పోస్టుమాన్ ఫిలాసఫీ!

నీ చుట్టురా ప్రపంచంలేకుండా నీకంటూ ప్రపంచం ఉండదు.

మానవుడి పుట్టుకే వింత.అతని గమనం, చలనం చైతన్యం చిత్ర విచిత్రమైనది.ఇవ్వాళ రేపట్లాగా,రేపు నిన్నలా, నిన్న మరో పదేళ్ల తరువాత ఎదురుపడే  మరో రోజులా,గడియాలా వుండి ,ఇది ఇంతకుముందే ఎప్పుడో జరిగిందే అనే ఉహాత్మకమైన అనుభవంలాంటి స్మృతి హృదయంలో ప్రకంపనలు కలిగించి కొత్త ఆలోచనలోకి నిన్ను తోలుకుపోతుంది.శత్రువు మిత్రుడవటం, మిత్రుడనబడువాడు శత్రువులాగాను మారటం విచిత్రం కాదు విధీకాదు.

జీవనచక్రంలో సంభవించే ఒకానొక cyclic భ్రమణం.మనిషి జీవితంలో జరిగినవే జరగటం, ఎదుర్కొన్నవే ఎదుర్కోవడం, మాట్లాడినవే మాట్లాడటం,
చేసినవే చేయటం, చూసినవే చూడటం, అనుభవించినవే అనుభవించడం  అనివార్యంగా జరుగుతాయి అనేది భ్రమకాదు.ఉహా కూడా కాదు.అవి నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎప్పుడో ఒకసారి, చూస్తున్న సినిమాకి ఇంట్రవెల్ వచ్చినట్టు ఒక కొత్త అంశం లేదా సరికొత్త అనుభవం ఏర్పడి అది అప్పటి దాకా ఉన్న మన జీవన గమనాన్ని చెరిపేసి పురోగమనంవైపో తిరోగమనం వైపో తిప్పుతుంది.ఒకడు ఎందుకు మంచివాడు అయ్యాడు లేదా వేటివల్ల సద్గుణాలు సంపాదించుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేనట్లే చెడ్డవారికి వ్యతిరేక,క్షుద్ర,ధూర్త గుణాలు,సంఘాన్ని బాధించే హృదయం ఎందుకు ఏర్పడతుందో చెప్పటం వీలుకాదు, అసాద్యం కూడా.ఒకసారి ఒక విశ్వాసo ఏర్పడినంక ఆ విశ్వాసం అబద్ధమని అసంబద్దమని ఆవ్యక్తికి మళ్ళీ తెలియకపోవొచ్చు తోయకపోవొచ్చు.అభిప్రాయాలు ఎప్పుడు ఎందుకు ఎవరివల్ల ఏర్పడతాయో ఎలా చెప్పటం? నూటికి నూరుశాతం ఇదే నిజం, వాస్తవమని బల్లగుద్ది చెప్పినవి కూడా అబద్దాలవుతాయి.అలాగే నిజాలు అబద్దాలవుతాయి.విశ్వాసం అవిశ్వాసంగా, మంచి చెడుగా,చెడుమంచిగా,కరుణ కాఠిన్యంగా కాఠిన్యం కరుణగా మారటం మానవుని జీవితంలో జరగటం కేవలం natural ఐతే ఒకే అనుభవక్రమం, అనుభూతిక్రమం, సంవేదనాశీలతా, చైతన్యం, ఉద్వేగాలు, స్పందనా వైశిష్ట్యం, ఊహాత్మకత,స్వప్నజగతు అందరికి ఒకలా ఉండవు.నీ చుట్టురా ఉన్న ప్రపంచమే నీప్రపంచాన్ని దిద్దితీర్చుతుంది,రూపొందిస్తుంది.
నీప్రపంచo నీద్వారానే నిర్మితమౌతుంది. అనేది సుద్దబద్దం.అలా అని నీ ప్రపంచమే నీలో ఉండదు. మిగతా ప్రపంచంకూడా నీప్రపంచాన్ని నిర్మిస్తుంది.నీ చుట్టురా ప్రపంచంలేకుండా నీకంటూ ప్రపంచం ఉండదు.

ఆత్మను వెలిగించే అనుభవాలు, అవగాహనను ప్రోదిచేసే సంఘటనలు, ఉహను అనంత ఆకాశసీమల్లోకి ప్రయనింపజేసే వ్యక్తుల సమూహం,నిన్ను శుభ్రపరిచి నీలో సమురుపోసి నిన్నొ అమరదీపంగా వెలిగించే చేతులూ,కాళ్ళకి కళ్ళుకట్టి కళ్ళకి కలల్ని ముడివేసి నిన్ను రసజ్ఞని fantasyలోకి మోసుకెళ్లే జ్ఞాన సాంగత్యం,విడివిడిగా ఒక్కోసారి మొత్తంగా వ్యక్తివల్లనో వ్యవస్థవల్లనో ఏర్పడి నిన్ను కనిపెంచి లాలిపోసి వీరుడినో విజేతనో చేస్తాయి.ప్రపంచం ఒక పాఠశాల లేదా ప్రపంచం మొత్తం ఒక పాఠమే ఆధి ఒక్కొక్కరికి ఒక్కొలాంటి పరిక్షపెడుతుంది.ఒక్కొక్కడు ఒక్కోలా పాసావ్వడమో ఫెయిల్ అవ్వటమో చేస్తుంటాడు.అందుకే రేపేంటో ఎవ్వరూ ఉహించలేరు.నిర్ధారనగా చేప్పలేరు.ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం జీవితాన్ని నేర్పుతుంది.

సహజంగా సంభవించే లేదా ఎదురుపడే సంఘటనలకి పరిస్థితులకి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తూనే వారి వారి జీవితాల్ని దిద్దుకుంటారు.అది అందరికి నచ్చొచ్చు నచ్చకపోవొచ్చు.

ఉపేంద్ర ఇంటింటికి తిరిగి ఉత్తరాలు పంచి ఇంటికోచ్చాడు.పనిచేసి ఇంటికోచ్చిన ప్రతి మగాడు భార్య నుండి చిరునవ్వుని కోరుకుంటాడు అని చాలాసార్లు రమణమ్మకి చెప్పినా ఏఉపయోగం లేకుండా పోతుంది.
ఉపేంద్ర అమాయకుడు. గొప్పవాడు .ఓపిక మంతుడని ఊరంతా అనుకుంటారు.సందర్భాన్ని బట్టి మాట్లాడటం మాట్లాడిన ప్రతిసారి తత్వాన్ని మాట్లాడతాడని,ఉపేంద్ర మాట్లాడే మాటలు సగంసగమే అర్ధమౌతాయని అందరి నమ్మకం.చిన్నజీతం. నలుగురు కోడుకులతో పెద్దపెద్ద బాధ్యతలతో కూడిన కుటుంబం.ఒక్కడి సంపాదనే.అందరూ ఇష్టపడే ఉపేంద్రని ఊరిజనం ఒక్క విషయంలో మాత్రం తిట్టుకుంటూ ఉంటారు.ఉపేంద్ర తన భార్యని గాలికి వొదిలేసాడనీ,తను చేసే పనుల్ని అతను మందలించటం లేదనీ,తన కళ్ళముందే తన ఇంట్లోనే వేరే మగాడితో ఉన్నా అన్నీ దిగమింగుకొని ఏమీ చేతకాని వాడిలా బతుకుని వెల్లదీస్తున్నాడని,చాతకాని వాడని,ఏవేవో అనుకుంటారు,అంటారు.ఐనా ముఖంమీద చిరునవ్వు చెదరనివ్వడు ఉపేoద్ర.ఎంత దుఃఖం ఉన్నా దానిని పైకి ఎన్నడూ చూపించలేదు.తనప్రపంచం తన పిల్లలే. వారిని చదివించాలని ఉద్యోగాలు చేయించాలని పట్టుదలమీద ఉన్న తనదృష్టితప్ప మరో ధ్యాసలేదు.

మొదటిసారి తన భార్యకు మరో మగవాడితో సంబంధాలు ఉన్నాయని తెలిసి మందలించినా ఏ ప్రయోజనం లేకుండాపొయింది.తల్లిలేని తన పిల్లల్ని
ఉహించలేకపోతున్నాడు ఉపేంద్ర.చుట్టాలు రావటం మానేశారు.ఇరుగుపొరుగు మాటమంతి చేసి ఎన్నాళ్ళయిందో?ఉపేంద్ర దృష్టి పిల్లలు.ఎప్పుడన్నా తన భార్యమీద కొరిక పుట్టినప్పుడు వెళ్లి భార్యకు చెప్తే ఒక్కొక్కసారి తను కాదన్నా ఏమీబదులు చెప్పేవాడు కాదు.అందరూ తననికూడా ఇలాగే చేయమని సలహా ఇచ్చినా ఒప్పుకునేవాడు కాదు.ఒట్టినీటి బిందువుకి లావా ఆరదని ఉపేంద్రకి తెలుసు.ఎందునిమ్మితం తనభార్య అలా చేస్తూవొస్తుందో ఉపేంద్రకి తెలియని విషయమే.

కాలం గడుస్తోంది.భార్యలో ఏమార్పులేదు.ఉపేంద్రలో కూడా.గొప్పవాడు చాతకానివాడు అనే భిన్న ఏకాభిప్రాయo ఉపేంద్ర మీద ఉంది అందరికి.కానీ ఉపేంద్ర
కి ఏ అభిప్రాయం ఉందో ఎవ్వరికీ తెలియదు.ఉన్నది ఉనట్టు,జరిగినదాన్ని జరుగుతున్నట్టు యధావిధిగా జీవితాన్ని తీసుకోవడం ఉపేంద్ర ఇన్నాళ్లు చేస్తూ వొచ్చింది. అందరికి అన్నీ అన్నిచోట్లా ఒకేలా అర్ధమవ్వాలని అనుకోవటం మూర్ఖత్వానికి మించిన చీకటి మూసత్వం ఎమోనని ఒకానొక సంశయo.

ఉత్తరాల్ని పంచుతూ పంచుతూ ఎండ బాగా ఉండటంవల్ల సైకిల్ని ఊరుబయట చింత చెట్టుకింద ఆపి అక్కడున్న రాయిమీద కూర్చున్నాడు ఉపేంద్ర.చింతచెట్టు చుట్టూ అంతా నిశ్శబ్దం .చల్లనిగాలి.సంచిలో ఇంకెన్ని ఉత్తరాలు ఉన్నాయో చూద్దామని సంచితెరిచి చూస్తుంటే…ఒక ఉత్తరంలో ఇలా రాసి ఉంది.

ఏ నీటి ప్రవాహమూ లేని ఒకానొక నదిలో ఒక తుంగమొక్క చీకుచింతా లేకుండా హాయిగా ఉంటుంది. తన జీవితాన్ని తలకిందులు చేసే ఏ ప్రమాదమూ లేదు తుంగమొక్కకి. ఒకరోజు నీటి ఉద్రితి బాగా పెరిగి తుంగమొక్క కొట్టుకుపోయే స్థితి వోచ్చింది .తెలివిగా తుంగమొక్క తననితాను ఒంచుకొని నీళ్ళల్లో మునిగింది.నీటి ఉద్రితి తగ్గినాక మళ్ళీ యధావిధిగా లేచినిలబడింది. తర్వాత ఎప్పుడు నీటి ఉదృతి పెరిగినా అదేపని చేసి తనని తాను కాపాడుకుంటుంది.

ఇన్నాళ్లు నేనూ చేస్తుంది ఇదేగా అనుకోన్నాడు ఉపేంద్ర. మరిచిపోయిన చిరునవ్వు చాలారోజుల తరువాత ఉపేంద్ర పెదాలపై వాలింది.

*

పెద్దన్న

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉపేంద్ర నాకు ఇక్కడ ఒక రాంగోపాల్ వర్మ లాగా అనిపించాడు. ఎవరికోసం వారు బ్రతకాలి ఇంకొకరికోసం నేను బ్రతకను అని చెప్పే inside ఫిలాసఫీ ఉంది. ఒక భార్య అలా చేస్తుంది అని తెలిసినప్పుడు, ఆమెను చేంజ్ చేయలేను అని అనుకున్నప్పుడు ఆమెను తన ఇష్టాలకి వదిలేసి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉన్నాడు అంటే ఆయన మీద ఆయనకి ఎంత ఇష్టం ఉందో అర్ధం అవుతుంది. ఇటువంటివి ప్రతి గ్రామంలో ,ప్రతి కాలనీ లో విన్నప్పుడు తెలిసినప్పుడు మనిషి,పెళ్లి ,కుటుంబం, సమాజం అనే ప్రశ్నలు వెంటాడతాయి. ఏదేమైనా జీవితం ఒక చక్రం ,సమాజం కూడా ఒక చక్రంలో తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఏదీ శాశ్వతంగా ఉండదు మారుతూనే ఉంటుంది,
    నిన్న పాత
    ఈరోజు కొత్త
    రేపు ఆ పాతే కొత్త
    కొత్తే పాత…

  • ఉపేంద్రలాంటి వాళ్ళను చూస్తే జాలిగా,
    జీవితానుభవం కలిగిన వ్యక్తిగా అనిపిస్తారు.
    తన భార్య కంటే పిల్లల భవిష్యత్తు అవసరమని
    గ్రహించి, తన భార్య చేసే తప్పును తన విజ్ఞతకే వదిలేసిన గొప్ప వ్యక్తి ఉపేంద్ర.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు