1.
మనసులో మాటొకటి
పెదవిపై మాటొకటి
మనిషి మనిషిని కలిసి
కనుగీటు మాటొకటి
కథల కళలకు రాజులో చందమామ!
2.
ఆత్మజ్ఞానంబనుచు
ఆర్తితో పాడేరు
మనిషి ఉనికిని మరచి
మాయనుచు తిరిగేరు
ఏమి భక్తులు వీరు ఓ చందమామ!
3.
మాట దాటును కోట
ఎదురు చెపితే తూట
కథల కలలకి పీట
ఎన్నికలకో బాట
నాయకమ్మన్యులిట ఓ చందమామ!
4.
ముంచునట ఓ మాట
తేల్చునట ఒకటి
నడిసంద్రమున
తెప్ప తగలేయునొకటి
మానవుల మాటలివి ఓ చందమామ!
5.
భూకరించే నొకడు
బుజ్జగించే నొకడు
అణకువగ నటియించి
అదిలించు నొకడు
మానవుల తీరులివి ఓ చందమామ!
*








అద్భుతమైన కవితా సరళి అండ్ శైలి… బావుంది ❤️
చందమామతో మీ సంభాషణలో మనసు కూడా మౌనంగా కలిసిపోయింది
శుభోదయం సార్!
చందమామకు చెప్తూనట్లే చెప్తూ సమాజంలో జరిగే మనుషుల మాటల తీరు, స్వభావం, మాటకి ఉన్న విలువను వర్ణించిన తీరు అద్భుతం!
చిన్న మాటలే కానీ ప్రతిఒక్కరనీ లోతుగా ఆలోచింపచేస్తుంది…
మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్ 💐🙏