కాసేపు బ్రేక్‌…

క్షతగాత్రుడి ఆఖరిరక్తపు బొట్టు వడ్డించుకుని
అమెరికన్‌ ఆసుపత్రిలో పుట్టాడు మార్క్స్‌
స్టీమ్‌బాత్‌లో జారిన అరిటాకు లుంగీ సాక్షిగా
దాస్తోవిస్కీలో బ్రాహ్మణీకాన్ని కలిపి
నిప్పుపూలు తింటూ ఈ దేహమే నా దేశమనుకుంటూ
ఎక్సైజ్‌ సుంకం కట్టి నా శవాన్ని తాకట్టు పెట్టా!

బెజవాడలో మహిషాసురమర్ధని
పికాసోకు ఫోన్‌ చేసి
మానవత్వాన్ని రీఛార్జ్‌ చేయమని కోరింది
ఆకాశం మేఘాల లిప్‌స్టిక్‌ను పూసుకుని ఎర్రగా నవ్వింది
సత్యాసత్యాల మధ్య జీవన్మృతుడి స్టోరీబోర్డును
ఓ కండోమ్‌ కంపెనీ స్పాన్సర్‌ చేసిందని తెలిసి
అర్ధరాత్రి శరీరాన్ని ఉతికి ఆరేసి 13వ నంబర్‌ బస్సెక్కి
ట్రంప్‌ ఇంటికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌ చేసివచ్చా
భ్రష్టయోగిని కదా!
గ్లాస్కో పంచె ఒక్కటే చాలు
వాడి ప్రమాణస్వీకారానికి
వాషింగ్టన్‌ వాల్‌స్ర్టీట్‌లో
టెస్ట్‌ట్యూబ్‌ బేబీల బీపీని చూస్తూ
ఈశావ్యాసోపనిషత్తు చదువుకున్న తర్వాత
నిద్రముంచుకొచ్చి చలం ఒళ్లో తలపెట్టుకుని
కన్నెచెర విడిపించుకున్నాను
ఇన్నాళ్లకు నా సీరియస్‌ రుతుక్రమంలో పడింది
ఇవాళ్టి నుంచి నా శీలం ఓ స్పాన్సర్డ్ ప్రోగ్రామే!
థాంక్‌ గాడ్‌
స్మశానంలో అయినా సంపెంగపూలు
అమ్ముకుబతికేస్తా
వడ్డేర చండీదాస్‌ మా కజినే…! సేమ్‌క్యాస్ట్‌..

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

వల్లూరి రాఘవ

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉన్మాదానికి ఉద్వేగానికి వేసిన అక్షరాల వంతెన ఈ.. కవిత

  • సాగ‌రం సంగ‌మం సినిమాలో రామ్‌గోప‌ల్ వ‌ర్మ దెయ్య సినిమా క‌లిపి సంగం బ్రూస్‌లీకి సంగం జాకీచాన్‌కి చూపించి మైకెల్ జాక్సన్‌తో చిన‌జీయ‌ర్ స్వామికి షేక్‌హ్యండ్ ఇప్పించి సుబ్బ‌య్య హోట‌ల్ కూర్చుని ర‌మ్ము తాగినంత కిక్‌వ‌చ్చింది. ఈ క‌విత చ‌దివి…….వేగుంట మోహ‌న ప్ర‌సాద్ లేని లోటు తీర్చాడు వ‌ల్లూరి రాఘ‌వ‌……అప్పుడ‌ప్పుడు మెంట‌ల్ వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి క‌విత చ‌దివి రిలాక్స్ కావ‌చ్చు……జ‌య‌రామ్ క‌ర్పూల్‌

  • eedi kasepu Break Kaadu…..Kasepu Shek….Sirreallystic way lo Thega Recchi Poyaru e Rachayitha Address Cheppagalaru….

  • పడుపుగత్తె రాక్షస రతి లో అని శ్రీ శ్రీ వాడిన పద బంధానికి
    ఈతరం అర్థం చెప్పిన అది వాస్తవిక అక్షర విన్యాసం పోరాట
    సన్యాసం ఈ కవిత్వం…జేమ్స్ వర్డ్స్ ఫర్ ది ఈస్ట్ కవిత
    గుర్తుకుతెచ్చారు. ఫ్రూస్ట్రేషన్లో కూడా ఇంత పాండిత్యం
    ఉంటుందని ఇప్పుడే తెలిసింది.

  • పిచ్చి కె పిచ్చి ఎక్కిపోతే ఇలాగే ఉంటుంది
    అసలు ఈ కవిత ఎవరిమీద దాడి దేని మీద పోరాటం
    ఏడుకు ఇంట అసహనం ప్రపంచం లోని అన్ని నిజాలను
    అన్ని ఇజాలను కలిపితాగేసిన కాక్టెయిల్ ఇది రచయితను ఎం చేయాలో
    తెలియటం లేదు.వినూత్న అనుభవం విచిత్ర అనుభూతి
    మొత్తానికి బాగా బ్రేక్ ఇచ్చారు.

    కే ఏడుకొండలు (తెనాలి)

  • ప్రపంచీకరణతో మారిన తాత్విక ధోరణులపై విసుగెత్తిపోయిన కవి హృదయానికి అక్షరదర్పణం ఈ కవిత్వం. అద్భుతమైన శిల్పంతో పరిగెత్తించింది ఈ కవిత. వేగం, ఉద్వేగం, ఈ కవితకు రెండు కళ్లు కావటం ఇందులోని అసలు టెక్నిక్

  • వికటించిన మానవీయత తాలూకు నెప్పి గాయం

    అక్షరక్షరానా కనిపించాయి.రాఘవ గారి భాద అంతా

    పాండిత్యం మీదా ఆజ్ఞానం మీదా పరాజయం మీదా

    దేనిమీదో ఆయనీ చెప్పలేని స్థితి …న్యూరో సర్జన్ కు సైతం

    అర్ధం కానీ మెదడు నరాల అలజడి ఈ కవిత

    చాలా కస్టపడి రాసినట్టున్నారు పాపం -సాయి కుమారి

  • హిచ్‌ కాకే బతికి ఉంటే.. షేక్‌ స్పియర్స్‌ ను హీరోగా పెట్టి.. మడోన్నాను హీరోయిన్‌గా.. అకిరా కురసోవాతో డైరెక్షన్‌ చేయించి..ఈ తరం ఆలోచనలను మార్చివేసి.. మరో తరానికి సరికొత్త నిచ్చెన వేసేలా.. అణు విస్ఫోటనం చెందేలా.. మనిషి అనే పదార్థంతో ఫుట్‌బాల్‌ ఆడుకుని..రగ్బీతో ర్యాగింగ్‌ చేసి.. మెదడులోని లక్షల కిలోమీటర్ల వెంట్రుకంత నరాలకు సెలైన్‌ బాటిల్స్‌ ఎక్కించేలా… చేసిన రాఘవగారి రచన రాటుదేలిన రచయితలకే ..మరపురానంతగా.. ఈ సంవత్సర అరుదైన..అద్భుతమైన.. అతి బుల్లి కవితకు నీరాజనం.

  • తాదాత్మ్య విచ్చిత్తి అనేది ఒక సాహిత్య లాకాశనం. పాఠకుడి మూడ్
    ను బొంగరం లా తిప్పుతూ చివరికి శున్యాన్ని మిగిలించడం
    అనేది ఒక అనుభూతి ప్రయోగం ..రచయితకు ఎంతో మానసిక
    అవగాహన విద్వత్తు ఉంటే గాని ఇది సాధ్యం కాదు. అర్ధం అవ్వడం ఎంత ముఖ్యమో
    అర్ధం కాక పోవడము అంటే ముఖ్యం.మొదటిది అనుభూతి రొండోది
    అనుభవం. ఈ రెంటిని ఒకే చోట చూపించిన ఆధునిక అద్భుతం ఈ కవిత
    చాలా వెంటాడుతోంది-చెన్నా గోపాల కృష్ణ ఏలేశ్వరం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు