‘జమ్మి’ ఆకులతో కుట్టిన కథ

సొగసైన తెలంగాణ పదాల్లాంటి జమ్మి ఆకులతో విస్తరి కుట్టి షడ్రసోపేతమైన భోజనం పెడుతుంది కథకురాలు ఈ కథలో…..

వాగు నీటిలాంటి తీయటి తెలంగాణ తెలుగు భాష, గ్రామీణ సమాజాన్ని డాక్యుమెంటరీగా చూపే కథాకథనం, పల్లెటూళ్ళలోని అమ్మలక్కల నోటి నుండి జాలువారే మౌఖిక కథా శిల్పం, తెలంగాణ సాంఘిక జీవనానానికి ఎత్తిన దివిటీలాంటి వస్తు సంచయం ఇవన్నీ కలిపితే ఆచార్య పి. యశోదా రెడ్డి (1929-2007) కథలు. తెలంగాణ తొలి తరం కథా రచయిత్రి యశోదా రెడ్డి నూటికి పైగా కథలు రాసి వాటిని ‘మా వూరి ముచ్చట్లు’ (1973), ‘ధర్మశాల’ (1999), ‘ఎచ్చమ్మ కథలు’ (2000) అనే మూడు సంపుటాలుగా వెలువరించారు. అంతకు ముందే ఇందులోని చాలా కథలను ఆకాశవాణి ద్వారా వినిపించారు.

ఎదురుగా కూర్చున్న మనిషికి చెప్పినట్టుండే ఈ కథలు ఆ కాలంలో కొన్ని వేల మంది శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. పాలమూరు జిల్లాకు చెందిన యశోదా రెడ్డి కరీంనగర్ కు చెందిన విఖ్యాత చిత్రాకారులు     పి. టి. రెడ్డి ధర్మపత్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ తెలుగు భాషకు ఒక Moving Dictionary గా పేరు పొందిన యశోదా రెడ్డి కథల్లో సాక్షి వ్యాసాలకున్న నాగుబాములాంటి నడక, తెలంగాణ సంస్కృతి పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి. తెలంగాణ సాంస్కృతిక, సామాజిక చిత్రానికి ప్రతిబింబంలాంటి పండుగలు  బతుకమ్మ, దసరా. ఈ రెండు పండుగలపైనా రెండు మధుర గుళికల్లాంటి కథలు రాశారు యశోదా రెడ్డి. అందులో బతుకమ్మ పండుగను చిత్రించిన కథ ‘మ్యానకోడలు’ ఐతే దసరాను ప్రస్తావించిన కథ  జమ్మి.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ముక్త, ఆమె భర్త రఘు ఇద్దరూ అమెరికాలో నివసిస్తుంటారు. పల్లెటూరు నుండి ముక్త చెల్లెలు అక్కకు ఉత్తరం రాస్తుంది. ఉత్తరమంతా బావకు ఇష్టమైన తెలంగాణ తేనె వంటి తెలుగులో రాస్తుంది ఆ మరదలు. ఆ ఉత్తరాన్నే పైకి చదువు వింటానంటాడు రఘు. ఆమె చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మనకు కూడా వినిపించి మేను పులకరిస్తుంది. పండగ సంబరమంతా చీరలోనే ఉన్నట్లు తెలంగాణ ఆడపడుచుల సంతోషమంతా “పూల పండుగనీ, ఆటపాటల పండుగనీ, కలెగల్పుల పండుగనీ, సింగిణేల పండుగనీ, పొలిమేరదాటు పండుగనీ, విజయ ప్రస్థానపు వేళ అనీ, ఆయుధ  పూజోత్సవమనీ, అపరాజితాదేవి కొల్పు అనీ, ముగ్గురమ్మల పండుగనీ, ఆదిశక్తి విశ్వరూప వైభవం అనీ పిల్చుకునే  బతుకమ్మ పండుగలోనే ఉంటుంది. బతుకమ్మ పండుగ మరునాడే మగవారికి ఇష్టమైన దసరా పండుగ. కొత్త బట్టలు ధరించి, పాలపిట్టను దర్శించడం, జమ్మి (బంగారం) ఆకును పెద్దలకు పెట్టి వారి ఆశీర్వాదం పొందడం.. ఒక ఆనవాయితి.

ఆ ఊళ్ళో కూడా ఊరి చెరువు దగ్గరున్న జమ్మి చెట్టు దగ్గరికి పిన్నలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా కదిలి పోతారు. వస్తూ వస్తూ గ్రామస్తులంతా కులాలకతీతంగా, హెచ్చుతగ్గులకతీతంగా ముచ్చట్లకు దిగుతారు. ఉబ్బాగని మల్లిగాడు “అయ్యా! ఈనాటి ఈ కలెగల్పు ఇచిత్రం జూస్తుంటే ఇంగ ఎత్తు పల్లాలన్నీ ఉడ్గి అంత సమంగ అయ్యే దినం కనుసూపు మేరల్నే ఉన్నట్లనిపిస్తుంది” అంటాడు. దీనికి “ఆ(  ఏం మంచో? ఏం సమానమో? యాడుంది మంచి? ఎక్కడుంది సమం? ఇవన్ని నూనె బుడ్డి మీది రాతలే. మాటలు కోటలు దాటుతయి గని సేతలు గీతలు దాటవ్. రాగి దుడ్డుంటే రాజు బిడ్డస్తది – పైసనే అంత. అదే మంచి, అదే సమం. తతిమ్మాదంత వుట్టి భ్రమ, మైదు, వో తమాస నాట్కం” అని పుల్లిరుస్తాడు యాదయ్య.

ఈ మాటల్ని విన్న కర్ణప్పంతులు ఎంకట్రావ్ మన చేతి వేళ్లే సమానంగా లేనప్పుడు ఇంత పెద్ద సంఘంలో హెచ్చు తగ్గులు ఉండవా? అని ప్రశ్నించి “నోరు లేని జీవరాసులకు గుడ నడిపిచ్చే నాయకుడుంట ఒకడుంటడు, ఉండాలె. గని, ఒక్కటి మట్కు గోరు నుండి శికె దాంక బాగ పర్కాయించి చూసి ఆలోచన జేయాలె, మీరు ఎన్నుకునే పెబ్బ పురాగ గోడ మీది పిల్లి వాటపోడు గాకుండ నల్గురి మంచి సెబ్బరలు ఆర్సుకుంట, ముండ్ల బాటేది? పూల బాటేది అనే గురి దెల్సి అందర్ని నడిపిచ్చెటోడు గావాలె, అసోంటోణ్ణి ఎన్నుకోండి. అందికె చిన్నా పెద్దా అంట ఉండాలన్నరు. లేకపోతే గొర్రె దాటు కతైతది” అని మంగళం పాడుతాడు.

ఈ మాటలన్నీ వింటున్న బాపనయ్య “సూడుండి పెద్దమనుషులు ఎందుకన్న మంచిది బూమి వాటం జూసి నీళ్ళు వారిచ్చుండి, గని, ఆ పారే నీళ్ళు యా వంకకు, యా దిక్కు వారుతుండవో? సూడుండి. ఉత్త మాటలే గద! అవి గాలిల గలుస్తయి అంట అనుకోగూడదు. మనం మాట్లాడిన మాటలన్ని ఆకాశాన అంటే మొగులు మీద శబ్ద బ్రహ్మయ్య కాడ వుంటవి. అట్ల లేక పోతే ఈ యాళ్ళ గీ రేడియో, టి. వి. గివి ఎట్లస్తుండే? యాదో మాట్లాడి పొద్దు గడిచెనంట సేతులు దుల్పకోకుండి” అని పత్యం చెప్తాడు.

ఇదంత విన్న రామయ్య “అయ్యలూ! ఈ యాల్ల అందరూ ఒకటే పాట. రోటి పాట తీర్గ తెల్సినా తెల్వకున్నా మనం మారాలె, ముందుకు పోవాలె. ఉర్కాలె అంటుండరు, ఇంగోటి మనొండ్లందరికి సదువు రావాలె అంటుండరు. నాకు మెప్పితమే. అంతకన్న బాగ్గెం యాడుండది? గని అక్కిరం రాస్కం మాట్కే సదువంటే నే నొప్పను. సదువు మనిషికి ఎలుగుజూపే కన్నసొంటిది. కన్నొచ్చినంక గుడ్డి నడ్క నడుస్తనంటే ఏం లాభం?” అని తెలివి చెప్తాడు.

ఈ వాదన అంతా విన్న నాగన్న “ఎప్పుడన్నగని నీళ్ళ బింకెం జూస్కోనె కప్పలు, చాపలు జేర్తయి. పచ్చ గడ్డిల్నే మిడ్తలు ఆడ్తయి. నాకు దెల్సినంతమట్టుకు ఇప్పటి పార్టీలల్ల అసలోండ్ల కంటే అంగడి గాండ్ల లొల్లే ఎక్కువ గానొస్తంది. అంతా భజనపర్లు, తందానగాండ్లు, అరువు బత్తెపోండ్లు, నిత్తెపు గాసగాండ్లు, కైకిలి కవులు, తిర్పెపు జోగులు, బూతు గాండ్లు, నూనె నాగన్నలు, రొండు మూతుల పాములు. ఉప్పేసి పొత్తుగల్సెటోండ్లేనయిరి. నమ్మికపు బంట్లు గన్కనా? ప్రాణాలొడ్డి నిల్సెటందుకు? ఆపతియాళ్ళకు ఆదుకునేటందుకు అసలు యాళ్ళకు తోకానాం పీకానాం?” దండకం అందుకుంటాడు. ఈ దినంల అంతా నమ్మిక లేని బతుకులు బతుకుతున్నామని రామాచారి పొడ్సినట్టే మాట్లాడుతాడు.

ఈ గొడవంతా వింటూ వస్తున్న పిల్లలు, యువకులంతా నవ్వులు పోయి నవ్వులయేతట్టుంది మీ ముచ్చట మీదేనా మాకు దీవెనార్తి ఇయ్యరా? అని బంగారం (జమ్మి) పెట్టి పెద్దల దగ్గర ఆశీర్వాదం పొందుతారు. సమ వయస్కుల దగ్గర అలై బలై తీసుకుంటారు.

అక్కా! బావ ఏమంటాడో కానీ మన ఊల్లే ముచ్చటైతే ఇదే అని వాళ్ళ గ్రామ విశేషాలన్నీ రాస్తుంది ఆ మరదలు ఉత్తరంలో. ముక్తా! మీ చెల్లెలు పుట్టి నేర్చిందా, పుట్టక నేర్చిందా ఈ మాటల సొగసూ? మా అమ్మ తోడు పెట్టిన మీగడ పెరుగు తిన్నట్టుగా ఉంది” అని నవ్వుతూ మరదల్ని మెచ్చుకోవడంతో కథ పూర్తవుతుంది.

నిజానికి ఈ కథకు ఇప్పటికీ ప్రాసంగికత తగ్గలేదనిపిస్తుంది. ఎందుకంటే రచయిత్రి ప్రస్తావించిన ఎన్నో అంశాలు ఇప్పటికీ వర్తిస్తాయి. మానవ మనస్తత్వం, సమాజ పోకడ ఏ మాత్రం మారలేదనిపిస్తుంది. యశోదా రెడ్డి రాసిన మిగతా అన్నీ కథల్లోలాగే ఈ కథలో కూడా ఎన్నో తెలంగాణ జాతీయాలు, సామెతలు, ఒక రకమైన తెలంగాణ వాతావరణం తొంగి చూస్తుంది. ‘మాటల పిట్ట’, ‘మిర్రెక్కి కూసోక’, ‘చిత్రపోవడం’, మిడ్కుతవు, అందత్కుల, మిటారి కత్తెలు, వాన గుర్రాలు, తకిరీరు లాంటి గమ్మత్తైన పదాలు అబ్బురపరుస్తాయి. తేనె చుక్కల్లాంటి సామెతలు కూడా తెలంగాణ భాష గొప్పదనాన్ని చాటిచెప్తాయి. నూనె బుడ్డి మీది రాతలు, మాటలు కోటలు దాటుతై గని సేతలు గీతలు దాటవు, రాగి పైసుంటే రాజు బిడ్డస్తది, నూరనండి ఆరనండి, గుత్ప సేత పట్టినోందే రాజ్జెం, శకునాలు వల్కిన బల్లి తాను వోయి అంబటి కుండల వడ్డదంట, ఎదుటోనికి తిర్పెపు సిప్ప అందియ్య అందరు వేమన్నలే, కడ్పుల ఇసం నాల్కెల బెల్లం, అందరి నోట్లే నానేది ప్యాదోడే, అంగట్ల అబ్బా అంటే ఎక్కడోడవు బిడ్డా, కొండలు తోడి తొండలు పట్టినట్టు, కూసిందే కూత ఏసిందే ఏటు, నరం లేని నాల్కకు  తాళమా? తలుగా? ఎటు దిప్పితే అటే, సూస్క ముర్వ, సెప్పుక ఏడ్వ, నోరు జారిన మాట సింగిణిడ్సిన బాణం, నీళ్ళ లోతు ఈతగానికి తెల్సు దేవుని గుట్టు పూజారికి తెల్సు, ముండ్ల మాటలు ఇని ముర్కిల గూలే కన్న, జోలెపట్టుక జోగి అయింది నయం లాంటి ఎప్పుడూ వినని సామెతలు కనిపిస్తాయి ఈ కథలో.

జమ్మి చెట్టు మీది నుంచి దించి ఆయుధ పూజ చేసినట్లు, ఈ కథలో ఎన్నో తెలంగాణ పదాలను గంపలకెత్తుకోవచ్చు. రచయిత్రి ఎంతో పండితురాలై ఉండి కూడా తెలంగాణ భాష పదాలు కాలగర్భంలో కల్సి పోకుండా ఎంతో సోయితో తెలంగాణ తెలుగులోనే తన కథలన్నీ రాసి భవిష్యత్ తెలంగాణ కథకులకు మార్గదర్శకంగా నిలిచారు. 1954-55 నాటికే వలసదారుల ప్రభావానికి లోనై తెలంగాణ భాష కనుమరుగైపోతుండడం గమనించిన యశోదారెడ్డి కావాలనే తన కథలకు మాధ్యమంగా తెలంగాణ తెలుగును ఎన్నుకున్నట్టు గమనించవచ్చు. తెలంగాణ భాషకు ఎంత నష్టం జరగాలో అంతా జరిగిపోయాక మనమిప్పుడు మూలాల్ని తవ్వుతూ  సమగ్ర తెలంగాణ భాషా  నిఘంటువును తయారు చేయాలని తాపత్రయపడుతున్నాం కానీ యశోదారెడ్డి కథల్ని సంప్రదిస్తే ఆ లోటును కొంతలో కొంతైనా పూడ్చవచ్చేమో!

రాజకీయాల మీద, విద్యా వ్యవస్థ పైనా, స్వదేశీయులు భాషను నిర్లక్ష్యం చేయడం, ప్రవాస తెలంగాణీయులు కాపాడాలని తహతహలాడడం, భాషా సంస్కృతుల పట్ల శ్రద్ధ తగ్గడం, బహుజనుల రాజ్యాధికారం, సమానత్వం, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటి పైన రచయిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటికీ మారలేదంటే రచయిత్రి ముందు చూపు అర్థం అవుతుంది.

ఈ కథ కేవలం దసరా నాడు జమ్మిని పంచుకునే సంప్రదాయాన్నే కాదు ఎన్నో మౌలిక అంశాలను చర్చించింది. ఒకనాటి తెలంగాణ సమాజ జీవితానికి ఈ కథ ఒక మచ్చు తునక. కాల్పనికతకు, వాస్తవికతకు, శిల్పానికి మధ్య సమతుల్యత పాటిస్తూ ఎంచుకున్న వస్తువును వర్ణించే విధానం పాఠకుడిని కట్టిపడేస్తుంది. తన స్వరానికి వాహికగా ప్రజల భాషను ఎన్నుకోవడంతో మల్లాది రామకృష్ణ శాస్త్రి, మా గోఖలే, సత్యం శంకరమంచి లాంటి కథకుల సరసన నిలబడే తెలంగాణ కథకురాలు యశోదారెడ్డి. సొగసైన తెలంగాణ పదాల్లాంటి జమ్మి ఆకులతో విస్తరి కుట్టి షడ్రసోపేతమైన భోజనం పెడుతుంది కథకురాలు ఈ కథలో.

    *

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

25 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సందర్భానికి తగిన కథను ఎంచుకన్న మీకు అభినందనలు.

    పదును, పదన‌, ఆవేదన, నివేదనకు అక్షర రూపం.

    జీవితాన్ని పట్టిచ్చిన గాలంలాంటి ఇమరస.

    సరళమైన విశ్లేషణ. సమర్థవంతమైన వివరణ. తెలంగాణ కథా విమర్శకు పారుతున్న అలుగుల వెల్దండ కు లావట్టిన తూంలతో స్వాగతం.

    పాకాల యశోదా రెడ్డి గారి కథలు మరోసారి చదువాలి అనిపిస్తుంది.

  • యశోదారెడ్డి గారి గొంతు రేడియోలో విని బాగా నవ్వుకునేవాళ్ళం.ఉచ్చారణ,భాషా పదాలు వాడకం ఆమె ప్రత్యేకత.మంచి విశ్లేషణ సార్.అభినందనలు.

  • గ్రామస్తులు పండుగ సందర్భంగా వొకచోట కలిసినప్పుడు మనసువిప్పి పిచ్చాపాటిగా మట్లాడుకునే మాటల్లో వెలువడే సామాజిక వైరుధ్యాల్ని జీవం తొణకిసలాడే తెలంగాణా భాషలొ యశోదారెడ్డిగారు చెప్పిన కథను వెల్దండి శ్రీధర్ గారు చక్కగా విశ్లేషించారు. ఈ చిన్న విశ్లేషణలోనే రెండు ముఖ్యమైన అంశాలు; భాష, సామాజిక మార్పుల గురించిన ప్రస్తావన ద్వారా కథకు సమకాలీనతను, విశ్లేషణకు బలాన్ని చేకూర్చారు. శ్రీధర్ గారికి అభినందనలు

  • **1954-55 నాటికే వలసదారుల ప్రభావానికి లోనై తెలంగాణ భాష కనుమరుగైపోతుండడం**
    తెలంగాణా భాష కనుమరుగైపోవడం, అజంత పదాలేవీ నోరుతిరగకపోవడానికి కారణం 1954-55 నాటి వలసదారులా? ఎవరా వలసదారులు? వాళ్లల్లో క్రీ.శ. 1400 నుండి పాలించి, మాతృభాషకు బదులుగా ముందు ఫారసీ లోను, తరువాత ఉర్దూలోను పరిపాలన నడిపి, బోధనా మాధ్యమాన్ని ఉర్దూనే ప్రధానం చేసి, పరిపాలనను ప్రజల నుండి దూరం చేసిననవాళ్లుే ఉన్నారా, లేరా? వలసదారుల పరిపాలన పోయి నాలుగేళ్లయింది కదా? సమగ్ర భాషా నిఘంటువులతో బాటు దృశ్య, శ్రవణ, ముద్రణా మాధ్యమాలన్నింటిలోను తెలంగాణా భాషే పెట్టుకోవడానికి ఎవరైనా వలసదారులు అడ్డంపడ్డారా? ప్రస్తుతం అవే కదా సాధారణ ప్రజానీకంతో సహా అందరి పలుకుబడులను నిర్దేశించి, ప్రభావితం చేస్తున్నది. ప్రాంతీయ రేసిజాన్నే పెంచి ప్రోత్సహించే తీరులేనే విశ్లేషణలు సాగిస్తూ దాన్నే పట్టుకు వ్రేలాడి, అక్కసుతో మాత్రమే విషయాన్ని చూస్తే ఎప్పటికీ అమ్మనుడిని కాపాడలేరు.

  • పాకాల యశోద రెడ్డి కథను ఎంచుకోవడం సముచితం.
    మంచి విమర్శన వ్యాసం
    వెల్దండి శ్రీధర్ గారికి శుభాకాంక్షలు

  • పాకాలయశోదా రెడ్డి గారి మరో మంచి కథని విజయదశమి సందర్భంగా పరిచయం చేయడం బాగుంది. మంచి విశ్లేషణ.

  • యశోదా రెడ్డి మేడం పాలమూరు, కరినగరం, హైదారబాద్ వాండ్లు మాట్లాడే భాషను రాసిండ్రు. ఆమె చదువుకుంది తెలుగు మాద్యమంలో. అంటే నిజాం పాలనలో కూడా బిరుదురాజు, సినారె, దాషరధి, కాళోజి ఇంకా చాలామంది ఉర్దూ, తెలుగులను సమపాళ్లలో ఆదరించారు. ఇక పోతే ఆంధ్రోళ్ల భాషాధిపత్యం పోలీస్ యాక్షన్ నుంచే షురువయ్యింది.తెలంగాణలో బూరుగుల ప్రభుత్వం ఎకాఎకిన ఉర్దూ స్థానములో తెలుగును చదవాలని మార్పులు జేసిండ్రు. దీంతో ఆంధ్రా నుంచి టెలుగు బోధించే పేరుతో దిగుమతైన పంతుళ్లు మీకు సదువురాదు.. జ్ణానంలోని లేదు అది నేర్పించేందుకు మేమొచ్చినం ఆని ఆధిపత్యాన్నిచలాయించారు. మెళ్లగా పత్రికలు కూడా వొచ్చినయి. 1955 నాటికే తెలుగు స్వతంత్ర హైదరబాద్కు వొచ్చింది. ఇందులో స్థానికుల రచనలు చాలా తక్కువగా అచ్చయ్యేవి. ఇట్లా తెలాంగాణ భాషను వలసొచ్చిన వారు భ్రష్టు పట్టించారు.

  • మంచి కథను, అత్యంత సజీవంగా విశ్లేషించినందుకు డా.వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు. శుభాకాంక్షలు.

    అయితే అభిప్రాయాల్లో శ్రీనివాసుడు గారి బాధ అర్థం కాలేదు.

    తెలంగాణ భాషకు చరిత్రకు జరిగిన అన్యాయం ఇంకా వెయ్యేండ్లు చెప్పుకున్నా తీరదు.

    బాధితులు తమ బాధను చెప్పుకుంటుంటే మద్ధతు తెలపాలి. లేకుంటే మౌనంగా ఉండాలి.

    అంతే తప్ప బాధితుల మీదే బండలు వేయడం ఎందుకు?

    తెలంగాణ భాషా, సంస్క్రుతుల పట్ల అన్యాయం జరుగకుండా ఉంటే, అరవయేండ్లు ఉద్యమం ఎందుకు జరిగినట్టు. ఎందుకు ప్రత్యేక రాష్ర్టం కావాలని ఉద్యమించినట్టు??

    కాబట్టి…

    వలస దారులు ముస్లిమైనా, తెలుగు వారైనా తెలంగాణకు చేసిన అన్యాయాలపై తప్పకుండా మాట్లాడాల్సిందే.

    మాట్లాడొద్దని వారించే హక్కు ఎవ్వరికీ లేదు.

    అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు.

    తెలంగాణ వచ్చినా సరే ఇంకా మీడియా, సాహిత్య రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది?

    దీనికి ఏం సమాధానం చెబుతారు?

    అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ముంబాయి విషయంలో మకాన్ దార్ మకాన్ దారుడే, కిరాయి దారుడు కిరాయి దారుడే అన్నాడు.

  • తెలంగాణాలో ఎవరు ప్రజల అమ్మనుడికి అన్యాయం చేసారో ఓ పాకిస్తానీ పరిశోధకుడు ఈ రెండు పరిశోధనా పత్రాలలో వివరంగా చెప్పారు. రాజకీయ, అక్కసు అవసరాలకోసం సగం మాత్రమే చెప్పి మిగతా సగాన్ని వదిలేయడం అనేది ఏ విధంగా బాధితుడి కథనం అవుతుందో తెలియాల్సి వుంది. బూర్గుల తెచ్చిన తెలుగు పంతుళ్లే తెలంగాణా భాషను నాశనం చేయడం మొదలుపెట్టారు అనడం సబబా?

    తారిక్ రెహమాన్ అనే వ్యక్తి భాషాశాస్త్ర చరిత్ర పరిశోధకుడు. అతడు పాకిస్తానీ. పాకిస్తాన్ ఉన్నత విద్యా కమీషనరేట్ అందించిన నిధులతో సమర్పించిన తన పరిశోధనా పత్రంలో “Urdu in Hyderabad State” లో నిజాం ఎందుకు ఉర్దూని ప్రధాన భాషగా చేసినది, దానివలన ప్రజలు మాట్లాడే భాషలైన తెలుగు, కన్నడం, మరాఠీ ఏ విధంగా భ్రష్టుపట్టాయి (పూర్తిగా అంతరించకపోయినా) (నిజానికి హైదరాబాద్ ఓ స్వతంత్ర దేశమైతే పరిస్థితి ఇంకెలా వుండేదో చరిత్రకారులు కూడా ఊహించలేరు) ముస్లింల రాజకీయాధికారాన్ని సుస్థిరం చేయడానికి మాత్రమే ఉర్దూను ఎలా బలవంతంగా ప్రజంలందరిపై రుద్దినదీ వివరంగా పేర్కొన్నాడు.

    Urdu in Hyderabad State

    http://www.urdustudies.com/pdf/23/06Rahman.pdf

  • తారిక్ రెహమాన్ గారి ఇంకో పరిశోధనాపత్రం
    The Teaching of Urdu in British India

    దీనిలో The Hyderabad Experiment అనే అధ్యాయంలో పైన నేను చెప్పిన విషయాన్ని వివరంగా చదువుకోవచ్చు.

    http://www.urdustudies.com/pdf/15/06rahmant.pdf

  • విషయం బాబాసాహెబ్ వైపుకు త్రిప్పబడింది కాబట్టి, ముస్లింల గురించి, ఇస్లామ్ గురించి బాబాసాహెబ్ విశ్లేషణను, అభిప్రాయాలను కూడా స్వీకరిద్దామా? తన Pakistan or The Partition of India’ పుస్తకంలోన ఆయన ఇలా వ్రాసారు….
    Dr. Ambedkar has also written, “ Hinduism is said t
    o divide people and in contrast Islam is
    said to bind people together. This is only a half t
    ruth. For Islam divides as inexorably as it
    binds. Islam is a close corporation and the distinc
    tion that it makes between Muslims and non-
    Muslims is very real, very positive and very aliena
    ting distinction. The brotherhood of Islam is
    not the universal brotherhood of man. It is brother
    hood of Muslims for Muslims only … The
    second defect of Islam is that it is a system of
    social self-government and is incompatible with
    local self-government, because the allegiance of a Muslim does not rest on his domicile in the
    country which is his but on the faith to which he b
    elongs … In other words, Islam can never
    allow a true Muslim to adopt India as his motherlan
    d and regard a Hindu as his kith and kin.”
    (P. 330). Also “The Muslims are howling against the
    Hindu Maha Sabha and its slogan of
    Hindudom and Hindu Raj. But who is responsible for
    this? Hindu Maha Sabha and Hindu Raj
    are the inescapable nemesis which the Musalmans hav
    e brought upon themselves by having a
    Muslim League. It is action and counter-action. One
    gives rise to the other.” (P. 359)

    the fundamental assumption made by all Muslims tha
    t Islam is a world religion, suitable for
    all people, for all times and for all conditions ..
    . that this uniformity is deadening and is not
    merely imparted to Muslims, but is imposed upon the
    m by a spirit of intolerance which is
    unknown anywhere outside the Muslim world for its s
    everity and its violence and which is
    directed towards the suppression of all rational th
    inking which is in conflict with the teachings
    of Islam.” (P. 234)

    • శ్రీనివాసుడు గారు,

      పాకిస్తాన్ అండ్ ఇట్స్ పార్టీషన్ చదివాము.

      అయితే ఇప్పుడేంటి?

      మీరు ఏం చెప్పదలుచుకున్నారు?

      • వలసదారుల విషయంలో మీరు అంబేడ్కర్ ప్రస్తావన తీసుకువచ్చారు కదా. మరి, అంబేడ్కర్ చెప్పినవన్నీ సత్యాలే అని చెప్పదలచుకున్నారా? అంబేడ్కర్ ప్రస్తాివన ీతీసుకువచ్చి మీరు చెప్పదలచుకున్నది ఏమిటి?

  • ఆధిపత్య విధ్వంసం వాదానికి, యథా తదా వాదానికి చర్చా బాలగోపాల్ ఒక సారి మాట్లాడుతూ “కృష్ణా నీళ్ళు ముందుగా రాయసీకు వచ్చి వుంటే అదే ప్రామాణిక భాష అయి ఉండేది” అంబేద్కర్ విశాల ప్రాతి పాతిపాదికన రాయడంతో రాయడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కోట్ చేస్తున్నారు గుంటూరు లో చూసిన ఒక RSS కర పత్రంలో “ఒకే వరుసలో ఒకే డ్రెస్ కోడ్ తో నిలబడడం ఆనడానిచ్చింది” witin quoets లో రాయడం అనేది అగ్ర వర్ణ ప్రాక్టీస్

    • అది కేవల ఉటంకింపు మాత్రమే అనుకుని బహుశా సర్దిచెప్పుకుని, సరిపుచ్చుకుంటున్నట్లున్నారు. ఆనంద్ రంగనాథన్ ‘‘అంబేద్కర్ ఆన్ ఇస్లామ్: ది స్టోరీ మస్ట్ నాట్ బి టోల్డ్’’ అనే వ్యాసం చదివితే అది విశాల ప్రాతిపదికో, నిర్దుష్ట అవగాహనో తెలిసే అవకాశం వుంటుంది. లేదా స్టోరీ ఆఫ్ పార్టీషన్ పుస్తకంలో ఇంకా వివరంగా వుంది…
      Ambedkar on Islam: The story that must not be told

      https://www.newslaundry.com/2017/04/14/ambedkar-on-islam-the-story-that-must-not-be-told

      ఇది చదివి ఆనంద్ రంగనాథన్ కూడా ఒకటి రెండు కొటేషన్లు తీసుకుని వ్రాసాడని మళ్లీ సర్దిచెప్పుకోనక్కరలేదు. ఎందుకంటే అదే వెబ్ సైట్లో అంబేడ్కర్ విశిష్టతని వివరిస్తూ ఇంకో వ్యాసం కూడా అతడే వ్రాసాడు. ఆసక్తి వుంటే దాని లంకె కూడా యిస్తాను. మనం తీసుకునే అంబేడ్కర్ కొటేషన్లన్నీ నిర్దుష్టం, వేరేవారు చెప్పేవన్నీ విశాల ప్రాతిపదికగా చూడడం ద్వంద్వం అవుతుంది.

    • ‘‘వర్ణం వేరు, కులం వేరు, రెండింటికీ సుద్దముక్కీ, జున్నుకీ వున్నంత తేడా వుంది’’ అని అంబేడ్కరే చెప్పినట్లున్నారు. కొటేషన్లు ఎవరు మొదలుపెట్టందీ, అది ఎవరి ప్రాక్టీస్ అనేది పై వ్యాఖ్యలు చూస్తే తెలియవచ్చు. విషయాన్ని సప్రమాణంగా చర్చించే ప్రయత్నం చేస్తే విషయానికి సంబంధంలేని వ్యాఖ్యలు రావు.

  • మాకు అంబెడ్కర్ మీద ఉన్న గౌరవం మీకు లేకున్నా మాకేం బాధ లేదు. ఎందుకంటే అంబేద్కర్ రచనలను ఆధిపత్యాని విధ్యంసం (హింస కాదు) చేసే సాహిత్యంగా మేము చూస్తాం. ఆధిపత్యానికి భాషా అణిచివేత కూడా ఒక కారణం అని పుస్తకాల జ్ఞానం మనలా లేకున్నా సినిమా ప్రపంచానికి అర్థ మైనంత మీకు అర్థం కాక పోవడం విచిత్రం. మీరు చెప్పినట్టు మిగతా కారణాలు ఒక్క శాతం మాత్రమే, సీమాంధ్ర భాషాదిపత్యం నూటికి తొంబై తొమ్మిది శాతం.
    మేము అంబేద్కర్ని కోట్ చేయడంలో తప్పులు చేస్తున్నామని ఎత్తి చూపారు. జున్నూ ముక్క –సుద్ద ముక్క అని —- నిజమే ఈ విషయాన్ని మీకంటే ముందే గ్రహించింది బాలగోపాల్ – కులం విషయంలో బహుజనవాదుల వాదనలు మార్కిసజం ప్రభావంతో మాట్లాడుతున్నారని, రాజ్యాధికారమే అన్ని సమస్యములకు పరిస్కారం అనే అవగాహన కూడా మార్కిసజం లోనిదే అని విమర్శించారు. వర్తమానంలోని మా సమస్యలను మేం పరిష్కరించు కోగలం. ఆధిపత్య రూపాల గురించి మాకు సలహాలు అవసరం లేదు.

    • గౌరవం అనేది ఆ వ్యక్తి భావజాలాన్ని అర్థంచేసుకోవడంలో, కోట్ చేయడంలో అడ్డం పడకూడదు. లేదా, ఆ వ్యక్తి చెప్పినదంతా సత్యమే అనే రొడ్డకొట్టుడు అవగాహనకు దారితీయకూడదు. సీమాంధ్ర భాషాధిపత్యం 99 శాతం అనేది తప్పుడు అవగాహన అనే పైన నేను సప్రమాణంగా చెప్పింది. ఈ వ్యాసం భాష గురించే గనక విషయాన్ని అక్కడివరకే పరిమితం చేయాలి. కొటేషన్లు కూడదు. కొటేషన్లు చెబితే ఆ కొటేషన్లకున్న పరిమితిని కూడా ఎత్తి చూపించవలసివస్తుంది. సలహాలు అవసరంలేనప్పుడు అగ్రవర్ణ భావజాలం అన్న కామెంట్లు కూడా చేయక్కర్లేదు. తప్పుడు అవగాహనకి అగ్రవర్ణ, నిమ్నవర్ణ తేడాలుండవు. ఆధిపత్యరూపాలు, అవి చేసిన విధ్వంసం చెప్పే క్రమంలో ఒక్క విషయాన్నే ఎత్తిచూపుతూ అంతకుముందు 600 ఏళ్ల ఆధిపత్యాన్ని విస్మరించడమే ద్వంద్వం, రాజకీయం అంటే. 99 శాతం సీమాంధ్ర భాషాధిపత్యం అని చెప్పినప్పుడు ప్రమాణాలు చూపాలి. లేనిపక్షంలో నేను చూపిన ప్రమాణాన్ని ఖండించాలి.
      ఆధిపత్యం మా మతం చేతిలో మాత్రమే వుండాలి అని, తన భాష ఆధిపత్యాన్ని ఏ విధంగా నిరంకుశంగా రుద్దారో పైన నేను యిచ్చిన రెహమాన్ ఖాన్ పరిశోధనాపత్రంలో వివరంగా వుంది.

  • ముందు మీకు ఆదిపత్యమ్ అర్థం కానట్టుంది. ఎంత చెప్పినా అర్థం కాకా పోవడమే ఆధిపత్య భావజాలం లో భాగం. అంతే కానీ ఎప్పుడో వచ్చిన ఇక్కడ తెలగాణ భాషలో కలిసి పోయి మా భాషా సౌందర్యాన్ని పెంచితే అది అర్థం కాక ‘తౌ రక్యాంధ్రం’ అని మాట్లాడారు

    • విషయాన్ని మీరు ప్రక్కదారి పట్టిస్తున్నారు. నేను చేసిన మొదటి వ్యాఖ్యలో 1955-56 నుండి మాత్రమే భాషాధిపత్యం మొదలైనదన్నదాని ఖండన. అంతేగాని భాషాసౌందర్యం గురించి, భాషలో కలసిపోయినదాని గురించి కాదు. ఇక్కడ మీరు చూడాల్సింది ముస్లింల ఆధిపత్యం మాత్రమే వుండాలని పాలకులు ఏ విధంగా అమ్మనుడిని నాశనం చేసిన విషయాన్ని గురించి. అది వివరంగా ఉర్దూ భాషను గురించి పరిశోధన చేసిన వ్యక్తి వ్రాసారు. ఇక ఎవరో తౌరక్యాంధ్రం గుిిరించి మాట్లాడారంటే వెళ్లి వాళ్ళని అడగండి. నేను అడిగింది ఆధిపత్యంకోసం అమ్మనుడిని ఎవరు ఎంత నాశనం చేసారు అన్న విషయం. మీ దగ్గర ప్రమాణాలుంటే తెలంగాణా భాష నాశనం చేసింది ఆంధ్రులు మాత్రమే అని చూపండి.
      ఇక ఆధిపత్య భాష విషయం….. మీరు తెలంగాణా సాధించుకుని నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఒక్కనాడయినా మీ మాధ్యమాలు అంటే 12 దినపత్రికలు, అనేక మాసపత్రికలు, పక్షపత్రికలు, దాదాపు 12 టి.వి. ఛానెళ్లలో ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు చెప్పిప ఆధిపత్య భాషలో తప్పితే తెలంగాణా భాషలోనే అచ్చంగా వార్తలు వ్రాస్తున్నారా, చదువుతున్నారా? చదవనట్లయితే అవన్నీ సీమాంధ్ర ఆధిపత్యాన్నే పెంచి పోషిస్తున్నాయా? అవన్నీ సీమాంధ్రులవేనా? మీరు వ్యక్తిగతంగా పత్రికలు వ్రాసే వ్యాసాలు, పెట్టే ఫేస్ బుక్ పోస్టులు తెలంగాణా భాషలోనే, అంటే ప్రజల భాషలోనే ఎన్ని వ్రాసారు? వ్రాయకపోయినట్లయితే మీరు కూడా ఆధిపత్య భాషనే పెంచి పోషించడానికి, కొనసాగడానికి ప్రయత్నిస్తున్నట్లా? కనీసం మీరు చేసిన 3 వ్యాఖ్యలలోనే సంస్కృతజన్యాలైన తెలుగు మాటలెన్ని? తెలంగాణా భాషకే ప్రత్యేకమైన, అంటే సామాన్యజనులకు అర్థమయ్యే మాటలెన్ని? సీమాంధ్ర మాటలెన్ని? మీరు సామాన్యుల భాష ఉపయోగించనంత మాత్రాన మీరు ఆంధ్ర భాషాధిపత్యానికి దోహదం చేస్తున్నట్లా? ఆత్మవిమర్శ స్వీయస్థితి నుండి మొదలయినప్పుడు మాత్రమే ప్రజలకు అర్థమయ్యే భాషలోనే వ్రాస్తాం. కాకపోతే సీమాంధ్రలు మీద పడి బాధపడతాం. సీమాంధ్ర ఆధిపత్యభాష అంతగా నాశనం చేసినట్లయితే మీ పత్రికలలో ప్రతి వార్త ఇప్పటివరకూ నడుస్తున్న ప్రామాణిక ప్రతికాభాషనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? వలస పాలన ముగిసిన మొదటి రోజునుండీ మీరు ప్రజల భాషలోనే వ్రాయవచ్చు కదా? మీ 4 వ్యాఖ్యలలోనే వున్న వైరుధ్యం గమనించారా? ‘‘బాలగోపాల్ వ్యాఖ్యను ఉదహరించి రాయలసీమకు కృష్ణానీరు వెళ్లినట్లయితే రాయలసీమ భాషే ఆధిపత్య భాష అయివుండేది’’ అన్నారు. దాని వెంటనే తరువాతి వ్యాఖ్యలో సీమాంధ్ర భాషాధిపత్యం అన్నారు. అంటే రాయలసీమ భాష ఆధిపత్య భాష అయిందా? లేదు కదా. రెండున్నర జిల్లాల భాష అంటున్నారు కదా. ఆ రెండున్నర జిల్లాలలో కూడా పత్రికాభాషను యథాతథంగా ఎవ్వరూ మాట్లాడరు. పత్రికాభాష వేరు, మాట్లాడే భాష వేరు. సూటి ప్రశ్న ఏమిటంటే మీరు వ్రాసేది ప్రజలభాషలో లేకపోవడానికి కారణం ఎవరు? అది మీరు చేస్తున్నదా? లేక ఎవరో వచ్చి మీ మీద ఆధితప్యం చలాయించి, ఈ భాషలోనే వ్రాయి అని ఆదేశించడమా?

      • శ్రీనివాసులు గారు మీరు చెప్తున్న భాషా రాజకీయాలు తెలుసుకోలేనంత అమాయకంగా ఏమీ లేము.

        మీలో తీవ్రమైన ముస్లిం వ్యతిరేకత ఉందని మాకు అర్థమవుతున్నది. అది ఇప్పుడు అవసరం లేనిది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం భాషాధిపత్యం తెలంగాణ మీద లేదు. కానీ, కోస్తాంధ్ర భాషాధిపత్యం రాష్ర్టం విడిపోయినా ఇంకా కొనసాగుతున్నది.

        తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందు దశాబ్దాల పాటు…

        తెలంగాణ భాషను సినిమాలల్లో విలన్లకు, కమేడియన్లకు పెట్టి మమ్మల్ని అవమాన పరిచినపుడు ఎక్కడ పోయింది మీ అమ్మనుడి ప్రేమ ??

        దయచేసి ఈ చర్చ ఆపేసి , ప్రొ.జయశంకర్ గారు రాసిన ‘‘తెలంగాణ రాష్ర్టం ఒక డిమాండ్’’ పుస్తకం చదవండి…సార్ ప్లీజ్

  • 1) రవీందరుగారూ, మీరు చెబుతున్న రాజకీయ ప్రయోజనాలు, అక్కసు ప్రయోజనాలకోసం ప్రాంతీయ విద్వేషాన్ని జీవితాంతం కొనసాగించే ధోరణులు గ్రహించలేనంత అమాయకంగా ఏమీ లేము.

    2) మీలో అతి తీవ్రమైన ఆంధ్రా ద్వేషం వున్నట్లు మాకు అర్థం అవుతున్నది. ఎందుకంటే వలసదారుల గురించి అంబేడ్కర్ ని ఉటంకిచిన్నప్పుడే ఆ విషయం అర్థమైంది.
    ఇక నా ముస్లిం ద్వేషం సంగతి……
    నాకు స్ఫూర్తి కలిగించినవారు
    నేను అనుసరించే నాయకుడు… అబ్దుల్ కలామ్
    నేను గౌరవించే సామాజిక సంస్కర్త…. 1966 లోనే త్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, పోలీగమీ ఆచారాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో రాజకీయపరమైన లక్ష్యాలు లేకుండా ఉద్యమాన్ని నడిపిన *హమీద్ దల్వాయ్*.నా దృష్టిలో ఇతడు నిజమైన సెక్యులరిస్ట్.
    నేను గౌరవించే దేశభక్తుడు…. జైన్ ఉల్ అబీద్ హసన్, ఇతడు హైదరాబాదీ. తాను జర్మనీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు అక్కడకి వచ్చిన నేతాజీని కలుసుకుని, వెంటనే తన చదువు ఆపేసి, దేశంకోసం నేతాజీకి సెక్రెటరీ మరియు దుబాసీగా మారారు. తన భారత సైన్యాన్ని ఉద్దేశించి సంబోధించడానికి ఒక నినాదాన్ని చెప్పమంటే “జైహింద్‘‘ నినాదాన్ని మొదటిసారిగా బోస్ కు చెప్పిన వ్యక్తి జైన్ ఉల్ అబీద్ హసన్.
    ఇస్లామ్, ముస్లింల ఆలోచనావిధానాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుంటున్నది…. ‘న్యూ ఏజ్ ఇస్లాం‘ అనే జాలగూటి పత్రిక సంపాదకుడు… సుల్తాన్ షహీన్
    పాత్రికేయుడు… తుఫైల్ అహ్మద్
    సమీక్షకుడు… ఎ. రజా హుస్సేన్
    ముస్లిం రాజకీయాల విశ్లేషకుడు…. తారెక్ ఫతా
    పాకిస్తాన్ పాత్రికేయులు… హసన్ నిసార్, నజమ్ సేథీ
    భారతీయ ముస్లింలలో వున్న దాదాపు 300 కులాలలో వెనుకబడిన, అట్టడుగు ముస్లింల బాగుకోసం, ముస్లింలలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అరికట్లడానికి పాటుపడుతున్న “పసమందా” ఉద్యమ ఆవిష్కర్త… అలీ అన్వర్ (బీహార్)
    ఇప్పుడు ఆ పసమందా ఉద్యమ కార్యకర్తలు, రచయితలు….. ఖాలిద్ అనీస్ అన్సారీ, ఫైజ్ అహ్మద్ ఫైజీ
    ఇలా నాకు మార్గదర్శనం, అవగాహన, స్ఫూర్తి కలిగిస్తున్న ముస్లింలు అనేకులున్నారు.
    ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజల భాషని అణచివేసి పాలకుల భాషలోనే బోధనామాధ్యమం, పరిపాలనా మాధ్యమాన్ని కొనసాగించారు అని పూర్తి గణాంకాలతో సహా పరిశోధనాపత్రం సమర్పించిన రెహమాన్ ఖాన్, ముస్లింల గురించి, ఇస్లాం గురించి తన అభిప్రాయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లుగా తెలిపిన అంబేడ్కర్ ముస్లిం ద్వేషులు కానప్పుడు ఆ విషయాన్ని గురంచి తెలియజేసిన నేనెట్లా ముస్లిం ద్వేషిని అయ్యాను అని.

  • 3) కోస్తాంధ్ర భాషాధిపత్యం కొనసాగుతూ వుంటే ఆధిపత్యానికి ప్రతీకగా ప్రతిక్షణం కనబడుతూవుంటే, వినబడుతూ వుండే ఆ భాషలోనే 90 శాతం అన్ని రచనలూ, అన్ని వ్యాఖ్యలూ, అన్ని ప్రసంగాలూ అన్ని అచ్చు మాధ్యమాలూ, శ్రవణ, దృశ్య మాధ్యమాలలో ఎందుకు వస్తున్నాయి? వ్రాస్తున్న, చదువుతున్నదెవరు? ఎవరు కొనసాగించమని ఆదేశించి నిరంకుశంగా అమలుపరుస్తున్నారు? దానంతటదే కొనసాగడం కాదు, కొనసాగిస్తున్నవాళ్లే మారడానికి, ప్రజలభాషలో చెప్పడానికి ఒక చిన్నమెత్తు ప్రయత్నం కూడా చేయడంలేదు. వాళ్లు ప్రజలభాషలోనే తాము వ్రాసే ప్రతిదీ వ్రాస్తే ‘‘అచ్చువేయం‘‘ అని ఆ పత్రికలు, టి.వి.లు నిర్దేశించాయా? మార్చుకునే మన ప్రయత్నం ఏదీ లేకుండా ఇంకో వేయేళ్ల పాటు ఆధిపత్యభాషే మా దుస్థితికి మూలకారణం అనే వ్యాఖ్యలు దేనిని సూచిస్తున్నాయి? రాజకీయ ప్రయోజనాన్నా కాదా? బోధనామాధ్యమంగా, పరిపాలనా ప్రక్రియలో మాధ్యమంగా ప్రజల భాషనే పెడితే కాదన్నదెవరు? అడ్డుపడుతున్నదెవరు? మీ భాష వేరు, మా భాష వేరు అని కదా చెబుతున్నారు? ప్రపంచ తెలుగు మహాసభలు కాకుండా ప్రపంచ తెలంగాణా భాష మహాసభలు అని ఎందుకు పెట్టలేదు?
    4) తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణా భాషను కమెడియన్లకు, విలన్లకు పెట్టిన సినిమాలను ఎందుకు నిషేధించలేదు? ఆ సినిమాలు ఇప్పటికీ తెలంగాణా థియేటర్లలో ఆడుతూనేవున్నాయా? టి.వి. ఛానెళ్లలో కామెడీ సీన్స్ కార్యక్రమాల్లో వస్తూనే వున్నాయా? వస్తున్నట్లయితే ఆపడానికి ఏ ప్రయత్నం అయినా జరిగిందా?
    ఇక నా సంగతి… నేను థియేటర్లలో సినిమా చూసి ఓ 14 ఏళ్లు, టి.వి.లలో సమకాలీన సినిమాలలో 99 శాతం చూసి పదేళ్లు అయింది. నేను చూసేది క్లాసిక్స్ లేదా పాత సినిమాలు. తెలుగు సినిమాల్లో కనిపించే చౌకబారు హాస్యాన్ని ఆస్వాదించే స్థాయి నాది కాదు.

    నేను కవిని కాదు, రచయితని కాదు, సామాన్య పాఠకుడిని. నేను వ్రాయడం మొదలుపెట్టింది ఇదే సారంగలో దాదాపు రెండేళ్ల క్రితం సూఫీతత్త్వం భారతీయ ఇస్లాం మతాల కలయిక, సూఫీకి మూలం ఇస్లాం అనే తప్పుడు వ్యాఖ్యానాన్ని ఖండించే వ్యాఖ్యతో. అంతకుముందు నేనెక్కడా నా అభిప్రాయాలు పంచుకోలేదు. ఒక్క వాక్యం కూడా వ్రాయనూలేదు. జాలగూళ్లలోని పత్రికల గురించి అసలే తెలియదు.

    విషయం గురించి అడినప్పుడు దానికి స్పందించకుండా విషయాన్ని అడిగినవారి వ్యక్తిత్త్వం గురించి వ్యాఖ్యలు చేయడం చాలా పాత ఎత్తుగడ. అప్పుడు నువ్వేం చేసావ్? అప్పుడు నువ్వేదైనా చేసివుంటే, అదీ మాకు తెలిసేట్లుగా చేసివుంటేనే మాట్లాడాలి అనేది పలాయనవాదం అవుతుందిగాని సత్యాన్వేషణ మార్గం కాదు. దీనివలన చర్చ సాగదు. ఇలాంటి ఎత్తుగడలు ఎన్నివేసినా ఇప్పటికీ ఆధిపత్య భాషలోనే వ్రాస్తున్న నైజమూ మారదు. ఒక్క వాక్యం కూడా ప్రజలు మాట్లాడుకునే భాషలోకి మార్చలేం.

    పోనీ, ఆ వ్యక్తిగత దాడికి భయపడో, లేదా అలాంటి దాడి కొనసాగించడానికి ఇష్టపడకో ఈ చర్చను నేను ఆపివేసినా, నేనిచ్చిన ఆదారాలు, ముస్లిం గురించిన అంబేడ్కర్ అభిప్రాయాలు వేరొకచోట, లేదా అన్నిచోట్లా అందరికీ వినిపించే అవకాశం అందరికీ వుంటుంది.

  • ప్రాంతీయద్వేషం అనేది అప్పటి పరిస్థితుల్లో రాజ్యాధికారాన్ని సాధించడానికి రెచ్చగొట్టినా ఆ రాజ్యాధికారం వచ్చిన తరువాతయినా దానిని విస్మరించి తల్లిభాషకోసం పాటుపడడం అనేది ఆచరణశీలంగా వుండాలి. ఇంకా భాషాధిపత్యం అని మాట్లాడుతూవుంటే దానివలన మన రాజకీయ, అక్కసు ప్రయోజనాలు నెరవేరతాయి తప్ప అమ్మనుడికి కలిగే ప్రయోజనం ఇసుమంతయినా వుండవు. మానసిక గోడలు ఇంకా దట్టంగా కట్టబడతాయి. ఒక భాష ధ్వంసానికి, ఆ భాషాస్వరూపం మారడానికి 1955-56 నుండి వచ్చిన భాషే కారణం అని నిర్ధారించడం అనేది అసమగ్ర దర్శనం. 600 ఏళ్లు పాలించిన భాషలు ఎన్ని తెలంగాణా పదాలని మింగేసాయో, ధ్వంసం చేసాయో, దాని విధ్వంసం ఏ స్థాయిలోవుందో అది కూడా తెలుసుకుంటేనే ఏ భాష అయినా పూర్తిగా కోలుకుంటుంది.

    ద్వేషం, ద్వేష ప్రకటన, ద్వేష విశ్లేషణలు మరింత ద్వేషం పెంచడానికే గాని సామరస్యానికి తోడ్పడవు. ఈ విషయాన్ని ఓ చలనచిత్ర సంభాషణలో అద్భుతంగా చెప్పారు. నిజానికి ఆ చిత్రం యొక్క సారాంశం అంతా ఆ ఒక్క సంభాషణలోనే ఇమిడ్చారు. ఆ చిత్రం పేరు ‘ది హరికేన్’. నటుడు డెంజెల్ వాషింగ్‌టన్.
    ‘‘Rubin “Hurricane” Carter: [to Lesra] Hate put me in prison. Love’s gonna bust me out.’’
    ఈ సంభాషణలోని లవ్ అంటే హేట్ కి పూర్తి వ్యతిరేకమైనది కాదు. అలా అయితే రాగద్వేషాలు రెండూ ఒకేనాణానికి రెండు తలాలు అవుతాయి. మనకి అలాంటి లవ్వూ అక్కర్లేదు, అలాంటి హేటూ అక్కర్లేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు చూసి, భావోద్వేగాలను ప్రక్కనబెట్టి ఇకనుండయినా మనం వ్రాసే ప్రతిదీ ప్రజల భాషలోనే వ్రాయడం ఇప్పుడు కావలసింది.
    ఆ పని విజయవంతంగా చేస్తున్నవారూ వున్నారు. నేను చూసినంతలో హెచ్ ఎమ్ టివిలోని జోర్దార్ వార్తలలో అచ్చంగా ప్రజలు మాట్లాడుకునే భాషలోనే ప్రతి విషయాన్ని చక్కగా చెబుతుంటారు. నాకు అర్థంకానిదేమంటే 24 గంటలూ అదే భాషలోనే అన్ని పత్రికలూ, అన్ని టివిలు, అన్ని బోధనా మాధ్యమాలు, అన్ని పరిపాలనా రీతులూ కొనసాగడానికి ప్రయత్నం ఎందుకు జరగడంలేదు అని.

    నేను ఈ మధ్యకాలంలో చదివిన నాకు నచ్చిన అలాంటి రచన…..
    శ్రీ కట్టా శ్రీనివాస్ గారి ఫేస్ బుక్ టపా…. “మన ప్రతిజ్ఞ’’
    దోస్తులందలికీ మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన జాతీయ గీతాన్ని దేశమంతా ఒకలాగానే పాడతరు కానీ ప్రతిజ్ఞ మాత్రం వారి వారి రాష్ట్ర భాషలలో చేస్తరు. అవును మరి ఒక ఒట్టు వేస్తాన్న మంటే దానికి కట్టుబడి ఉండాల్న వద్దా? అట్లుండాలంటే ముందుగల అదేందో తెలవాల్న వద్దా? మరి మనకి సుత సమజయ్యే టట్లు దేశం కోసం ఒట్టు వేయాలంటే గిట్లుంటే ఏమయితది? వుండాలనుకుంటే నేను సరిగా రాయలేని చోట కొంచెం చెయ్యి చేసుకోండి. చూద్దాం ఒకవేళ ఇదే పనికొస్తదేమో√√
    పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి శనార్థులతో.
    కట్టా శ్రీనివాస్ || ఒట్టు ||
    నే పుట్టిన దేశమంటే నాకు తల్లి లెక్క. దేసపోళ్ళందరూ నా అన్న దమ్ములు, అక్కసెల్లెళ్ల లెక్క. దేశమంటే మస్తు నా పానానికి పానం లెక్క.
    డబ్బు దస్కమున్న, జోర్డార్ గున్న నా దేశపు ఇలాకా ఖాన్ దాన్ గట్లా నాకు పూరా ఖుష్ ఐతది.
    దీనికి కాబిల్ కాటానికి కొశిష్ జేస్తా.
    అయ్యా అమ్మల్ని పంతులోరిని, పెద్దోళ్ళందరిని ఇజ్జత్ గా జూస్తా.
    పతోళ్ల తోనూ బరాబర్ మంచిగుంటా.
    దేశానికీ జనానికి సాయత ఉంటానని ఒట్టేసి చెప్తన్నా.
    ఆళ్ళఅందరు సుకంగుండుడే నాకు సుతా సంబురం.
    || ప్రతిజ్ఞ ||
    భారతదేశం నా మాతృభూమి.
    భారతీయులందరూ నా సహోదరులు.
    నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
    సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
    దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
    నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
    ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
    నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
    వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
    09-09-2018 (ఆదివారం)

    దయచేసి ఈ చర్చను ఇక్కడితో ఆపేసి రాజకీయ భావోద్వేగాలు ప్రక్కనబెట్టి భాషావిధ్వంసం గురించి సమగ్రదర్శనం ఏర్పరచుకోడానికి తోడ్పడే రచనలు ఏవైనా చదవండి. ప్లీజ్……

  • బాగుందండి. మంచి కథను పరిచయం చేసారు. తప్పకుండా చదువుతా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు