్నావు నువ్వు …  shitty people అని కూడా అనుకున్నావు. వాళ్ళని దాటి వచ్చి పార్కింగ్ గ్రౌండ్ లో ఒక రకమైన జుగుప్సతో ఉమ్మి ఊసి ‘వెళదాం పద’ అని రంగనాథ్ తో అన్నావు. అప్పటికి నీకు ఇంకా తెలియదు ఎస్తర్ ఆ రోజు యూనివర్సిటీ కి వస్తుందని! తనని తీసుకుని నువ్వు నీ తల్లి వద్దకి వెళ్తావనీ –

***

ఎస్తర్ ఆ రోజు యూనివర్సిటీ కి వస్తుంది అని నీకు చెప్పింది కూడా రంగనాథ్ నే. అతనికి అక్కడ డిప్లొమా చేసే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయికి తన సీనియర్ ఎవరో తనకు ఎస్తర్ వస్తుంది ఆ రోజు అని చెబితే ఆ విషయం ఆ అమ్మాయి రంగనాథ్ కి చెప్పింది. రంగనాథ్ నీకు. వెహికల్ మీద తిరిగి వస్తున్నప్పుడు అతను ఉమెన్స్ హాస్టల్ లో అయిన ఏదో ఇష్యూ  గురించి చెబుతున్నాడు కానీ నువ్వు వినడం లేదు. మధ్యమధ్యలో attention తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అతని మాటలు వినపడుతున్నాయి. You were lost somewhere … there was a buzz in your ears … శరీరం మొత్తం వైబ్రేట్ అవుతున్నట్టుగా buzzing feeling …నువ్వు ఇది వ్రాద్దామని అనుకున్నప్పుడు నీ డైరీలో ఆ తారీఖున ఏమి రాశావా అని చెక్ చేసావు. ఆ తారీఖుతో మూడు పేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక narrative క్రమం లేకుండా disjointedగా ఉన్నాయి. ‘why did I do what all I did?’ అని ఉంది ఒక పేజీ చివర్న. దానిపైన is there a choice? అనిరాసి కొట్టి వేసావు. దేని గురించి అది రాసుకున్నావు? నీకు తెలియదు. ఆ పేజీ మీద కూడా అక్కడక్కడా వెలసి పోయిన నెత్తురు మరకలు … you did not realize then కానీ the cut was deep … ఆ తరువాతి రోజు కూడా చిన్నగా రక్తం పోటమరుస్తూనే ఉంది. ముఖ్యంగా చూపుడు వేలికి. గుంజుతూ కూడా ఉండింది. ఆ రోజు నువ్వు ఎస్తర్ ను నీ తల్లి వద్దకు తీసుకు వెళ్లి తిరిగి యూనివర్సిటీ కి తీసుకు వచ్చే దాకా తను నీ తెగిన వేళ్ళను గమనించలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి ఎస్తర్ తో తిరిగి వచ్చి కాంటీన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు నువ్వు వణికే వేళ్ళతో కప్ ను అందుకోవడం తను గమనించింది. (your father was also there in the canteen along with you). నీ చేయి పుచ్చుకుని బ్యాండ్ ఎయిడ్ లోంచి పచ్చిగా ఉన్న నీ వేలును తాకి నీ చేతిని తన చేతిలోకి తీసుకున్నది. మరో అరచేతితో దానిని కప్పింది. ఏదో అడగబోయి ఆగింది. ముఖం తిప్పుకుంది. Were there tears in her eyes? You don’t know. కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా చప్పున తల తిప్పుకుంది అని నువ్వు అనుకున్నావు. నీ చేతిని తన చేతిలోంచి వెనక్కు తీసుకున్నావు. చల్లగా ఉండింది ఆ చేయి. తన చేయే చల్లగా ఉన్నదో లేక నీ చేతిలోని చల్లదనం తన చేతిలోకి పాకిందో నీకు తెలియదు కానీ dampnessని పట్టుకున్నట్టుగా తోచింది నీకు తన చేయి. ‘గుబురుగా ఉన్న పావురంలాగా ఉన్నది అది/ తన చేయి’ అని నువ్వు రాసుకున్నావు నీ డైరీలో ఆ రోజు. కింద hand / a hand / cold / so cold that / it reminds you of death / it reminds you of / a dead body / of someone you loved / her hand’s cold / so cold  … అని ఇంగ్లీష్ లో. మరో పావుగంట తర్వాత తను వెళ్లిపోయింది. నీకు జాగ్రత్తలు చెప్పి నీ తండ్రీ. హాస్టల్ లో నీ రూమ్ కి నువ్వు తిరిగి వచ్చి నిస్త్రాణగా వాలుకుర్చీలో కూలబడటం నీకు గుర్తుంది. ఆ సాయంత్రం గుర్తు ఉంది. ముసురుకుంటున్న చీకటీ గుర్తుంది. అప్పుడు వీచిన చల్లని గాలీ గుర్తుంది. నిన్ను తాకిన ఆ చల్లని చేయీ గుర్తుంది.  తను వెళ్లినా నీ అరచేతిలోంచి ఇంకా వీడని తన చేతివేళ్ళ చల్లదనమూ గుర్తుంది. నీ చేతిలో తను  వదిలిన మంచు ముక్కవంటి ఆ చల్లదనం నీ అరచేతిలోంచి మొదలయ్యి క్రమేణా నీ శరీరమంతా పాకి నిన్ను కూడా ఒక నిలువెత్తు మంచు ముక్కని చేయడం గుర్తుంది … ఆ చల్లదనం … మంచు …పొగమంచు … cold … so cold … dead cold … నీలో … మంచు … బూడిద రంగులో మంచు …

***

నువ్వు తనని తీసుకుని నీ తల్లి పని చేసే ఆఫీసుకు వెళ్లేసరికి 12 దాటింది. తన సెక్షన్ రెండో ఫ్లోర్ లో.  లేక మూడో ఫ్లోర్లో నా? బహుశా మూడోదే అనుకుంటాను. ఎస్తర్ ను బయట వేచి చూడమని నువ్వు నీ తల్లి పని చేసే సెక్షన్ లోకి వెళ్ళావు.  నిన్ను చూడగానే విస్మయంతో నీ తల్లి నిన్ను చూసిన చూపు ఎప్పటికీ మరచిపోలేవు. చిరునవ్వు పరుచుకుంది తన ముఖంలో. ‘చెట్ల నీడ’ అని ఆ నవ్వు గురించి తరువాత నువ్వు నీ డైరీలో రాసుకున్నావు. ‘ఏమిటి ఇలా వచ్చావు?’ అని అడిగింది నీ తల్లి. తన పక్కనే కూర్చుని ఉన్న colleague మీ ఇద్దరినే గమనిస్తున్నది. ఒకసారి బయటకి రా అని నువ్వు ముందుకు కదిలావు. బయట ఎస్తర్ మెట్ల రైలింగ్ కు ఆనుకుని అటువైపు తిరిగి ఉన్నది. నీ తల్లి నీ వెనుకే వచ్చి అయోమయంగా చూస్తూ నిలబడి ఉన్నప్పుడు నువ్వు తనని పరిచయం చేసావు: ‘తను ఎస్తర్. ఈ అమ్మాయి అంటే ఇష్టం. యూనివర్సిటీలో నా జూనియర్. ఎంఫిల్ పూర్తి అయ్యింది ఈ మధ్యే’ అని నువ్వు చెప్పావు. నీ తల్లి ముఖంలో సంతోషం కనిపించింది. నమస్తే అని ఎస్తర్ అంటే నీ తల్లి తన దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా తన చేతిని పుచ్చుకుని భుజం నిమిరింది … She was really happy … పెళ్లి అంటే తరచూ మాట దాటవేసే తన కొడుకు పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నది. తరువాత ఎన్నడో ఆ టాపిక్ వచ్చినప్పుడు ‘ఆ క్షణాన చాలా ఆనందం వేసిందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటావు అని …’ అని చెప్పింది నీ తల్లి. నిజానికి నువ్వు ఆ మాట కూడా చెప్పావు నీ తల్లికి: ‘ఈ అమ్మాయి ఎస్తర్ … తను అంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను’. నీ తల్లి నిండుగా నవ్వింది ఆ మాట వినగానే కానీ క్షణం తరువాత మీ ఇద్దరి మౌనం తనని సందిగ్ధంలో పడవేసింది. అప్పుడు నువ్వు నెమ్మదిగా నీ వాక్యాన్ని పూర్తి చేసావు: ‘ఎస్తర్ తను. ఇష్టం నాకు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను … కానీ తనకి నాలుగు రోజుల క్రితమే పెళ్లి అయ్యింది …’. నీ తల్లి ముఖంలో నవ్వు ఆగిపోయింది. పైన metaphor ని extend చేస్తూ ‘చెట్ల నీడల్లోకి రాత్రి పొరలు పొరలుగా వ్యాపించింది’ అని రాసుకున్నావు తరువాత నీ డైరీ లో తన ముఖం ఎలా మారిందో నోట్ చేసుకుందామని అనుకున్నప్పుడు. నువ్వేం చెబుతున్నావో నీ తల్లికి ముందు అర్థం కాలేదు. సింక్ అవ్వలేదు వెంటనే. అర్థం అయ్యి ఏం చెప్పాలో పాలుపోక అలా నిలబడిపోయింది. ఆ తరువాత తేరుకుని ‘నేను తనని తీసుకుని ఇంటికి వెడతాను. నువ్వు బండి మీద దిల్షుక్నగర్ వెళ్లి నాన్నని తీసుకుని ఇంటికి రా’ అన్నది. నువ్వు తల ఎటువైపు ఊపావో ఇప్పుడు గుర్తు లేదు. ఆ తరువాత నీకు గుర్తున్నది బండిపై దారిలో వెడుతూ ఎక్కడో మంచినీళ్లు కొనుక్కున్నావు. విపరీతమైన దాహం వేసింది నీకు. ఎండ కూడా తీవ్రంగానే ఉన్నట్టు గుర్తు. నిద్రలేమి … ఆల్కహాల్ … స్మోక్ … లాస్ అఫ్ బ్లడ్ … అన్నీ కలగలసిపోయి you felt very week … dehydrated … reeling as well … నువ్వు వెళ్లేసరికి ఆ మధ్యాహ్నం నీ తండ్రి పడుకుని ఉన్నాడు. నీ మరో అమ్మ ఏమిటి ఇప్పుడు వచ్చావు అని నిన్ను అడిగింది. నువ్వు వెళ్లి నీ తండ్రిని లేపి ‘ఇంటికి వెళ్దాము’ అన్నావు. నీ ఆకారం చూసి అతను ఎందుకు అని అడగకుండానే దుస్తులు మార్చుకుని నీ బండి ఎక్కి కూర్చున్నాడు. నీ కుడి చేయి వణకడం అతను గమనించాడు. ‘కోసుకున్నావా?’ అని అడిగాడా నిన్ను? ఎందుకు? అని ప్రశ్నించాడా నిన్ను? నీకు ఇప్పుడు గుర్తు లేదు. అడగటం వల్ల గాయాలు మానిపోతాయా? కోతలు తిరిగి అతుక్కుంటాయా? Will the bleeding stop? ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు? లోపల ఏర్పడ్డ కోతలు … బయటకు కనిపించని గాయాలు … ఆ గాయాల బ్లీడింగ్ …

 

నువ్వు నీ తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంతయ్యింది? You lost sense of time.  ముందు గదిలో (చిన్నది) సోఫాలో కూర్చుని ఉన్నారు ఇద్దరూ. నీ తండ్రిని చూడగానే లేచి నిలబడ్డారు. నువ్వు ఇంటి వెనక ఆవరణలోని బాత్రూంకి ముఖం కడుక్కోడానికి వెళ్ళావు. ప్యాంటు మడచి కాళ్ళు కడుక్కుని నీళ్లు అరచేతిలోకి తీసుకుని ముఖం కడుక్కుంటుంటే చూపుడు వేలు బాగా గుంజింది. It bled again through the band aid. అది తీసి వేలిని కడిగావు. చాలా లోతుగా ఉంది కోత. వేలు పాలిపోయి ఉంది. బ్యాండ్ ఎయిడ్ వేసి ఉండటం వల్ల వేసినంత మేరా ఒక రకమైన తెలుపు దనం. నువ్వు ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ మీద ఉండే చిన్న మందుల డబ్బాలో వెదికి డెట్టాల్ పెట్టి దూది అద్ది దాని మీదుగా మళ్ళీ బ్యాండ్ ఎయిడ్ వేసావు. ముందు గదిలోంచి లోగొంతుకతో నీ తండ్రీ ఎస్తర్ మాటలు వినిపిస్తున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నారో నీకు వినపడటం లేదు. నీకు ఓపిక అయిపోయింది. బెడ్ రూమ్ మంచంపై నుంచి ఒక దిండు తీసుకుని నేలపై వేసుకుని పడుకున్నావు. వాళ్ళిద్దరి గొంతుకల మధ్యలో చిన్నగా నీ తల్లి స్వరం వినిపిస్తున్నది నీకు. ‘నేను మాట్లాడతాను … మేడ మీదకి వెళదాం’ అని నీ తల్లి ఏదో అనడం లీలగా వినిపిస్తున్నది. నీ కళ్ళ ముందు పొరలు. మూసుకుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరిచి ఉంచేందుకు ప్రయత్నించావు. కష్టంగా ఉంది. numbగా. నీ కనురెప్పలు మూసుకుపోయే ముందు ఎందుకో నీకు నీ బాల్యంలో పెంచుకున్న పావురం గుర్తుకు వచ్చింది. ఆ క్షణంలో నీ ఎదురుగా అది … పడుకుని ఉన్న నీ కళ్ళ ముందుగా అడుగులు వేస్తూ అది! దాని ప్రతి ఒక్క ఫీచర్ నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావు. ఇది ఎలా సాధ్యం?! అని నువ్వు అని అనుకున్నావు. నువ్వు ఏడో తరగతిలో ఉండగా ఒకనాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తే అది ఇంటి వెనుక జామ చెట్టు కింద తచ్చాట్లాడుతూ ఉన్నది. ఎగిరి పోలేదు. దాని రెక్కకు ఏదో గాయం అయ్యి ఎగరలేక అక్కడక్కడే తిరుగుతున్నది. కుక్కలు చంపివేస్తాయని దానిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. జొన్నలు తింటాయి అని నీ తల్లి చెబితే కిరాణా కొట్టులోంచి అవి తెచ్చి దానికి పెట్టావు. దానిని బయటకి పంపక దానిని ఇంట్లోనే ఉంచి కాపాడుకున్నావు. స్కూలు నుంచి రాగానే ఇక నీకు దానితోనే ఆటలు. మాటలు. క్రమేణా దానితో అనుబంధం పెంచుకున్నావు.  ఒకనాడు ఇంట్లో అందరూ ఎక్కడికో వెళ్తూ, దానిని ఇంట్లో కాక నీటి తొట్టిపైన అయిదు అడుగుల ఎత్తులో ఉండే అర వంటి దాని పైన వదిలి వెళ్లారు.  ఎక్కడికి వెళ్లారో నీకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. నీకు వెళ్లాలని లేకుండింది. కానీ తప్పలేదు. దాని రెక్కలు నయం అయ్యాయి, నీటి తొట్టిపై ఎత్తులో ఉండే ఆ అటకపై ఉంచావు కనుక కుక్కలు దానిపై దాడి చేసే అవకాశం లేదు అని అనుకున్నావు. ఆ రోజు రాత్రి పది దాటింది మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి.  రాగానే ఇంటి వెనుకకు పరిగెత్తుకు వెళ్లి అటకపై చూసావు. అది కనిపించలేదు. నీ గుండె అదిరింది. పెద్దగా కొట్టుకుంది. ఆ అటకపై నుంచి ఎగిరి కిందకి వచ్చి అక్కడే ఉన్న మొక్కల్లో లేదా జామ చెట్టు మొదట్లో ఉన్నదేమో అని వెదికావు. నీతో పాటు నీ తల్లి కూడా. ‘ఎగిపోయి ఉంటుంది’ అని అప్పుడు నీ తండ్రి అన్నాడు కానీ బెదురుగా నువ్వు ఇంటి చుట్టూతా వెదుకుతూనే ఉన్నావు దానిని పిలుస్తూ! ఎక్కడికి పోయి ఉంటుంది అని అనుకున్నావు. ఎక్కడా కనిపించక, నీ తండ్రి అన్నట్టు దాని రెక్కలు నయమయ్యి ఎగిరిపోయి ఉంటుందనే అనుకున్నావు కానీ నీ గుండెల్లో చిన్నగా ఏదో భయం. వెదికి కనిపించక తిరిగి ఇంట్లోకి వస్తుండగా నీకు చప్పున లీలగా ఏదో తట్టి గుండె ఆగినంత పనయ్యింది. దడ దడ లాడే గుండెతో ఇంటి వెనుకకు పరిగెత్తుకు వెళ్లి భయం భయంగా నీటి తొట్టిలోకి తొంగి చూసావు. ఉన్నది అది. అక్కడే! నిర్జీవంగా ఆ నీళ్ళల్లో తేలుతూ! చల్లగా అయిపోయావు నువ్వు …  కంగారుగా అరచేతుల్లోకి తీసుకుని తడిమి చూసావు  … నీ చేతులతో రుద్దావు … ఏ కదలికా లేదు దానిలో … అటకపై నుంచి ఎగరబోయి దుస్తులు ఆరేసే సన్నని ఇనుప తీగలకి తట్టుకుని నీటి తొట్టిలోకి పడిపోయి, పూర్తిగా మానని ఆ రెక్కలతో ఎగరలేక ఆ నీళ్లలోనే కొట్టుకులాడీ కొట్టుకులాడీ చచ్చిపోయి ఉండవచ్చు  … నీలో ఏదో గుంజింది … ఎంతో నొప్పి అయ్యింది నీకు … విలవిలలాడావు … నీ గుండెను ఎవరో పారతో తవ్వినట్టు అనిపించింది … వెక్కిళ్లు పెట్టి ఏడ్చావు నువ్వు ఆ రోజు. ఎంతో … నీ తల్లి నిన్ను ఎంత సముదాయించినా కూడా నీ ఏడుపు ఆగలేదు. ఏడ్చి ఏడ్చి వెక్కిళ్లు పెట్టుకుంటూనే అలాగే ఏమీ తినకుండానే నిద్రపోయావు ఆ రాత్రి. ఇప్పుడు ఆ పావురం … అదే పావురం ఆ తరువాతి ఉదయం నువ్వు ఇంటి వెనుక నిమ్మ చెట్టు వద్ద గొయ్యి తవ్వి దానిలో పాతిపెట్టిన ఊదా రంగు పావురం …. నువ్వు పెంచుకున్న పావురం అప్పుడు అక్కడ సజీవమై మళ్ళా నీ ముందు … అవే గుండ్రని కళ్ళతో … అదే కుంటి నడకతో నీ ముందు … ఎలా?  ఎలా సాధ్యం అది? నీకు గుర్తుకు ఉన్నదల్లా ఒకప్పుడు నువ్వు దాని మెడ మీద మెత్తగా నిమిరినట్టుగా తాకుదామని నీ చూపుడు వేలిని నెమ్మదిగా ముందుకు చాచావు … దానిని తాకావా? మెత్తని మెడని? ఏమో … ఏదో అరుపు ఏదో వినిపించింది నీకు … ఊపిరి అందని అరుపు … కీచుమని … అలజడిగా రెక్కలు నీళ్ళల్లో కొట్టుకునే సవ్వడీ  వినపడింది నీకు … ఆ నీళ్లు చింది నీ ముఖం తడిచిపోయింది …  ముఖంపై తడి … నువ్వు ముంజేతితో ఆ తడిని తుడుచుకుంటుంటే నీకు దాని రెక్కల వాసన సోకింది  … నల్లటి మట్టి మెదిలింది నీ కళ్ళ ముందు … నీ కళ్ళల్లో రాత్రి అయ్యింది … నీలో చీకటి కమ్ముకుంది … ఆ తరువాత నీకు ఏమీ గుర్తు లేదు …

***

ఇలాగే చాలా వెళ్లిపోయాయి నీ జీవితంలోంచి . జారిపోయాయి. వాటి రూపాలు ఏవీ స్పష్టంగా గుర్తు లేవు కానీ అవి నీనుంచి దూరమయ్యిన క్షణంలో ఏర్పడ్డ ఖాళీతనపు essence నీకు ఇప్పుడు బాగా గుర్తు ఉన్నది. ‘the essence of experience you retain … it stays with you … lingers around you … that essence sinks into you and becomes your very own self … your soul’ అని నీ డైరీలో ఆ రోజు చివరి నోట్. నువ్వు దానిని ఆ రాత్రి ఎప్పుడో పడుకోబోయే ముందు నీ రూమ్ లో రాసుకున్నావు. నువ్వు నీ ఇంటి వద్ద నుంచి తనని తిరిగి యూనివర్సిటీ వద్దకు తీసుకు వచ్చేటప్పటికి అయిదున్నర అవుతుంది. నీ తండ్రీ ఎస్తర్ ఆటోలో వస్తే, నువ్వు నీ టూ వీలర్ మీద వచ్చావు. హాస్టల్ కి కొద్ది దూరంలో ఉండే కాంటీన్ ముందు లాన్ లో కూర్చున్నారు. అక్కడ దొరికే ఈవెనింగ్ స్నాక్స్ ఏవో ఆర్డర్ చేసావు.  నీ తండ్రి తింటున్నాడు. నువ్వు కాఫీ మాత్రం చెప్పుకున్నావు. ‘ఎందుకు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు’ అని ఇలాంటిది ఏదో నీ తండ్రి అడిగాడు. ‘నేను వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడనా? పోనీ మీ హస్బెండ్ తో? నువ్వు సరే అంటే ఏదో ఒక పరిష్కారం వెదకవచ్చు’ అని ఇటువంటిది ఏదో కూడా నీ తండ్రి తనను అడిగాడు. ‘మా నాన్న గుండాగి చనిపోతాడు. పెళ్లి అయిన నాలుగు రోజులకే ఇలాంటిది తెలిస్తే … నాన్న  తట్టుకోలేడు’ అని ఇలాంటి రిప్లై నే ఏదో తను ఇచ్చింది. ‘ఆరింటికి జోసెఫ్ వస్తాడు హాస్టల్ కి నన్ను పిక్ అప్ చేసుకోడానికి. నేను వెళ్ళాలి’ అని అన్నది. ‘అనేకసార్లు అడిగాను … ఏ ఒక్కసారి కూడా ఉండమని తను అడగలేదు … ఇంట్లో పెళ్లికి బలవంతం చేస్తున్నారు … పెళ్లి చేసుకుకోపోయినా కనీసం కలిసి ఉందాం అని అయినా చెప్పు అని అడిగాను … పెళ్లి చేసుకోలేను, ఉండలేను అనే తప్ప ఇండైరెక్ట్ గా నైనా ‘ఉండు నువ్వు’ అనే hint కూడా ఇవ్వలేదు … I could not do anything … I was helpless … అయినా నేనే కొంచెం ఓపికతో ఉండాల్సింది … వెయిట్ చేయాల్సింది … If possible, forgive me’ అని ఇలా ఏదో కూడా తను నీ తండ్రితో అన్నది. ‘ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పు ఏదైనా ఉంటే …’ అని నీ తండ్రి ఆ వాక్యాన్ని పూర్తి చేయలేదు.  నిజానికి there is nothing wrong with her … చివరకు ‘పెళ్లి చేసుకోవద్దు. సరే … కనీసం ఉంచుకో నన్ను’ అని కూడా తను నిన్ను అడిగింది. తనని కూర్చోబెట్టి నువ్వు అలా అడగటం ఎంత ఆత్మాభిమానం లేని విషయమో ఎంత స్వతంత్రంగా తను ఉండాలో చెప్పావు కానీ ఉండమని అనలేదు! కనీసం ఎందుకు ఉండలేకపోతున్నావో చెప్పలేదు. You never knew at that point of time that you would miss her so much … తన తల్లితండ్రులు తనని తీసుకు వెళ్ళడానికి వస్తున్నారని తెలిసి రెండు వారాల క్రితం నువ్వే తన గదిలోని సామానులు పాక్ చేయడానికి సహాయ పడ్డావు. దగ్గరుండి తనకు send off ఇచ్చావు … you were quite normal then … it is only when she left in the car along with her parents … ఒక sudden downpourలాగా ఏదో నిన్ను ముంచి వేసింది. నీ సీనియర్, స్నేహితుడూ అయిన రఘుతో కలిసి సీతాఫల్ మండి  లోని కెఫె కి నడుచుకుంటూ వెళ్లి సిగెరెట్ వెలిగించుకుని టీ తాగే దాకా కూడా నిబ్బరంగానే ఉన్నావు … కానీ ఆ తరువాతే ఏదో నిన్ను ఆకస్మికంగా  చుట్టివేసింది … ముంచివేసింది … బహుశా the depth of her absence struck you then …the emptiness revealed itself as a void inside yourself … you could not take it and you could not bear it … you burst out and cried like hell in that small cafe … రఘు నిన్ను అదిమి పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు కానీ ఎప్పటి నుంచో అణిచి పెట్టుకున్నదేదో ఒక్కసారిగా బద్దలై అక్కడ రాలిపడ్డావు … like a short intense burst of rain … ఒక అయిదు నిమిషాలు … అంతే … ఆ తరువాత తేరుకున్నావు … కళ్ళు తుడుచుకుంటూ రఘుని అడిగావు నువ్వు తడిచిన గొంతుకతో: Why am I like this? Why am I …

***

ఆ సాయంత్రం ఆరింటికి కాంటీన్ లో ఎస్తర్ లేచి నిలబడింది. ‘వెళ్తాను’ అన్నది. నీవైపు చూసింది. You felt dampness in the air. Or perhaps in her heart. Or was it in your heart? చాలా suffocated అనిపించింది నీకు. చూపు తిప్పకుండా తన వైపే చూస్తున్నావు నువ్వు. నీ తండ్రి లేచి నిలబడి తన తలపై నిమిరి వెళ్ళమన్నట్టుగా తల ఊపాడు. నెమ్మదిగా పరుచుకునే చీకటిలో తను ఉమెన్స్ హాస్టల్ వైపు నడిచింది. నీ లోపల ఏదో బరువు. ఒక నల్లని ఇనుప గోళం నీ శరీరం లోపలి ‘నువ్వు’ ని నింపుతున్నట్టు … కంకర మిక్సర్ ఏదో క్రమేణా గట్టిపడి గడ్డకడుతున్నట్టు … you could feel that heaviness spread to every cell of your body … something tightening up inside you … నువ్వు చేయగలిగినది ఏమీ లేదు … just stand and stare into the night that is falling … ‘ఇంటికి వెళదాం. రాత్రికి ఉండి రేపు రావచ్చు’ అని నీ తండ్రి నిన్ను అడిగాడు. ‘పర్వాలేదు. I am ok now. I want to be alone’ అని అన్నావు. ‘Don’t drink’ అని నీ తండ్రి నీతో చెప్పాడు. అతనికి ఏం బదులు ఇచ్చావో నీకు ఇప్పుడు గుర్తు లేదు. నీకు గుర్తుకు ఉన్నదల్లా ఆ feeling … essence of that moment … నీ గదికి వెళ్లి ఒక్కడివే ఉండాలి అని ఎంతో తీవ్రతతో అనిపించడం. పూర్తిగా అలసిపోయి ఉన్నావు. నీ తండ్రి ‘జాగ్రత్త’ అని చెప్పి  వెళ్ళిపోయాడు. నువ్వు నెమ్మదిగా లేచి నిలబడి నీ రూమ్ వైపు నడిచేటప్పటికీ పూర్తిగా చీకటి పడింది. రాత్రి చల్లదనం చుట్టుకుంటున్నది. ఎక్కడో పక్షుల అరుపులు … క్రీక్ క్రీక్ మని … కొంగలేమో … తెలియదు … నీ కుడి చూపుడు వేలితో పాటు కుడి భుజం కూడా లాగుతుంది. డ్రై గా ఉన్నది. నెమ్మదిగా మెస్ ని దాటుకుని నీ రూమ్ వద్దకు చేరుకున్నావు. బయట గడియ పెట్టి ఉన్నది. అక్కడే ఉన్న వెదురు  కుర్చీలో కూర్చుని చూస్తే ఎదురుగా రాత్రి ఆకాశంలో పల్చని వెలుతురు … రూమ్ లో ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయో లేదో కూడా నీకు తెలియదు. కడుపు చెక్కుపోయినట్టుగా ఉంది. మెస్ ఎనిమిదింటికి. ఏమీ తినాలని కూడా లేదు … you felt blank … అలా ఎంతసేపు అక్కడ కూర్చున్నావో నీకు తెలియదు … ఒక క్షణం ఎంతో అలెర్ట్ గా … మరు నిమిషంలోనే ఎంతో drowsyగా … నీ శరీరం ఒక స్థితి నుంచి మరో దానికి వేగంగా నీ ప్రమేయం ఏదీ లేకుండానే షిఫ్ట్ అవుతుంది … for a moment you felt you were out of your body … falling out of your body … చుట్ట చుట్టుకుని నీ శరీరంలోంచి నువ్వు బయటకి దొర్లిపోయినట్టుగా … ఉలిక్కి పడ్డావు. దాహంగా అనిపించింది. లేచి గడియ తీసి లోపలికి వెళ్ళావు. తలుపు తీయగానే కుడివైపు గోడకు ఆనించి ఉన్న బుక్ షెల్ఫ్ పై ఉన్న నీళ్ల బాటిల్ పక్కగా మిగిలిన రాత్రి డ్రింక్. రాత్రి జరిగినవేమీ నీకు పెద్దగా గుర్తు లేదు. గుర్తు తెచ్చుకోవాలన్న కోరికా లేదు. బాటిల్ లో మిగిలిన మందును గది ముందు ఉన్న అశోక చెట్టు మొదట్లో ఒంపి దానిని డస్ట్బిన్లో వేసి గదిలో చిందర వందరగా పడి ఉన్న పేపర్ ప్లేట్స్ నూ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలనూ సర్ది చీపురుతో శుభ్రంగా గదిని ఊడ్చుకున్నావు. నీ వేళ్ళు ఇంకా గుంజుతూనే ఉన్నాయి … నొప్పిని దాటిన తరువాతి స్థితి ఏదో తెగిన నీ వేళ్ళల్లో … మంచంపై దుప్పటి తీసి దులిపి వేసుకుని లైటార్పి నీళ్ల బాటిల్ తో మంచపైకి చేరావు. మెష్ కొట్టిన కిటికీలోంచి చల్లని గాలి … వెనక్కు వాలి వీపును దిండుకు ఆనించి నీళ్లు తాగావు. drained feeling నీలో … ‘What did I do?’ అని మాత్రం అనుకున్నావు … it never occurs to you ‘why?’ అని … బహుశా ‘ఎందుకు’ అనేది నీకు ఎప్పుడూ తట్టదు … it just never occurs to you … that ‘why’ …

 

ఇక నీకు తెలియకుండానే నీ కళ్ళు మూతలు పడుతుంటే ఆ కళ్ళల్లో నీకు ఒక సరస్సు కనిపించింది. తీవ్రత లేని మధ్యాహ్నపు సూర్యరశ్మి దాని అలలపై పడగా, తళతళలాడే సరస్సు. ఎండ పడి అంచులలో మెరిసే అలలు నీవైపు కొట్టుకు వస్తున్నాయి. crystal clear నీళ్లు … నీళ్ల అడుగున ఉండే ఇసుక నీకు కనపడుతుంది … మెత్తని ఇసుక … ఒకటీ రెండు గవ్వలు కూడా కనిపించాయి. వీచే గాలి నిన్ను బలంగా తాకుతున్నట్లు తెలుస్తుంది … బహుశా ఏవో పక్షులు అరుపులు కూడా నీకు వినిపించాయి … కాదు … you did not hear them … you felt those sounds!  కనుచూపు మేరా – సరస్సు ఆవలి అంచున – ఆకాశం ఛారికలతో నిండి ఉన్నది. నీలం. ఆకుపచ్చ. ఎరుపూ పింక్ కలగలసిన రంగు కూడా ఏదో వాటిలో …  that lake along with that sky looked ethereal … ఇంతకు మునుపు నీకు బాగా పరిచయం ఉన్న, ఘాడమైన అనుబంధం ఉన్న సరస్సు ఏదో అది … you ‘felt’ it … ఆ పరిసరాలు అన్నీ నీలోనే ఉన్నట్లు … అలలు కొట్టుకు వచ్చి నీలోనే ఎక్కడో తాకి తిరిగి వెనక్కి మర్లినట్టు … you could feel those waves hitting you inside and recede … నీలోనే గరుకుగా మెత్తగా ఇసుక కూడా తెలుస్తుంది … గాలి వీచినప్పుడల్లా నీ శరీరంలో ‘వౄమ్’ అని చిన్నగా శబ్దం … నీలోపల నుంచి ఆవలివైపుకి  వీచి వెళ్లిపోతున్నట్టుగా గాలి … ఆ సరస్సు నుంచి వచ్చే వాసన ఏదో కూడా నీలోపలే generate అవుతున్నట్లు … నీలోనే నీళ్లు … నీలోనే వాటిలో ఉన్న గులక రాళ్లు  … ఆ నీళ్లలోంచి కొంచెం ఎత్తుగా లేచిన రాక్ structures …. వాటిపై పడే కాంతీ … ఏదో తాకుతుంది … ఎక్కడో తెలియడం లేదు … అది ఏమిటో కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు … ఆ తరువాత ఒక split secondలో పగలు రాత్రిగా మారింది. నువ్వు ఇంకా అక్కడే … ఆ సరస్సును స్పష్టంగా చూడగలుగుతున్నావు ఆ చీకట్లో … వెన్నెల లేని కాంతిలో … ఆకాశంలో నక్షత్రాలని కూడా కనిపించాయి … భూమికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రాలు … చల్లని గాలి  … అదే గాలి … అవే నీళ్లు … కానీ ఇప్పుడు ఉప్పగా తోచాయి … కాదు … you ‘felt’ that saltiness … that taste … నీలో … ఆ నీళ్ళని చూడటానికి దగ్గరగా ముందుకు జరిగావు … అద్దంలోకి చూసినట్టు …  you felt as if the waves were saying something to you … you wanted to know what they were saying … you bent over … బహుశా నీ ముఖాన్ని లేదా whatever that ‘I’ is in you … you have brought it closer to the water … water that turned to a mirror … all you could see was another mirror inside that mirror … within it another one …. within it another … the only thing that distinguishes one mirror from the other is the frame … the border … without which you will never know if there is one mirror or many … ఆ అద్దాలు … అద్దాలలోని ఆ అలలు నీకు  ఏదో చెప్పాయి … ఆ రాత్రి … the last thing you remember was a thought … (the only thing that is left the next morning) … ‘are you already cemented inside a mirror? Are you already inside a mirror that reflects another mirror that reflects another one ad infinitum?’ … ఏదో buzzing sound … నీలో … చుట్టూ … అంతటా … ఒక్కసారిగా నల్లని తెర ఏదో పడినట్లయ్యి … నీ ముందు blankness … ఆ తరువాత ‘నువ్వు’ లేవు!

***

Part II of Chapter III of Home: A Memoir (The Years 1996 -2000)

శ్రీకాంత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.