ఇప్పుడు అస్తిత్వం, హింస తత్వాల గురించిన సంక్లిష్ట సమస్యను వలసవాద నేపథ్యంలో నుంచి అర్థం చేసుకోవచ్చు. వలసవాదం సామ్రాజ్యవాదం/ నయా సామ్రాజ్యవాదం పాత వలసదేశాలను ఉద్దేశపూర్వకంగా విభజించాయి. మన దేశంలోని విభిన్న శక్తులు తామే ప్రజలు కు నిజమైన ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఘర్షణ పడుతున్నాయి.
దేశాన్ని ఒక కాయంతో పోల్చితే జాతీయవాదం మాతృ భావనను ప్రతీకగా తీసుకుంటుంది. దీని వల్ల ప్రతి విభజనను తల్లిని ఖండించినట్లు భావిస్తుంది. దానిని సమర్థించే భావాలని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ చరిత్రలో పెరిగే జనాభా, ప్రజలలో జాతీయతా భావాల్లో తేడాలు, భౌగోళిక సరిహద్దుల మార్పులు వచ్చే అవకాశముంది. ఇథియోపియా, యుగోస్లేవియా, పూర్వ సోవియట్ యూనియన్ దీనికి కొన్ని ఉదాహరణలు.
రష్దీ నవల “ది మూర్స్ లాస్ట్ సై” పాత్రలలోని అంతర్గత హింస, స్వీయ నాశనాన్ని, భారత దేశ విభజన, మత కలహాలు, పరస్పర హత్యా కాండ కు దిగిన ప్రజలలోని అంతర్గత దయ్యాన్ని చూపిస్తాయి. మత కలహాల గురించి రష్దీ చెబుతూ ఇలా అంటాడు: “వోహ్, మనందరికీ కారణాలున్నాయి, వ్యక్తిగతంగా లేదా సైద్ధాంతికంగా, నీకు కారణాలు దొరకచ్చు, ఏ చోర్ బజార్లో, ఏ దొంగల మార్కెట్లో, కారణాలు కుప్పలు, పదులు , డజన్లు, కారణాలు చౌక , రాజకీయాల జవాబుల్లా చౌక, నాలిక నుంచి దొర్లుకుంటూ వస్తాయి; నేను అది చేసింది డబ్బు, యూనిఫామ్ , కలిసి ఉండటానికి, కుటుంబం, తెగ, జాతి,దేవుడు కోసం.”
సల్మాన్ రష్దీ నవల “ది మూర్స్ లాస్ట్ సై” (The Moor’s Last Sigh) లో కమోయిష్, ఇసాబెల్లా ల తనయ అరోరా ఒక కళాకారిణి. లవంగాలు ఎగుమతి చేసే కంపెనీ మేనేజర్ అయిన అబ్రహం పౌర్చుగీసు యూదుల సంతతివాడు . అతడు ఆరోరా ప్రేమ కోసం తన కన్నతల్లిని, కమ్యూనిటీని కూడా వదులుకుంటాడు. అబ్రహం స్పానిష్ అరబ్బు -బహిష్కృత పోర్చుగీసు యూదు నుంచి వచ్చిన మిశ్రమ జాతీయుడైన మూలాన ఆరోరా, అబ్రహాం వివాహాలకు రెండు మతాచార్యుల నుంచి ఆశీర్వాదం దొరకదు. మొరైస్ తన తల్లి దండ్రుల గురించి ఇలా చెబుతాడు: “వారి పెళ్లికాని తిరస్కారానికి నా నమస్కారం; గమనించండి విధి ఎలా విషయాలు తయారు చేసిందీ అంటే – మత రహితులైన ఇద్దరూ – గతంతో ఒప్పుకోలు సంబంధాలు బద్దలు చేసుకోవాల్సి వచ్చింది .నేను ఏమైనా, కాథలిక్ గాని లేదా యూదు లాగానో పెరగలేదు. నేను రెండూ, ఏమీ కాదు; ఒక అనామక jewholic ను.cathjew nut ను, ఒక కూర పాత్ర, ఒక మిశ్రమ జాతి కుక్క. నేను ఈ రోజుల్లో ఆ మాట ఏందీ /- అణువైనాను ,అవున్సార్ : నిజమైన బాంబే మిక్స్ ను.”(104)
అరోరా స్వతంత్ర భావాలు ఉన్న స్త్రీ .తన భర్త మృతి తర్వాత ఆమె కొచ్చిన్ తిరిగి వస్తుంది. అబ్రహం, ఆరోరాల తనయుడైన మొరైస్ జోగోయిబీ కి ప్రత్యేక మైన ప్రత్యేకమైన అంగవైకల్యం ఉంటుంది . అతడి భౌతిక శరీర అభివృద్ధి మానసిక అభివృద్ధికి రెండంతలుగా వేగంగా జరుగుతుంటుంది. వాస్కో మిరాండా వచ్చి వికార బాలుడైన మొరైస్ కు ఒక ఊహ ప్రపంచాన్ని సృష్టించి ఆరోరాకు దగ్గరవుతాడు.అరోరా మైనారిటీ మతానికి చెందిన కళాకారిణి. తన అస్తిత్వ సమస్యను ఎదుర్కోవటానికి రామన్ ఫీల్డింగ్ సాయం తీసుకుంటుంది. మత భావాల పెరుగుదల నేపథ్యంలో అరోరా తన కొడుకుకు జాగ్రత్తలు చెబుతుంది.
మొరైస్ పై పూర్తి అదుపుకు ఒక వైపు తల్లి అరోరా, మరో వైపు తన ప్రేయసి, బహుళ అస్తిత్వాల, మార్మిక ఉమా సరస్వతి ల మధ్య పోరాటం మొదలవుతుంది. మొదట ఉమా సరస్వతి అరోరా కుటుంబానికి బాగా దగ్గరైనా,అరోరా ఆమె జన్మ రహస్యం కొడుకుకు చెప్పి చివరి క్షణంలో అతడు పెళ్లి నుంచి వెనక్కి తగ్గేట్టు చేస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బతిన్న మొరైస్ ఉమా సరస్వతి పట్ట తన ప్రేమను చంపుకోలేక ప్రేమ అనేది ఆత్మల కలయికగా, స్వచ్ఛతపై మిశ్రమత విజయంగా, నిర్జన దీవిలో ప్రజాస్వామ్య విజయంగా చూస్తాడు.
ఈ నవలలో అరోరా చారిత్రక బహుళత్వానికి వాస్కో ఉమా సరస్వతి లు , వేర్లు నాటుకోని బహుళత్వానికి ప్రతినిధులు మిశ్రమజాతీయుడైన మొరైస్ ఉద్వేగ భరిత ప్రేమ, ద్వేషం , వూహాత్మక సమాజ సున్నితత్వానికి ప్రతినిధిగా ఉంటాడు. మొరైస్ కు తన ప్రేయసి ఉమా ఒక పథకం ప్రకారం తమ ప్రేమ సన్నివేశాలను టేప్ చేసి, తన తల్లిదండ్రులకు చూపించి , తనను ఆత్మ హత్యకు ప్రేరేపించినా ఎత్తు బెడిసి ఆమే చనిపోవటం తెలుస్తుంది. అయినా ఆమెను మొరైస్ పిచ్చిదానిగానే చూస్తాడు కానీ చెడు అనుకోడు. వక్ర హస్తుడు అయిన మొరైస్ తల్లి ప్రేమ, ప్రేయసి మోసాల మధ్య నలిగి మత నేరస్తుల ముఠా హింసా హస్తంగా మారుతాడు. తన తండ్రి డాన్ అబ్రహం, రామన్ ఫీల్డింగ్ లాంటి రాజకీయ నేత ల అధికార దాహానికి పనిముట్టుగా మారుతాడు. మొరైస్ ను కార్మికుల సమ్మెలు, యూనియన్లు, కమ్యూనిస్టులను దెబ్బ తీసేందుకు వాడటం ఫాసిజం తలెత్తడాన్ని సూచిస్తుంది.
అర్థరాత్రి పిల్లలను మత వాదులు బలి పశువులుగా చేశారు. జీని పాత్ర ద్వారా రష్దీ ఏకశిలా సదృశ హిందూయిజం, యుద్ధ దేవుడు, ఒకే పుస్తకం, గుంపు పాలన రూపొందటాన్ని, మత బృందాల కుటుంబ నియంత్రణ వ్యతిరేకతలను తెలియజేస్తాడు.మొరైస్ తన చుట్టూ లౌకికవాద వాతావరణం కరిగిపోయి మైనార్టీలు ఎదుర్కొనే ఇబ్బందులు చూస్తాడు. తన తల్లి అరోరా కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రామన్ ఫీల్డింగ్ అంతం అవుతాడు.
అరోరా ఆధిపత్య ధోరణి వల్ల ఆమె పెద్ద కూతురు ఇనా లైంగిక విశృంఖలతకు, రెండవ కూతురు మిన్నీ నిరసనలలో మునిగి తేలే లాయర్ గా, మూడవ అమ్మాయి మైనా సన్యాసినిగా మారటానికి దారితీసింది . ఎడిపస్ కాంప్లెక్స్ వల్ల మొరైస్ తన ట్యూషన్ టీచర్ డిల్లి హార్ముజ్ తో ఆత్మీయ బంధంలో జీవిస్తాడు. తన తల్లి రహస్యాలు ఆమె చెబితే వినే నమ్మకస్తుడిగా ఉంటాడు.
నవల చివరలో వాస్కో మిరాండా కోటలో బందీలుగా మారిన మొరైస్ , జపనీస్ వనిత అఓయ్ ఉయె కి సన్నిహితమై ఓడిన ప్రేమ కూడా సంపదని, ప్రేమరాహిత్యాన్ని కోరుకునే వాళ్ళు విజయం పొందరని గ్రహిస్తాడు తన తండ్రి అబ్రహం తన తల్లి అరోరా మృతికి కారణమని నాయకుడు మొరైస్ కు తెలుస్తుంది. “పిల్లలు తమ తండ్రుల గురించి ఊహలు చేస్తారు, తమ అపరిపక్వ అవసరాల బట్టి తిరిగి రూపొందించుకుంటారు. తండ్రి వాస్తవికత బరువు కొందరు పిల్లలు మాత్రమే మోయగలరు.”
చరిత్రలో 1492లో స్పెయిన్ దేశంలోని గ్రనడా సుల్తాన్ బోఅబ్దీల్ స్పానిష్ క్రైస్తవ రాజుల చేతిలో పరాజితుడై కోల్పోయిన రాజ్యం కోసం, ఒథెల్లో అసూయ గా మారిన ప్రేమకి, మొరైస్ తన కోల్పోయిన అమాయకత్వం కోసం చివరి నిట్టూర్పులు విడుస్తారు.
ఈ నవలలో రచయిత లౌకిక అస్తిత్వానికి -మత అస్తిత్వ చీకటి శక్తికి ,బలహీన భౌతిక వాదానికి – వేర్లు వూనుకోని బహిళత్వానికి మధ్య పోరాటాన్ని చిత్రిస్తూ భావిపట్ల హెచ్చరిక చేశాడు. సమాజాన్ని నాశనం చేసే కఠినత్వాన్ని కాక సరళమైన బహుళ తత్వాన్ని ప్రశంసించాడు.రష్దీ బొంబాయి నగరం లో భారత్ , అది కానిది కలిశాయని, అది కథా సాగరం, మనమందరం కథకులం, ప్రతివారు ఒకేసారి మాట్లాడతారు అని రాశాడు.
రష్దీ మాటల్లో చెప్పాలంటే, “అనాగరికులు మన ద్వారాల దగ్గరే కాదు మనలోనూ ఉన్నారు.మనమే మన కొయ్య గుర్రాలం , మనలో ప్రతి ఒక్కరిలో నాశనం….మనమే బాంబులు వేసేవారం, బాంబులం. ఆ పేలుళ్లు మన సొంత చెడు – విదేశీ వివరణల కోసం చూడ పని లేదు , మన సరిహద్దుల బయట , మన లోనూ చెడు ఉండేది, (ఇప్పుడు)ఉంది. మన కాళ్ళను మనమే నరికేసుకున్నాం , మన పతనానికి మనమే పథకం వేసుకున్నాం.”
కొందరు విమర్శకులు రష్దీ మిత్, ఊహా శక్తి ల ద్వారా మెరుగైన ప్రపంచం వస్తుందని విశ్వసించాడని, బహుళత్వాన్నీ, మిశ్రమ అస్తిత్వాన్ని కోరాడని చెప్పారు. అమర్త్య సేన్ అస్తిత్వం యొక్క బహుళత్వాన్ని, ఒక ప్రత్యేక పరిస్థితిలో ఎంపికను, ప్రజాస్వామ్య జగంలో ఒకే అస్తిత్వానికి కట్టుబడటంలోని హింసను నొక్కి చెప్పారు. సాదియా తూర్ అనే పాకిస్తానీ విమర్శకురాలు తన దేశం లోని సంకిష్ట జాతీయత గురించి రాస్తూ అసమానతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పుడు జాతీయ ఐక్యత ను రుద్దేందుకు ఏకీకృత జాతీయ సంస్కృతిని ఆయుధంగా వాడలేమని చెప్పారు.
మన దేశంలో గత పాలకుల అవకాశవాద లౌకికవాదం, గతంలో వామపక్షాలు భారతీయ సంస్కృతిని పూర్తిగా తిరస్కరించడం వల్ల మత జాతీయవాద భూతం తలెత్తింది. దీనికి ప్రత్యామ్నాయ జాతీయవాదం మిశ్రమ అస్తిత్వం, పర్యావరణ హిత అభివృద్ధి ,బహుళ సంస్కృతి ,చిన్న ప్రాజెక్టులు, కుల మతాతీత ప్రేమ వివాహాల సమర్థన, హేతుబద్ధత ,అధికార వికేంద్రీకరణ, ప్రపంచ శ్రామిక ఐక్యతలను కోరుతుంది.
*








Add comment