మోహ సరంగు


గాజుపడక మీద
చర్మం వాసన పదేపదే

అలికిడిలేని ఆకలి
అవయవాల అరల్లో

గాలిసోకిన భాస్వరంలా
భగ్న క్షణాలు భస్మం

మట్టిదిగులుతో
దేహ వృక్షం      

అనువాదాలకు లొంగని
ఒక లోహ వాక్యం

ఆ శిరోజాల వలలో
చిక్కిన జూదరి చేప

మోసకారి రంగులు
మోహ సరంగులు.
సాంత్వన
శూన్యంలో
ఎన్నో విస్ఫోటనలుఎక్కడో గడ్డకట్టుకు
దాగింది కన్నీరంతా

ఏదో చీకటిని చెరపడానికి
వెళ్లాయి వెలుగు వలయాలన్నీ

పొదరింట పొగమంటతో
తరలిపోయింది మధురిమ

ఇప్పుడు లయాత్మక
మంద్ర ప్రకంపనల వ్యాప్తి

స్తంభించిన గాలి
శ్రోతగామారి వింటోంది

చెదరిన సరిగమల సుమాలను
ఏరి, కూర్చి సరం చేస్తోంది గళం

ఆలాపనలో సేదదీరుతోంది
అలసిన సాయంత్రనేత్రం

*

మల్లారెడ్డి మురళీ మోహన్

2 comments

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు