ఏకాకి వలపోత

నీడలు తెగిపోతాయి

జీవితం ఉన్నట్టుండి ఒక జ్ఞాపకమై వెంటాడుతుంది

ఎంతకూ తీరని వేదన

మనస్సు పొరల నిండా నిండుకుంటుంది

 

కళ్లముందే చూస్తుండగా

మూడురాళ్ల పొయ్యి కూలిపోతుంది

ఎవరి దారిన వారు పాత్రలు ముగించుకొని వెళ్లిపోతారు

మిగిలిన ఒత్తుకుండా

ఏ ఒంటరి జీవితాన్ని ఈదుతుందో

ఎవ్వరికీ పట్టదు

 

ఎన్ని ముచ్చట్లను కుప్పలు పోసి చలికాచుకున్నారో

సూర్యోదయాలు, సూర్యస్తమయాలకు

జీవిత రంగుల్ని పులిమిన ఘడియలు ఏమయ్యాయి

 

ఎవరికి ఎవరు ఎట్లా దొరికారు

సంధ్యా సమయ తీరాన

నాలుగు ముచ్చట్లే కదా ఓదార్పు

 

కూర్చున్న చెట్టు నీడ కాదు

చెట్టే మాయమవుతుంది

గుర్తులు మాయమవుతాయి

వెనక్కి తిరిగి చూసుకుంటే

అలుముకున్న శూన్యమే కనిపిస్తుంది

 

కాలం వెనక్కి తిరిగిరాదు

జీవితాలు మళ్లీ రావు

మాటల్లో దొర్లాడిన కష్టం సుఖం ముఖం చూపించదు

అంతా చరిత్రలోకి చేరిపోతుంది

రేపు పుట్టబోయే వాడికి ఏ గతమూ తెలియదు

ఒకనాడిట్లా ఉండేదని చెప్పేవాడేవడు?

ఈ బతుకును ప్రేమించేవాడెవడు?

అంతా ఏకాకి వలపోత

(కరోనా ఐసోలేషన్ లో)

*

పసునూరి రవీందర్

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • …మూడు రాళ్ల పొయ్యి కుప్ప కూలుతుంది.

    .. nice anna

    • వెనక్కి తిరిగి చూసుకుంటే
      అలుముకున్న శూన్యమే కనిపిస్తుంది ….

      అంతా ఏకాకి వలపోత …
      జీవిత తాత్వికతను తెలిపారు అన్న ….

  • “ఒకనాడిట్ల ఉండేదని చెప్పేవాడేవాడు ?
    ఈ బతుకును ప్రేమించే వాడేవడు
    అంతా ఏకాకి వలపోత”
    బాగుంది 👌

  • కరోనా చాలా మందిని ఏకాకులను చేసింది
    ఇది అందరి వలపోత.
    మీరన్నట్టు ఎవరికైనా నాలుగు ముచ్చట్లే కదా ఓదార్పు..
    చాలా బాగుంది అన్న..

  • “రేపు పుట్టబోయే వాడికి ఏ గతమూ తెలియదు
    ఒకనాడిట్లా ఉండేదని చెప్పేవాడేవడు?”
    – ఈ కవితనే కదా రేపటి వాళ్ళకి తెలియజేసేది . ఇంకా ఇలాంటి సాహిత్యం రావాలి రేపటి తరాలకి తెలియచేయడానికి .

    • కళ్లముందే చూస్తుండగా

      మూడురాళ్ల పొయ్యి కూలిపోతుంది

      ఎవరి దారిన వారు పాత్రలు ముగించుకొని వెళ్లిపోతారు
      మిగిలిన ఒత్తుకుండా
      ఏ ఒంటరి జీవితాన్ని ఈదుతుందో
      ఎవ్వరికీ పట్టదు.

      నిజమే… అన్నా
      మనిషి పాత్ర ఎంత సాదించిన ఎమి మిగలదు చివరికి కాలి పాత్రయే… తప్ప!🙏
      మల్లి ఎవడో ఓకడు ఆపాత్రలో ఇమడాల్సిందే… కోనసాగాల్సిందే….

  • kaalam venakki thirigi radu…
    jeevitam thirigi radu.. kasta sukhala madhya ontaritanam vedana baga cheppavu Ravinder ..Abhinandanalu

  • ..మూడు రాళ్ల పొయ్యి కుప్ప కూలుతుంది.

    “ఒకనాడిట్ల ఉండేదని చెప్పేవాడేవాడు ?
    ఈ బతుకును ప్రేమించే వాడేవడు
    అంతా ఏకాకి వలపోత”..…
    చాలా బావుంది అన్నా…వర్తమాన వాస్తవం…

  • ఏకాకి వలపోత – కరోనా ఇసోలేషన్ ఏకాంత స్పందన 🙏🌹

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు