తెలవారనీకు

రేయి నేను
చందమామను
పాలముంతలో
ఉట్టికి వేలాడదీసాను
తెలవారనీకు.
ఈ రాత్రి పూచిన
పూలన్నీ ఆకాశంలోకి
విసిరేసాను
తెలవారనీకు
ఈ రేయి
నదీ ప్రవాహన్ని
దారి తప్పించాను
తెలవారనీకు
ఈ రాత్రి సంద్రపు
అలలన్ని పడవలో
దొంగిలించి ఒడ్డున
ఇసుకలో దాచిపెట్టాను
తెలవారనీకు
ఈ రాత్రి ఈ దేహం
ముక్కలై పోయి
గోడలన్నిటా వార్తగా
ఆద్దుకోని
తెలవారనీకు
ఈ రాత్రి ఈ అడవిలో
దారితప్పి అలసి
మట్టిలో మొలకెత్తని
తెలవారనీకు
*

కెక్యూబ్ వర్మ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వర్మ గారూ కవిత బాగుంది.అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.