రైతు కవితలు ఆరు

రైతు కవితలు ఆరు

1
పొడువు గీతతో
పక్క గీత తగ్గుతుంది
కాని ఆ చాళ్లను
మించలేం
2
పూవులై నవ్వుతాం
పక్షులై పాడుతాం
మట్టిలోని తనకు
తెలియదు మన సంగతి
3
ఇవ్వడమే తెలుసు తనకు
అడుక్కోవడం
నేర్పింది మనమే
4
విత్తనంకై నెత్తురొలుకుతాడు
నీళ్ల కోసం‌ కన్నీరౌతాడు
కాని తీసుకోవడమే
నేర్పాడు మనకు
5
చెప్పాలంటే
మనమే అసలు
చిల్లర నాటి
టోకు పండిస్తాం
6
మిద్దెలు మేడల కలలు కంటూ
నేలలు మారుతున్నాయి
చివరికి కొండలూ మారుతున్నాయి
ఏ మార్పు లేనిది తానే!
*

మడిపల్లి రాజ్‌కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు