ఎండ మండిపోతోంది,
బాటిల్ లో నీళ్ళు అయిపోవచ్చాయి,
ఎన్ని తాగినా గొంతు తడవట్లేదు,
అయినా మిలిగిన చుక్కతో దాహం తీర్చుకోకుండా,
ఎండకి వాలిపోయిన ఓ పక్షి గొంతు తడిపారు,
తిన్న అన్నం ఆవిరై అరిగి ఎగిరిపోతోంది,
అయినా రోడ్డు మీద ఆకలికి అల్లాడిన చిన్న పాప కడుపు నింపారు.
వచ్చే కోపానికి లాటీ పెట్టి, కొట్టే అవకాశం ఉంది,
అయినా ఓపిగ్గా నచ్చచెప్పారు,
మనుషుల్ని తిరిగి ఇంటికి పంపారు,
ప్రాణం మీదికి వచ్చే ప్రమాదం ఉంది,
అయినా సాకు చెప్పి తప్పించుకోరు.
ఆకలినీ, దాహాన్ని, అలసటనీ,
ఎండని, గాలిని, వాననీ,
ఆఖరికి కొరోనాని కూడా పట్టించుకోకుండా,
పెట్టిన టోపీ తియ్యకుండా,
వేసిన యూనిఫారం నలగకుండా,
ధరించిన చిరునవ్వు మాయకుండా,
తమ బాధ్యతలకు మించిన పని చేస్తున్నారు,
దీనికి వారికి పురస్కారాలేవీ అందకపోవచ్చు,
అయినా వారు ఆశించారు కూడా-
*
Add comment