రాయని కవిత్వం చదవాలంటే…

1.

 

నీ కళ్లు

 

రాసిన

కవిత్వం

చదవాలంటే

నా కళ్లు చాలు

 

రాయని

కవిత్వం

చదవాలంటే

నీ కళ్ళను చూడాలి

2.

 

నీ కోసం

 

నీ కోసం

మనసులో కొంత ఖాళీ కాదూ

మనసే లేని ఖాళీనై పోయాను

 

3.

 

ప్రేమైక్యం

 

నువు నీతో వున్నట్టే నాతో వుంటావు

నీలో నువ్వు సంచరించడానికి

నా సమక్షమొక దారి

 

నేను నాలో లేనట్టే నీతో వుంటాను

నాలో నిను ఉత్సవించడానికి

నీ సావాసమో కచేరీ

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.