రేపటి పోరాటం కోసం

నిర్జనారణ్యంలో టార్పాలిన్ పైన
నిద్రిస్తున్న నిన్ను
సీతాకోక చిలక ముద్దుపెట్టుకుంది.
అన్ని సౌకర్యాలూ  వదులుకున్న
నగ్న పాదాలు
అడవిలో గ మ్యాన్ని వెతుకుతున్నాయి.
రేపటి పోరాటం కోసం
ఈ రోజు
నీ నిద్రను పొదుపు చేసుకుంటున్నావు.
చెల్లే-
నీ పోరాటం ముందు మాది అసలు పోరాటమేనా?
నేను నీలాంటి విప్లవాన్ని కలగంటున్నాను.
యుద్ధభూమిలో సాయుధంగా నిలిచిన నీ ముందు నేనెక్కడ ?
రాజ్యపు అణచివేత అర్ధమవుతుంది,
కానీ రక్తచరిత్రలోనే నిత్యం జీవిస్తున్న నీ ముందు నేనెక్కడ ?
విముక్తి కోసం  ఆశ ఉంది .
చెల్లే-
విముక్తి కోసం
అజ్ఞాతజీవితం ఎంచుకున్న నీ ముందు నేనెక్కడ ?
వ్యవస్థపై పోరాడాలనే ఆశయం ఉంది
వ్యవస్థ మార్పులో కోసం
అమరత్వం పొందిన నీ
 ముందు నేనెక్కడ ?
అచేతనంగా పడుకుని
విప్లవాలను స్వప్నిస్తున్న నిన్ను
సీతాకోకచిలుక ముద్దు పెట్టుకుంది.
నేను
ఇక్కడ
విప్లవాన్ని
కలగంటున్నాను.
*
జాబిలి పుట్టింది, పెరిగింది హైదరాబాద్. అశోక యునివర్సిటీ నుండి లిబరల్ స్టడీస్ లో పోస్ట్-గ్రాజుయెట్ డిప్లొమా పొందింది. ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. చిన్నప్పటినుండీ చదవడం, రాయడం అంటే ఆసక్తి. 2016 లో తన కవిత్వ సంపుటి ‘Quill’ ప్రచురించింది. 

జాబిలి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు