1.
ఇక్కడ ఈ బంధనాల్లోంచీ
ఎవరూ పోల్చుకోలేని
అదృశ్య రూపాన్ని ఊహిస్తాను.
వర్ణరంజితమయమైన
ఈ పరిసరశోభని తిలకించే
కనులని నింపుకున్న
వాక్యభరిత ప్రాణం ఉట్టిపడే
కథల్ని పంపిస్తాను.
2.
రాత్రి, చీకటిలోకి ఇంకుతోంది.
విచ్చుకుంటోన్న కలువపూవులు
రాత్రి సౌందర్యాన్ని పఠిస్తున్నాయి.
3.
భూమిపై విస్తరించిఉన్న సకలానికీ
ఆకాశం జోలపాటలు పాడుతోంది.
అన్ని ప్రేమ కథలనూ చూస్తోన్న నక్షత్రాలు
సిగ్గులో ఉన్నాయి.
4.
నదులు సముద్రాలకేసి దారికాచుకుని ఉన్నాయి.
ఓడలు సముద్రతీరంలో సేదతీరుతూ
ప్రయాణానికై ఎదురుచూస్తున్నాయి.
ఇసుక, సందర్శకులతోనూ అలలతోనూ
ఆటలాడుకుంటోంది.
4.
ఇక నేనా!
సత్యదూరమయిన నాటకాలలో
మునిగిపోయిఉన్నాను.
*
Good one Madam