రైల్లో …కొన్ని దృశ్యాలు

ఆశగా ఒక బొద్దింక
ఆకలిగా ఒక మనిషి

వొలిచాక పడేసిన
కమలాతొక్కను
మూచూస్తూ…
నిర్లక్ష్యంగానో
నిర్లిప్తంగానో
పడుతున్న చెప్పులను
తప్పుకుంటూ.
నలిగి పడిన
వడియపు ముక్క కింద
ఆకలిగా
దాక్కుంటూ.
*         *       *
చెదిరి న తలకట్టు
ఎండి చారికలంటిన చెక్కిలి
కమిలిన ఒంటిని
 కానరాకుండా కప్పుకున్న
పమిట చాటున దాపెడుతున్న ఒక అమ్మ.
చారగిలపడి
చచ్చిపోతున్న సంగతీ
చంపుతున్న సంగతీ
అర్ధం కానంతగా
ఆటలో మునిగే ఉన్న
ఒక కుర్రవాడు.
పించను తీసిచ్చేదాకా
బతికున్నాడని
ఆనక
ఛా!..చచ్చాడని
స్టేషనులో వదలబడ్డ
ఒక తండ్రి.
ముద్ద కీ ముద్దుకీ
అలకజేస్తూ
కళ్ళెండిపొయ్యేట్టు
గాజు తెరలోకి కూరుకుంటున్న
ఒక బుజ్జోడు.
బేబీ! ….విరహంగా
బేబీ! ….సరసంగా
బే….బీ..అంటూ
కాలం  కలిపిన
కొత్తజంట ఒకటి.
*    *     *
చిరిగి కూలుతున్న పొట్లాలూ
చితికి రాలుతున్న పొట్టూ
అడపాదడపా
పొరపాటున రాలే
కాసింత తిండి కోసం
తిరుగుతూనే !..
ఆశగా ఒక బొద్దింక
ఆకలిగా ఒక మనిషి
*        *       *
తేడా పెద్దగా లేదుకదా??
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

రవికుమార్ కోసూరి

2 comments

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆకలి తో తిరిగే బొద్దింక కి మనిషికీ తేడా లేదు అండి. రైల్లో చూసే దృశ్యాలు. కవితాత్మకంగా … బాగుంది అండి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు