నా లోపల జ్ఞాపకాల కొండ
పెరుగుతూ తరుగుతూ
నాతోనే కొనసాగుతోంది
ఎప్పటి నుండో ఏమో
దాని పొరలు పొరల్లో
ఎన్నున్నాయో ఏమున్నాయో
కావలసింది అందులో
చటుక్కున దొరుకుతే
ఆ కొండ గుర్తుకురాదు
దొరకనపుడే
ఆశాచావదు వెతికేపనీ ఆగదు
దాని
పెరుగుదల ఆగిపోతుందో
ఉన్నా అరిగిపోతుందో
పాతవాటిని పారేస్తుందో
ఏదీ తెలియదు
ఒకటి పనిచేయనపుడు
ఇంకొకటి పనిచేసేలా
ప్రత్యామ్నాయ జ్ఞాపకం కొండ
మరొకటి
దానికీ ఉంటే
ఎంత బాగుండును
*
బావుంది సర్
చాలా బాగుంది సార్
కనిపించని కొండను కనిపింపజేశారు. ఇంకా అది పెరిగినా అరిగినా మిగిలే ఉంటుంది. ఎప్పట్లానే అలతి అలతి పదాలతో అర్థ గాంభీర్యంతో మీ పద్యం చాలా హృద్యంగా ఉంది.
ఙాపకాల పొరల్లో దాగిన అనుభూతుల దొంతరల ప్రతీక చాలా బాగుంది.