కనిపించని కొండ

నా లోపల జ్ఞాపకాల కొండ

పెరుగుతూ తరుగుతూ

నాతోనే కొనసాగుతోంది

ఎప్పటి నుండో ఏమో

 

దాని పొరలు పొరల్లో

ఎన్నున్నాయో ఏమున్నాయో

 

కావలసింది అందులో 

చటుక్కున దొరుకుతే

ఆ కొండ గుర్తుకురాదు

దొరకనపుడే

ఆశాచావదు వెతికేపనీ ఆగదు

 

దాని

పెరుగుదల ఆగిపోతుందో

ఉన్నా అరిగిపోతుందో

పాతవాటిని పారేస్తుందో

ఏదీ తెలియదు

 

ఒకటి పనిచేయనపుడు

ఇంకొకటి పనిచేసేలా

ప్రత్యామ్నాయ జ్ఞాపకం కొండ

మరొకటి

దానికీ ఉంటే

ఎంత బాగుండును

 *

ముకుంద రామారావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కనిపించని కొండను కనిపింపజేశారు. ఇంకా అది పెరిగినా అరిగినా మిగిలే ఉంటుంది. ఎప్పట్లానే అలతి అలతి పదాలతో అర్థ గాంభీర్యంతో మీ పద్యం చాలా హృద్యంగా ఉంది.

  • ఙాపకాల పొరల్లో దాగిన అనుభూతుల దొంతరల ప్రతీక చాలా బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు