సాయంత్రం మెల్లగా చీకటిలోకి జారిపోతున్న వేళ.
కొద్దికొద్దిగా ముదురు వెలుతురులో కలిసిపోతోంది. ఇంటి ముందున్న నేరేడు చెట్టు ఆకులు గాలికి తేలికగా ఊగుతూ, నిశ్శబ్దాన్ని శబ్దంతో మరింత అందంగా మారుస్తున్నాయి. వాకిట్లో నేల వాసన, దూరంగా వినిపిస్తున్న ఎద్దుల గంటలు, అప్పుడప్పుడు వినిపించే పక్షుల అరుపులు అన్నీ కలసి ఒక పల్లె సాయంత్రానికి సజీవ చిత్రంలా నిలుస్తున్నాయి.
ఆ ఇంటి మధ్యలో, చెక్కతో చేసిన కుర్చీలో శాంతమ్మ నిశ్చింతగా కూర్చుంది. కాలం తనపై వేసిన ముద్రలు ఆమె ముఖంపై కనిపిస్తున్నా, ఆ చూపులో మాత్రం ఓ శాంతి, ఓ నిండుదనం ఉంది. చిన్న ఉద్యోగంతో జీవితాన్ని మొదలుపెట్టి, ఎన్నో కష్టాలు దాటుకుని, ఇప్పుడు రిటైర్ అయి ఊరికి చేరి, తన ఐదు ఎకరాల పొలంలో తనకు తానుగా జీవిస్తోంది.
********
తన ఇద్దరు ఆడపిల్లలను ఎంతో కష్టపడి చదివించి, మంచి స్థాయికి తీసుకెళ్లి, సరైన సంబంధాలు చూసి పెళ్లి చేసింది.
పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ వాళ్లకి ఏ లోటూ రాకుండా, అవసరమైనప్పుడు అండగా నిలబడి, మమతతో ఆదుకుంటూ ఉంటుంది. తన ఇద్దరు కూతుళ్లు సిటీలో స్థిరపడి తమ తమ కుటుంబాలతో బిజీగా ఉన్నా. బతుకమ్మ, బోనాలు, యాసంగి ఏ పండుగైనా, ఈ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోవాల్సిందే అన్నది శాంతమ్మ నియమం. మొన్నే పరీక్షలు ముగిశాయి. మనుమలు, మనవరాళ్లు నలుగురు గాలివానల్లా ఇంట్లోకి చేరిపోయారు. వారి అడుగుల శబ్దం, నవ్వుల సందడి, చిన్నచిన్న గొడవలు ఇంట్లో ప్రతి మూలను మళ్లీ జీవంతో నింపేశాయి. వాకిట్లో పరుగు తీస్తూ, చెట్టు కింద కూర్చొని ఆటలు ఆడుతూ, ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా ఉండని ఆ పిల్లలను చూస్తూ, శాంతమ్మ కళ్లలో ఆనందం మెరిసింది. ఆ దృశ్యాన్ని ఆస్వాదించింది. ఈ క్షణాలే నిజమైన విశ్రాంతి అనిపించాయి.
*********
ఆమె చుట్టూ ముగ్గురు పిల్లలు చేరి కూర్చున్నారు.
వాకిట్లో గాలి మెల్లగా వీచుతోంది.. అమ్మమ్మ దగ్గర కథ వినడం. ఈసారి కూడా వాళ్ల కళ్లల్లో అదే ఆసక్తి, అదే ఎదురు చూపు. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు “అమ్మమ్మా…” అని చిన్నది మెల్లగా పిలిచింది. “ఏమమ్మా?” అని శాంతమ్మ ప్రేమగా చూసింది. “ఒక మంచి కథ చెప్పు… ఈరోజు పెద్దదిగా చెప్పాలి,” అని కొంచెం అల్లరి కలిపిన స్వరంలో అంది. పక్కనే ఉన్న అబ్బాయి వెంటనే మధ్యలో దూకాడు. “అమ్మమ్మా! రాజులు, రాణుల కథలు వద్దు. మాకు కొత్తగా ఏదైనా చెప్పు.” మరొక అమ్మాయి నవ్వుతూ, “అవును అమ్మమ్మా… మనకు అర్థమయ్యేలా ఉండాలి. సినిమాల్లా ఉండాలి,” అంది. శాంతమ్మ వాళ్లని ఒకసారి చూసి నవ్వుకుంది.
“అలానా? అయితే మీరే చెప్పండి… ఏం కథ వినాలనుకుంటున్నారు?” అని అడిగింది.
పిల్లలు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. కాసేపు నిశ్శబ్దం. అప్పుడే చిన్నది కళ్లల్లో మెరుపుతో, “లవ్ స్టోరీ!” అని గట్టిగా అంది. “అవునవును … లవ్ స్టోరీ చెప్పు అమ్మమ్మా!” అని మిగతావాళ్లు కూడా కలిసిపోయారు. ఆ మాట విన్న శాంతమ్మ నవ్వింది. ఆ నవ్వులో కొంచెం ఆశ్చర్యం, కొంచెం ఆనందం కలిసిపోయాయి. “లవ్ స్టోరీ అంటే…” అని ఆమె మెల్లగా ప్రారంభించింది. ఆమె కళ్లలో ఒక్కసారిగా ఏదో గతాన్ని తలుచుకున్నట్టా, లేక ఏదో అనుభవం గుర్తొచ్చినట్టు . ఆలోచిస్తుంది పిల్లలు ఆసక్తిగా ఆమె ముఖం వైపు చూస్తున్నారు. “ఏమైంది అమ్మమ్మా? చెప్పు కదా…” అని ఆత్రంగా అడిగారు. శాంతమ్మ కాసేపు ఆలోచించి, “సరే… నేను మీకు ఒక కథ చెప్తాను. కానీ ఒక షరతు,” అంది. “ఏమిటది?” అని ముగ్గురూ ఒకేసారి అడిగారు. “కథ నేను చెప్తాను… కానీ దానికి ముగింపు మాత్రం మీరు చెప్పాలి,” అని మెల్లగా అంది. పిల్లలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు అయోమయం. వెంటనే
“సరే! మేమే చెప్తాం ముగింపు!” అని ముగ్గురూ ఒకేసారి అంగీకరించారు. శాంతమ్మ కుర్చీలో కాస్త సర్దుకుని కూర్చుంది. పిల్లలు ఇంకా దగ్గరగా చేరారు. గాలి కూడా ఆగి వినిపిస్తున్నట్టుంది. ఆమె నెమ్మదిగా కథ ప్రారంభించింది.
*******
ఒక అమ్మాయి ఉంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాలో ఆమె పేరు చాలామందికి తెలుసు. ఆమెను కేవలం “ఇన్‌ఫ్లుయెన్సర్” అని చెప్పడం సరిపోదు. ఆమె రాసే. ప్రతి పోస్టు వెనుక ఒక ప్రశ్న ఉంటుంది. ప్రతి ప్రశ్న వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. ఆమె చాలా అందంగా కూడా ఉంటుంది కానీ ఆమెను గుర్తుంచుకునే వాళ్లు ఆమె రూపం వల్ల కాదు, ఆమె మాటల వల్ల. మహిళా స్వేచ్ఛ, కుల వివక్ష, సామాజిక అసమానత ఇలాంటి విషయాలపై ఆమె రాస్తుంది. పోస్టులు చదివిన వాళ్లు కేవలం లైక్ చేసి వెళ్లిపోరు. ఆలోచిస్తారు. చర్చిస్తారు. కొన్ని సార్లు తమ అభిప్రాయాల్ని మార్చుకుంటారు. ఆమె పేరు భువిక. సోషల్ మీడియా గుర్తింపు తో పాటు , అభిమానులు చాలా మంది ఉన్నారు, రాత్రి ఒక్కటిన్నరవుతోంది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఫోన్ వెలుతురు మాత్రమే ఆమె ముఖాన్ని తాకుతోంది. భువిక తన ఫోన్ స్క్రీన్‌కి ఎదురుగా కూర్చొని ఆలోచనలను పదాలుగా మార్చుతోంది. ‘సమానత్వం అనేది ఒక నినాదం కాదు. అది మన దైనందిన నిర్ణయాల్లో కనిపించాలి’ అని టైప్ చేసి కాసేపు ఆగింది. మళ్లీ చదివింది. ఆ మాటల్లో తననే చూసుకుంది. తర్వాత మెల్లగా “పోస్ట్” బటన్ నొక్కింది. కొన్ని సెకన్లలోనే నోటిఫికేషన్ టోన్ వరుసగా మోగడం ప్రారంభమైంది. లైక్స్, షేర్లు, కామెంట్లు ఇవి అన్నీ ఆమెకు కొత్తవి కావు. ప్రతి పోస్టుకూ ఇదే స్పందన. కానీ ఆ శబ్దాల మధ్యలో కూడా, ఆమె మనసులో మాత్రం ఒక మౌనం ఉంటుంది. కొద్దిసేపటికి ఆమె ఫోన్ సైలెంట్‌లో పెట్టింది. బెడ్‌పై ఒంటరిగా పడుకుంది. కాసేపటికి ఆ స్క్రీన్ వెలుతురు కూడా ఆరిపోయి ఒక ఖాళీ మిగిలింది. ఆ ఖాళీలో మెల్లగా వినిపిస్తున్న ఒక ప్రశ్న “నన్ను నిజంగా అర్థం చేసుకునే ఒక్క మనిషి ఉన్నాడా?” అని ఆలోచిస్తూ మెల్లగా మొబైల్ తీసుకుని టైప్ చేస్తుంది: “Ideal partner ఎలా ఉండాలి?” టైప్ చేసిక వేళ్లు కాసేపు ఆగయీ … తర్వాతతెలుగు టైప్ చేస్తు: “నా లాంటి అమ్మాయిని అర్థం చేసుకునే అబ్బాయి ఎలా ఉంటాడా ? ” అని చాట్ జీపీటీ ఆడుతుంది వెంటనే నీకు నచ్చే అబ్బాయి అంటే నీ అభిప్రాయాలను తప్పు అనకుండా…అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు . నువ్వు మాట్లాడితే నీ వెర్షన్ ని గౌరవిస్తాడు నీ స్వప్నాలు సాధించడానికి నీతో పాటు నడుస్తాడు ముక్యంగా నీ స్వేచ్ఛను నీకు ఇచ్చేవాడు కావాలి కదా అని ఇస్తుంది భువి నవ్వి (నెమ్మదిగా) అలాంటోడు నిజంగానే ఉంటాడా అని అని టైప్ చేయగానే ఇంచు మించు ఇలాగే ఒకడు ఉన్నాడు. నీ ఇంస్టా కామెంట్స్ చూడు దొరుకుతాడు అని ఇస్తుంది స్క్రీన్ వెలుగు భువిక ముఖంపై పడుతుంది. ఎప్పుడు కామెంట్స్ చూడని భువి ఫస్ట్ టైమ్ కామెంట్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో కామెంట్స్ స్క్రీన్ పై కనిపిస్తుంటాయి . డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ స్క్రోల్ అవుతూ చివరికి ఒక్క కామెంట్ దగ్గర అగుతుంది .
******
ఆమె వేళ్లు స్క్రీన్‌పై మెల్లగా కదులుతున్నాయి. ఒక్కో కామెంట్‌ను చదువుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక కామెంట్ దగ్గర ఆగి చదువుతుంది “మీరు చెప్పేది కేవలం సిద్ధాంతం కాదు. మీరు అనుభవించిన ఆలోచనలా అనిపిస్తోంది.”అని వివరంగా రాసిన ఆ కామెంట్ చదివి కింద ఇంకో పోస్ట్ కామెంట్స్ ఓపెన్ చేసి ఆ ప్రోఫైల్ కామెంట్ “సమానత్వం గురించి మాట్లాడటం సులభం. కానీ మన జీవితం దానికి సరిపడేలా మార్చుకోవడం కష్టం.”అని ఇంకా బలంగా చాలా చెప్పాడు ఆమె రాసిన పోస్టుకంటే లోతుగా ఆ అంశం చూసినట్టు అనిపించింది ఇంకా చాలా పోస్ట్ లకు అతని కామెంట్స్ చూశాక కళ్లలో చిన్న వెలుగు మెరిసింది. “ఇతను… అర్థం చేసుకున్నాడు…” మనసులో అనిపించింది చుట్టూ ఇంకా నోటిఫికేషన్‌లు వస్తూనే ఉన్నాయి. వందల కామెంట్లు. వేల స్పందనలు. కానీ ఆ క్షణంలో అతని కామెంట్స్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయాలా… వద్దా… అనే చిన్న సందేహం. కొన్ని క్షణాలు చూస్తూనే ప్రొఫైల్‌ను ఓపెన్ చేసింది. ఎలాంటి హడావిడి లేని ఫీడ్. కొన్ని సాధారణ పోస్టులు. ఎక్కడో చదివిన పుస్తకాల కోట్స్. ఎక్కడో చూసిన జీవితపు చిన్న చిన్న ఆలోచనలు. కానీ వాటిలో నిజాయితీ. భువిక ఫోన్‌ను కొంచెం దగ్గరగా తీసుకొని “ఇలాంటి వాళ్లు… ఇంకా ఉన్నారా?” ఆమె మనసులో అనుకోని డైరెక్ట్ మెసేజ్ ( డి ఏం ). చేయాలా? వద్ద అని ఒక చిన్న నవ్వు సందేహంతో కలిసిన ధైర్యం. చివరికి “హాయ్..” అంతే. రెండు అక్షరాలు. ఎవ్వరికీ మెసేజ్ చేయని
భూవిక మెల్లగా “సెండ్” నొక్కింది. స్క్రీన్‌పై ఆ మెసేజ్ కనిపించింది.
*******
రెండు రోజులు అలా గడిచిపోయాయి. భూవిక పంపిన మెసేజ్‌కి వెంటనే రిప్లై రాలేదు. మొదట్లో ఆమెకు అది పెద్దగా అనిపించలేదు.తరువాత ప్రతి గంటకీ ఫోన్‌ని చూడటం అతని మెసేజ్ రాకపోవడం కొంత ఒత్తిడి కి గురి చేసింది ఒక్కో క్షణం భారంగా మారింది. ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారి అదే ఎదురవడంతో ఆ ఆశ మెల్లగా అలసిపోయీ . “ఏం అయి ఉంటాడు?” అన్న ప్రశ్న మాటలుగా బయటకు రాకపోయినా, ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ తెలియని భయం కూడా స్టార్ట్ అయ్యింది ఆ రెండు రోజులు ఆమెకు ఓ అస్పష్టమైన ఆందోళనగా మిగిలిపోయాయి. మూడవ రోజు సాయంత్రం… ఆ మెసేజ్ వచ్చింది దానితో ఒక్కసారిగా తన లో ఉన్న భయం చెరిగిపోయి భారమంతా కరిగిపోయింది. “Sorry… ఒక పని కారణంగా సోషల్ మీడియా కి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది.” ఎలా ఉన్నారు అని మెసేజ్ చేశాడు భువి వెంటనే రిప్లై ఇవ్వలేదు. “ఇప్పుడు ఎలా మాట్లాడాలి?” కాసేపు ఆగి, టైప్ చేసింది:. ” కొద్దిసేపటి తర్వాత అతని రిప్లై వచ్చింది. అవి సాధారణ మాటలకన్నా , భావాలు గా రూపం దిద్దుకునేవి. అతను వెంటనే రాయడు. కానీ రాసినప్పుడు ప్రతి పదం నిజంగా ఉండేది. కొన్నిసార్లు వెంటనే వచ్చే సమాధానాలు కాదు, ఆలస్యంగా వచ్చే భావాలే మనసును ఎక్కువగా తాకుతాయి అని భూవికకి అర్థమైంది…“మీకు రాయడం ఎలా మొదలైంది?” అని అతను అడిగితే, ఆమె తన కథలో కొంత భాగం చెప్పింది. “మీరు ఇలా ఆలోచించడానికి కారణం ఏమిటి?” అని ఆమె అడిగితే, అతను తన అనుభవాల్లోని కొన్నింటిని పంచుకున్నాడు. తెలియకుండానే వారి మధ్య ఒక సూక్ష్మమైన అనుబంధం అల్లుకుపోవడం ప్రారంభమైంది. రోజులు వాటంతట నడుస్తున్నాయి. భువికకు మాత్రం అవి వేగంగా మారిపోతున్నట్టే అనిపించాయి. ప్రతి రోజు, ప్రతి రాత్రి ఆమె జీవితంలో ఒక కొత్త భాగం చేరినట్టుంది. ఆ భాగం పేరు ‘చాట్’.
****
మొదట ఒక సాధారణ పరిచయంలా ప్రారంభమైన చాట్ రోజులు గడిచే కొద్దీ అది ప్రత్యేకమైన ప్రపంచంగా మారిపోయి ఇద్దరి మధ్య మాటలు భావాలు పంచుకోవడం పెరిగి రోజురోజుకు మరింత లోతుగా మారాయి. చిన్న చిన్న గొడవలు వచ్చాయి, కానీ అవి ఎప్పుడూ దూరాన్ని పెంచలేదు. ఒకరి మాటను మరొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు. “భువిక” అందరికీ పరిచయం. కనుక అతనికి కనబడుతుంది కానీ భూవిక కి అతని ముఖం తెలియదు. చాట్లో కాల్ లో అడిగితే అతను ఎప్పుడూ చెప్పేది ఒకటే “సమయం వచ్చినప్పుడు నా ముఖాన్ని డైరెక్ట్‌గా నీకు చూపిస్తాను. అంటాడు ఆమెకు ఈ మాట కాస్త వింతగా అనిపించిన . “నువ్వు నన్ను చూస్తున్నావు, కానీ నాకు నువ్వు ఎందుకు కనబబడవు ?” ఎన్నోసార్లు అడిగేది. అతను ఎప్పుడూ చిరునవ్వుతో దాగడం కాదు సరైన క్షణం కోసం ఎదురుచూడటం అనే సమాధానం ఇచ్చేవాడు “ఒక రోజు, సాధారణంగా సాగుతున్న వారి చాట్ మధ్యలో భువిక “ కలుద్దామా?” అని అడిగింది. ఏమంటాడో అని ఆమె హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను సరే అంటాడు . ఎక్కడ కలుద్దాం. కాఫీ షాప్… మల్టీప్లెక్స్ థియేటర్. మాల్ ఎక్కడ బాగుంటుంది. ఇవన్నీ రొటీన్ కదండి. ఐతే ఎక్కడ ఏదైనా పబ్, పార్క్ etc ….. నాకు అలాంటివన్నీ నచ్చవు అంటే హైదరబాదే కదా అంటుంది భూవిక, హైదారాబాద్ అంటే, మాల్స్, మల్టీప్లెక్స్ లు, పబ్ లే కాదండీ మీకు తెలియని సిటీని చూపిస్తాను అంటాడు పెద్ద ప్లానే వేశారు. అని నవ్వుతూ. టైమ్ ప్లేస్ ఫైనల్ అంటుంది మూడు రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది. ఆ ఉదయం నుంచే భువిక మనసులో అనేక ప్రశ్నలు. “అతను నిజంగా నేను ఊహించినట్టే ఉంటాడా?” “ఈ అనుబంధం నిజజీవితంలో కి వెళ్తుందా లేదా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ డే ఏ డ్రెస్ వేసుకోవాలా అని రకరకాల డ్రెస్ లు, హెయిర్ స్టైల్ మార్చుకుంటూ చూసుకుంటుంది భువిక ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఇది కేవలం ఒక కలయిక కాదు, ఒక అనుభవం అవబోతుందని ఆమెకు అనిపించింది.
*****
ఆ ఉదయం భువిక చార్మినార్ దగ్గర నిలబడి ఉంది. చుట్టూ జనసందోహం, వీధి వ్యాపారుల పిలుపులు, బెలూన్ల రంగులు, గాలిలో కలిసిన సెంటు వాసనలు… అన్నీ కలిసి ఒక గొప్ప ప్రపంచం చూస్తాన్న శబ్దాల మధ్య ఆమెకు మాత్రం తన గుండె చప్పుడే ఎక్కువగా వినిపిస్తోంది. ఆన్లైన్‌లో గంటల తరబడి మాట్లాడిన అతను… ఇప్పుడు నిజంగా కళ్లముందు రాబోతున్నాడు. ఆ ఒక్క ఆలోచనే ఆమె మనసులో వేల భావాలను కలిపి అన్నీ ఒకేసారి ఊపిరిలో కలిసిపోయినట్టు అనిపించింది. ప్రతి వచ్చే మనిషిని ఒక్కసారి చూసి… “ఇతనేనా?” అనే ప్రశ్నతో ఆమె మనసు తర్జనభర్జన పడుతోంది. ఆ క్షణాల్లో కాలం కూడా నెమ్మదిగా ఆగిపోయినట్టే అనిపించింది. చుట్టూ ప్రపంచం కదులుతున్నా… ఆమె లోపల మాత్రం ఒకే ఎదురుచూపు. అప్పుడే… దూరంగా, జనాల మధ్య నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా ఆమె వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ గందరగోళం మధ్య కూడా అతని నడకలో ప్రశాంతత భువిక గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. “అతనేనా…?” “లేదా ఇంకెవరైనా…?” అతను దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమె ఊపిరి మరింత వేగంగా మారింది. ప్రపంచం మొత్తం ఒక క్షణం ఆగిపోయినట్టుగా అనిపించింది. చివరికి అతను నేరుగా ఆమె ఎదురుగా వచ్చి నిలబడి చిరునవ్వుతో… “హాయ్…” అన్నాడు. ఊహించిన దానికంటే అతను చాలా అందంగా అనిపించాడు. నిటారుగా నిలిచిన అతని తీరు, ప్రశాంతతను ప్రతిబింబించే ముఖం, మాటలు లేకుండానే నమ్మకాన్ని చెబుతున్న కళ్ళు… ఇవన్నీ ఆమె మనసును ఒక్కసారిగా మౌనంలోకి తీసుకెళ్లాయి. ‘ఇతనే…’ అని మనసు లో అనుకోని ఆనందంతో వెలిగిపోయింది స్వరం కొంచెం కంపిస్తూ “హాయ్…” అంది. కొన్ని క్షణాలు ఇద్దరూ మాటలు లేకుండా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రశ్నలు లేవు… భయాలు లేవు ఏదో లోతైన పరిచయంలా అనిపించింది. తెలియని అనుబంధం రూపం దిద్దుకుంటున్నట్టుగా ఉంది. “ఇరానీ చాయ్ తాగుదామా? అన్నాడు అతను ఓల్డ్ సిటీలో చాలా బాగుంటుంది…” కదా అని భువిక చిన్నగా నవ్వింది. “ఓల్డ్ సిటీ అనకండి… హిస్టారికల్ సిటీ అనండి ప్లీజ్,” అన్నాడు అతను సరదాగా, చార్మినార్ నీడల్లో, జనాల మధ్య చాయ్ కప్పుల వేడి ఆవిరిలో, చిరునవ్వుల మధ్య… దూరం అనిపించిన ప్రతిదీ నెమ్మదిగా కరిగిపోతూ, ఒక కొత్త అనుబంధం తన రూపాన్ని తీసుకుంటోంది. ఇద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు.,
******
లాడ్ బజార్‌లో గాజుల మధ్య నడుస్తూ అతను ఒక రంగుల గాజుల సెట్ చూపించాడు. “ఇది నీకు బాగా సూట్ అవుతుంది…” అన్నాడు. భువిక నవ్వింది. అక్కడి నుంచి వాళ్ల గోల్కొండ కోట వైపు వెళ్లారు. పెద్ద పెద్ద రాళ్ల గోడలు, ఎత్తైన గేట్లు, గాలి తాకితే ప్రతిధ్వనించే శబ్దాలు… అతను మెట్లు ఎక్కుతూ చెప్పాడు “ఇది కేవలం కోట కాదు… ప్రేమలు, యుద్ధాలు, రాజుల కలల నిలయం.” పైకి చేరినప్పుడు మొత్తం హైదరాబాద్ ఒక పటంలా కనిపించింది. తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్ , కుతుబ్ షాహీ టూంబ్స్ కొన్ని చారిత్రక ప్రదేశాలు చూసి బిర్లా మందిర్ కొండ పైకి వెళ్లారు. వైట్ మార్బుల్ వెలుగులో మొత్తం నగరం మెరిసిపోతూ కనిపించింది. ఆ వెలుగులో భువిక ముఖం కూడా ప్రకాశించింది. అతను ఆమె వైపు చూసి, “నగరం అందంగా ఉందా లేక నువ్వా?” అని అడిగాడు. భువిక నవ్వుతూ, “రెండూ కలిసినప్పుడే అందంగా ఉంటాయి” అంది. ఆ తర్వాత కొన్ని హైదరాబాదు గల్లీలు తిరిగి, పాత పుస్తకాల వాసనలో కొంత టైమ్ గడిపారు , “హైదరాబాద్ అంటే పెద్ద బిల్డింగ్స్ కాదు… ఈ చిన్న వీధులే అసలు జీవితం.” భువిక అంగీకరించి. ఆ చిన్న చిన్న క్షణాలే పెద్ద జ్ఞాపకాలుగా మారుతాయి అన్నది చివరికి నెమ్మదిగా నెక్లెస్ రోడ్ వైపు చేరుకున్నారు.
******
టాంక్ బండ్ రోడ్ మీద నెమ్మదిగా తిరుగుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మీద సూర్య కిరణల ప్రతిబింబాలు నీటితో కలిసి కదులుతున్నాయి.. గాలి మెల్లగా తాకింది.. ఆ ప్రశాంతతలో భువిక అతని వైపు తిరిగి, చాలా లోతుగా దాచుకున్న మాటల్ని బయటకు తెస్తు . “నీ కామెంట్స్ మొదట చదివిన రోజు, “నువ్వు నాకు ఫాలోవర్ కాదు. నన్ను అర్థం చేసుకున్న మనిషివి.” అనిపించింది అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. మెల్లగా కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. తన చిన్నప్పటి గురించి, తన ఒంటరితనం , కలల గురించి… ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఒకరికొకరు తెలియని ప్రపంచాలను తెరిచారు. అంతలో భువిక ఒక్కసారిగా అడిగింది, “నీ అసలు పేరు ఏంటి?” అతను కొంచెం నవ్వి, ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు “ఆకాశ్.” “భువిక… ఆకాశ్…” ఆమె మనసులో ఆ పేర్లు సరైనదిగా అనిపించింది. “ఏం జాబ్ చేస్తావు?” అని ఆమె మళ్లీ అడిగింది. అతను ఒక క్షణం ఆగి, “అది చెబుతా… పద” అన్నాడు. ఇద్దరూ బైక్ మీద కూర్చున్నారు. ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. గాలి వారి ముఖాలను తాకుతూ, బైక్ గల్లీల్లోకి దూసుకెళ్లింది. “ఎక్కడో చెబుతావా?” అని భువిక మళ్లీ అడిగింది. అతను నవ్వుతూ, “ఇంకొంచెం దూరం…” అన్నాడు. చివరికి బైక్ ఒక మీట్ షాప్ దగ్గర ఆగింది.. భువిక ఆశ్చర్యంగా అతని వైపు అతను బైక్ నుంచి దిగుతూ మెల్లగా అన్నాడు “ఇదే నా ప్రపంచం… ఇదే నా పని.” లోపలికి వెళ్లి అక్కడి డ్రెస్ వేసుకొని మాంసం ముక్కలు కొడుతూ నేను హిందువునే! ఇదే కులవృతి పని. ఇది చేస్తున్నందుకు నాకేమీ చిన్నతనం లేదు.ఈ పనిచేస్తున్న నేను నీకు నచ్చితే నీ నిర్ణయం చెప్పు” అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది భువిక.
టాంక్ బండ్ రోడ్ మీద నెమ్మదిగా తిరుగుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మీద సూర్య కిరణల ప్రతిబింబాలు నీటితో కలిసి కదులుతున్నాయి.. గాలి మెల్లగా తాకింది.. ఆ ప్రశాంతతలో భువిక అతని వైపు తిరిగి, చాలా లోతుగా దాచుకున్న మాటల్ని బయటకు తెస్తు . “నీ కామెంట్స్ మొదట చదివిన రోజు, “నువ్వు నాకు ఫాలోవర్ కాదు. నన్ను అర్థం చేసుకున్న మనిషివి.” అనిపించింది అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. మెల్లగా కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. తన చిన్నప్పటి గురించి, తన ఒంటరితనం , కలల గురించి… ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఒకరికొకరు తెలియని ప్రపంచాలను తెరిచారు. అంతలో భువిక ఒక్కసారిగా అడిగింది, “నీ అసలు పేరు ఏంటి?” అతను కొంచెం నవ్వి, ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు “ఆకాశ్.” “భువిక… ఆకాశ్…” ఆమె మనసులో ఆ పేర్లు సరైనదిగా అనిపించింది. “ఏం జాబ్ చేస్తావు?” అని ఆమె మళ్లీ అడిగింది. అతను ఒక క్షణం ఆగి, “అది చెబుతా… పద” అన్నాడు. ఇద్దరూ బైక్ మీద కూర్చున్నారు. ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. గాలి వారి ముఖాలను తాకుతూ, బైక్ గల్లీల్లోకి దూసుకెళ్లింది. “ఎక్కడో చెబుతావా?” అని భువిక మళ్లీ అడిగింది. అతను నవ్వుతూ, “ఇంకొంచెం దూరం…” అన్నాడు. చివరికి బైక్ ఒక మీట్ షాప్ దగ్గర ఆగింది.. భువిక ఆశ్చర్యంగా అతని వైపు అతను బైక్ నుంచి దిగుతూ మెల్లగా అన్నాడు “ఇదే నా ప్రపంచం… ఇదే నా పని.” లోపలికి వెళ్లి అక్కడి డ్రెస్ వేసుకొని మాంసం ముక్కలు కొడుతూ నేను హిందువునే! ఇదే కులవృతి పని. ఇది చేస్తున్నందుకు నాకేమీ చిన్నతనం లేదు.ఈ పనిచేస్తున్న నేను నీకు నచ్చితే నీ నిర్ణయం చెప్పు” అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది భువిక.
****
అమ్మమ్మ కథ ఆపింది.
****
“ఆ తర్వాత ఏమైంది అమ్మమ్మా?” అని పిల్లలు అడిగారు.
అమ్మమ్మ నవ్వింది.“ఆ తర్వాత ఏమైందో…నాకూ తెలియదు” అంది. “అమ్మమ్మా! కథ చెప్తున్నది నువ్వేగా, నీకే తెలియకపోతే ఎలా?” అని పిల్లలు అడిగారు. “కథ మొదలు పెట్టేముందే చెప్పానుగా, ముగింపు మీరే చెప్పాలని. మీరే చెప్పండి ఇప్పుడు భువిక ఏం చేస్తుందో?” పిల్లలు అయోమయంగా ఆమె వంక చూశారు. “ఇది కథ కాదు పిల్లలూ! ఇది మీ జీవితాల్లో రాబోయే ఒక ప్రశ్న. మనం వేరేవాళ్ల కథలు వినేటప్పుడు తీర్పులు ఇవ్వడం చాలా సులభం. అదే పరిస్థితి మన జీవితంలోకి వస్తే మనసు ఒకటి చెప్తుంది, పరిస్థితులు మరొకటి చెప్తాయి. భయం ఒకవైపు, ప్రేమ మరోవైపు లాగేస్తాయి. ఆ క్షణంలో తీసుకునే నిర్ణయం ఎవ్వరూ ముందుగా ఊహించలేరు” అంది. “భువిక ఏం చేసిందో తెలుసుకోవడం కంటే… మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారనేదే అసలు కథ. అదే అసలు ముగింపు.”
***








Anna chala bagundi it’s very organic story