వీడ్కోలు

తెమలని పనితో
తెగ తెంపులు చేసుకుని
ఆఖరి కొసాన మిగిలిన నిమిషాన
అయితేనేం చేరుకున్నాను
ఇంటి కబుర్లో, ప్రపంచ చర్చలో
అవునంటే కాదనే వాదనలో
చేసుకునే తీరుబడి లేకపోయింది
టేబుల్ కు అటొకళ్ళం
ఇటొకళ్ళం కూర్చుని
పొగలు కక్కే కాఫీ
తాగేంత తీరిక లేకుండా పోయింది
అయితేనేం
అది జర్రున జారి పోయే
క్షణమే కావచ్చు
బరువనిపించే వీడ్కోలు సందర్భమే అయ్యుండొచ్చు
రేఖా మాత్రంగా కలిసిన ఆ చూపులు గతాన్ని గట్టిగా పెనవేసుకుని ఉన్నవేగా
ముఖాన విచ్చుకున్న చిరునవ్వుకు
ఇద్దరి గుండెల్లోని లోతెంతో తెలిసిందేగా
ఒక కరచాలనం, ఓ గాఢాలింగనం
వీడ్కోలు వేళ
స్నేహితునికిచ్చే జ్ఞాపకాలు
ప్రతిసారీ మాటలకు చోటుండాల్సిన పని లేదు
మరో కలయికకు చిరునవ్వు
చమురై వెలుగుతూనే ఉంటుంది.
*

రెహానా

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎప్పుడో మర్చిపోయిన స్వచ్చమైన తెలుగు పదాలను మళ్ళీ మీరు గుర్తు చేశారు. థ్యాంక్యూ మేడమ్..

  • Veedkolu Kavitha mana veedkolu samayanni achanga alage gurthuchesindi mitrama…kavitalo mi bhavana life lo mi acharana rendu okate…This unification of what you are and what you write is making the content more lively.Themalani panulatho thegathempulu chesukuni ane expression Chala nachindi…Something difficult to get rid of ane artham elavate aindi

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు